నిరంతర వార్తా స్రవంతి

Tuesday, May 20, 2008

తెరాసకు చిత్తశుద్ధిలేదు : వరంగల్ పర్యటనలో వైఎస్ విమర్స

సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో అగ్నిప్రమాదం

హైదరబాద్ బల్కంపేట ఇంజినీరింగ్ కాలేజీలో అగ్నిప్రమాదం

ఆసెట్ ఫలితాల విడుదల

గుంటూరు మిర్చియార్డులో మళ్లీ అగ్ని ప్రమాదం

విజయవాడలో సి.పి.ఐ. ధర్నా

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ప్రారంభం

గుంటూరు జిల్లాలో ఇసుక లారీ బోల్తా పడి ఇద్దరి మృతి

నిజామాబాద్ లో చంద్రబాబు పర్యటన

అనంతపురం హౌసింగ్ ఎ.ఇ. ఇంటిపై ఎ.సి.బి. దాడి

పాతబస్తీలో యాసిడ్ దాడి

హైదరబాద్: పాతబస్తీలో మోటారు సైకిల్ పై వెళుతున్న ఇద్దరు యువకులపై బుధవారంయాసిడ్ దాడి జరిగింది.

నల్గొండ జిల్లాలో బావిలో దూకి తల్లీ కూతుళ్ల ఆత్మహత్య

సిమ్రాన్ నెట్ కష్టాలు!

అసలే కెరీర్ సరిగా లేక కష్టాల్లో ఉన్న సిమ్రాన్ కి రీసెంట్ గా మరో తలనొప్పి ఎదురైంది. ఆమె ప్రస్తుతం చేస్తున్న టి.వి. సీరియల్ షూటింగ్ బ్రేక్ టైంలో ఒక వ్యక్తి వచ్చి ఆమెను క్యాజువల్ గా పలకరించాడుట. అభిమాని అనుకుని అభిమానంతో రెస్పాన్స్ ఇస్తే "అతను మీరు చాలా మంచి వారండి.. రోజూ ఇంటర్ నెట్ ఛాటింగ్ లో ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారండి "అని పొగిడాడట. కంగారుపడ్డ ఆమె మాట్లాడే లోగా " మీరు మాపాప యోగ క్షేమాలు అడగటం కూడా చాలా చాలా హ్యాపీగా ఉందండి " అని మరీ ఉత్సాహ పడ్డాడుట.

దాంతో బుర్ర తిరిగి పోయిన ఆమె కంగారుగా "మీరు పొరబడ్డారు...నేను సిమ్రాన్ ని అందిట". అతను చిరునవ్వు చెక్కుచెదరకుండా "అవును నేను మీ గురించే చెప్తున్నాను మీరు లేటెస్ట్ గా నెట్ లో పంపిన పర్శనల్ ఫొటోలు కూడా తెచ్చా ఆటోగ్రాఫ్ కోసం" అన్నాడుట. షాకయిన ఆమె వెంటనే కోపం తెచ్చుకుని అతనితో "నాకు అసలు నెట్ పరిచయమే లేదు... అందులోనూ ఫొటోలవి పంపేంత టెక్నికల్ నాలెడ్జ్ అసలు లేదు...మీరు ఇక వెళ్ళచ్చు" అందిట.ఈ సారి షాకవటం అతని వంతైందిట.

తర్వాత ఆమె ,భర్త దీపక్ తో కలిసి నెట్ ఓపెన్ చేసి చూస్తే అసలు విషయం బయిటపడింది. ఆమె పేరుతో వేరేవారెవరో నెట్ లో ఛాటింగ్ చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె భర్త సీరియస్ గా తీసుకుని అమెరికా లో ఉన్న సాప్ట్ వేర్ ఇంజనీరు స్నేహితుడు ని సంప్రదించాడుట. దాంతో వాళ్ళు పూర్తి స్ధాయిలో ఎంక్వైరీ చేస్తే మౌంట్ రోడ్డులో రిజస్టర్ చేసిన ఓ IP address బయిట పడిందట. దాంతో దీన్ని సైబర్ క్రైమ్ గా బుక్ చేయాలని దంపతులిద్దరూ నిర్ణయానికొచ్చారట. అంతేగాక నెట్ లో తన పేరుతో ఛాటింగ్ చేస్తున్న వ్యక్తి తో సిమ్రాన్ కలిసిందిట. కాని అసలు విషయం కనిపెట్టిన అతను తప్పుకున్నాడుట. ఈ విషయాన్ని ఆమె నవ్వుతూ చెప్పినా సీరియస్ ప్లాబ్లెమ్ గానే దీన్ని పరిగణిస్తోంది సిమ్రాన్. అందుకే సొంతంగా వెబ్ సైట్ ఓపెన్ చేయాలని నిర్ణయానికి వచ్చిందిట. త్వరలో అది కార్యరూపం దాల్చనుందిట.

వైఎస్ కు పదవీ గండం!

ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పదవికి ఇప్పట్లో ఏదైనా ప్రమాదముందా? ఈ నెల 29 న జరుగనున్న ఉప ఎన్నికల్లో టీఅర్ ఎస్ గనుక తన స్ధానాలను తాను దక్కించుకుంటే రాజశేఖరరెడ్డి పదవికి రోజులు దగ్గర పడినట్టే. కాంగ్రెస్ హైకమాండ్ వద్ద వైఎస్ పై ఇప్పటికే అనేక ఆరోపణల చిట్టా పేరుకుని ఉంది. అయితే రాజశేఖరరెడ్డి ప్రజాకర్షణ గల నాయకుడని హై కమాండ్ వద్ద సమాచారం ఉండడంతో ఆయన పై ఏ చర్య తీసుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్ధితి దాపురించింది. రాజశేఖరరెడ్డి ప్రజాకర్షణకు, రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ముడిపెట్టకపోయినా, వైఎస్ కు ఇది పరీక్షా కాలమే.

వైఎస్ కు గతంలో కాంగ్రెస్ అధిష్టానవర్గం వద్ద ఆడింది ఆట, పాడింది పాటగా ఉండేది. ఇప్పుడా పరిస్ధితి లేదు. చిరంజీవి పార్టీ పెట్టడం ఖాయం కావడం, తెలుగుదేశం పార్టీ కొద్దిగా బలపడడం వంటి పరిణామాల నేపధ్యంలో వైఎస్ మీద హై కమాండ్ వత్తిడి తీవ్రతరమవుతోంది. కేంద్ర్ కేబినెట్ మంత్రి జైపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉంది. అయితే ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి జైపాల్ ఆసక్తి చూపకపోవడంతో వైఎస్ కు ప్రత్యామ్నాయ శక్తి దాదాపు లేకుండా పోయింది.

అంతమాత్రం చేత వైఎస్ పదవి పదికాలాలపాటు నిలబడి ఉంటుందన్న గ్యారంటీ లేదు.ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 6 స్ధానాల్లో అయినా విజయం సాధించకపోతే అధిష్టానవర్గం వైఎస్ ను నిలదీసి ప్రశ్నించడం ఖాయం. చిరంజీవి రాజకీయపార్టీ గురించి ఆసక్తిగా ఆరా తీస్తు న్న కాంగ్రెస్ అధిష్టానవర్గం ఆ విషయంలో వైఎస్ అభిప్రాయాలకు పెద్ద విలువ ఇవ్వడం లేదని, దగ్గుబాటి పురంధేశ్వరి వంటి వారి నుంచి సమాచారం రాబడుతున్నట్టు తెలుస్తోంది.

ఎన్నికల కోడ్ పై జాగ్రత్త: వైయస్

ఎన్నికల ప్రవర్తనా నియమావళి పట్ల జాగ్రత్త వహించాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రులకు, కాంగ్రెస్ నాయకులకు సూచించారు. ఏ చిన్న పొరపాటు జరగకుండా ముందే అనుమతులు తీసుకోవాలని ఆయన మంగళవారం సూచించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని ఆయన అన్నారు. పాజిటివ్ ఓటును పోలింగ్ బూత్ వరకు తీసుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

అభివృద్ధి తమను గెలిపిస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్లలో ఏం జరిగిందో ప్రజలు గమనిస్తున్నారని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకోలేదని ఆయన అన్నారు. ఇతర రాజకీయ పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు మీద ఆధారపడతాయని, ఇప్పుడది లేదని ఆయన అన్నారు.

చిరంజీవి పాద యాత్ర?

హీరో చిరంజీవి తన పార్టీ విషయంలో అంతులేని మౌనం వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. కొంత మంది అయితే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని, ఆయన మనస్తత్వానికి రాజకీయాలు సరిపడవని వాదిస్తున్నారు.


కానీ చిరంజీవి చుట్టూ ఉండే ఆ నలుగురు, ఆ నలుగురికి సన్నిహితులైన ఆ పదహారు మంది చెబుతున్న విషయం ప్రకారం చిరంజీవి మొదట పాదయాత్రను ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 22 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు నుంచి తిరుపతి వరకు సాగిస్తారని అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.


చిరంజీవి తన పాదయాత్రలో భాగంగా ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయరు. కేవలం ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన యాత్ర సాగిపోతుంది. ప్రజల నుంచి వచ్చే వినతి పత్రాలను మాత్రం ఆయన స్వీకరిస్తారు. ఆయన మౌనపాద యాత్రను టీవీ చానళ్ళు పోటీ పడి ఉచితంగా ప్రసారం చేస్తాయి కాబట్టి ప్రచారం ఖర్చును బాగా తగ్గించుకోవచ్చని చిరంజీవి శిబిరం అంచనా.

తొలి పాద యాత్ర తర్వాత చిరంజీవి పూర్తి స్ధాయిలో జిల్లా పర్యటనలు ప్రారంభిస్తారని తెలుస్తోంది. చిరంజీవి జిల్లా పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. రోడ్ షో నిర్వహించడానికి అత్యాధునిక రెండు చైతన్య రథాలను ముంబైలో తయారు చేయిస్తున్నారు. అవినీతి రహిత సమాజం చిరంజీవి పార్టీకి ప్రధాన ఎజెండా కాబోతోంది.

Saturday, May 10, 2008

ఆత్మగౌరవానికి కాంగ్రెస్ ముప్పు : చంద్రబాబు విమర్శ

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ పి. వేణుగోపాల్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతిసారీ ఇలాగే తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని ఆయన అన్నారు. మీ కోసం యాత్రలో భాగంగా ఆయన శుక్రవారంనాడు కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్ నియోజకవర్గంలో పర్యటించారు.

గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జరిపిన పాదయాత్రకు, తన యాత్రకు మధ్య తేడా ఉందని ఆయన చెప్పారు. తన యాత్ర దేశ ఆర్థిక పరిస్థితిని మార్చేందుకు సాగుతోందని ఆయన చెప్పారు. కాంగ్రెస్,తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) దొంగాట ఆడుతున్నాయని ఆయన విమర్శించారు. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. అక్కడి నుంచే ఆయన ఒక ప్రైవేట్ టీవీ చానెల్ జూనియర్ ఎన్టీఆర్ తో నిర్వహించిన లైవ్ షోలో కూడా ఆయన మాట్లాడారు. రైతుల ప్రభుత్వమని చెప్పి కాంగ్రెస్ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని ఆయన విమర్శించారు. తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఇప్పుడు రాష్ట్రంలో ఆదాయం పెరిగిందని ఆయన అన్నారు.

Thursday, May 1, 2008

'సాక్షి'పై తెరాస పరువు నష్టం దావా!

తనకు పరువు నష్టం కలిగించేలా వార్తను ప్రచురించినందుకు "సాక్షి" దిన పత్రిక మీద 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు "సాక్షి" కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు.

చంద్రశేఖరరావుకు "సాక్షి" వార్తా కథనాలు కొంతకాలంగా ఇబ్బంది కలిగిస్తున్నాయి. కాంగ్రెస్, టిడిపిలు అగ్రవర్ణాల కను సన్నల్లో నడూస్తున్నాయని ఆయన ఆరో పించారు. తెలంగాణ్ ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని ఆయన చెప్పారు.

రెండో పెళ్లి కోసం భార్యను చంపిన టెక్కీ?

రెండో పెళ్లి కోసం భార్యను హత్యచేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. హేమలత అనే తన భార్యను చంపి నగేష్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీరు రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. హేమలత బాత్రూంలో శవమై తేలింది. హిందూపురం సమీపంలోని ముదిరెడ్డిపల్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. హేమలత తల్లిదండ్రుల నుంచి నగేష్ 15 లక్షల వరకట్నం, ఇతర కట్నకానుకలు తీసుకున్నాడు.

అందిన వివరాల ప్రకారం - పెళ్లి చేసుకున్న తర్వాత థాయ్ లాండ్ తీసికెళ్లాడు. తిరిగి తమ స్వగ్రామానికి వచ్చారు. నగేష్ ఎప్పుడూ తమ కూతురిని వేధించేవాడని హేమలత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నగేష్ కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నాడు. హేమలతది ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నగేశ్ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హేమలత కుటుంబ సభ్యులు ముదిరెడ్డిపల్లికి వచ్చి నగేష్ ఇంటిలో విధ్వంసానికి దిగారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.

అజీజ్ రెడ్డి మృతదేహానికి ఎక్స్ రే

అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ అనుచరుడు వెంకటరెడ్డి అలియాస్ అజీజ్ రెడ్డి మృతదేహానికి ఎక్స్ రే తీస్తున్నారు. ఇందు కోసం అతని మృతదేహాన్ని మార్చురీ నుంచి ఆస్పత్రికి తరలించారు. పోలీసులతో హైదరాబాదులోని జూబిలీహిల్స్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో అజీజ్ రెడ్డి బుధవారం రాత్రి మరణించిన విషయం తెలిసిందే. అతని మృతదేహానికి గురువారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అతని మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

సంఘటనా స్థలం నుంచి పోలీసులు అమెరికా తయారీ 9 ఎంఎం రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు. మూడు సెల్ ఫోన్లు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా పోలీసుల చేతికి చిక్కాయి. గతంలో జైలు నుంచి విడుదలైన అజీజ్ రెడ్డి ముంబయికి పారిపోయాడు. ఇటీవలే హైదరాబాద్ వచ్చాడు. ఎర్రబండ్లపల్లికి చెందిన అజీజ్ రెడ్డి హైదరాబాదు వచ్చి ముషీరాబాద్ దాదాగా అవతారమెత్తాడు. ఆ తర్వాత తీవ్రవాదులతో చేతులు కలిపాడు. అతినిపై హత్య కేసులు, భూ సెటిల్ మెంట్ కేసులు, తదితర కేసులు ఉన్నాయి. సినీ నిర్మాత నిఖిల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు అజీజ్ రెడ్డి ఆచూకీ దొరికినట్లు భావిస్తున్నారు. తనకు కోటి రూపాయలు ఇవ్వాలని అజీజ్ రెడ్డి డిమాండ్ చేసినట్లు నిఖిల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాదులోనే ఉన్న అజీజ్ రెడ్డిని తమ కొడుకుగా భావించడం లేదని అతని తల్లిదండ్రులు గతంలోనే చెప్పారు. బంధువులు వస్తే అజీజ్ రెడ్డి మృతదేహాన్ని అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు.

