నిరంతర వార్తా స్రవంతి

Thursday, March 27, 2008

"కోతి కొమ్మచ్చి"

ఆంధ్రదేశములోని గ్రామీణ సాంప్రదాయక ఆట. ఈ ఆటలో ముందుగా ఒకరిని దొంగగా ఎన్నుకుంటారు. మిగతా వారిలో ఎవరో ఒకరు ఒక కర్రను వృత్తాకారంలో గీచిన గీతలోనుండి విసురుతారు. ఇలా వృత్తాకారంలో గీచిన గీతను గిరి అని కూడా పిలుస్తారు. అలా విసరిన కర్రను దొంగ తీసుకొచ్చి గిరిలో ఉంచుతాడు. ఆ తర్వాత మిగతా వారిలో ఎవరో ఒకరిని తాకడానికి ప్రయత్నిస్తాడు. వారు అతనికి దొరకకుండా చెట్లెక్కి దాగి ఉంటారు. దొంగ వారిలో ఎవరో ఒకరిని తాకగల్గితే అలా దొరికిన అతను తర్వాత దొంగ అవుతాడు. ఒక వేళ దొంగ ఒకరిని తాకే ప్రయత్నంలో ఉండగా ఎవరో ఒకరు గిరిలో ఉన్న కర్రను తొక్కినట్లయితే మరలా అతనే దొంగగా ఉంటాడు.

ఆటగాళ్లంతా భద్రంగా చెట్లెక్కేస్తారు - ఇద్దరు తప్ప. జట్టులోని మేటి ఆటగాడొకరు చెట్టు కింది లేక సమీపంలోని ఒక వృత్తం(గిరి అంటారు) మధ్యలో ఎడమకాలిమీద నిలబడి, కుడికాలు మోకాలివరకు పైకెత్తి, ఆ కాలి కిందుగా కుడిచేత్తో ఒక మూరడు పొడుగున్న కర్రని విసరగలిగినంత దూరం విసరగానే, అతని ఎదురుగా నిలబడిన దొంగగా పిలవబడే ఆటగాడు పరుగునవెళ్లి ఆ కర్రను తెచ్చి గిరిలో పెట్టాలి. ఈ లోగా కర్ర విసిరినవాడూ చెట్టెక్కేస్తాడు. ఇప్పుడు చెట్టుమీదున్న వాళ్లలో ఎవరైనా ఒకరు దొంగకు దొరక్కుండా (అందకుండా) గిరిలోని కర్రను తాకగలిగితే దొంగ మళ్లీ దొంగావతారం ఎత్తాలి. ఎవరూ కర్రను తాకక మునుపే ఎవరైనా దొంగకు దొరికితే (చెట్టు మీదయినా కిందయినా) ఆ ఆటగాడు దొంగవుతాడు. మాజీదొంగ కర్రవిసరాలి. దొంగ కర్రకు కాపలాగా గిరిలోనే వుండిపోకుండా ఎవరినైనా దొరకబుచ్చుకొనే ప్రయత్నంలో వుండాలి.

ప్రగతిపథంలో ఇస్రో

ఇస్రో లోగోలో పైకి గురిఓట్టిన బాణం గుర్తు రాకెట్టును, అటూ ఇటూ ఉన్న సోలార్ సెయిల్స్ ఉపగ్రహాన్నీ సూచిస్తాయి.

ఇస్రో లోగోలో పైకి గురిఓట్టిన బాణం గుర్తు రాకెట్టును, అటూ ఇటూ ఉన్న సోలార్ సెయిల్స్ ఉపగ్రహాన్నీ సూచిస్తాయి.

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ. ఇస్రో గా ప్రసిద్ధమైన ఈ సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశ్యంతో ఏర్పాటై, ప్రస్తుతం ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష రంగ సంస్థల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. బెంగుళూరు కేంద్రంగా ఏర్పాటైన ఇస్రో, దేశంలోని వివిధ ప్రదేశాల్లో పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలు కలిగి ఉంది.

చరిత్ర

చరిత్రలో మొదటిసారి బ్రిటీషు సైన్యంపైన టిప్పు సుల్తాన్ రాకెట్లను ప్రయోగించాడు. అది చూసిన బ్రిటీష్ శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి ప్రయోగించే రాకెట్ల నిర్మాణానానికి అంకురార్పణ చేసారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చినపుడు భౌగోళికంగా చాలా పెద్దదయిన భారదేశానికి రక్షణ అవసరాలు, అభివృద్దికి అంతరిక్ష పరిజ్ఞానం యొక్క అవసరాన్ని గ్రహించి భారత ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనా వ్యవస్థను ఏర్పరుచుటకు సన్నాహాలు మొదలు పెట్టింది.

విక్రం సారాభాయ్ ని భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు పితామహుడిగా అభివర్ణిస్తారు. 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్‌ను ప్రయోగించినపుడు శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధాన మంత్రి అయిన నెహ్రూకు వివరించి, 1962లో భారత అణు శక్తి వ్యవస్థ పితామహుడయిన హోమీ బాబా పర్యవేక్షణలో Indian National Committee for Space Research (INCOSPAR) ఏర్పరిచాడు.

1960-1970

ఆదినుండి ఉపగ్రహాల నిర్మాణాన్నే దృష్టిలో పెట్టుకొని దానికి అవసరమయిన భూఉపరితల లక్షణాలను అధ్యయనం చేయుటకొరకు కేరళలో త్రివేండ్రం వద్ద Thumba Equatorial Rocket Launching Station (TERLS) నెలకొల్పి అమెరికా, రష్యా నుండి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగిస్తూ ఉపరితలాన్ని అధ్యయం చేయడం మొదలు పెట్టారు. అనతికాలంలోనే భారత దేశం స్వదేశీయంగా పూర్తి స్థాయి రాకెట్లను తయారు చేసి ఉపరితల అధ్యయంలో పురోగతి సాధించింది.భవిష్యత్తులో ఇతర దేశాలు ఉపగ్రహానికి అవసరమయిన అన్ని పరికరాలు సమకూర్చకపోవడాన్ని గ్రహించిన విక్రం సారాభాయ్ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో శాటిలైట్‌కు అవసరమయిన అన్నీ విడిభాగాలు మనదేశంలోనే తయారు చేసే దిశగా తన బృందాన్ని నడిపించాడు. 1969లో ఇస్రో, అనగా Indian Space Research Organisation (ISRO), 1972లో ప్రత్యేక అంతరిక్ష విభాగం ఏర్పడ్డాయి.