పరుగు : సమీక్ష

నటీనటులు: అల్లు అర్జున్, షీలా, ప్రకాష్ రాజ్, పూనం బజ్వా, సునీల్,
సుబ్బరాజు, జయసుధ, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, జీవా తదితరులు
సంగీతం: మణి శర్మ
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, అనంత శ్రీరామ్
సంభాషణలు: బివిఎస్ రవి
సినిమాటోగ్రఫి: విజయ్ చక్రవర్తి
కథ, స్కీన్ ప్లే, దర్శకత్వం: భాస్కర్
నిర్మాత: రాజు

పెద్దలకి తెలిస్తే ఒప్పుకోరని ప్రేమించిన అమ్మాయిని లేవదీసుకు పోయే కుర్రాళ్ళదా తప్పు లేక వారి ప్రేమను గుర్తించని తల్లితండ్రులదా తప్పు అనే సమకాలీన సామాజిక సమస్యను చర్చిస్తూ సాగిన చిత్రం పరుగు.పండుగ వాతావరణాన్ని సృష్టిస్తూ ఈ రోజు ఉదయం ఆటతో రాష్ట్రమంతటా 234 ప్రింట్లతో రిలీజయింది. దేశముదురు తర్వాత అల్లు అర్జున్ అంతకు మించి ఎనర్జీతో నటించిన ఈ సినిమా స్క్రిప్టు లోపాలతో సెకండాఫ్ సాగి పరుగు తగ్గింది. ఓ పల్లెటూరు పెద్దాయన(ప్రకాష్ రాజ్) పెద్దకూతురు (పూనం బజ్వా) పెళ్ళి జరుగుతూంటూంది. కాస్సేపటికి ఆమె తన ప్రియుడు(ఆ ఊరిలో పొలం పనులు చేసుకుని బ్రతికే కుటుంబంలోని కుర్రాడు) తో జంప్. దాంతో హర్ట్ అయిన ఆమె తండ్రి కూతురు కోసం వేట ప్రారంభిస్తాడు. ఆ కుర్రాడి ప్రెండ్స్ ని తీసుకొచ్చి హౌస్ అరెస్టు చేస్తాడు. వాళ్ళలో కృష్ణ (అల్లు అర్జున్) అనే హుషారైన హైదరాబాద్ కుర్రాడుంటాడు. అతను ఈ హడావిడిలో పెద్దాయన మరో కూతురు మీనా(షీలా) తో ప్రేమలో పడతాడు. ఆమెని లేపుకు పోదామనుకుంటాడు. దానికి ఆ అమ్మాయి ఒప్పుకుందా? అసలే కోపంలో ఉన్న పెద్దాయన ఈ సారేం చేస్తాడు? అన్నది తెరపై చూడాల్సిందే. పాయింట్ ఈ మధ్య వచ్చిన 'జల్సా' ని గుర్తు చేస్తే కథనం 'ప్రేమిస్తే' ని ఫాలో అవుతుంది. నిజానికి 'పరుగు' కథ పాయింట్ చాలా బాగున్నా ట్రీట్ మెంట్ లోపంతో కుదేలయింది. పిల్లలు లేచిపోతే బాధ పడే పెద్దలు కథో లేక ప్రేమించినవాళ్ళని పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి అనే కధో స్పష్టం కాకుండా కధనం నడుస్తుంది. బొమ్మరిల్లు లో మొదటి సీనులోనే సమస్య చూపి కథ లోకి వచ్చిన భాస్కర్ దీనిలో హీరోని ప్రి క్లైమాక్స్ దాకా సమస్య లోకి పడెయ్యడు. అదే ప్రధాన లోపం . అంతేగాక ప్రకాష్ రాజ్ పాత్ర సమస్య తరువాత సమస్యలో పడుతూ (పెద్ద కూతురు ఒకరితో వెళ్ళి పోయిందని తెరుకునే లోపే రెండో కూతురు అదే దారిలో నడవబోతోందని తెలియటం) సానుభూతి సంపాదించుకుంటూ హీరోని దాటి ఎదిగిపోయింది. అల్లు అర్జున్ పాత్ర ఎంతసేపు తన ప్రకాష్ రాజ్ కూతురుని తీసుకుని వెళ్ళి పోయిన స్నేహితుడుకి సాయం చేస్తూ నెగిటివ్ ఇంప్రెషన్ పొందుతాడు. అలాగే ఇంట్రవెల్ దగ్గరకు వచ్చేసరికి హీరోకి సమస్యలో పడబోతున్నానని అర్ధమవుతుంది గాని సమస్యలో భౌతికంగా పడడు. దాంతో సమస్యలో పడని హీరోని ఫాలో చేస్తున్న ప్రేక్షకులకు అసహనం కలుగుతుంది. ఇక హీరోయిన్ పాత్రలో సృష్టత కనపడదు. అక్క ప్రేమను సపోర్టు చేసిన ఆమె ఎప్పుడు డైలమాలో ఉన్నట్లు మాట్లాడుతుంది. రవి డైలాగులు కొన్నిచోట్లే పేలాయి. పల్లె లో చూపిన అపానవాయువు, మూత్ర విసర్జన సీన్లు చూడటానికి అసహ్యంగా ఉన్నాయి. పాటల ప్లేస్ మెంట్లు కరెక్టుగా పడలేదు. అలాగే కథకు సంభంధం లేని ఫైట్ సీను అనవసరమనిపిస్తుంది. అలాగే జయసుధ పాత్ర హీరోతో "ఆ అమ్మాయే నా కోడలు, తీసుకురా!" అని చెప్పటం తేజ సినిమాల పార్మెట్ ని అనుసరించి నవ్వులపాలైంది. ఇలా ఇన్ని స్కీన్ ప్లే లోపాలున్నా ఫస్టాఫ్ లో ఒకే ఇంటిలో సీన్లు ఫన్నీగా నడపటం భాస్కర్ కే సాధ్యం అనిపించాడు. అలాగే మణిరత్నం 'దిల్ సే' ని గుర్తు చేస్తూ హీరో లవ్ ఎట్ పస్ట్ సైట్ సీన్ పొగ మంచులో చూపటం చాలా బాగుంది. అలీ కామిడి ద్వారా సినిమా కాన్సెప్ట్ మొత్తం వివరించటం స్కిప్టు పరంగా మరో గ్రేట్.సెకాండాఫ్ లో వచ్చే ప్రకాష్ రాజ్ తాగి అల్లు అర్జున్ తో తన బాధ చెప్పుకోవటం సన్నివేశం తెలుగు సినిమాల్లో అరుదుగా మంచి ఎమోషనల్ సీను. "నమ్మవేమో, హృదయం "అంటూ సాగే పాటలు బాగున్నాయి. రీరికార్డింగ్ ఎప్పటి మణిశర్మ సినిమాల లాగే బాగుంది. ముఖ్యంగా కెమెరా కొన్ని సీన్లలో(పొగ మంచు వాతావరణం) అద్భుతాలు చూపించింది.దర్శకత్వం అద్భుతం కాకపోయినా చాలా మంది కన్నా మేలనిపిస్తుంది. యేదైమైన దాదాపు మూడు గంటలు నిడివి ఉన్న ఈ సినిమా అరగంట వరకు ట్రిమ్ చేయవచ్చు.పాటలకోసం,అల్లు అర్జున్ డాన్స్ ల కోసం ఈ సినిమా చూడచ్చు. ఫ్యామిలీలకు పడితే నిలబడుతుంది. యూత్ ని ఆకట్టుకోవటం కష్టమే.

తెరాసతో మాట్లాడేది లేదు : తేల్చిచెప్పిన డి.ఎస్.

హైదరాబాదులోని ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం ఏకగ్రీవ ఎన్నిక కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో ఇక మాట్లాడేది లేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక విషయంలో చంద్రశేఖరరావు మాట తప్పారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ తో రాయబారాలు నడిపేది లేదని ఆయన అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 14వ తేదీన పునరంకిత సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకు ఈ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, మంత్రులు ఆ సభలో పాల్గొంటారని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల కోసం ఆయన పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి మొదటి ఫోన్ కరీంనగర్ లోకసభ పార్టీ అభ్యర్థి టి. జీవన్ రెడ్డికి చేశారు.

విరామం వీడి...!

సాంకేతిక కారణాలరీత్యా ఏప్రిల్ 8 నుంచి బ్లాగ్ అప్డేట్లో ఏర్పడిన అంతరాయానికి విరామం చెబుతూ నేటి నుంచి మళ్లీ మీ ఆదరణకు వేచిచూస్తూ...
మీ బ్లాగ్.

Tuesday, April 8, 2008

ప్రజలే మాకు అంగరక్షకులు: నాయని

ప్రజలే తమకు అంగరక్షకులని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మాజీ శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డి అన్నారు. ఇటీవల రాజీనామాలు చేసిన తమ పార్టీ శాసనసభ్యులకు ప్రభుత్వం అంగరక్షకులను ఉపసంహరించుకోవడంపై ఆయన సోమవారంనాడు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఉగాది పర్వదినం సందర్భంగా పార్టీ కార్యాలయంలో తెలంగాణ భవన్ లో రుద్రయాగం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి రోజు రోజుకూ విచక్షణ కోల్పోతున్నారని నాయని నర్సింహారెడ్డి అన్నారు. మాజీ శాసనసభ్యులందరికీ అంగరక్షకులు కొనసాగుతుండగా తమకే అంగరక్షకులను తొలగించారని ఆయన అన్నారు.

తమను ప్రజలు నెత్తిన పెట్టుకుని కాపాడుకుంటారని, తాము ప్రజల కాళ్లకు పూజలు చేస్తామని ఆయన అన్నారు. తమపై ముఖ్యమంత్రి కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నారని ఆయన విమర్శించారు. తాము రాజీనామాలు చేస్తున్నామని చెప్పి శాసనసభ్యులకు భూములు ఇస్తూ జారీ చేయాల్సిన జీవోను రెండు నెలలు ఆపారని ఆయన చెప్పారు. ఆ భూముల కోసం తాము కోర్టుకు వెళ్తామని ఆయన చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా తెలుగుదేశం, కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని ఆయన విమర్శించారు.

బాలకృష్ణ "పాండురంగడు"

తాను నటించిన పాండురంగడు చిత్రం అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాల కన్నా భిన్నమైందని హీరో బాలకృష్ణ అన్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సోమవారంనాడు ప్రసాద్ ల్యాబ్స్ లో పాండురంగడు చిత్రం ప్రెస్ మీట్ జరిగింది. రాఘవేంద్రరావు ఇంతకు ముందు అన్నమయ్య, శ్రీరామదాసు భక్తి చిత్రాలకు దర్శకత్వం వహించారని, అయితే తనతో నిర్మించిన పాండురంగడు వాటికన్నా భిన్నమైందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ నటించిన పాండురంగ మాహత్మ్యం ఆధారంగా పాండురంగడు చిత్రాన్ని కృష్ణమోహన్ నిర్మాతంగా ఆర్కె పిల్మ్ అసోసియేట్స్ పతాకంపై నిర్మించారు. బాలకృష్ణ సరసన స్నేహ, టబు నటించారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు.

హీరో బాలకృష్ణతో పాటు చిత్ర దర్శకుడు రాఘవేంద్ర రావు, దర్శకుడు కె. విశ్వనాథ్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, రచయిత జెకె భారవి, సనా, సుహాసిని, అపూర్వ తదితరులు ఈ ప్రెస్ మీట్ కు హాజరయ్యారు. పాండురంగడు పాత్రను పోషించడం ఒక సవాల్ అని బాలకృష్ణ అన్నారు. తన తండ్రి నటించిన పాండురంగ మాహాత్మ్యం చిత్రంతో తాను నటించిన పాండురంగడు చిత్రానికి పోలికలున్నాయని, అయితే అదే సమయంలో దాన్ని కన్నా కొంత భిన్నంగానూ ఉందని ఆయన అన్నారు. పాండురంగడు చిత్రంలో సత్యభామ, రుక్మిణి, నారద పాత్రలున్నాయని, పాండురంగ మాహాత్మ్యంలో ఆ పాత్రలు లేవని ఆయన చెప్పారు. పాండురంగడు చిత్రాన్ని రాఘవేంద్రరావు ఎంతో అందంగా రూపొందించారని ఆయన ప్రశంసించారు. చిత్రం ఆడియో ఆవిష్కరణ ఈ నెల 27వ తేదీన మచిలీపట్నంలోని ముంగినపూడి తీరంలో గల పాండురంగ స్వామి ఆలయంలో జరుగుతుందని ఆయన చెప్పారు.

ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాధ్ ఈ చిత్రంలో బాలకృష్ణ తండ్రి పాత్రను పోషించారు. పాత సినిమాలో ఈ పాత్రను చిత్తూరు నాగయ్య పోషించారని, ఈ పాత్ర పోషణ అతి కష్టమైందని ఆయన చెప్పారు. చిత్రం అపూర్వ విజయం సాధిస్తుందని నిర్మాత కృష్ణమోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్కే పతాకంపై బాలయ్యతో గతంలో నిర్మించిన అపూర్వ సహోదరులు ఘన విజయం సాధించిందని ఆయన గుర్తు చేశారు.

చిరు పార్టీకి మద్దతు : బ్రహ్మనందం

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే తాను మద్దతు ఇస్తానని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం చెప్పారు. ఆయన మంగళవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తాను ఈ స్థాయిలో ఉండడానికి శ్రీవారి కృపే కారణమని ఆయన అన్నారు. ఎవరు సినిమాల్లోకి వచ్చినా, రాజకీయాల్లోకి వచ్చిన శ్రీవారి కృప వల్లనే సాధ్యమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. చెన్నైలోని శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ పదో సంవత్సర ఉగాది పురస్కారాల సందర్భంగా హాస్యనటుడు బ్రహ్మానందాన్ని ఘనంగా సన్మానించింది. ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో చెన్నై నగర మేయర్ సుబ్రమణియన్ చేతుల మీదుగా బ్రహ్మానందానికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును బహూకరించారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన తిరుమలకు వచ్చారు.

బ్రహ్మానందంతో పాటు నటుడు విశాల్, నటి తమన్నా, స్నేహ, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌లను సైతం ఘనంగా సన్మానించారు. తెలుగువారు ఉగాదిని ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి పంపిన ఉగాది సందేశాన్ని చదివి వినిపించారు. తాను ఇటీవల గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించడానికి ప్రేక్షకుల దీవెనలే కారణమని బ్రహ్మానందం అన్నారు. గిన్నీస్ రికార్డ్ సాధించిన తర్వాత తనకు అనేక సార్లు సన్మానాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. తాను ఈ సన్మాన కార్యక్రమాల సందర్భంగా ప్రేక్షకులు పొందే ఆనందాన్ని చూడడానికే తాను ఈ సన్మానాలను స్వీకరిస్తున్నానని అన్నారు. నటుడు విశాల్ మాట్లాడుతూ తాను కేవలం సన్మానాన్ని పొందడానికి రాలేదని బ్రహ్మానందాన్ని స్వయంగా చూడాలనే వచ్చానని అన్నారు.

తెదేపా తెలంగాణ కమిటీ భేటీ!

తెలంగాణపై ఏర్పడిన అధ్యయన కమిటీ మంగళవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో సమావేశమైంది. కమిటీ సభ్యుల్లో ఒకరైన యనమల రామకృష్ణుడు నెల్లూరు పర్యటనలో ఉండడంతో సమావేశానికి హాజరు కాలేదు. కమిటీ విధివిధానాలను ఖరారు చేయడానికి ఈ సమావేశం జరిగింది. కమిటీ నివేదిక సమర్పించడానికి గడువేదీ విధించలేదు. కమిటీ తెలంగాణలోని పార్టీ నాయకులను, కార్యకర్తలను సంప్రదించడమే కాకుండా తెలంగాణ పత్రికల్లో వస్తున్న విశ్లేషణలను కూడా అధ్యయనం చేస్తుంది.

తెలంగాణపై సాధ్యమైనంత తొందరగా కమిటీ అధ్యయనం చేసి ఉప ఎన్నికలు జరిగే లోగానే నివేదిక సమర్పిస్తుందని భావిస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగా పార్టీ వైఖరిని ఖరారు చేయాలని సమావేశంలో అనుకున్నారు. పార్టీ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. చిరంజీవి పార్టీ ప్రభావంపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఈ కమిటీలో టి. దేవేందర్ గౌడ్, నాగం జనార్దన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు, కె. ఎర్రంనాయుడు, కె.ఇ. కృష్ణమూర్తి ఉన్నారు.

మారుతున్న రాజకీయ ముఖచిత్రం!

"ఈనాడు" రామోజీరావు ప్రయత్నాల ఫలితంగా రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా రామోజీరావు సాగిస్తున్న మౌన పోరాటం ఒక కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలోనే అత్యంత బలమైన ముఖ్యమంత్రిగా అవతరించిన వైఎస్ గత మూడేళ్ళుగా రామోజీరావును అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే.

చిరంజీవి పార్టీ వామపక్షాలతో జోడీ కట్టే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మరోవైపు తెలుగుదేశం, టీఅర్ ఎస్ ల మధ్య స్నేహం చిగురిస్తోంది. వైఎస్ వ్యతిరేకులందరినీ ఒక తాటి మీదికి తెచ్చేందుకు రామోజీరావు చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలున్నాయి.

చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఎదుగూ బొదుగూ లేకుండా ఉండడంతో "ప్యాడింగ్" వర్క్ రామోజీరావు నాయకత్వంలో అతి రహస్యంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డీతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న రామోజీరావు వైఎస్ కు ఏకు మేకు వంటి డిఎస్ ను పిసిసి అధ్యక్షుడిగా చేయగలిగారు, జైపాల్ సహకారంతో.

రానున్న రోజుల్లో వైఎస్ , రామోజీ మధ్య పోరాటం తీవ్రతరం కానుంది. రామోజీరావు మీద రాజశేఖరరెడ్డి కక్ష గట్టడం కాంగ్రెస్ నాయకుల్లోనే చాలామందికి నచ్చడం లేదు. ఆ విషయాన్ని గ్రహించిన అధిష్టానవర్గం రామోజీపై మరీ అంత క్రూరంగా వ్యవహరించవద్దని సూచించినట్టు తెలుస్తోంది.

Monday, April 7, 2008

గద్వాల మునిసిపాలటీ గురించి తెలుసుకొందాం!

 గద్వాల పురపాలక సంఘ కార్యాలయము

గద్వాల పురపాలక సంఘ కార్యాలయము

మహబూబ్ నగర్ జిల్లాలోని 4 పురపాలక సంఘాలలో ఇది ఒకటి. 1952లో స్థాపించబడిన ఈ పురపాలక సంఘము ప్రస్తుతం 6.14 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో 2001 జనాభా లెక్కల ప్రకారము 53,601 జనసంఖ్యతో జిల్లాలో రెండవ పెద్ద పురపాలక సంఘముగా కొనసాగుతోంది. పురపాలక సంఘము పరిధిలో 9 రెవెన్యూ వార్డులు ఉండగా, 26 ఎన్నికల వార్డులు ఉన్నాయి.

చరిత్ర

గద్వాల ఒక చారిత్రక పట్టణము. పూర్వపు హైదరాబాదు రాజ్యంలో గొప్ప సంస్థానముగా వెలుగొందిన ఈ పట్టణములో సోమనాద్రి కట్టించిన చారిత్రక కోట పట్టణం మద్యలో సందర్శకులను ఆకట్టుకుంటుంది. స్వాతంత్ర్యానంతరం 1952లో గద్వాలను మూడవ గ్రేడు పురపాలక సంఘముగా ఏర్పాటుచేశారు. ఇప్పటికీ ఇది మూడవ గ్రేడు పురపాలక సంఘముగానే కొనసాగుతోంది.

నీటి సరఫరా

పురపాలక సంఘముచే పట్టణములో 3.9 మిలియన్ గ్యాలన్ల నీటిసరఫరా జరుగుతోంది. పురపాలకసంఘ్అం పరిధిలో 4316 ఇంటినల్లాలు, 585 పబ్లిక్ నల్లాలు ఉన్నాయి. ఇవే కాకుండా పట్టణ పరిధిలో 162 చేతిపంపులు కూడా ఉన్నాయి. పట్టణములో ఉన్న నీటి సరఫరా పైపు లైన్ పొడవు 48 కిలోమీటర్లు. ఇంటికి సరఫరా చేయబడే ప్రతి కనెక్షనుకు నెలసరు రూ.70/- నీటిరుసుము క్రింద పురపాలక సంఘము వసూలు చేస్తుంది.

రోడ్లు

పురపాలక సంఘం పరిధిలో 25 కిలోమీటర్ల పొడవు కల సిమెంటు రోడ్లు, 10 కిలోమీటర్ల పొడవు తారు రోడ్లు, 35 కిలోమీటర్ల పొడవు ఇతర రోడ్లు కలవు.

మురికి కాల్వలు, పారిశుద్ధ్యం

పట్టణ పరిధిలో 120 కిలోమీటర్ల పొడవుకల పక్కా మురుగునీటి కాల్వలు మరియు 60 కిలోమీటర్ల పొడవు కల కచ్చా మురికికాల్వలు ఉన్నాయి. ప్రతిరోజు దాదాపు 38 మెట్రిక్ టన్నుల చెత్తను పురపాలక సిబ్బందిచే తొలిగించివేస్తున్నారు. దీనికి గాను 2 మున్సిపల్ ట్రాక్టర్లు మరియు 6 అద్దె ట్రాక్టర్లు ఉపయోగిస్తున్నారు.

పట్టణ వీధి దీపముల ఏర్పాటు

పురపాలక సంఘము పరిధిలో ముఖ్యమైన కూడలిలలో 5 హైమాస్ట్ లైటింగ్ సదుపాయము ఉంది. 17 సెంట్రల్ లైటింగ్ స్తంభాలు ఉన్నాయి. 2400 ఫ్లోరొసెంట్ బల్బులే కాకుండా 36 ఎస్.వి.బల్బులు పట్టణంలో విద్యుత్తు స్తంభాలకు బిగించబడి ఉన్నాయి.

మురికివాడలు

  • సుంకులమ్మ మెట్టు
  • చిన్న హరిజనవాడ
  • కుంట్లవీధి
  • వడ్లవీధి
  • గంటగేరి
  • షైరలి వీధి
  • చింతలపేట్
  • తెలుగుపేట్
  • బుర్ధాపేట్
  • గంజిపేట్
  • బి.సి.కాలని
  • హత్కర్ పేట్
  • వడ్డెవీధి
  • మోమిన్ మహల్ల
  • రాతిబురుజు
  • రాఘవేంద్ర కాలని
  • ధారుర్ మెట్టు
  • రామానగర్
  • నల్లకుంట

రెవెన్యూ వార్డుల వారీగా జనాభా

రెవెన్యూ వార్డు సంఖ్య మహిళలు పురుషులు మొత్తం జనాభా
1 4959 5151 10110
2 1788 1858 3646
3 1358 1395 2753
4 1707 1774 3481
5 2221 2227 4448
6 3537 3267 6804
7 5269 4963 10232
8 3112 2850 5962
9 3112 2850 5962
మొత్తము 27014 26587 53601

అభివృద్ధి పనులు

గద్వాల పురపాలక సంఘముచే పట్టణ పరిధిలో ఇటీవలి కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులు :

  • భూగర్భ డ్రైనేజీ : రూ.16 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులను చేపట్టడమైనది. సిటీ ఛాలెంజ్ ఫండ్‌లో భాగంగా ప్రభుత్వం రూ.3 కోట్లు విడుదల చేసినది.
  • ఔటర్ రింగ్ రోడ్డు : రూ.2 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనుల సర్వే పూర్తీయినది. గద్వాల నుంచి రాయచూరు వెళ్ళడానికి ఈ మార్గం ఉపయోగపడుతుంది.
  • మురికి వాడల అభివృద్ధి : రూ.59 లక్షల వ్యయంతో మురికివాడలలో సిమెంటు రోడ్లు, మురుగునీటి కాల్వలు నిర్మించడమైనది.
  • పారిశుద్ధ్యం : రూ.5 లక్షల వ్యయంతో పట్టణములో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టినారు.
  • కమ్యూనిటీ భవనములు : ఎంపీలాడ్స్ పథకము నుంచి మంజూరు అయిన నిధులనుంచి రూ.13 లక్షల వ్యయంతో 2 కమ్యూఇటీ భవనములు నిర్మించినారు.
  • దుకాణ సముదాయాల నిర్మాణము : చిన్న, మధ్య తరహా పట్టణముల సమీకృత అభివృద్ధి పథకపు నిధులనుంచి రూ.1.06 కోట్ల వ్యయంతో 107 దుకాణములను నిర్మించడం జరిగినది.
  • పేదవారికి తక్కువ ధరలో నల్లా కనెక్షన్లు : దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న 335 కుటుంబాలకు కేవలం రూ.1200/- ధరావత్తుతో నూతనంగా నల్లా కనెక్షన్లు ఇవ్వబడినది.

ప్రధాన ఆదాయ వనరులు

గద్వాల పురపాలక సంఘపు ప్రధాన ఆదాయ వనరులు :

  • ఇంటిపన్నులు
  • నీటి రుసుము (నల్లా కనెక్షన్)
  • భవన నిర్మాణ అనుమతుల పీజు
  • లైసెన్స్ పీజు
  • పురపాలక సంఘపు దుకాణముల కిరాయలు
  • ప్రభుత్వము విడుదల చేసే వివిధ గ్రాంటులు
  • మార్కెట్ వేలములు

ఇటీవలి కాలంలో పనిచేసిన పురపాలక సంఘ కమీషనర్లు

క్ర.సం. కమీషనర్ పేరు కాలము
1 బాలరాజు (ఇంచార్జి) 24.07.2000 నుంచి 13.08.2000
2 ఎం.ఏ.అలీమ్ (ఇంచార్జి) 04.09.2000 నుంచి 22.12.2000
3 ఏ.ఏ.అజీజ్ 01.01.2001 నుంచి 03.04.2001
4 వి.రామకృష్ణారెడ్డి (ఇంచార్జి) 04.04.2001 నుంచి 09.07.2001
5 ఎన్.వాణిశ్రీ 10.07.2001 నుంచి 20.03.2002
6 ఎం.ఏ.అలీమ్ 21.03.2002 నుంచి 11.02.2004
7 బి.శ్రీనివాస్ 12.02.2004 నుంచి 28.02.2004
8 ఎం.ఏ.అలీమ్ 28.02.2004 నుంచి 31.10.2004
9 వి.శ్రీనివాసులు 17.10.2004 నుంచి 30.10.2004
10 ఎన్.వాణిశ్రీ 24.11.2004 నుంచి





మార్టినా నవ్రతిలోవా రికార్డుల బాట!

మార్టినా నవ్రతిలోవా

మార్టినా నవ్రతిలోవా

1956, అక్టోబర్ 18న ప్రేగ్ లో జన్మించిన మార్టినా నవ్రతిలోవా (Martina Navratilova) ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి. టెన్నిస్ రచయిత స్టీవ్ ఫ్లింక్ తన గ్రంథం The Greatest Tennis Matches of the Twentieth Century లో నవ్రతిలోవాను స్టెఫీగ్రాఫ్ తరువాత మహిళా టెనిస్ క్రీడాకారిణులలో 20 వ శతాబ్దపు రెండో ఉత్తమ క్రీడాకారిణిగా పేర్కొన్నాడు. మార్టినా నవ్రతిలోవా తన క్రీడా జీవితంలో 18 గ్రాండ్‌స్లాం సింగిల్స్ టైటిళ్ళను, 31 గ్రాండ్‌స్లాం డబుల్స్ టైటిళ్ళను, 10 గ్రాండ్‌స్లాం మిక్స్‌డ్ డబుల్స్ టైటిళ్ళను గెలిచింది. వింబుల్డన్ సింగిల్స్ ఫైనల్లో 12 సార్లు ప్రవేశించింది. 1982 నుంచి 1990 వరకు వరుసగా 9 సార్లు వింబుల్డన్ ఫైనల్లో ప్రవేశించడం విశేషం. మొత్తంపై 9 సార్లు వింబుల్డన్ టైటిల్‌ను గెలిచి అత్యధిక వింబుల్డన్ టైటిళ్ళను గెలుపొందిన మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. రికార్డు స్థాయిలో 31 డబుల్స్ గ్రాండ్‌స్లాం టైటిళ్ళను గెలవడమే కాకుండా బిల్లీ జీన్ కింగ్‌తో కలిసి 20 సార్లు వింబుల్డన్ గెలుపొంది రికార్డు సాధించింది. వరుసగా 11 సార్లు గ్రాండ్‌స్లాం టోర్నమెంట్ ఫైనల్లో ప్రవేశించి 13 సార్లు ఈ ఘనత వహించిన స్టెఫీగ్రాఫ్ తరువాత రెండో స్థానంలో ఉంది.

ప్రారంభ జీవితం

1956, అక్టోబర్ 18న చెకొస్లోవేకియా లోని ప్రేగ్ నగరంలో జన్మించింది. ఆమెకు 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. 1962లో ఆమె తల్లి మిరొస్లావ్ నవ్రతిల్‌ను వివాహం చేసుకుంది. అతడే మార్టినాకు తొలి టెన్నిస్ గురువు. 1972లో మార్టినా 15 సంవత్సరాల వయస్సులోనే చెకొస్లోవేకియా జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను సాధించింది. 1974లో తొలిసారిగా ప్రొఫెషనల్ సింగిల్స్ టైటిల్‌ను సాధించింది.