శ్రీహరి కోటలోని PSLV లాంచ్ ప్యాడ్

శ్రీహరి కోటలోని PSLV లాంచ్ ప్యాడ్

1970-1980

నాసాతో చర్చలు జరిపిన అనంతరం కేవలం శాటిలైట్లను తయారు చేయడమే కాకుండా వాటిని ప్రయోగించే సౌకర్యాన్ని కలిగిఉండడం ఆవశ్యకతను గుర్తించిన సారాభాయ్, ఇస్రోతో కలసి ఉపగ్రహాలను ప్రయోగించే వేదిక అయిన లాంచింగ్ ప్యాడ్ రూపకల్పన మొదలు పెట్టారు. దానిపేరే Satellite Launch Vehicle (SLV). మరొక వైపు ఇస్రో పూర్తిస్థాయి ఉపగ్రహాన్ని తయారు చేయగా, దానికి భారత గణిత మరియు ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట పేరు పెట్టబడింది. భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహమయిన ఆర్యభట్టను ఏప్రిల్ 19, 1975న అప్పటి సోవియట్ యూనియన్ నుండి విజయవంతంగా ప్రయోగించారు. 1979 నాటికి శ్రీహరి కోటలో SLV లాంచ్ ప్యాడ్ సిద్దమవడంతో ప్రయోగించిన ఉపగ్రహం రెండవ దశలో ఎదురయిన సమస్య వల్ల విజయవంతం కాలేదు. లోపాలను సరిదిద్ది 1980లో విజయవంతంగా ప్రయోగించిన రోహిణి -1 భారతదేశంలో ప్రయోగింపబడిన మొదటి ఉపగ్రహంగా చరిత్రలో నిలిచిపోయింది.

1980-1990

SLV విజయంతో శాస్త్రవేత్తలు రాబోవు దశాబ్దాలలో ఉపయోగించుటకు వీలుగా Polar Satellite Launch Vehicle (PSLV) నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పరీక్షలను నిర్వహించుటకు Augmented Satellite Launch Vehicle (ASLV) నిర్మించారు. 1987లొ మరియు 1988లో చేసిన ASLV ప్రయోగాలు రెండూ విఫలమయినప్పటికీ PSLVకి ఉపయోగపడు ఎన్నో విషయాలు శాస్త్రవేత్తలు తెలుసుకొన్నారు.

1990-2000

చివరకు 1992లో ASLV ప్రయోగం విజయవంతమయింది. కానీ అప్పటికి తక్కువ బరువు ఉన్న ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించగలిగారు. 1993లో PSLV ప్రయోగం విఫలమయింది. తిరిగి 1994లో చేసిన PSLV ప్రయోగం విజయవంతమయింది. అప్పటినుండి భారత ఉపగ్రహాలకు PSLV స్థిరమయిన వేదికగా నిలిచి ప్రపంచంలోనే అతి పెద్ద ఉపగ్రహాల సమూహానికి మూలమయినదిగా, రక్షణ, విద్యా, వ్యవసాయాలకు అవసరమయిన ఎంతో పరిజ్ఞానానికి ఆధారంగా నిలిచింది.

2000 తర్వాత

2001లో మరింత శక్తి సామర్థ్యాలు కలిగిన Geosynchronous Satellite Launch Vehicle (GSLV) నిర్మాణానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. దీనివల్ల 5000 కిలోగ్రాముల బరువున్న ఉపగ్రహాలను కూడా భూమి ఉపరితల కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చు. చంద్రుడి పైకి మనిషిని పంపే దిశగా కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి.

శాటిలైట్లు

ఇన్‌శాట్ - INSAT లేదా Indian National Satellite System అనునది టెలీకమ్యూనికేషన్లు, వాతావరణం, ప్రసారాలు మొదలయిన బహుళప్రయోజనాలకు ఇస్రో తయారు చేసిన ఉపగ్రహాల క్రమ సమూహం. 1983లో మొదలయిన ఇన్‌శాట్ ఆసియా-పసిఫిక్ దేశాల్లో అతిపెద్ద ఉపగ్రహాల వ్యవస్థ. ప్రస్తుతం 199 ట్రాన్స్‌పాండర్లతో భారతదేశంలోని దాదాపు అన్ని టెలివిజన్ మరియు రేడియోలకు మాధ్యమంగా ఉన్న ఈ ఉపగ్రహాలను కర్నాటకలోని హస్సన్ మరియు భోపాల్ లలో అనుక్షణం పర్యవేక్షిస్తుంటారు. ఇవి కాక IRS, అనగా Indian Remote Sensing satellites మరియు METSAT అనగా Meteorological Satellite ఉపగ్రహాలు కూడా ప్రయోగించారు. కొన్ని ఉపగ్రహాల వివరాలు:

నింగికి ఎగస్తున్నPSLV ఉపగ్రహ వాహకం

నింగికి ఎగస్తున్నPSLV ఉపగ్రహ వాహకం
క్రమ సంఖ్య శాటిలైట్ ప్రయోగించిన తేది
1 INSAT-1A 10 ఏప్రిల్,1982
2 INSAT-1B 30 ఆగష్టు,1983
3 INSAT-1C 22 జూలై,1988
4 INSAT-1D 12 జూన్,1990
5 INSAT-2A 10 జూలై,1992
6 INSAT-2B 23 జూలై,1993
7 INSAT-2C 7 డిసెంబర్,1997
8 INSAT-2D 4 జూన్,1997
9 INSAT-2DT అంతరిక్షంలో కొనుగోలు చేయబడినది
10 INSAT-2E 3 ఏప్రిల్,1999
11 INSAT-3A 10 ఏప్రిల్,2003
12 INSAT-3B 22 మే,2000
13 INSAT-3C 24 జనవరి,2002
14 KALPANA-1 12 సెప్టెంబర్,2002
15 GSAT-2 8 మే,2003
16 INSAT-3E 28 సెప్టెంబర్,2003
17 EDUSAT 20 సెప్టెంబర్,2004
18 INSAT-4A 22 డిసెంబర్,2005
19 INSAT-4C 10 జూలై,2006
20 INSAT-4B 12 మార్చి,2007
21 INSAT-4CR 2 సెప్టెంబర్,2007