గ్రాండ్‌స్లామ్ ఫలితాలు

  • 1973: 1973లో తొలిసారిగా గ్రాండ్‌స్లాంలో ప్రవేశించిన మార్టినా ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకుంది. వింబుల్డన్‌లో 3వ రౌండ్ వరకు చేరుకోగా, అమెరికన్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.
  • 1974: 1974లో కూడా ప్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళగలిగింది. వింబుల్డన్‌లో తొలిరౌండ్ లోనే నిష్రమించగా, అమెరికన్ ఓపెన్‌లో మూడో రౌండ్ వరకు వెళ్లింది.
  • 1975: ఈ ఏడాది తొలిసారిగా రెండు గ్రాండ్‌స్లాం ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియన్ మరియు ఫ్రెంచ్ ఓపెన్‌లలో ఫైనల్స్ వరకు ప్రవేశించగా, వింబుల్డన్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరింది. అమెరికన్ ఓపెన్‌లో సెమీఫైనల్స్ వరకు ఆడింది.
  • 1976: 1976లో ఆమె ఆతతీరు ఆశాజనకంగా లేదు. వింబుల్డన్‌లో సెమీస్ వరకు వెళ్ళగలిగింది. అమెరికన్ ఓపెన్‌లో మాత్రం తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.
  • 1977: ఈ ఏడాది వింబుల్డన్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు, అమెరికన్ ఓపెన్‌లో సెమీఫైనల్స్ వరకు వెళ్ళింది.
  • 1978: 1978లో నవ్రతిలోవా తొలిసారిగ గ్రాండ్‌స్లాం టైటిల్‌ను గెలుపొందింది. వింబుల్డన్ సింగిల్స్‌ను తన ఖాతాలో జమచేసుకుంది. ఆ తరువాత జరిగిన అమెరికన్ ఓపెన్‌లో సెమీస్ వరకు ప్రవేశించింది.
  • 1979: 1979లో కూడా క్రితం సంవత్సరపు ఫలితాలనే పునరావృత్తం చేసింది. వింబుల్డన్ సింగిల్స్‌ను మళ్ళీ గెలువగా, అమెరికన్ ఓపెన్‌లో కూడా సెమీస్ వరకు వెళ్ళగలిగింది.
  • 1980: 1980లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరియు వింబుల్డన్‌లో సెమీఫైనల్స్ వరకు చేరింది. అమెరిక ఓపెన్‌లో నాల్గవ రౌండ్‌లో నిస్క్రమించింది.
  • 1981: ఈ ఏడాది తొలిసారిగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌ టైటిల్‌ను గెలిచింది. ఆ తరువాత జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు ప్రవేశించింది. వింబుల్డన్‌లో సెమీస్ వరకు వెళ్ళగా, అమెరికన్ ఓపెన్‌లో ఫైనల్ వరకు ప్రవేశించింది.
  • 1982: 1982లో మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ప్రవేశించి రెండిటిలో విజయం సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్రిస్ ఎవర్ట్ చేతిలో ఓడిపోగా, వింబుల్డన్‌లో క్రిస్ ఎవర్ట్ పైనే విజయం సాధించి టైటిల్ గెలిచింది. ఫ్రెంచ్ ఓపెన్ తైటిల్‌ను కూడా గెలువగా, అమెరికన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్ళగలిగింది.
  • 1983: ఈ ఏడాది 3 గ్రాండ్‌స్లాం టైటిళ్ళను సాధించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం నాలుగవ రౌండ్‌లో నిస్క్రమించింది.
  • 1984: 1984లో కూడా 3 గ్రాండ్‌స్లాం సింగిల్స్ టైటిళ్ళను సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్ వరకు మాత్రమే చేరగలిగింది. సాధించిన మూడు టైటిళ్ళను కూడా ఫైనల్లో క్రిస్ ఎవర్ట్ పైనే గెలవడం విశేషం.
  • 1985: ఈ ఏడాది తొలిసారిగా 4 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. అందులో రెండింటిలో టైటిల్ సాధించింది. వింబుల్డన్ మరియు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లలో క్రిస్ ఎవర్ట్ పైనే గెలిచి టైటిల్ సాధించగా, ఫ్రెంచ్ ఓపెన్‌లో క్రిస్ ఎవర్ట్ చేతిలో పరాజయం పాలైనది. అమెరికన్ ఓపెన్‌లో హనా మాండ్లికోవా చేతిలో ఓడిపోయింది.
  • 1986: 1986లో వింబుల్డన్ టైటిల్‌ను హనా మాండ్లికోవాను ఓడించి సాధించగా, అమరికన్ ఓపెన్‌లో హెలీనా సుకోవాను ఓడించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం క్రిస్ ఎవర్ట్‌పై ఫైనల్లో ఓడిపోయింది.
  • 1987: ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రాండ్‌స్లాం ఫైనల్స్ లోకి ప్రవేశించి రెండింటిలో విజయం సాధించింది. వింబుల్డన్ మరియు అమెరికన్ ఓపెన్‌ ఫైనల్లో స్టెఫీ గ్రాఫ్ ను ఓడించి టైటిల్ పొందగా, ఫ్రెంచ్ ఓపెన్‌లో స్టెఫీగ్రాఫ్ చేతిలో ఫైనల్లో పరాజయం పాలైంది. ఆస్త్రేలియన్ ఓపెన్‌లో హనా మాండ్లికోవా చేతిలో ఫైనల్లో ఓడిపోయింది.
  • 1988: 1988 నుంచి మార్టినా ఆటతీరు ఆశాజనకంగా లేదు. ఈ ఏడాది కేవలం ఒకే ఒక్క గ్రాండ్‌స్లాం (వింబుల్డన్) ఫైనల్లో ప్రవేశించి స్టెఫీ గ్రాఫ్ చేతిలో ఫైనల్లో ఓడిపోయింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్ వరకు మాత్రమే వెళ్ళగా, ఫ్రెంచ్ ఓపెన్‌లో 4వ రౌండ్‌లోనే నిష్క్రమించింది. అమెరికన్ ఓపెన్‌లో కూడా క్వార్టర్ ఫైనల్స్ వరకు మాత్రమే వెళ్ళగలిగింది.
  • 1989: 1989లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో నిష్క్రమించింది. వింబుల్డన్ మరియు అమరికన్ ఓపెన్‌లలో ఫైనల్స్ వరకు ప్రవేశించి స్టెఫీగ్రాఫ్ చేతిలో పరాజయం పొందినది.
  • 1990: రెండు సంవత్సరాల మళ్ళి 1990లో గ్రాండ్‌స్లాం టైటిల్ విజయం పొందినది. ఇది ఆమెకు వింబుల్డన్‌లో రికార్డు స్థాయిలో తొమ్మిదవ టైటిల్. వింబుల్డన్‌లో జినా గారిసన్‌పై గెలిచినదే ఆమె క్రీడాజీవితపు చిట్టచివరి గ్రాండ్‌స్లాం టైటిల్. అమెరికన్ ఓపెన్‌లో 4వ రౌండ్‌లోనే నిష్క్రమించినది.
  • 1991: ఈ ఏడాది వింబుల్డన్‌లో క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించగా అమెరికన్ ఓపెన్‌లో ఫైనల్స్ లోకి ప్రవేశించి మోనికా సెలెస్ చేతిలో పరాజయం పొందినది.
  • 1992: ఈ ఏడాది వింబుల్డన్‌లో సెమీస్ వరకు, అమెరికన్ ఓపెన్‌లో రెండో రౌండ్ వరకు మాత్రమే ప్రవేశించగలిగింది.
  • 1993: 1993లో కూడా వింబుల్డన్‌లో సెమీస్ వరకు ప్రవేశించగా, అమెరికన్ ఓపెన్‌లో 4వ రౌండ్ వరకు చేరింది.
  • 1994: ప్ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా, వింబుల్డన్‌లో రికార్డు స్థాయిలో 12వ సారి ఫైనల్లోకి ప్రవేశించింది. ఫైనల్లో కొంచితా మార్టినేజ్ చేతిలొ పరాజయం పాలైంది. ఇదే ఆమెకు చిట్టచివరి సింగిల్స్ ఫైనల్ మ్యాచ్.
  • 1995: 1995 నుంచి 2003 వరకు గ్రాండ్ స్లాంలలో ఆడలేదు.
  • 2004: ఈ ఏడాది మళ్ళీ టెన్నిస్ రాకెట్ చేతపట్టిననూ ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిరౌండ్ లోనూ, వింబుల్డన్‌లో రెండో రౌండ్ లోనూ నిష్రమించినది. ఆ తరువాత మళ్ళీ గ్రాండ్‌స్లాం టోర్నమెంట్లలో పాల్గొనలేదు.

సాధించిన వింబుల్డన్ టైటిళ్ళు

సంవత్సర< ↓ చాంపియన్‌షిప్ ↓ ఫైనల్లో ప్రత్యర్థి ↓ స్కోరు ↓
1978 వింబుల్డన్ టోర్నమెంట్ Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు క్రిస్ ఎవర్ట్ 2–6, 6–4, 7–5
1979 వింబుల్డన్ టోర్నమెంట్ (2వ సారి) Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు క్రిస్ ఎవర్ట్ 6–4, 6–4
1981 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు క్రిస్ ఎవర్ట్ 6–7(4), 6–4, 7–5
1982 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఆండ్రూ జీగర్ 7–6(6), 6–1
1982 వింబుల్డన్ టోర్నమెంట్ (3వ సారి) Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు క్రిస్ ఎవర్ట్ 6–1, 3–6, 6–2
1983 వింబుల్డన్ టోర్నమెంట్ (4వ సారి) Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఆండ్రూ జీగర్ 6–0, 6–3
1983 అమెరికన్ ఓపెన్ టెన్నిస్ Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు క్రిస్ ఎవర్ట్ 6–1, 6–3
1983 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (2వ సారి) Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు కాథీ జోర్డాన్ 6–2, 7–6(5)
1984 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ (2వ సారి) Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు క్రిస్ ఎవర్ట్ 6–3, 6–1
1984 వింబుల్డన్ టోర్నమెంట్ (5వ సారి) Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు క్రిస్ ఎవర్ట్ 7–6(5), 6–2
1984 అమెరికన్ ఓపెన్ టెన్నిస్(2వ సారి) Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు క్రిస్ ఎవర్ట్ 4–6, 6–4, 6–4
1985 వింబుల్డన్ టోర్నమెంట్ (6వ సారి) Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు క్రిస్ ఎవర్ట్ 4–6, 6–3, 6–2
1985 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (3వ సారి) Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు క్రిస్ ఎవర్ట్ 6–2, 4–6, 6–2
1986 వింబుల్డన్ టోర్నమెంట్ (7వ సారి) మూస:Country data TCH హనా మాండ్లికోవా 7–6(1), 6–3
1986 అమెరికన్ ఓపెన్ టెన్నిస్(3వ సారి) మూస:Country data TCH హెలీనా సుకోవా 6–3, 6–2
1987 వింబుల్డన్ టోర్నమెంట్ (8వ సారి) మూస:Country data FRG స్టెఫీగ్రాఫ్ 7–5, 6–3
1987 అమెరికన్ ఓపెన్ టెన్నిస్(4వ సారి) మూస:Country data FRG స్టెఫీగ్రాఫ్ 7–6(4), 6–1
1990 వింబుల్డన్ టోర్నమెంట్ (9వ సారి) Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు జినా గారిసన్ 6–4, 6–1

వర్ధిల్లుతున్న ఉర్దూ భాష!

ఉర్దూ (Urduఉచ్ఛారణ ) ఒక ఇండో-ఆర్యన్ భాష, భారత దేశం లో జన్మించిన భాష. ఈ భాష కు మాతృక లేదు. బహుభాషా సమ్మేళితం. ఖరీబోలి, లష్కరి, రీఖ్తి, హిందూస్తానీ దీనికి ఇతర నామాలు. అరబ్బీ (అరబిక్), బృజ్ భాష (హిందీ), పారశీకం (పర్షియన్), ఆంగ్లం మొదలగు భాషల సమ్మేళనం. ప్రపంచంలో దాదాపు 35 కోట్ల మంది మాట్లాడే భాష. భారతదేశపు 23 అధికారిక భాషల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్ లో 2వ అధికారిక భాష. ప్రపంచంలో మాండరిన్, ఇంగ్లీషుల తరువాత అత్యధికులు మాట్లాడేభాష ఉర్దూ.

చరిత్ర

13వ శతాబ్దం దక్షిణాసియా లోని ముస్లింల పరిపాలనా రాజుల సభలలో సభా భాష గా ఇండో-ఆర్యన్ (హిందూ-ఆర్యన్) ల మాండలికంగా ప్రారంభమయినది. ఢిల్లీ సుల్తానుల, మొఘల్ సామ్రాజ్యపు అధికార భాషగా విరాజిల్లినది. నాగరిక, సాహిత్య మరియు పద్యరూపాలకు పరిపూర్ణభాషగా పర్షియన్ ఉపయోగంలో వుండేది. మతపరమయిన మరియు ధార్మికపరమయిన భాషగా అరబ్బీ వుండేది. ఢిల్లీసుల్తానుల కాలంలో దాదాపు అందరు సుల్తానులు మరియు అత్యున్నత పదాధికారులందరూ మధ్యాసియా కు చెందిన పర్షియన్-తురుష్కులే. వీరి మాతృభాష చొఘ్తాయి లేదా టర్కిక్ భాష. మొఘలులుకూడా మధ్యాసియాకు చెందిన పర్షియన్ లే. వీరి ప్రథమభాష టర్కీ, తరువాత వీరు పర్షియన్ (పారసీ, ఫారసీ భాష) భాషను తమభాషగా ఉపయోగించసాగారు. మొఘలులకు పూర్వం, పర్షియన్ భాష అధికార భాషగాను సభ్యతా, సాహితీభాషగా పరిగణించబడినది. బాబరు మాతృభాష టర్కీ, టర్కీభాషలోనే బాబరు తన రచనలు చేశాడు. ఇతని కుమారుడు హుమాయూన్ కూడా టర్కీభాషనే అవలంబించాడు. మొఘల్ కాలపు హిందూ-పర్షియన్ చరిత్రకారుడు మొఘల్ పరిపాలనా, అక్బర్ పరిపాలనా కాలంలో పర్షియన్ భాష తన సభ్యతా విశాలధృక్పదాలు మరియు సరళతాకారణాలవల్ల ప్రధాన భాషగా ఆమోదం పొందిన భాష గా వర్ణిస్తాడు. టర్కీ, పర్షియన్, బ్రజ్ భాష, హిందవి, హర్యానవి, హిందీ భాషల సమ్మేళనభాషగా ఉర్దూ జన్మించింది. ఈ భాష దక్షిణాసియాలో ప్రధానంగాను, ప్రపంచమంతటా పాక్షికంగాను వాడుకలోయున్నది. ఢిల్లీ, హైదరాబాదు, కరాచి, లక్నో మరియు లాహోర్ లలో తనముద్రను ప్రగాఢంగా వేయగల్గింది.

ఉర్దూ అనే పేరు ఎలా వచ్చింది

The phrase జబాన్-ఎ-ఉర్దూ-ఎ-ముఅల్లా ("లష్కరీ భాష") నస్తలీఖ్ లిపిలో వ్రాయబడినది

The phrase జబాన్-ఎ-ఉర్దూ-ఎ-ముఅల్లా ("లష్కరీ భాష") నస్తలీఖ్ లిపిలో వ్రాయబడినది

రీఖ్తి, లష్కరి (సైనిక), భాషగా పేరు పడ్డ ఉర్దూ, షాజహాను కాలంలో ఉర్దూ అనేపేరును పొందింది. ఉర్దూ అనే పదానికి మూలం టర్కిష్ పదము ఉర్ద్ లేదా ఓర్ద్, అనగా సైన్యము, సైన్యపు డేరా, లేదా బజారు. దీనిని లష్కరీ జబాన్ లేదా 'సైనికులభాష' గా పేరొచ్చింది. ఎర్రకోట నిర్మాణసమయంలో దీనిపేరు ఉర్దూ గా స్థిరమయినది. సైనికులమధ్య వ్యావహారిక భాషగా మార్పుచెందుతూ, బజారులలో, వ్యాపారలావాదేవీల వ్యవహారాలలో, సభలలో తుదకు ఆస్థానాల ప్రధాన అధికారిక భాషగా స్థానం పొందింది. నవాబులు ఉర్దూను పోషించారు. రానురాను సాహితీభాషగా పద్యభాగానికి అనువైన భాషగా మార్పుచెందింది. ఉత్తరభారతదేశంలో ప్రధానభాషగా మారింది. రానురాను పర్షియన్ భాష స్థానాన్ని ఆక్రమించింది. పశ్చిమోత్తరభారతదేశంలో ప్రధానభాషగా వుండినది. 1947లో భారతదేశం విడగొట్టబడి పాకిస్తాన్ ఏర్పడినప్పుడు, పాకిస్తాన్ అధికారభాషగా ఆమోదింపబడింది. స్వతంత్రభారతదేశంలో అధికారభాష ప్రకటనా సమయంలో హిందీ భాషకు సమానంగా ఉర్దూకూ ఓట్లొచ్చాయి, పార్లమెంటులో హిందీ భాష ఆమోదం పొందింది. హిందీ-ఉర్దూ చెట్టాపట్టాలేసుకొని హిందవి లేదా హిందూస్తానీ భాషగానూ ప్రజామోదం పొందింది.

ఉర్దూ లిపి

ఉర్దూ లిపి నస్తలీఖ్, అరబ్బీ మరియు పర్షియన్ భాషల సాంప్రదాయం. కుడివైపు నుండి ఎడమవైపుకు వ్రాస్తారు. అరబ్బీ భాష లోని శబ్దాలను(అరబ్బీ భాషలో ప,ట,చ,డ మరియు గ శబ్దాలు లేవు) పర్షియన్ భాషనుండి ప,ట,చ,డ మరియు గ శబ్దాలను సంగ్రహించి ఉర్దూ భాషా శబ్దాలను ఏర్పరచారు.

మాండలికాలు

ఉర్దూ అక్షరమాల. (నస్తలీఖ్ అక్షరాలలో)

ఉర్దూ అక్షరమాల. (నస్తలీఖ్ అక్షరాలలో)

ఉర్దూ భాషకు నాలుగు మాండలికాలు గలవు. అవి

  • దక్కని దక్షిణభారతదేశంలోని మహారాష్ట్ర, హైదరాబాదు చుట్టుప్రక్కల ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలలోను, కర్నాటక, తమిళనాడు లోను,
  • పింజారి అనేక తెగలలోను,
  • రీఖ్తా ఉర్దూ పాత ఒరవడిగాను, మరియు
  • ఖరీబోలి ఢిల్లీ ప్రాంతం లోను మాట్లాడబడుచున్నవి.

దక్కని కు ఇతర పేర్లు దఖ్ఖని, దేశియా మరియు మిర్గాన్.

ఉర్దూ సాహిత్యం

ఉర్దూ మూడు శతాబ్దాలుగా సాహితీభాషగా విరాజిల్లుచున్నది. దీనికి మునుపు పర్షియన్ మరియు అరబ్బీ భాషాసాహిత్యాలు ప్రముఖంగా ఉపయోగపడేవి. ఉర్దూభాషా సాహిత్యం ప్రపంచ సాహిత్యంలో తనదంటూ ఒక స్థానం సంపాదించుకోగలిగినది.

గద్యం

ధార్మికసాహిత్యం

ఇస్లామీయ మరియు షరియా సాహిత్యంలో అరబ్బీ మరియు పర్షియన్ ల తరువాత ఉర్దూ ప్రముఖం. ఖురాన్ తర్జుమాలు, హదీసులు, ఫిఖహ్, ఇస్లామీయ చరిత్ర, మారిఫత్ (ఆధ్యాత్మికము), సూఫీ తత్వము, మరియు ధార్మికశాస్త్రాల సాహిత్యం చూడవచ్చు. ఖససుల్ అంబియా, తఫ్ హీముల్ ఖురాన్, తర్జుమానుల్ ఖురాన్, తఫ్సీరుల్ ఖురాన్, ఫజాయల్-ఎ-ఆమాల్, బెహిష్తీ జేవర్ మరియు బహారె షరీయత్ లు ప్రముఖం.