ప్రయోగ కేంద్రాలు

తుంబా

కేరళలో తిరువనంతపురం సమీపాన భూ అయస్కాంత రేఖకు దగ్గరలో ఉన్న తుంబాలో 1962లో మొదటి రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని నిర్మించారు. అప్పటి శాస్త్రవేత్తలలో అబ్దుల్ కలాం ఒకరు. మొదట కేవలం రాకెట్ల ప్రయోగకేంద్రముగా ఉన్న తుంబా నెమ్మదిగా రాకెట్లకు అవసరమయిన ప్రొపెల్లర్లు, ఇంజన్లు తయారు చేసి అమర్చగలిగి పూర్తిస్థాయి రాకెట్ నిర్మాణ కేంద్రంగా తయారయింది.

శ్రీహరి కోట

భారతదేశంలో ఉపగ్రహాల ప్రయోగానికి అత్యంత అనువయిన ప్రదేశమయిన శ్రీహరి కోట నెల్లూరు జిల్లాలో సూళ్ళూరుపేట దగ్గర ఉన్నది. ఈ అంతరిక్ష కేంద్రం పేరు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, దీనినే షార్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని ఏకైక ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇక్కడనుండి ఎన్నో PSLV మరియు GSLV ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. ప్రస్తుతం ఇక్కడ రెండు లాంచ్ ప్యాడ్‌లు ఉన్నాయి. ఈ రెండిటివల్ల ప్రతి ఏడాది 6 శాటిలైట్లను ప్రయోగించే వీలు ఉన్నది.

బలేశ్వర్

ఇది ఒరిస్సాలో ఉన్నది. శ్రీహరి కోటలో ఉన్నట్లు ఇక్కడ శాటిలైట్ల ప్రయోగానికి సౌకర్యాలు లేకున్నా,దీనిని ప్రధానంగా రాకెట్లను ప్రయోగించుటకు ఉపయోగిస్తారు.

విశిష్ట వ్యక్తులు

విక్రం సారాభాయ్

విక్రం సారాభాయ్

విక్రం సారాభాయ్

విక్రం సారాభాయ్ ఆగస్టు 12, 1919న అహ్మదాబాద్ నగరంలో ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన తరువాత 1940లో కాలేజీ చదువుల కోసం కేంబ్రిడ్జ్ వెళ్ళిన సారాభాయ్ రెండవ ప్రపంచ యుద్ద కారణంగా భారతదేశం తిరిగి వచ్చాడు. కొద్ది రోజుల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరులో ప్రొఫెసరుగా పనిచేస్తున్న సర్ సి.వి.రామన్ దగ్గర రీసెర్చి స్కాలరుగా చేరి అనతి కాలంలో భౌతిక శాస్త్రాన్ని, విశ్వకిరణాలను అధ్యయం చేసి తిరిగి 1945లో కేంబ్రిడ్జ్ వెళ్ళి పీహెచ్.డీ పూర్తి చేసి 1947 లో భారతదేశానికి వచ్చాడు.

1947 నవంబర్లో అహ్మదాబాదులో భౌతిక శాస్త్ర పరిశోధనాలయం ఏర్పాటు చేయడంలో సారాభాయ్ ముఖ్యపాత్ర వహించాడు. తన పరిశోధనలతో గొప్ప శాస్త్రవేత్తగా పేరు పొందిన సారాభాయ్ 1957 లో ప్రపంచంలో మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్ ప్రయోగం గురించి తెలుసుకొని భారత భవిష్యత్ అవసరాలకు శాటిలైట్ల అవసరం గురించి ఎంతో విషయ సేకరణ చేసి అప్పటి ప్రధానమంత్రి నెహ్రూను ఒప్పించి అంతరిక్ష పరిశోధనా విభాగాన్ని ఏర్పాటు చేయించాడు. సాంకేతిక పరిజ్ఞాన ఉపయోగాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొని రావాలని, అప్పుడే మన దేశంలోని ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చని సారాభాయ్ తోటి శాస్త్రవేత్తలను ప్రొత్సహించేవాడు.

ఆయన ఆదర్శాలకు అనుగుణంగా ఇస్రో ఎన్నో విజయాలను సాధించి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపచేసింది. 'భారత అంతరిక్ష రంగ పితామహుడు ' అయిన విక్రం సారాభాయ్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను 1962లో శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డుతో, 1966లో పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. సారాభాయ్ డిసెంబరు 30, 1971న మరణించాడు.

సతీష్ ధావన్

సతీష్ ధావన్ 25 సెప్టెంబర్, 1920న శ్రీనగర్లో జన్మించాడు. పంజాబ్ యూనివర్సిటీలో చదువుపూర్తి చేసిన తర్వాత సతీష్ ధావన్, 1947లో మిన్నియాపోలిస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాలో మరియు 1949లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. భారతదేశం తిరిగి వచ్చిన అనంతరం బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో వివిధ పదవులు చేపట్టి, 1972లో విక్రం సారాభాయ్ అనంతరం ఇస్రో ఛైర్మెన్ పదవిని అలంకరించాడు. ఆ తరువాతి కాలంలో భారత అంతరిక్ష చరిత్రలో ఎన్నో గొప్ప విజయాలకు మూలకారకుడు అయ్యాడు.

సతీష్ ధావన్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1981లో పద్మ భూషణ్ అవార్డు ప్రదానం చేసింది. జనవరి 3, 2002న మరణించిన ఆయన స్మృత్యర్థం శ్రీహరి కోటలోని అంతరిక్ష కేంద్రానికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని పేరు పెట్టారు.

మాధవన్ నాయర్

మాధవన్ నాయర్ అక్టోబర్ 31, 1943లో కేరళలొని తిరువనంతపురంలో జన్మించాడు. 1966లో కేరళ యూనివర్సిటీ నుండి ఎలక్ట్రానిక్స్ విభాగంలో పట్టభద్రుడయిన మాధవన్ నాయర్ ఆ తరువాత ముంబైలోని ప్రతిష్టాత్మక భాభా అటమిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) లో శిక్షణ పొందాడు.1967లో తుంబాలో చేరిన పిమ్మట SLV నిర్మాణంలో పనిచేసాడు. తరువాత PSLV ప్రాజెక్టు డైరక్టరుగా భారతదేశపు మొదటి ఉపగ్రహ ప్రయోగ వాహన నిర్మాణంలో కీలక పాత్ర వహించాడు.

1998లో ఆయనకు పద్మ భూషణ్ అవార్డు లభించింది. సెప్టెంబరు 2003 లో మాధవన్ నాయర్ ఇస్రో ఛైర్మెన్ పదవి చేపట్టినుండి ఇస్రో మరెన్నో ఉపగ్రహలను విజయవంతంగా ప్రయోగించి విజయ పరంపరను కొనసాగిస్తున్నది.

మహాక్షేత్రం మహానంది

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లా నంద్యాలకు 14 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7 వ శతాబ్ధినాటిది. ఇచ్చట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము తప్పటగ వుంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కి నందు వలన లింగము కొంచెము అణిగివుంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. ఇచ్చట శుద్ధ స్పటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత. ఇక్కడి పుష్కరిణి నీరు అమృతం వలె ఉంటుంది.
ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు కలవు. లింగము క్రింద నుండి నీరు ఊరుతూ వుంటుంది. మహాశివరాత్రి పుణ్యదినమున లింగోధ్బవసమయమున అభిషేకము, కళ్యాణోత్సవము, రధోత్సవములు జరుగుతాయి. కోదండరామాలయం, కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు.

Saturday, March 22, 2008

పెద్దల సభ తప్పే!

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం సంకేతాలు లేకుండా సభ నిర్వహించాలనుకోవడమే కాంగ్రెస్ సీనియర్ల తప్పిదమని రాష్ట్ర మంత్రులు దామోదరం రాజనర్సింహ, ముఖేష్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ సీనియర్లు భువనగిరి సభను రద్దు చేసుకోవడం హర్షనీయమని వారు శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై తాము పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వారు చెప్పారు.ప్రజలు నిలదీస్తారనే భయంతోనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఉప ఎన్నికలకు సిద్ధపడ్డారని రాజనర్సింహ విమర్శించారు. ఉప ఎన్నికల్లో ప్రజలు తెరాసకు తగిన గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు. కరీంనగర్ లోకసభ ఉప ఎన్నిక పరిస్థితులు ఇప్పుడు లేవని ముఖేష్ గౌడ్ అన్నారు. ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పదో తరగతి పరక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పాఠశాల విద్యా మంత్రి రాజనర్సింహ చెప్పారు. ఈ ఏడాదే కొత్త డిఎస్సీ నిర్వహిస్తామని కూడా చెప్పారు.

ఒంగోలులో "సెల్"లీలలు!

తన ప్రియురాలితో నడిపిన సెక్స్ కార్యకలాపాలను సెల్ ఫోన్ లో చిత్రించి తన స్నేహితుల సెల్ ఫోన్లోకి పంపిన ఒక యువకుడి ఉదంతం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో సంచలనం సృష్టించింది. ఒంగోలులోని ఒక కార్పెరేట్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న ఒక అమ్మాయి ఒక యువకుడిని ప్రేమించింది. వారిద్దరు కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్నారు. ఆ కార్యకలాపాలను రహస్యంగా అతను సెల్ ఫోన్లో చిత్రీకరించాడు.ఆ నయవంచకుడు అంతటితో ఆగకుండా తన స్నేహితుల సెక్స్ కోరికలు తీర్చాలని ఆ అమ్మాయిపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె నిరాకరించింది. దాంతో ఆ యువకుడు సెల్ ఫోన్లో చిత్రీకరించిన ప్రేమ కలాపాల దృశ్యాలను తన మిత్రుల సెల్ ఫోన్లలోకి పంపించాడు. దాంతో ఆ అమ్మాయి తీవ్ర మనస్తాపానికి గురైంది. విషయం తెలిసిన మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. నిందితుల కోసం పోలీసులు రంగంలోకి దిగాడు.

నేను అలా అనలేదు!

తాను తమ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డిని దూషించలేదని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి స్పష్టం చేశారు. జి. వెంకటస్వామితో పాటు మిగిలిన కాంగ్రెస్ సీనియర్లు శనివారంనాడు ఢిల్లీ నుంచి హైదరాబాదు తిరిగి వచ్చారు. పురుషోత్తమరెడ్డిని తాను తెలంగాణ ద్రోహి అనలేదని వెంకటస్వామి మీడియా ప్రతినిధులతో అన్నారు. విషయాలు తెసుకున్న తర్వాత మాట్లాడ్తానని ఆయన చెప్పారు. రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తల గురించి తెలుసుకోవడానికి తాను పురుషోత్తమరెడ్డికి ఫోన్ చేశానని, అహ్మద్ పటేల్ చెప్పినందున భువనగిరి సభను రద్దు చేస్తున్నట్లు తాను ఇక్కడ ప్రకటిస్తానని, మీరు అక్కడ ప్రకటించండని పురుషోత్తమ రెడ్డి తనతో అన్నారని ఆయన వివరించారు.కాంగ్రెస్ కోర్ కమిటీలో తెలంగాణపై జరగాల్సినంత చర్చ జరగలేదని మరో కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తదుపరి కోర్ కమిటీలో విస్తృతంగా చర్చిస్తారని ఆయన చెప్పారు. తెలంగాణపై తమ పార్టీ అధిష్ఠానవర్గం ఒక కమిటీని వేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. తమ మధ్య విభేదాలు ఏం ఉన్నాయో పురుషోత్తమరెడ్డికే తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. తాము ఈ సాయంత్రం సమావేశమై తదుపరి కార్యక్రమాన్ని ఖరారు చేసుకుంటామని ఆయన చెప్పారు.