సాహితీ

గద్య సాహిత్యంలో ఇవి ముఖ్యం. దాస్తాన్, అఫ్సానా, నావల్ (నవల), సఫర్ నామా, మజ్ మూన్, సర్ గుజిష్త్, ఇన్ షాయియ, మురాసల, ఖుద్ నవిష్త్.

పద్యం

పద్యం లేదా కవితాసాహిత్యానికి చాలా అనువైనభాషగా ఉర్దూకు పేరుగలదు.

గజల్ ఉర్దూకవితా శిరస్సుపై వజ్రకిరీటం. ఉర్దూ ద్వారా గజల్ కు పేరురాలేదు గాని, గజల్ ద్వారా ఉర్దూకు ఖ్యాతి వచ్చింది అంటే అతిశయోక్తిగాదు.

పద్యసాహిత్యంలో కవితలకు ఈవిధంగా వర్గీకరించవచ్చు. నజమ్, గజల్, మస్ నవి, మర్సియా, దోహా, ఖసీదా, హమ్ద్, నాత్, ఖతా, రుబాయి, షెహ్ర్-ఎ-ఆషూబ్.

కవి తనకవితలలో తన కలంపేరు 'తఖల్లుస్' ఉపయోగిస్తాడు.

అరూజ్ లేదా ఛందస్సు

అరూజ్ అనగా కవితా రచనలో తీసుకోవలసిన సాంప్రదాయక విలువలు. కవితలు ఒక క్రమంగా తఖ్తీ ను గలిగి వుంటాయి. ఒక బహర్ (మీటర్) లో ఇమడబడి వుంటుంది. తఖ్తీ మూలాన్ని బహర్ అని, బహర్ లో వుండే శబ్దాలను అర్కాన్ లని అంటారు. అరూజ్ లో ముఖ్యమైన పదాలు అరూజ్, తఖ్తీ, బహర్, జమీన్, అర్కాన్.

షారిఖ్ జమాల్ నాగ్ పూరి అరూజ్ విద్వాంసుడు. ఇతని శిష్యగణం భారతదేశమంతటా, ముఖ్యంగా దక్షిణభారతదేశమంతటా గలరు.

వ్యావహారికము

ఉదాహరణలు

తెలుగు వాడుక ఉర్దూ లిపిలో తెలుగు లిప్యాంతరీకరణ యధానువాదం (గమనిక)
నమస్కారము السلام علیکم అస్సలామ్ ఒ అలైకుమ్ "మీకు శాంతి కలుగును గాక." ( అరబ్బీ నుండి.)
(ప్రతి) నమస్కారము و علیکم السلام వ అలైకుమ్ అస్సలామ్ "మీకునూ శాంతి కలుగును గాక." (అరబ్బీ నుండి)
నమస్తే (آداب (عرض ہے ఆదాబ్ (అర్జ్ హై) "గౌరవాన్ని ప్రకటించడం" (సెక్యులర్ విధానము)
మంచిది. వెళ్ళి రండి خدا حافظ ఖుదా హాఫిజ్ "అల్లాహ్ మిమ్మల్ని కాపాడు గాక"
అవును ہاں హాఁ అవును (సాధారణ వ్యవహారం)
అవును جی జీ అండీ(గౌరవ సూచకం)
అవునండీ جی ہاں జీ హాఁ అవునండీ(మర్యాదపూర్వంగా)
లేదు نا నా (సాధారణ వ్యవహారం)
లేదండి نہیں، جی نہیں నహీఁ, జీ నహీఁ లేదు (సాధారణ వ్యవహారం);లేదండీ (మర్యాదపూర్వంగా)
దయచేసి, దయవుంచి مہربانی మెహర్బానీ (కర్‌కె) దయ (ఉండి)
ధన్యవాదాలు شکریہ షుక్రియా ధన్యవాదాలు
దయచేయండి, స్వాగతం تشریف لائیے తష్రీఫ్ లాయియే "గౌరవంగా స్వాగతించడం"
దయచేసి కూర్చోండి تشریف رکھیئے తష్రీఫ్ రఖియే "గౌరవంగా కూర్చోబెట్టడం"
మీతోకలసి చాలా సంతోషించాను اپ سے مل کر خوشی ہوئی ఆప్ సే మిల్ కర్ ఖుషీ హుఈ "మీతోకలవడం ఆనందదాయకం"
మీరు ఇంగ్లీషు మాట్లాడగలరా? کیا اپ انگریزی بولتے ہیں؟ క్యా ఆప్ అంగ్రేజీ బోల్ తే హైఁ? "మీకు ఇంగ్లీషు వచ్చా?"
నేను ఉర్దూ మాట్లాడలేను. میں اردو نہیں بولتا/بولتی మైఁ ఉర్దూ నహీఁ బోల్ తా/బోల్ తీ బోల్ తా (పుంలింగము), బోల్ తీ (స్త్రీలింగము)
నా పేరు ... میرا نام ۔۔۔ ہے మేరా నామ్ .... హై
లక్నో ఎక్కడుంది? لکھنئو کہاں ہے؟ లక్నో కహాఁ హై
ఉర్దూ మంచి భాష. اردو اچھی زبان ہے ఉర్దూ అచ్ఛీ జబాన్ హై

ఇవి కూడా చూడండి

  1. ఉర్దూ సాహిత్యము
  2. ఉర్దూ ప్రముఖులు
  3. ఉర్దూ కవులు
  4. ముషాయిరా (కవిసమ్మేళనం)
  5. ఉర్దూ రచయితలు
  6. ఉర్దూ షాయిరి
  7. ఉర్దూ సామెతలు
  8. ప్రముఖ ఉర్దూ పుస్తకాలు
  9. ఉర్దూ-తెలుగు నిఘంటువు

ఉర్దూ భాష మాట్లాడే దేశాలు

  • భారత దేశం * పాకిస్తాన్ * బంగ్లాదేశ్ * యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ * యునైటెడ్ కింగ్డమ్ * సౌదీ అరేబియా * నేపాల్ * యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా * ఒమన్ * కెనడా * బహ్రయిన్ * మారిషెస్ * కతర్ * జర్మనీ * నార్వే * ఫ్రాన్స్ * స్పెయిన్ * స్వీడెన్ * ఆఫ్ఘనిస్తాన్ * ఇరాన్

ఉర్దూ అధికారిక భాష గల రాష్ట్రాలు

ప్రథమ అధికారిక భాష

  • జమ్మూ కాశ్మీరు

రెండవ అధికారిక భాష

  • ఉత్తరప్రదేశ్
  • బీహార్
  • ఆంధ్ర ప్రదేశ్
  • కర్నాటక
  • జార్ఖండ్
  • ఢిల్లీ
  • ఉత్తరాఖండ్

ఆంధ్రప్రదేశ్ లో రెండవ అధికారిక భాషగా గల జిల్లాలు

1. హైదరాబాద్. 2. నిజామాబాద్. 3. ఆదిలాబాద్. 4. వరంగల్. 5. మహబూబ్ నగర్. 6. కర్నూలు. 7. అనంతపురం. 8. చిత్తూరు. 9. కడప. 10. నల్గొండ. 11. కరీంనగర్ 12. మెదక్ 13. ఖమ్మం 14. రంగారెడ్డి

ఆంధ్రప్రదేశ్ నుండి ప్రచురితమయ్యే ఉర్దూ వార్తా పత్రికలు

దినపత్రికలు

సియాసత్, మున్సిఫ్ , రహ్ నుమా-యె-దక్కన్, ఏతెమాద్ , రాష్ట్రీయ సహారా మరియు మిలాప్

ఆంధ్రప్రదేశ్ లో ఉర్దూ విశ్వవిద్యాలయాల

  • మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటి, హైదరాబాద్.

ఆంధ్రప్రదేశ్ లో ఉర్దూ భాషా విభాగాలు గల విశ్వవిద్యాలయాలు

  • ఉస్మానియా విశ్వవిద్యాలయము హైదరాబాద్
  • హైదరాబాదు విశ్వవిద్యాలయము హైదరాబాద్
  • డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము హైదరాబాద్
  • కాకతీయ విశ్వవిద్యాలయము వరంగల్
  • శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము అనంతపురం
  • శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము తిరుపతి.

ఉర్దూ భాషాభివృధ్ధి కొరకు పాటుపడుతున్న సంస్థలు

  • సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్
  • నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్
  • అంజుమన్ తరఖ్ఖి ఉర్దూ
  • ఉర్దూ అకాడమీ

భారతదేశం లో ఉర్దూ టి.వి. ఛానళ్ళు

  • దూరదర్శన్ ఉర్దూ
  • ఈ.టి.వి. ఉర్దూ (ETV Urdu)

రేడియో స్టేషన్లు

  • ఆల్ ఇండియా రేడియో ఉర్దూ సర్వీస్.
  • వివిధ భారతి ఉర్దూ సర్వీస్.
  • ఆకాశవాణి ఉర్దూ సర్వీస్.

Saturday, April 5, 2008

నేవీ అమ్ములపొదిలో ఐ.ఎన్.ఎస్. కేసరి

భారతీయ నావికాదళం అమ్ములపొదిలో మరో ఆణిముత్యం వచ్చిచేరింది. దేశీయ అవసరాలకు అనుగుణంగా, అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన ఈ యుద్ధనౌకను రాష్ట్ర గవర్నర్ నారాయణ్ దత్ తివారీ శనివారం ఇక్కడి తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రమైన విశాఖపట్నంలో జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ నౌకలోని సందర్శకుల పుస్తకంలో సంతకం చేస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు.

విశాఖలో ముఖ్యమంత్రి కబుర్లు!

ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విశాఖ విమానాశ్రయంలో అధికారులతో ముచ్చటించారు. ఆరుబైట చిన్నసైజు సమీక్షా సమావేశంలా సాగిన భేటీలో జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్, వుడా వీసీ విఎన్ విష్ణు, ఎమ్మెల్యేలు గురుమూర్తిరెడ్డి, బాబ్జి, మంత్రి కొణతాల, జేసీవీరబ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Thursday, April 3, 2008

కొందరికే "జల్సా"

Pavan Kalyan




సినిమా: జల్సా
రేటింగ్: 2/5
విడుదల తేదీ: 2-4-08
బేనర్: గీతా ఆర్ట్స్
నటీనటులు :పవన్ కళ్యాణ్,ఇలియానా,కమిలినీ ముఖర్జీ,పార్వతీ మిల్టన్,ముఖేష్ ఋషి,ప్రకాష్ రాజ్,ఉత్తేజ్,అలీ,శివాజీ,సునీల్,బ్రహ్మానందం తదితరులు.
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: అల్లు అరవింద్
కథ,స్కీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్


జనజీవన స్రవంతి లో కలిసిపోయి తిరిగి జీవితం ప్రారంభించిన నక్సలైట్ ప్రేమలో పడితే వచ్చే పరిణామాల చుట్టూ తిరిగే కథగా వచ్చిన చిత్రం జల్సా.ఇందులో పవన్ కళ్యాణ్ యూత్ ని ఆకట్టుకునే మేనరిజమ్స్,డాన్సులతో ప్రెష్ గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తారు.కాని టైటిల్ కి తగినట్లుగా పూర్తి స్ధాయి జోష్ గా ఉండక పోవటంతో ఒక వర్గం కొంత నిరాశకి గురవుతోంది.అందులోనూ సామాజిక సమస్యని వినోదంతో చెప్పాలన్న ఆలోచన మంచిదే గాని కామెడీగా ప్రతీ అంశాన్ని చెప్పటంతో పండాల్సిన ఎమోషన్స్ మిస్సయ్యాయి .

సంజయ్ సాహూ( పవన్ )కరీంనగర్ జిల్లాలోని ఓ పేద రైతు కొడుకు.తండ్రి ఆత్మహత్య,అన్న హఠాత్ మరణం అతని జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి.తప్పని పరిస్థితుల్లో అడవుల్లోకి పారిపోయి నక్సలైట్ గా మారతాడు.అక్కడికి కూంబింగ్ ఆపరేషన్ కోసం వస్తాడు పోలీస్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్. తర్వాత జరిగిన పరిణామాలతో సంజయ్ జనజీవన స్రవంతి లో కలిసిపోయి హైదరాబాద్ వచ్చి తిరిగి జీవితం ప్రారంభిస్తాడు.అప్పుడు భాగమతి(ఇలియానా) పరిచయం అవుతుంది. తర్వాత అది ప్రేమగా మారుతుంది.జీవితం మళ్ళీ చిగురించి జల్సా చేసుకుందామనుకున్న దశలో ఆమె తండ్రి ప్రకాష్ రాజ్ అని తెలుస్తుంది.అప్పుడు ఏంజరుగుతుందనేది మిగతా కథ.

కెరీర్ ప్రారంభం నుండి రొమాంటిక్ కామిడీలతో హిట్లు కొడుతున్నరచయిత,దర్శకుడు త్రివిక్రమ్.ఖుషీ తో రొమాంటిక్ కామిడీలకు కరెక్టుగా సరిపోయే హీరో అనిపించుకున్న హీరో పవన్ కళ్యాణ్ తో చేసిన చిత్రం కావటంతో అంతటా మంచి హైప్ ఏర్పడింది.కాని కథలో ట్విస్టులు ఎక్కువ అవటం,చెప్పే విషయం లో స్పష్టత కొరవడటం కథనాన్ని నీరుగార్చాయి. డైలాగులు కూడా ఊహించిన రేంజిలో పేలకపోవటం మరో మైనస్.శివాజి,ముఖేష్ రుషి పాత్రలు రొటీన్ గా సాగాయి.మహేష్ బాబు వాయిస్ ఓవర్ ప్రయోగం బాగున్నప్పటికి కథకి కలిసి రాలేదు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం,శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగున్నాయి.దర్శకత్వం పరంగా త్రివిక్రమ్ మరింత పరిణతి సాధించినట్టు ఫ్లాష్ బ్యాక్ సీన్ల లో కనిపిస్తుంది.మరింత కామెడీ,రొమాంటిక్ టచ్ ఉంటే మరింత రాణించేది. ఇవన్నీ ప్రక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఎనర్జిటిక్ నటన హైలైట్.సామాజిక సమస్యను తెరకెక్కించాలన్న అల్లు అరవింద్ ప్రయత్నం అభినందించతగ్గది.

తారక్ తో రజనీ కాంత్ కూతురు పెళ్లి?

టాలీవుడ్ కుర్ర హీరోల పెళ్ళి కబుర్లపై రోజుకో వార్త వస్తోంది. తాజాగా తారక రత్న ఈ లిస్టులో చేరాడు. రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్యను చేసుకోవటం కోసం పెళ్ళి మాటలు జరుగుతున్నాయిట. తారక్ తండ్రి మోహన్ కృష్ణ తన బావ చంద్రబాబు నాయుడు సాయంతో సంప్రదింపులు జరుపుతున్నాడట. తారక్ హీరోగా భారీ హంగామాతో కెరీర్ ప్రారంభించి నిలదొక్కలేయాడు. మేడం సౌందర్య తన తండ్రిని హీరోగా పెట్టి 'సుల్తాన్ ది వారియర్' అనే యానిమేషన్ సినిమా రూపొందించి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తారక్ 'ముక్కంటి' అనే సినిమాతో ఆపసోపాలు పడుతున్నాడు. రజని మొదటి అల్లుడు ధనుష్ ఈ సంభంధంపై ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం. అన్నీ కుదిరితే నవంబర్ లో మేరేజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారుట.మరో ప్రక్క ఈ విషయం తెలిసిన జూనియర్ యన్టీఆర్ తల్లి మాత్రం తారక్ కన్నా ముందు తన కుమారుడుకి పెళ్ళి చేయాలని ప్రయత్నాలు చేస్తోందిట. రజనీకాంత్ స్వర్గీయ ఎన్టీరామారావు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఆ సాన్నిహిత్యాన్ని ఆయన బంధుత్వంగా మార్చుకోవాలనుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.