రాష్ట్రంపై అల్పపీడన ద్రోణి ప్రభావం

అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరో 24 గంటల పాటు రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించింది. తెలంగాణాలోనూ చెదురుమొదురు జల్లులు పడొచ్చని తెలిపింది.అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడుల తీరంపై ఆవరించిన నేపథ్యంలో గత రెండు రోజులుగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. పసిఫిక్ మహాసముద్రం నుంచి ఈస్టర్లీ వేవ్స్‌గా పిలిచే గాలి అలల ప్రభావం కారణంగా ఇలా వేసవికాలంలో వర్షాలు పడుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉష్ణోగ్రత కూడా తగ్గుముఖం పడుతుందని తెలిపారు.

"సాక్షి"తో పోటీకి "ఆంధ్రజ్యోతి" సిద్ధం!

తెలుగులో మీడియా యుద్ధం పతాకస్ధాయికి చేరుకుంది. ఒకరి ప్లగ్ ను ఒకరు లాక్కోవడానికి ప్రయత్నించడం గతంలో కూడా జరిగినా ఇప్పుడు తీవ్ర యుద్ధం జరుగనుంది. సోమవారం ఉదయం వైఎస్ రాజశేఖరెడ్డి తనయుడు వైఎస్ జగన్ ప్రియ పత్రిక "సాక్షి" భారీ ఎత్తు న ప్రారంభం కానుంది. సోమవారం ఉదయం సాక్షి తెలుగు పాఠకుల ముందు సాక్షాత్కరించనుంది.ఏ దినపత్రికైనా ప్రాంరంభ దినాన మాల్ మసాలా సిద్ధం చేసుకోవడం సహజం. గతంలో అంటే 1983లో డెక్కన్ క్రానికల్ ను ఢీకొట్టే రీతిలో రామోజీరావు న్యూస్ టైమ్ అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించారు. అప్పటికే హైదరాబాదీలతో మమేకమై, ఇరానీ చాయ్ లో భాగమైన డెక్కన్ క్రానికల్ ను తన మార్కెటింగ్ సిల్స్ తో చిత్తు చేయగలనని రామోజీరావు అనుకున్నారు. రామోజీరావు నుంచి గట్టి పోటీ ఉంటుండని డెక్కన్ క్రానికల్ యాజమాన్యం కూడా ఊహించింది. న్యూస్ టైం విడుదలకు ముందు రోజున డెక్కన్ క్రానికల్ టీం ఒక మంచి బ్రేకింగ్ స్టోరీని సిద్ధం చేసుకుంది. న్యూస్ టైం చక్కటి డిజైన్ తో విడుదలైనా మంచి న్యూస్ స్టోరీలు లేకపోవడం వల్ల మొదటి రోజే మార్కెట్ లో వెలా తెలా పోయింది.ఇప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా కొత్త పత్రిక నుంచి పోటీని తట్టుకోడానికి ఒక పకడ్బందీ వ్యూహాన్ని రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ "జల్సా" విడుదల రోజునే తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేస్తారని, వివరాలకు రేపటి సంచిక చదవాలంటూ ఆంధ్రజ్యోతి నేడు మొదటి పేజీలో ఒక ప్రకటన లాంటి వార్తను ప్రచురించింది. లక్షల సంఖ్యలో ఉన్న పవన్ , చిరు అభిమానులు రేపు ఆదివారం ఆంధ్రజ్యోతిని కొని చదవడం ఖాయం. సోమవారం ఉదయం చిరంజీవి రాజకీయాల మేనిఫెస్టోపై భారీ కథనాలను ఆంధ్రజ్యోతి ప్రచురించనుంది.కేవలం ధన బలంతో రంగుల హంగులతో "సాక్షి" పత్రిక వస్తోంది కానీ, దానిలో ఇన్వెస్టిగేటివ్ స్పిరిట్ గానీ, విశ్లేషణా సామర్ధ్యం గానీ ఉండదని ప్రాక్టికల్ గా చెప్పడానికి ఆంధ్రజ్యోతి సిద్ధమవుతోంది. రంగులు మాత్రమే సరిపోవని, కాస్తంత ఉప్పూ కారాన్ని తెలుగు ప్రజలు ఆశిస్తారని బాగా గ్రహించిన ఆంధ్రజ్యోతి ఈ విధంగా తన మార్కెట్ షేర్ ను కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంది.అంతర్జాతీయ స్ధాయి లే అవుట్, అన్ని రంగుల పేజీలు, కొంతకాలం ఉచిత సరఫరా వంటి ప్లస్ పాయింట్లతో వస్తున్న "సాక్షి" మసాలా లేకుండా మనుగడ సాగించడం కష్టమే. హిందూ దినపత్రికలాగా మడి కట్టుకుని వందేళ్ళు జీవించడం సందేహమే. ఎన్ని రంగుల హంగులున్నా గరం మసాలా లేని ప్రొడక్ట్ ను తెలుగువారు ఆదరించిన సందర్భాలు దాదాపు లేవు.

రాష్ట్రంలో రాక్షస పాలన: హరికృష్ణ విమర్శ

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, స్వర్గీయ ఎన్టీ రామారావు కుమారుడు హరికృష్ణ వ్యాఖ్యానించారు. ఆయన శనివారంనాడు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. గుంటూరులో టిఎన్టీయుసి పతాకను ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు. కాంగ్రెసు పార్టీని చిత్తుగా ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పాలక కాంగ్రెస్ పార్టీవారు డబ్బులు దండుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో రైతులకు నీరివ్వని దౌర్భాగ్య స్థితి నెలకొని ఉందని ఆయన అన్నారు. సిమెంట్, ఐరన్ ధరలు పెరిగాయని, రైతులకు పంటలకు మాత్రం ధరలు పెరగడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. తొమ్మిదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ అవినీతి రహిత పాలనను అందించిందని ఆయన చెప్పుకున్నారు.

కె.సి.ఆర్. రహస్య చర్చలు!

టీఅర్ ఎస్ అధినేత చంద్రశేఖరరావు గురువారం సాయంత్రం గన్ మన్ లను, వ్యక్తిగత సహాయకులను తీసుకెళ్ళకుండా జూబిలీహిల్స్ లోని ఒక రహస్య ప్రదేశానికి వెళ్ళి ఒక ప్రముఖ వ్యక్తితో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ఆ ప్రదేశానికి డ్రైవర్ ర్ ను కూడా తీసుకెళ్ళలేదు. కుమారుడు రామారావే ఆయన కారును డ్రైవ్ చేశారు.తెలుగుదేశం నాయకుడు దేవేందర్ గౌడ్ లేదా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఆయన వెళ్ళి ఉండవచ్చని భావిస్తున్నారు. దేవేందర్ గౌడ్ ఇంటికి వెళ్ళడానికి మరీ అంత రహస్యం అవసరం లేదని , ఆయన చిరంజీవి ఇంటికి వెళ్ళి రహస్య మంతనాలు జరిపి ఉంటారని సన్నిహిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. చిరంజీవి పార్టీతో పెట్టుకోడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఒక ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన వెంటనే చిరంజీవి నుంచి పిలుపు వచ్చిందని అంటున్నారు.

ప్రకాష్ రాజ్ విడాకులు!

క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక ప్రేమ జంటలకు దారి చూపిన ప్రకాష్ రాజ్ కుటుంబ జీవితంలో పరాజయం పాలయ్యారు. తన భార్య, ఒకనాటి నటి అయిన లలిత కుమారికి విడాకులు ఇచ్చినట్టు ప్రకాష్ రాజ్ మీడియా ఎదుట అంగీకరించారు. చెన్నై ఎగ్మోర్ ఫ్యామిలీ కోర్టులో ఆయన విడాకుల పిటిషన్ దాఖలు చేశారు.ప్రకాష్ రాజ్ చాలాకాలంగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. చాలా కాలంగా తన భార్య, తాను దూరంగా ఉంటున్నామని, లీగల్ గా విడిపోడానికి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నామని ప్రకాష్ రాజ్ విలేకరులకు చెప్పారు. తన కూతురిని మాత్రం తన సంరక్షణలో ఉంచవలసిందిగా న్యాయస్ధానాన్ని అభ్యర్ధించారు.

అధికారంలో ఉన్నంత కాలం ఉచిత విద్యుత్

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం రైతులకు ఉచిత విద్యుత్ పథకం అమలు జరిపితీరుతామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్పష్టంచేశారు. "ఎన్ని వ్యయప్రయాసలకు ఓర్చైనా రైతులకు ఉచిత విద్యుత్ అందించి తోరుతాం" అని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలతో కాసేపు సమావేశం అయిన వైఎస్ మీడియాతోనూ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఉచిత విద్యుత్ గురించి విలేఖరులు ప్రశ్నించినప్పుడు వైఎస్ పై విధంగా స్పందించారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలందించే "ఆరోగ్యశ్రీ" పథకాన్ని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే కార్యక్రమాలను భవిష్యత్తులో మరిన్ని చేపట్టనున్నామని, చేపట్టిన74 ప్రాజెక్టుల్లో 14 పూర్తిచేసినట్లు చెప్పారు.

Friday, March 21, 2008

స్ఫూర్తి ప్రధాత... ఎన్టీ రామారావు!

నందమూరి తారక రామారావు గారు

నందమూరి తారక రామారావు గారు

తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao / NT Rama Rao / NTR) (1923 మే 28 - 1996 జనవరి 18) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. రామారావు, ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావు గా కూడా ప్రసిద్ధుడైన ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపుగా 302 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఆయన, అనేక జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా నిలచిపోయారు. రామారావు 1982 లో తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసారు. పార్టీని స్థాపించిన కేవలం 9 నెలలలోనే ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తరువాత మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచారు.

బాల్యము, విద్యాభ్యాసము

నందమూరి తారక రామారావు 1923, మే 28 వ తేదీన, సాయంత్రం 4:32కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించాడు. మొదట కృష్ణ అని పేరుపట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తరువాత అది కాస్తా తారక రామారావుగా మారింది. పాఠశాల విద్య విజయవాడ మునిసిపలు హైస్కూలులో చదివాడు. తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చేరారు. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావును ఒక నాటకములో ఆడవేషం వేయమన్నాడు. అయితే రామారావు తన మీసాలు తీయటానికి 'ససేమిరా' అన్నాడు. మీసాలతోటే నటించడం వలన ఆయనకు "మీసాల నాగమ్మ" అనే పేరు తగిలించారు. 1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కూతురు అయిన బసవ రామతారకంను పెళ్ళి చేసుకున్నాడు. వివాహం విద్యనాశాయ అన్నట్లు పెళ్ళయిన తరువాత పరీక్షలలో రెండుసార్లు తప్పాడు. తరువాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేరాడు. అక్కడకూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవాడు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ (NAT) అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల నాగభూషణం, కె.వి.ఎస్.శర్మ తదితరులతో చేసినపాపం వంటి ఎన్నో నాటకాలు ఆడాడు. తరువాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా. రాష్ట్రవ్యాప్త చిత్రలేఖన పోటీలలో ఆయనకు బహుమతి కూడా లభించింది. సుభాష్ చంద్రబోసు విజయవాడ వచ్చినప్పుడు ఎన్టీఆర్ బోసు బొమ్మను చిత్రించి ఆయనకు కానుకగా ఇచ్చాడు.