హరికృష్ణది వ్యక్తిగత ప్రకటన: పెద్దిరెడ్డి

తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని చేసిన ప్రకటన తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ వ్యక్తిగత అభిప్రాయమని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఇ. పెద్దిరెడ్డి అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడే పార్టీ సుప్రీం అని, తెలంగాణపై చంద్రబాబు నిర్ణయం వెల్లడించాల్సి ఉందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉందని, 1971 నుంచి ఈ సెంటిమెంటు ఉందని ఆయన అన్నారు. తెలంగాణ సెంటిమెంటు కొత్తది కాదని ఆయన అన్నారు.

Wednesday, April 2, 2008

"జల్సా"పై రాజకీయ రంగు!

పవన్ కళ్యాణ్ సినిమా "జల్సా"పై రాజకీయ రంగు పడింది. రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారున్న అన్ని కేంద్రాల్లో దాదాపు వెయ్యి థియేటర్లలో బుధవారం ఉదయం "జల్సా" విడుదలైంది. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న నేపధ్యంలో విడుదలైన ఈ సినిమాపై కోస్తా ఆంధ్రలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆసక్తి చూపించడం విశేషం. అంతే కాదు, తమ నియోజకవర్గం లోని చిరంజీవి కుటుంబ అభిమానులను ఆకట్టుకోడానికి కాంగ్రెస్, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటీ పడ్డారు.

విజయవాడ, గుంటూరు నగరాల్లో రాజకీయ నాయకులు "జల్సా" సినిమాను తమ ఓటర్లకు చూపించేందుకు థియేటర్లను బుక చేసుకున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి కుటుంబ అభిమానులనే కాకుండా కాపు వర్గానికి చెందిన యువతను ఆకర్షించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ పడ్డారు. చిరంజీవి రాజకీయాల్లోకి రావడం ఖాయం కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలుస్తామా లేదా అన్న అనుమానం పట్టుకున్న కాంగ్రెస్ , టిడిపి ప్రజా ప్రతినిధులు "జల్సా" సినిమా మీద మహా జల్సాగా ఖర్చు చేస్తున్నారు. చిరంజీవి పార్టీ పెట్టినా ఆ వర్గానికి చెందిన యువత తమ పక్షం వైపే ఉంటారన్న అభిప్రాయం కలిగించడానికి "ఉచిత జల్సా" స్కీం ను వీరు ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది.

కాపు వర్గం తమ వెంటే ఉందన్న బల ప్రదర్శన చేయడానికి కన్నా లక్ష్మీ నారాయణ వంటి కాపు నాయకులే కాకుండా కొందరు కమ్మ రాజకీయ నాయకులు కూడా ప్రయత్నించడం గమనార్హం. ఇక చిరంజీవి పార్టీ టికెట్ పొందాలనుకుంటున్న నాయకులైతే సూక్ష్మంలో మోక్షం అన్న రీతిలో థియేటర్లను అద్దెకు తీసుకుని "జల్సా" సినిమాను ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో వెయ్యి రూపాయలు, పట్టణాల్లో 500 రూపాయలకు 'జల్సా" టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్నారు. ఉచితంగా "జల్సా" టికెట్లు లభించడంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.

విజయవాడలో కాపు వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నపూర్ణ, లీలామహల్ థియేటర్లను, కమ్మ వర్గానికి చెందిన ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ ప్రియదర్శిని, జయరాం థియేటర్లను గుప్పిట్లో పెట్టుకుని చిరంజీవి కుటుంబ అభిమానులకు ఉచితంగా "జల్సా" సినిమాను చూపిస్తున్నట్టు తెలియవచ్చింది. "ఖుషీ" తర్వాత ఏడేళ్ళకు పవన్ కల్యాణ్ కు ఇదే పెద్ద హిట్ చిత్రమవుతుందని అభిమానులు భావించడంతో "జల్సా" సిన్మాకు క్రేజ్ పెరిగింది. గుంటూరు పట్టణలో అయితే "జల్సా' విడుదలైన అన్ని థియేటర్లనూ వారం రోజుల పాటు అక్కడి రాజకీయ నాయకులు హస్తగతం చేసుకున్నట్టు సమాచారం.

సేవల్లో విస్తరిస్తున్న భారతీయ తపాలా వ్యవస్థ

భారతీయ తపాలా వ్యవస్థ (ఇండియా పోస్ట్) ఒక భారత ప్రభుత్వ సంస్థ. ఇది 155,333 పోస్టాఫీసులతో ప్రపంచంలో కెల్లా అతి పెద్ద తపాలా వ్యవస్థ (చైనా 57,000 రెండవ స్థానం). దీని విస్తృతమైన శాఖలతో తపాలా సర్వీసులే కాకుండా బ్యాంకుల మాదిరి సర్వీసులు కూడా అందిస్తుంది.

చరిత్ర

మైసూరులో పోస్టాఫీసు
మైసూరులో పోస్టాఫీసు

ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో మొదటగా ముంబై, చెన్నై మరియు కోల్కతా 1764-1766 మధ్య పోస్టాఫీసులు ప్రారంభించింది. వారెన్ హేస్టింగ్స్ గవర్నరుగా ఈ తపాలా సర్వీసులను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చారు.

1839లో, North West Province సర్కిల్ ఏర్పాటయింది. 1860లో పంజాబ్ సర్కిల్, 1861లో బర్మా సర్కిల్, 1866లో సెంట్రల్ సర్కిల్ మరియు 1869లో సింద్ సర్కిల్ ఏర్పాటయినవి. తరువాత సర్కిల్స్ అవధ్ (1870), రాజ్ పుట్ (1871), అస్సాం (1873), బీహార్ (1877), తూర్పు బెంబాల్ (1878) and Central India (1879)లో ఏర్పడ్డాయి. 1914 సంవత్సరం కల్లా మొత్తం పోస్టల్ సర్కిల్స్ ఉన్నాయి.

తపాలా బిళ్ళలు 1 జూలై 1852లో సింధ్ జిల్లాలో మొదలయ్యాయి. వీటిని ఈస్ట్ ఇండియా కంపెనీ ముద్రించేది; కానీ అమ్మేవారు కాదు. అన్ని తపాలా బిళ్ళలు కలకత్తాలో ముద్రించబడేవి; అన్నీ కూడా విక్టోరియా మహారాణి బొమ్మతోనే విడుదల అయేవి.

తపాలా వ్యవస్థ

తపాలా వ్యవస్థ భారత ప్రభుత్వంలో సమాచార మంత్రిత్వ శాఖలోని భాగము. దీని నియంత్రణ' తపాలా సర్వీస్ బోర్డు' అధినంలో ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 22 తపాలా సర్కిల్స్ ఉన్నాయి. ప్రతీ సర్కిల్ కు ప్రధాన తపాలా జనరల్ అధికారి. ఇవి కాకుండా భారత రక్షణ వ్యవస్థ కోసం ప్రత్యేకమైన సర్కిల్ ఏర్పాటు చేయబడింది.

ఇతర సర్వీసులు

పోస్టాఫీసులలో తపాలా సర్వీసులు కాకుండా, ఆర్ధిక లావాదేవీలు కూడా విరివిగా జరుగుతున్నాయి. ఇవి ఎక్కువగా బ్యాంకులు లేని మారుమూల పల్లెలలో కేంద్రీకరించబడ్డాయి.

  • Public Provident నిధి
  • జాతీయ పొదుపు Certificate
  • కిసాన్ వికాస్ పత్రం
  • పొదుపు ఖాతా
  • నెలసరి ఆదాయ పధకము Monthly Income Scheme
  • Recurring పొదుపు ఖాతా
  • తపాలా పెట్టెలు

విప్లవకారుడు "ఫిడెల్ కాస్ట్రో"

ఫిడెల్ కాస్ట్రో
ఫిడెల్ కాస్ట్రో

ఫిడెల్ కాస్ట్రో (Fidel Castro) (జననం:ఆగస్టు 13,1926-) పూర్తి పేరు ఫిడెల్ అలెజాండ్రో కాస్ట్రో రుజ్, క్యూబా రాజకీయ నాయకుడు మరియు విప్లవకారుడు. కాస్ట్రో క్యూబాను 1959 జనవరి నుండి 2008 ఫిబ్రవరి వరకు పరిపాలించాడు. ఇతను క్యూబా నియంత బాటిస్టా ను సాయుధ పోరాటం ద్వారా తొలగించి అధికారం చేపట్టాడు. క్యూబాను పశ్చిమార్థ భూగోళంలో మొట్ట మొదటి సామ్యవాద దేశంగా మార్చాడు. ఇతడు అమెరికా కు బద్ద వ్యతిరేకి. అమెరికా గూఢాచార సంస్థ CIA (Central Intelligence Agency) కాస్ట్రో ను హత్య చేయటానికి మొత్తం 638 సార్లు విఫలయత్నం చేసింది. ఇతడు కాల్చే సిగార్ లో బాంబు పెట్టి, అతని స్కూబా-డైవింగ్ సూట్‌లో ప్రాణాంతకమైన ఫంగస్‌ ను ఉంచి చంపటానికి ప్రయత్నించినది. మాఫియా తరహాలో షూట్ చేయటం ద్వారా కూడా కాస్ట్రో ను హతమార్చుటకు ప్రయత్నించినది. ఆఖరికి అతని మాజీ ప్రియురాలు మారిటా లోరెంజ్ ద్వారా కూడా ఇతనిని హత్యచేయుటకు CIA ప్రయత్నించినది. కానీ ప్రతీ సారీ కాస్ట్రో మృత్యుంజయుడై బయటపడి అమెరికాకు పక్కలో బల్లెమై ఎదురు నిలిచాడు.

బాల్యం మరియు విధ్యాబ్యాసం

కాస్ట్రో క్యూబా లోని మయారి పట్టణానికి సమీపంలో ఉన్న బిరాన్ అనే గ్రామంలో ఆగస్టు 13,1926(కొందరు 1927 అని కూడా పేర్కొంటారు) న జన్మించాడు. ఇతని తండ్రి స్పెయిన్ దేశం నుండి వలస వచ్చిన చెరకు తోటల పెంపకందారుడు. కాస్ట్రో 1947 లో క్యూబన్ పీపుల్స్ పార్టీలో చేరాడు. 1950 లో హవానా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రం లో పట్టా పొందాడు. తరువాత కాస్ట్రో హవానాలోనే న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించాడు. 1952 లో క్యూబా ప్రతినిథుల సభ కొరకు జరగబోయే ఎన్నికలలో పోటీచేశాడు. కానీ అదే సమయంలో బాటిస్టా మిలిటరీ కుట్ర ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుని రాజ్యాంగాన్ని బహిష్కరించి క్యూబాలో నియంతృత్వాన్ని నెలకొల్పాడు.

క్యూబా తిరుగుబాటు

కాస్ట్రో బాటిస్టా నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రహస్య విప్లవ వర్గానికి నాయకత్వం వహించాడు. జూలై 26,1953 న కాస్ట్రో దళాలు శాంటియాగో డి క్యూబా నగరం లోని మోన్‌కాడా సైనిక స్థావరాన్ని ముట్టడించాయి. ఈ ముట్టడిలో పట్టుబడటంతో కాస్ట్రోకు 15 సం.లు కారాగార శిక్ష విధించబడింది. కానీ 1955 లో బాటిస్టా ఇతనిని విడుదల చేశాడు. విడుదలైన వెంటనే కాస్ట్రో తన మొదటి తిరుగుబాటు జరిగిన రోజు స్మారకంగా జూలై 26 ఉద్యమం అనే పేరుతో ఒక విప్లవ దళాన్ని నిర్మించాడు. ఈ విప్లవ దళంతో కాస్ట్రో మెక్సికో ప్రవాసం వెళ్లాడు. అక్కడే ప్రఖ్యాత విప్లవ కారుడు చే గెవారా వీరితో కలిసాడు. మొత్తం 82 మంది తో కూడిన ఈ విప్లవ దళం మరలా తిరిగి డిసెంబరు,1956 లో క్యూబా లో కాలు మోపింది. ఈ దళం లోని 70 మంది వెంటనే చంపివేయబడ్డారు. కాస్ట్రో,అతని సోదరుడు రౌల్ కాస్ట్రో మరియు చే గెవారాల తో కూడిన మిగిలిన 12 మంది క్యూబా ఆగ్నేయ ప్రాంతంలోని సియెర్రా మేస్త్రా పర్వత శ్రేణి లోకి పారిపోయారు. ఆ పర్వత ప్రాంతంలోని చుట్టుపక్కల ప్రజలు కాస్ట్రో విప్లవదళం లో చేరారు. కాస్ట్రో 1958 డిసెంబరు నెలలో తన విప్లవదళంతో హవనా కు బయలు దేరాడు. మార్గ మధ్యంలో అతనికి లభించిన ప్రజాదరణను చూచిన బాటిస్టా జనవరి 1,1959 న దేశం విడిచి పారిపోవటంతో క్యూబా నాయకుడిగా కాస్ట్రో అధికారాన్ని చేపట్టాడు.

అధికారం

అదికారాన్ని చేపట్టిన వెంటనే కాస్ట్రో అమెరికా తో సహా విదేశీయులందరి మరియు స్వదేశీయుల ఆస్థులన్నింటినీ స్వాధీనం చేసుకున్నాడు.ఈ చర్యల మూలంగా అమెరికాతో దౌత్య,వ్యాపార సంబంధాలు దెబ్బ తినటంతో కాస్ట్రో అప్పు, ఆయుధాలు, ఆహార సరఫరా ఇత్యాది వాటి కొరకు సోవియట్ యూనియన్ కు దగ్గరయ్యాడు. కాస్ట్రో క్యూబా సహజ వనరులన్నింటినీ జాతీయం చేశాడు. వ్యవసాయాన్ని సమిష్టిగా నిర్వహించాడు. క్యూబాలో ఒకే పార్టీ గల సోషలిష్టు రాజ్యాన్ని నెలకొల్పాడు. దీనితో అనేకమంది ధనవంతులైన క్యూబన్ లు దేశం విడిచి వెళ్ళిపోయారు.కాస్ట్రో క్యూబాలోని అమెరికా కంపెనీలన్నింటినీ స్వాధీనం చేసుకోవటంతో ఆగ్రహించిన అమెరికా 1960 లో క్యూబాతో అన్ని రకాల వ్యాపార ఒప్పందాలను రద్దుచేసుకున్నది.

బే ఆఫ్ పిగ్స్

1961 లో అమెరికా క్యూబా నుండి ప్రవాసం వచ్చిన వారి ద్వారా కాస్ట్రో ప్రభుత్వాన్ని కూల్చివేయుటకు విఫల యత్నం చేసింది(Bay of Pigs Invasion) ఈ ఘటన తరువాత కాస్ట్రో మరింతగా సామ్యవాదం వైపు మరలాడు. సోవియట్ యూనియన్ తో మరింత బలమైన బంధాలను ఏర్పరచుకుని దానినుండి ఆర్థిక, సైనిక పరమైన సహాయాలను పొందనారంభించాడు.

క్యూబా అణు క్షిపనులు

1962 లో సోవియట్ యూనియన్ క్యూబాలో మధ్య తరహా అణు క్షిపణులను మోహరించడంతో అమెరికా అభ్యంతరం తెలిపినది. ఈ సంక్షోభ సమయంలో ప్రపంచమంతటా అణు యుధ్ధ భయం ఆవరించినది. కానీ సోవియట్ నేత నికితా కృశ్చెవ్ మరియు అమెరికా నేత జాన్ ఎఫ్.కెన్నడి ల మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ సంక్షోభం(Cuban Missile Crisis)శాంతియుతంగా పరిష్కారమైనది.

విదేశాలతో సంభందాలు

తరువాతి కాలంలో కాస్ట్రో వర్ధమాన దేశాలలో అలీనోద్యమ నేతగా సమున్నత స్థానాన్ని పొందాడు. కాస్ట్రో దక్షిణ అమెరికా, మధ్య అమెరికా మరియు ఆఫ్రికా లలోని అనేక దేశాలలోని విప్లవోద్యమాలకు సహాయం చేశాడు. కాస్ట్రో ప్రభుత్వం క్యూబన్ లకు మెరుగైన విద్యను మరియు ఆరోగ్య సౌకర్యాలను కల్పించినది. 1991 లో సోవియట్ యూనియన్ పతనమవటంతో ఆ దేశం నుండి నిరవధికంగా అందుతున్న సహాయం ఆగిపోయింది. అయినా కూడా కాస్ట్రో సామ్యవాద పంథాకే బలంగా కట్టుబడ్డాడు.