చలనచిత్ర జీవితం

రామారావు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం కొన్ని కారణాల వలన హరించుకుపోయింది. అప్పుడు యుక్తవయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేసాడు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తరువాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవాడు కాదు.


రామారావు 1947లో పట్టభద్రుడయ్యాడు. తదనంతరం ఆయన మద్రాసు సర్వీసు కమీషను పరీక్ష రాసాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచాడు. అప్పుడు ఆయనకు మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయాడు.


ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటోను ఎల్వీ ప్రసాదు దగ్గర చూసి, వెంటనే ఆయనను మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేసాడు. దీనికి గాను రామారావుకు వెయ్యి నూటపదహార్ల పారితోషికం లబించింది. వెంటనే ఆయన తన సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలు అవ్వలేదు. ఈలోగా మనదేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు. అంచేత ఆయన మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా మనదేశం అయింది. 1949లో వచ్చిన ఆ సినిమాలో ఆయన ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్‌ పాత్ర పోషించాడు. 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వీ ప్రసాదు షావుకారు కూడా విడుదలైంది. ఈ రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చివేశాడు. థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవాడు. ఆయనతో పాటు ఆ గదిలో యోగానందు (తరువాతి కాలంలో నిర్మాత అయ్యాడు) కూడా ఉండేవాడు.

1951లో కె.వి.రెడ్డి పాతాళభైరవి, దాని తరువాత అదే సంవత్సరం బి.ఎన్‌.రెడ్డి మల్లీశ్వరి, 1952లో ఎల్వీ ప్రసాదు పెళ్ళిచేసి చూడు, ఆ తరువాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం చంద్ర హారం ఆయనకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయావారివే. ప్రతీ సినిమాకు నెలకు 500 రూపాయిలు జీతం మరియు 5000 రూపాయిల పారితోషికమూ ఇచ్చారు. పాతాళభైరవి 34 కేంద్రాలలో 100 రోజులు ఆడి అప్పట్లో సంచలనం సృష్టించింది. తన ఉంగరాల జుట్టుతో, ఎత్తయిన రూపంతో, వెలుగులు విరజిమ్మే నవ్వుతో ఆంద్రదేశ ప్రజలను ఆకట్టుకుని వారి మనసులలో నిలిచిపోయాడు.


1956లో విడుదలయిన మాయాబజార్‌లో ఆయన తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అపట్లో అత్యధికం అని భావిస్తారు. 1959లో ఎవిఎమ్ వారు నిర్మించి, విడుదల చేసిన భూకైలాస్ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేసాడు. 1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం భారీ విజయం సాధించింది. శ్రీమద్విరాటపర్వములో ఆయన ఐదు పాత్రలు పోషించాడు. ఆ విధముగా 1950లలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగాడు. సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవాడు. 1963లో విడుదలయిన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాలలోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు ఆయన పారితోషికం 4 లేదా 5 అంకెలలోనే ఉండేది. 1972నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది.


ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని "నేషనల్ ఆర్టు ప్రొడక్షన్సు" పతాకంపై విడుదల చేసాడు. 1977లో విడుదలయిన దాన వీర శూర కర్ణలో ఆయన మూడు పాత్రలలో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసాడు. 1978లో విడుదలయిన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా ఆయన దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు, యమగోల గొప్ప బాక్సాఫీసు విజయం సాధించాయి. 1991 ఎన్నికల ప్రచారం కోసం ఆయన నటించి, దర్శకత్వం వహించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర 1990లో విడుదలయింది.


ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా కచ్చితంగా ఉండేవాడు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోడానికి ప్రతీరోజూ మద్రాసు మెరీనా బీచిలో అభ్యాసము చేసేవాడు. నర్తనశాల సినిమా కోసం ఆయన వెంపటి చినసత్యం దగ్గర భరతనాట్యం నేర్చుకున్నాడు. వృత్తిపట్ల ఆయన నిబద్ధత అటువంటిది. కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలు లేవని చెబుతూంటారు, ఎందుకంటే ఆయన డైలాగులను ముందుగానే కంఠతా పట్టేసేవాడు.

రాజకీయ ప్రవేశం

1978లో ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారానికి వచ్చిన కాంగ్రేసు పార్టీ అంతర్గత కుమ్ములాటల వలన అపకీర్తి పాలయ్యింది. తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు. ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి, రాష్ట్రంలో శాసనసభ్యులచేత నామకార్థం ఎన్నిక చేయించేవారు. ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అప్రదిష్ట పాలయింది.


1981లో ఊటీలో సర్దార్‌ పాపారాయుడు చిత్రం షూటింగు విరామసమయంలో ఒక విలేఖరి, మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదయినా నిర్ణయం తీసుకుంటున్నారా? ఆని అడిగాడు. దానికి జవాబుగా నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామములో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తరువాతి పుట్టిన రోజునుంచి నా వంతుగా ప్రతీనెలలో 15రోజులు తెలుగుప్రజల సేవకోసం కేటాయిస్తాను అని చెప్పాడు. ఆయన చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతం.


అప్పటి నుండి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలు త్వరత్వరగా పూర్తి చేసాడు. 1982 మార్చి 21 న హైదరాబాదు వచ్చినప్పుడు అభిమానులు ఆయనకు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికారు. 1982 మార్చి 29 సాయంత్రము 2:30లకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పాడు. ఆసమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి, ప్రకటించాడు. పార్టీ ప్రచారానికై తన పాత చెవ్రోలెటు వ్యానును బాగు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించాడు. దానిపై నుండే ఆయన తన ప్రసంగాలు చేసేవాడు. దానిని ఆయన "చైతన్యరథం" అని అన్నాడు. ఆ రథంపై "తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!" అనే నినాదం రాయించాడు. ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్యరథమే స్ఫూర్తి.

ప్రచార ప్రభంజనం

నందమూరి తారక రామారావు

నందమూరి తారక రామారావు
రామారావు ప్రచార ర్యాలీ.

రామారావు ప్రచార ర్యాలీ.