వారసత్వం

తన వారసుడుగా ఏనాడో ప్రకటించిన తమ్ముడు రౌల్ కాస్ట్రో కు బాధ్యతలను అప్పగించి ఫిబ్రవరి, 2008లో పరిపాలనా బాధ్యతలనుండి ఫిడెల్ కాస్ట్రో తప్పుకున్నాడు.

తోకచుక్క గురించి తెలుసుకుందాం!

Comet Hale-Bopp

Comet Hale-Bopp
CComet P1 McNaught

CComet P1 McNaught
సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తోకచుక్క రెండు తోకల్ని గమనించండి.

సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తోకచుక్క రెండు తోకల్ని గమనించండి.

తోకచుక్కలు (Comets) ఆకాశంలోని చిన్నచిన్న విచిత్రాలు. నక్షత్రాలను చుక్కలంటాము. తోకచుక్కలు నిజంగా చుక్కలు కావు. తోకచుక్కలు సౌరకుటుంబానికి చెందినవి. సంస్కృతంలో తోకచుక్కలను ధూమకేతువు లంటారు. పూర్వకాలంలో తోకచుక్క కనిపిస్తే ఏదో అరిష్టానికి సూచనగా భావించేవారు.

ఇప్పటికి ఇంచుమించు 600 తోకచుక్కలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిలో 513 చాలా దీర్ఘకాలికమైనవి.

తోకచుక్క నిర్మాణం

తోకచుక్క కక్ష్యలో సూర్యునికి దూరాన ఉన్నప్పుడు అతిశీతలంగా ఉంటుంది. దానిలోని వాయువులు గడ్డకడతాయి. అప్పుడు దానికి తలేకాని తోక ఉండదు. తోకచుక్క తలలో మిథేన్, అమ్మోనియా, నీరు గడ్డకట్టి ఉంటాయి. ఈ గడ్డలోపల ఇనుము, నికెల్, కాల్షియం, మెగ్నీషియం, సిలికాన్, సోడియం మొదలగు మూలకాలు ఉంటాయి. సూర్యుని సమీపిస్తున్న కొద్దీ కేంద్రంలోని మంచు కరిగిపోతుంది. వాయువులు విడిపోతాయి. ఈ వాయుకణాల మీద, ఉల్కాధూళి కణాలమీద సూర్యకాంతి పడి ప్రతిఫలిస్తుంది. ఇదే తోకలాగా ప్రకాశిస్తుంది. ఈ వాయువులను సౌరవాయువులు వెనక్కి త్రోసివేస్తాయి. ఈ కారణం వల్లనే ఎప్పుడూ తోకచుక్క తల సూర్యునివైపు, తోక సూర్యునికి వ్యతిరేక దిశలో ఉంటాయి.

ముఖ్యమైన తోకచుక్కలు

హేలీ తోకచుక్క

ఇది 1910 సంవత్సరంలోను, 1985 లోను కనిపించిన తోకచుక్క. ఈ తోకచుక్క 76-77 సంవత్సరాల కొకసారి భూమికి దగ్గరగా వస్తుందని మొదటగా కనిపెట్టినవాడు ఎడ్మండ్ హేలీ అనే ఇంగ్లీషు శాస్త్రజ్ఞుడు. ఆయన పేరు మీదనే దానికి 'హేలీ తోకచుక్క' అని పేరు పెట్టారు. హేలీ 1659 లో జన్మించాడు. తోకచుక్కలను గురించి ఆయన పరిశోధన చేస్తూ పాత రికార్డులని తిరగ వేస్తుండగా, 1531 లో కనబడిన ఒక ప్రకాశవంతమైన తోకచుక్క, 1607 లో తిరిగి కనబడిందని తెలియవచ్చింది. 1682 లో తాను స్వయంగా చూచిన తోకచుక్క అదేనని కూడా ఆయన కనిపెట్టాడు. అతని లెక్క ప్రకారం ఇది తిరిగి 1759 లో మళ్ళి కనిపించింది. కానీ 1742 లోనే హేలీ కాలధర్మం చెందాడు.

హేలీ తర్వాత ఈ తోకచుక్క చరిత్ర తవ్వి తీయగా వరుసగా 76 సంవత్సరాల కొకసారి దాన్ని ఎవరో ఒకరు చూస్తూనే వున్నరని తెలిసింది. మానవులు చైనా లో మొదటిసారిగా దాన్ని క్రీస్తుపూర్వం 249 లో చూసినట్టుగా నిర్ధారణ అయింది. 1066 లో ఇంగ్లండును నార్మన్ లు జయించినప్పుడు కూడా అదే తోకచుక్క కనబడినట్టు చరిత్రలో ఉన్నది. ఈ హేలీ తోకచుక్కనే 1910 లో గురజాడ అప్పారావు వర్ణించిన "సంఘ సంస్కరణ ప్రయాణ పతాక". ఈ తోకచుక్క గురించి అమెరికన్ రచయిత మార్క్ ట్వేన్ కధనం ప్రసిద్ధమైనది. మహాకవి శ్రీ శ్రీ కూడా 1910 లోనే జన్మించాడు.

విష్ణు సహస్రనామ స్తోత్రము

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము (Sri Vishnu Sahasranama Stotra) అత్యంత ప్రాచుర్యము కలిగిన హిందూ ప్రార్థనలలో ఒకటి. పేరును బట్టి ఇది శ్రీమహావిష్ణువు వేయి నామాలను సంకీర్తనం చేసే స్తోత్రము. ఈ స్తోత్రాన్ని చాలామంది హిందువులు భగవంతుని పూజించే కార్యంగా పారాయణం చేస్తూ ఉంటారు.

విష్ణు సహస్ర నామ స్తోత్రము మహాభారతం లోని అనుశాసనిక పర్వం లో 149వ అధ్యాయంలో ఉన్నది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద పండుకొని ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠురు నకు ఉపదేశిస్తాడు. ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని ఆ విధమైన విశ్వాసం ఉన్నవారి నమ్మకం. స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి)లో ఈ శ్లోకం "ధర్మార్థులకు ధర్మము, అర్థార్థులకు అర్థము, కామార్థులకు కామము, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును" అని చెప్పబడినది.

స్తోత్ర ఆవిర్భావము

విష్ణు సహస్రనామ స్తోత్రము ఆవిర్భవించిన పరిస్థితులు ఆసక్తి కరమైనవి. కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన జనక్షయం, కష్టాలవలన పాండవాగ్రజుడు యుధిష్ఠిరుడు కృంగిపోయి ఉన్నాడు. తన వంశోన్నతిని కోరిన భీష్ముడు అంపశయ్యపై మరణానికి సిద్ధంగా ఉన్నాడు. అనితర జ్ఞాననిలయమైన భీష్ముని ఆశ్రయించి ధర్మాన్ని, నీతిని తెలిసికొనమని యుధిష్ఠిరుని వేదవ్యాసుడు, శ్రీకృష్ణుడు ఆదేశించారు. భీష్ముడు కృష్ణునితో "ప్రభూ! జగద్గురువువైన నీయెదుట నేను ఉపదేశము చేయజాలినవాడను కాను. ఆపై క్షతగాత్రుడనైన నా బుద్ధి, శక్తి క్షీణించినవి. క్షమింపుడు" అనెను. అప్పుడు శ్రీకృష్ణుడు "భీష్మా! నా ప్రభావము చేత నీ క్లేశములన్నీ ఇపుడే తొలగిపోవును. సమస్త జ్ఞానము నీ బుద్ధికి స్ఫురించును. నీచేత నేను ధర్మోపదేశము చేయించుచున్నాను" అని అనుగ్రహించెను. అలా భీష్ముడు అంపశయ్యపైనుండే యుధిష్ఠిరునకు సమస్త జ్ఞాన, ధర్మములను ఉపదేశించెను.

భీష్ముడి ఉపదేశం

అలా జ్ఞానబోధను గ్రహించే సమయంలో యుధిష్ఠిరుడు ఆరు ప్రశ్నలను అడిగాడు. ఆ ప్రశ్నల సారాంశము: "దుఃఖముతో కృంగి ఉన్న నాకు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితమును ఇచ్చే ఉపాయమేది? ఎవరిని స్తుతించాలి?" దానికి భీష్ముడు చెప్పిన ఉపాయము: "భక్తితో, శ్రద్ధతో విష్ణువు వేయి నామాలను జపించు. అన్ని దుఃఖములు, కష్టములు, పాపములనుండి విముక్తి పొందడానికి ఇదే సులభమైన మార్గము". అలా భీష్ముడు ఉపదేశించినదే విష్ణు సహస్రనామ స్తోత్రము.

స్తోత్రవిభాగము

విష్ణు సహస్రనామ స్తోత్రపఠనానికి ముందుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని పఠించడం చాలామంది పాటించే ఆనవాయితీ. చాలా స్తోత్రాలలో లాగానే విష్ణు సహస్రనామ స్తోత్రంలో వివిధ విభాగాలున్నాయి.

పూర్వ పీఠిక

ప్రార్థన

ప్రార్ధన శ్లోకములు, స్తోత్రము ఆవిర్భవించిన సందర్భ వివరణ ఈ పూర్వపీఠికలో ఉన్నాయి. ముందుగా వినాయకు నకు, విష్వక్సేను నకు, వ్యాసు నకు, ఆపై విష్ణువుకు ప్రణామములతో స్తోత్రము ఆరంభమౌతుంది.

స్తోత్ర కథ

అనేక పవిత్ర ధర్మములను విన్న తరువాత ధర్మరాజు భీష్ముని అడిగిన ఆరు ప్రశ్నలు:

  1. కిమ్ ఏకమ్ దైవతం లోకే - లోకంలో ఒక్కడే అయిన దేవుడు (పరమాత్ముడు) ఎవరు?
  2. కిమ్ వాపి ఏకమ్ పరాయణమ్ - జీవితానికి పరమపదమైన గమ్యము ఏది?
  3. స్తువంతః కమ్ ప్రాప్నుయుః మానవాః శుభమ్ - ఏ దేవుని స్తుతించుట వలన మానవులకు శుభములు లభించును?
  4. కమ్ అర్చంతః ప్రాప్నుయుః మానవాః శుభమ్ - ఏ దేవుని అర్చించుట వలన మానవునకు శుభములు లభించును?
  5. కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః - మీ అభిప్రాయము ప్రకారము సర్వధర్మములకు ఉత్కృష్టమైన ధర్మమేది?
  6. కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్ - ఏ దేవుని జపించుటవలన జన్మ సంసార బంధనములనుండి ముక్తి లభించును?

అందుకు భీష్ముడు చెప్పిన సమాధానం: జగత్ప్రభువును, దేవదేవుని, అనంతుని, పురుషోత్తముని వేయి నామములను నిశ్చలమైన భక్తితో స్తుతిసేయట వలనను, ఆరాధించుట వలనను, ధ్యానించుట వలనను, ప్రణామము చేయుట వలనను సర్వదుఃఖములనుండి విముక్తి పొందవచ్చును. ఆ బ్రహ్మణ్యుని, పుండరీకాక్షుని ఆరాధించుట ఉత్తమ ధర్మము. ఆ దేవదేవుడు పరమ మంగళ ప్రదుడు. సకల సృష్టి స్థితి లయ కారకుడు. ఈ వేయి గుణ కీర్తనకరములైన నామములను ఋషులు గానము చేసినారు.

సంకల్పము

తరువాత స్తోత్రములో సంకల్పము (ఎవరిని, ఎందుకు స్తుతిస్తున్నాము) చెప్పబడుతుంది. ఈ స్తోత్రమునకు

  • ఋషి - వేదవ్యాసుడు
  • ఛందస్సు - "అనుష్టుప్"
  • మంత్రాధిష్టాన దైవము - శ్రీమన్నారాయణుడు
  • బీజము - అమృతాం శూద్భవః భానుః
  • శక్తి - దేవకీ నందనః స్రష్టా
  • మంత్రము - ఉద్భవః క్షోభణః దేవః
  • కీలకము - శంఖభృత్ నందకీ చక్రీ
  • అస్త్రము - శార్ఙ్గధన్వా గదాధరః
  • నేత్రము -రథాంగపాణి రక్షోభ్యః
  • కవచము -త్రిసామా సామగః సామః
  • యోని - ఆనందం పరబ్రహ్మ
  • దిగ్బంధము - ఋతుః సుదర్శనః కాలః
  • ధ్యానము చేయు దేవుడు - విశ్వరూపమని భావించే విష్ణువు
  • చేసే పని - సహస్రనామ జపము
  • కారణము - శ్రీమహావిష్ణువు ప్రీతి కొరకు

ధ్యానము

తరువాత పాలకడలిలో శంఖ చక్ర గదా పద్మములు ధరించిన వాడు, భూమియే పాదములుగా గలవాడు, సూర్యచంద్రములు నేత్రములైనవాడు, దిక్కులే చెవులైనవాడు, త్రిభువనములు శరీరముగా గలవాడు, శేషశాయి, విశ్వరూపుడు, శ్రీవత్సాంక కౌస్తుభ పీతాంబరధారి, నీలమేఘ వర్ణుడు అయిన రుక్మిణీ సత్యభామా సమేతుడు, ముకుందుడు, పరమాత్ముడు అయిన దేవునకు ధ్యానము చెప్పబడుతుంది.

"హరిః ఓం" అంటూ వేయి నామాల జపం మొదలవుతుంది.

వేయి నామములు

విశ్వం అనే నామంతో మొదలైన సహస్ర నామ జపం సర్వ ప్రహరణాయుధ అనే వెయ్యవ నామంతో ముగుస్తుంది. ఈ ప్రధాన స్తోత్ర భాగంలో 107 శ్లోకాలలో వేయి నామములు పొందుపరచబడి ఉన్నాయి. పరమాత్ముని వివిధ లక్షణ గుణ స్వభావ రూపములు వివిధనామములలో కీర్తించబడ్డాయి. అనంత గుణ సంపన్నుడైన భగవానుని వేయి ముఖ్యగుణములను కీర్తించే పుణ్యశబ్దాలుగా ఈ వేయి నామాలను సాంప్రదాయికులు విశ్వసిస్తారు.

విష్ణు సహస్రనామాలను గురించి పెక్కుభాష్యాలు వెలువడినాయి. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు రచించిన భాష్యము వీటిలో ప్రథమము. అద్వైత సిద్ధాంతము ననుసరించే ఈ భాష్యంలో భగవంతుని పరబ్రహ్మ తత్వమునకు, షడ్గుణైశ్వర్యమునకు ఎక్కువ ప్రాదాన్యతనిచ్చి వ్యాఖ్యానించారు. 12వ శతాబ్దంలో పరాశర భట్టు రచించిన భాష్యము విశిష్టాద్వైతం సిద్ధాంతాలకు అనుగుణంగా సాగుతూ, భక్తుల పట్ల భగవానుని సౌలభ్యాన్నీ, సౌశీల్యాన్నీ, కరుణనూ మరింతగా విపులీకరించినది. తరువాత అనేకులు రచించిన వ్యాఖ్యలకు ఈ రెండు భాష్యాలే మార్గదర్శకాలు.


వివిధ భాష్యకర్తలు వ్యాఖ్యానించిన నామముల జాబితా పరిశీలించినట్లయితే వారు పేర్కొన్న నామములలో స్వల్ప భేదాలు కనిపిస్తాయి. ఉదాహరణకు శంకరాచార్యులు "స్థవిరోధ్రువః" అని ఒకే నామమును పరిగణించగా, పరాశరభట్టు "స్థవిరః", "ధ్రువః" అనే రెండు నామములుగా పరిగణించెను. పరాశరభట్టు "విధేయాత్మా" అని తీసుకొనగా శంకరాచార్యులు "అవిధేయాత్మా" అని తీసుకొనెను. కాని ఇటువంటి భేదాలు చాలా కొద్ది.


ఇంకా కొన్ని నామములు పునరావృతమైనట్లుగా ఉంటాయి. ఉదాహరణకు విష్ణుః (మూడు సార్లు); శ్రీమాన్, ప్రాణదః (ఒక్కొక్కటి నాలుగు సార్లు); కేశవః, పద్మనాభః, వసుః, సత్యః, వాసుదేవః, వీరః, ప్రాణః, వీరహా, అజః, మాధవః (ఒక్కొక్కటి మూడు సార్లు); పురుషః, ఈశ్వరః, అచ్యుతః, అనిరుద్ధః, అనిలః, శ్రీనివాసః, యజ్ఞః, మహీధరః, కృష్ణః, అనంతః, అక్షోభ్యః, వసుప్రదః, చక్రీ (ఒక్కొక్కటి రెండేసి సార్లు) - ఇలా చెప్పబడ్డాయి. మొత్తం 90 నామాలు ఒకటికంటె ఎక్కువసార్లు వస్తాయి. కాని భాష్యకారులు ఒకే నామానికి వివిధ సందర్భాలలో వివిధ అర్ధాలు వివరించి, పునరుక్తి దోషం లేదని నిరూపించారు.

ఇంకా భగవద్గీతకు, విష్ణు సహస్రనామ స్తోత్రానికి అవినాభావ సంబంధము ఉన్నది. (రెండూ మహాభారతం లోనివే). ప్రత్యేకించి గీతలోని 10వ అధ్యాయము (విభూతి యోగము)లో భగవంతుని వర్ణించే విభూతులు అన్నీ విష్ణు సహస్ర నామంలో వస్తాయి. (ఉదాహరణ - ఆదిత్యః, విష్ణుః, రవిః, మరీచిః, వేదః, సిద్ధః, కపిలః, యమః, కాలః, అనంతః, రామః, ఋతుః, స్మృతిః, మేధా, క్షమః, వ్యవసాయః, వాసుదేవః, వ్యాసః). 11 వ అధ్యాయము (విశ్వరూప సందర్శన యోగము)లలో భగవంతుని వర్ణించే పదాలు అన్నీ విష్ణు సహస్ర నామంలో దాదాపుగా వస్తాయి. (ఉదాహరణ: తత్పరః, అవ్యయః, పురుషః, ధర్మః, సనాతనః, హృషీకేశః, కృష్ణః, సనాతనః, చతుర్భుజః, విశ్వమూర్తిః, అప్రమేయః, ఆదిదేవః). ఇంకా గీత 2వ అధ్యాయములోని స్థితప్రజ్ఞ లక్షణాలు, 12వ అధ్యాయములోని భక్త లక్షణాలు, 13వ అధ్యాయములోని భగవద్గుణములు, 14వ అధ్యాయములోని త్రిగుణాతీతుని లక్షణాలు, 16వ అధ్యాయములోని దేవతాగణగుణాలు అన్నీ వేర్వేరు నామాలుగా సహస్రనామ స్తోత్రంలో చెప్పబడ్డాయి.

శంకరాచార్యులు "గేయం - గీతా - నామ సహస్రం" అని రెండు పవిత్ర గ్రంధాలకూ ఎంతో ప్రాముఖ్యతను తెలియజెప్పారు.

ఉత్తర పీఠిక

ఫలశ్రుతి

ఈ స్తోత్రం వలన కలిగే ప్రయోజనాలు ఫలశ్రుతిలో చెప్పబడ్డాయి. క్లుప్తంగా ఇదీ ఫలశ్రుతి:

ఈ దివ్య కేశవ కీర్తనను వినేవారికి, చదివే వారికి ఏవిధమైన అశుభములు కలుగవు. బ్రాహ్మణులకు వేదవిద్య, గోవులు లభించును. క్షత్రియులకు విజయము, వైశ్యులకు ధనము, శూద్రులకు సుఖము లభించును. ధర్మము కోరువారికి ధర్మము, ధనము కోరువారికి ధనము అబ్బును. కోరికలీడేరును. రాజ్యము లభించును. భక్తితో వాసుదేవుని నామములను శుచిగా కీర్తించేవారికి కీర్తి, శ్రేయస్సు, ప్రాధాన్యత లభించును. వారి రోగములు హరించును. వారికి బలము, తేజము వర్ధిల్లును.


పురుషోత్తముని స్తుతి చేసేవారిలో వ్యాధిగ్రస్తులు ఆరోగ్యవంతులవుతారు. బంధితులకు స్వేచ్ఛ లభించును. భయమునుండి విముక్తి కలుగును. ఆపదలు తొలగిపోవును. అట్టి భక్తుల కష్టములు కడతేరును. వాసుదేవుని భక్తులకు పాపములు తొలగును. వారికి అశుభములు, జన్మ మృత్యు జరా వ్యాధి భయములు ఉండవు. సుఖము, శాంతి, సిరి, ధైర్యము, కీర్తి, సస్మృతి లభించును. పుణ్యాత్ములగుదురు.


సకల చరాచర జీవములు, గ్రహ నక్షత్రాదులు, దేవతలు వాసుదేవుని ఆజ్ఞానుబద్ధులు. జనార్దనుడే సకల వేద జ్ఞాన విద్యా స్వరూపుడు. ముల్లోకాలలో వ్యాపించిన విష్ణువు ఒకడే. వ్యాసునిచే కీర్తింపబడిన ఈ స్తవమును పఠించిన, విన్న యెడల శ్రేయస్సు, సుఖము లభించును. అవ్యయుడైన విశ్వేశ్వరుని భజించినవారికి పరాభవమెన్నడును జరుగదు.


ఈ స్తోత్రంతో కలిపి చదివే ఈ స్పష్టమైన ఫలశ్రుతి మహాభారత పాఠంలో అంతర్గత విభాగం. దీనికి జనాదరణ కలిగించడానికి ఎవరో తరువాత అతికించినది కాదు. భాష్యకారులు తమ వ్యాఖ్యలలో ఫలశ్రుతిని కూడా వివరించారు.

ఉపదేశాలు

  • అర్జునుడు "పద్మనాభా! జనార్దనా! అనురక్తులైన భక్తులను కాపాడు" అని కోరగా కృష్ణుని సమాధానం - "నా వేయి నామములు స్తుతించగోరే వారు ఒకే ఒక నామము స్తుతించినా గాని నన్ను పొందగలరు"
  • వ్యాసుడు చెప్పినది - "ముల్లోకములు వాసుదేవుని వలన నిలచియున్నాయి. అన్ని భూతములలోను వాసుదేవుడు అంతర్యామి. వాసుదేవునకు నమోస్తుతులు"
  • పార్వతి కోరినది - "ప్రభో! ఈశ్వరా! విష్ణు సహస్ర నామమును పండితులు నిత్యం క్లుప్తంగా ఎలా పఠిస్తారు? సెలవీయండి" అందుకు ఈశ్వరుడు ఇలా చెప్పాడు - "శ్రీరామ రామ రామ యని రామనామమును ధ్యానించనగును. రామ నామము వేయి నామములకు సమానము"
శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
  • బ్రహ్మ చెప్పినది - "అనంతుడు, వేలాది రూపములు, పాదములు, కనులు, శిరస్సులు, భుజములు, నామములు గల పురుషునకు నమోస్తు. సహస్రకోటి యుగాలు ధరించిన వానికి నమస్కారములు"
  • సంజయుడు చెప్పినది - "యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉన్నచోట ఐశ్వర్యము, విజయము నిశ్చయంగా ఉంటాయి."
  • శ్రీ భగవానుడు చెప్పినది - "ఇతర చింతనలు లేక నన్నే నమ్మి ఉపాసన చేసేవారి యోగక్షేమాలు నేనే వహిస్తాను. ప్రతియుగం లోను దుష్ట శిక్షణకు, సాధురక్షణకు నేను అవతరిస్తాను"
  • నారాయణ నామ స్మరణ ప్రభావము - "దుఃఖితులైనవారు, భయగ్రస్తులు, వ్యాధిపీడితులు కేవలము నారాయణ శబ్దమును సంకీర్తించినయెడల దుఃఖమునుండి విముక్తులై సుఖమును పొందుతారు."

సమర్పణ

శరీరముచేత గాని, వాక్కుచేత గాని, ఇంద్రియాలచేత గాని, బుద్ధిచేత గాని, స్వభావంచేత గాని చేసే కర్మలనన్నింటినీ శ్రీమన్నారాయణునకే సమర్పిస్తున్నాను. భగవంతుడా! నా స్తోత్రంలోని అక్షర, పద, మాత్రా లోపములను క్షమించు. నారాయణా! నీకు నమస్కారము.

అన్న ప్రణతులతో ఈ పుణ్యశ్లోకము ముగుస్తుంది.

సాంప్రదాయాలు, వ్యాఖ్యలు

హిందూమత సాంప్రదాయంలో శివుడు, శక్తి, వినాయకుడు, లక్ష్మి - ఇలా చాలా దేవతల సహస్రనామ స్తోత్రాలు ఉన్నాయి. ఎవరి సాంప్రదాయాలను బట్టి వారు ఆయా దేవతలను అర్చిస్తారు. కాని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము బాగా ప్రాచుర్యాన్ని పొందిన స్తుతులు.

విష్ణు సహస్రనామము పారాయణ విస్తృతంగా చేయడానికి కొన్ని కారణాలు -

  • ఈ పారాయణకు కుల, మత పట్టింపులు లేవు. (బ్రాహ్మణులకు, వైశ్యులకు, క్షత్రియులకు, శూద్రులకు వచ్చే ప్రయోజనాలు ఫలశృతిలో స్పష్టంగా ఉన్నాయి)
  • పారాయణకు పెద్దగా శక్తి సామర్థ్యాలు, ఖర్చు అవసరం లేదు. శ్రద్ధ ఉంటే చాలును.
  • ఫలశృతిలో చెప్పిన విషయాలు విశ్వాసాన్ని పెంచుతున్నాయి.
  • పేరుమోసిన పండితులు ఈ స్తోత్రానికి వ్యాఖ్యలు రచించి, ప్రజల విశ్వాసాన్ని ఇనుమడింపజేశారు.
  • విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం గృహస్తులకు అనుకూలమైన పూజా విధానం.

స్మార్తుల వ్యాఖ్యలు

శైవుల శ్రీరుద్రం ప్రార్థనలో విష్ణువు శివుని స్వరూపమని చెప్పబడింది. విష్ణు సహస్రనామ స్తోత్రంలో కొన్ని నామాలు (114-రుద్రః, 27-శివః, 600-శివః) శివుని స్తుతించేవిగా ఉన్నాయి. శివకేశవులకు భేదము లేదని శంకరాచార్యులు వ్యాఖ్యానించారు. ఇంకా శివుడనగా మంగళకరుడనీ, అదే నామము విష్ణువుకూ వర్తిస్తుందనీ మరికొన్ని వ్యాఖ్యలు. ముఖ్యంగా అద్వైత వాదం నిర్గుణ నిరాకార శుద్ధ సత్వ పరబ్రహ్మమును గురించి చెబుతుంది గనుక శంకరాచార్యుల భాష్యము ఆ కోణంలోనే ఉంది.

వైష్ణవ వ్యాఖ్యలు

పరాశర భట్టు, ఇతర వ్యాఖ్యాన కర్తలు శివునితో ప్రమేయము లేకుండా విష్ణువు పరంగానే అన్ని నామాలనూ వ్యాఖ్యానించారు. శ్రీ వైష్ణవులకు, అనగా రామానుజాచార్యులు విశిష్టాద్వైతమును అనుసరించే వారికి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పరమ పావన స్తోత్రాలలో ఒకటి. శ్రీలక్ష్మీవల్లభుని కరుణ ప్రాప్తికి సులభమార్గము ఈ స్తోత్రము. ఇంకా శ్రీవైష్ణవులు పంచాయుధములు ధరించిన, వైకుంఠనివాసుడైన, శ్రీదేవీ భూదేవీ సమేతుడైన నారాయణుని రూపమునకు (సాకార భగవంతునకు) తమ అర్చనా సాంప్రదాయములలో విశేష ప్రాముఖ్యతనిస్తారు. వారి వ్యాఖ్యలు కుడా ఈ దృక్కోణంలోనే ఉన్నాయి.

పారాయణము, అర్చన

అన్ని శ్లోకాలను (పూర్వపీఠిక, స్తోత్రము, ఉత్తరపీఠిక) క్రమంలో చదవడాన్ని పారాయణం అంటారు. పెద్దగా ఈ పారాయణానికి ప్రత్యేకించి విధివిధానాలు లేవు. అంగన్యాస, కరన్యాసాలు పారాయణానికి ముందు చేయడం ఒక ఆచారం. చాలామంది విష్ణు సహస్ర నామ పారాయణానికి ముందుగాని, తరువాతగాని లక్ష్మ్యష్టోత్తర నామాన్ని పారాయణం చేస్తారు. భక్తి ముఖ్యమనీ, సామాన్యమైన పూజకు పాటించే నియమాలు పాటించడం భావ్యమనీ చెబుతారు.


ఇక వేయి నామాలనూ ఒక్కొక్కటిగా నమస్కారపూర్వకంగా చెప్పుతూ, పుష్పాదికాలతో పూజించడానిని అర్చన అంటారు. ప్రతి నామానికి ముందు ప్రణవం (ఓం), చివర చతుర్ధీ విభక్తితో "నమః" చేర్చి అర్చనలో చెబుతారు. ఉదాహరణకు పారాయణ శ్లోకం

రామో విరామో వరతో మార్గో నేయో నయో నయః
వీరః శక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః

అర్చనలో చదివేది

  • ఓం రామాయ నమః
  • ఓం విరామాయ నమః
  • ఓం విరతాయ నమః
  • ఓం మార్గాయ నమః
  • ఓం నేయాయ నమః
  • ఓం అనయాయ నమః
  • ఓం వీరాయ నమః
  • ఓం శక్తిమతాం శ్రేష్ఠాయ నమః
  • ఓం ధర్మాయ నమః
  • ఓం ధర్మవిదుత్తమాయ నమః


మహాత్ముల, పండితుల అభిప్రాయాలు

శ్రీవైష్ణవ సాహిత్యం గురించి విస్తారంగా అధ్యయనం చేసిన ఎన్.కృష్ణమాచారి తమ విష్ణు సహస్రనామ స్తోత్ర వివరణ ఆరంభంలో ఈ స్తోత్రం ప్రాముఖ్యత గురించి ఆరు విషయాలు చెప్పాడు:

  1. ఇది మహాభారత సారము.
  2. నారదాది మహాభాగవతులు, ఆళ్వారులు, త్యాగరాజాది వాగ్గేయకారులు తమ భక్తికావ్యాలలో మరల మరల విష్ణువు వేయి నామాలను ప్రస్తావించారు.
  3. విష్ణువు అంశావతారము, వేదవిదుడు అని చెప్పబడే వేదవ్యాసుడు దీనిని మనకు అందించాడు.
  4. ఇది ధర్మములలోకెల్ల ఉత్తమము, సులభము, సకల కర్మబంధ విముక్తి సాధకము అని భీష్ముడు చెప్పాడు.
  5. ఈ స్తోత్రపారాయణం దుఃఖములనుహరిస్తుందనీ, శాంతి సంపదలను కలుగజేస్తుందనీ విస్తృతమైన విశ్వాసం.
  6. భగవద్గీత, నారాయణీయము వంటి గ్రంథాలలో చెప్పిన విషయాలు ఇందుకు అనుగుణంగా ఉన్నాయి.

ఆది శంకరులు ఇది గానము చేయవలసిన స్తోత్రమని భజగోవిందం స్తోత్రంలో చెప్పాడు.


ఆన్ని పాపాలనూ హరించే అసమాన ప్రార్థన అని పరాశర భట్టు చెప్పాడు.


ఇది మహాభారత సారమనీ, ఒకోనామానికి నూరు అర్థాలున్నాయనీ మధ్వాచార్యుడు అన్నాడు.


భాగవతం దశమ స్కందము, విష్ణు సహస్రనామము పుణ్య క్షేత్రాలలో పఠించవలసిన, వినవలసిన గ్రంథాలని స్వామి నారాయణ్ తమ శిక్షాపత్రి లో అన్నారు.


షిరిడి సాయిబాబా అన్న మాటలు మరింత ఆసక్తికరమైనవి. "బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామము పుస్తకమును తీసికొనెను. తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను - శ్యామా! ఈ గ్రంథము మిగుల విలువైనది. ఫలప్రదమైనది. కనుక నీకిది బహూకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడితిని. నా హృదయము కొట్టుకొనెను. నా జీవితమపాయములోనుండెను. అట్టి సందిగ్ధ స్థితియందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామా! అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగుచేసెనని యనుకొంటిని.