ఎన్టీఆర్ ప్రజలను చైతన్య పరుస్తూ చైతన్యరథంపై ఆంధ్ర ప్రదేశ్ నలుమూలలకూ ప్రచార యాత్రను సాగించాడు. చైతన్యరథమే ప్రచార వేదికగా, నివాసంగా మారిపోయింది. ఒక శ్రామికుడి వలె ఖాకీ దుస్తులు ధరించి, నిరంతరం ప్రయాణిస్తూ, ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నాడు. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసాడు. కాంగ్రెసు అధికారాన్ని కూకటివేళ్ళతో పెకలించివేసిన ప్రచార ప్రభంజనమది.


ఎన్టీఆర్ ప్రసంగాలు ఉద్వేగభరితంగా, ఉద్రేక పూరితంగా ఉండి, ప్రజలను ఎంతో ఆకట్టుకునేవి. ముఖ్యమంత్రులను తరచూ మార్చడం.., అదీ ఢిల్లీ పెద్దల నిర్ణయం ప్రకారమే తప్ప, శాసనసభ్యుల మాటకు విలువ లేకపోవడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని తన ప్రసంగాలను మలచుకున్నాడు. కాంగ్రెసు నాయకులు కుక్కమూతి పిందెలనీ, కొజ్జాలనీ, దగాకోరులనీ, దగుల్బాజీలని, అధిష్టానం చేతిలో కీలుబొమ్మలనీ తీవ్రపదజాలంతో విమర్శించాడు. కాంగ్రెసు పార్టీ కారణంగా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదనీ, దాన్ని ఢిల్లో తాకట్టు పెట్టారనీ విమర్శిస్తూ, ఆ ఆత్మగౌరవ పునరుద్ధరణకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పాడు. కాంగ్రెసు నిర్వాకానికి అప్పటికే విసుగు చెందిన, ప్రజలు ఆయన నినాదం పట్ల ఆకర్షితులయ్యారు.


1983 జనవరి 7 న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. తెలుగుదేశం 199, కాంగ్రెసు 60, సిపిఐ 4, సిపిఎం 5, బిజెపి 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఎళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీ చేతులలో ఓడిపోయింది. ఆయన విజయానికి అప్పటి దినపత్రికలు - ముఖ్యంగా ఈనాడు - ఎంతో తోడ్పడ్డాయి.

రాజకీయ ఉన్నత పతనాలు

1970లలో ఎదుర్కొన్న చిన్నపాటి ఒడిదుడుకులు తప్పించి, ఎన్టీఆర్ సినిమా జీవితం విజయవంతంగా, అప్రతిహతంగా సాగిపోయింది. అయితే ఆయన రాజకీయ జీవితం అలా -నల్లేరుపై నడకలా సాగలేదు. అద్భుతమైన విజయాలకూ, అవమానకరమైన అపజయాలకు మధ్య తూగుటుయ్యాలలా సాగింది. ఎన్నికల ప్రచారసమయంలో ఎన్టీఆర్ కాంగ్రెసు నాయకులపై చేసిన ఆరోపణల కారణంగాను, ఎన్నికల్లో తెలుగుదేశం చేతిలో కాంగ్రెసు పొందిన దారుణ పరాభవం వలనా, ఆ రెండు పార్టీల మధ్య వైరి భావాన్ని పెంచింది. రాజకీయపార్టీల మధ్యన ఉండే ప్రత్యర్థి భావన కాక శతృత్వ భావన వారి మధ్యన నెలకొంది. తెలుగుదేశం పాలిత ఆంధ్ర ప్రదేశ్ కు కాంగ్రెసు పాలిత కేంద్రానికీ మధ్య వివాదంగా మారే వరకు వెళ్ళింది. కేంద్రం మిథ్య అనేంతవరకు ఎన్టీఆర్ వెళ్ళాడు.


1983 శాసనసభ ఎన్నికలలో ఆయన సాధించిన అపూర్వ విజయం ఆయన రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టం. అధికారం చేపట్టిన తరువాత, అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ తగ్గింపు వీటిలో ప్రధానమైనది. ఈ నిర్ణయాల కారణంగా చాలా వేగంగా ప్రజాభిమానం కోల్పోసాగాడు. 1984 ఆగష్టు 16 న నాదెండ్ల భాస్కరరావు, అప్పటి గవర్నరు రాంలాల్, ప్రధానమంత్రి ఇందిరా గాంధీల లోపాయికారీ సహకారంతో రామారావును అధికారం నుండి తొలగించి, తాను దొడ్డిదారిన గద్దెనెక్కడంతో తిరిగి రామారావు ప్రజల్లోకి వెళ్ళాడు. జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో మిత్రపక్షాలు ఆయనకు ఎంతో సహాయం చేసాయి. ఫలితంగా సెప్టెంబర్ 16 న రామారావును తిరిగి ముఖ్యమంత్రిగా ప్రతిష్టించక తప్పింది కాదు, కేంద్రప్రభుత్వానికి. నెలరోజుల్లోనే, ఆయన ప్రభ తిరిగి శిఖరాగ్రానికి చేరిన సందర్భం ఇది.


ఆంద్ర ప్రదేశ్ లో మొదటి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. 1984లో సినిమారంగంలో "స్లాబ్ విధానము"ను అమలుపరిచారు. ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఎందుకూ పనికిరాదని చెప్పి శాసనమండలిని రద్దు చేసాడు (1985 జూన్ 1 న అధికారికంగా మండలి రద్దయింది). హైదరాబాదు లోని హుస్సేన్‌సాగర్ కట్టందు ( ట్యాంకుబండ్నందు) సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలు నెలకొల్పాడు. నాదెండ్ల కుట్ర కారణంగా శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి సంపాదించే ఉద్దేశ్యంతో మార్చి 1985లో ప్రజలతీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళాడు. ఆ ఎన్నికలలో 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చాడు.


1985-89 మధ్య కాలంలో తన ఏకస్వామ్యపాలన వలన ఎన్టీఆర్ ఎంతో అప్రదిష్ట పాలయ్యాడు. పార్టీలోను, ప్రభుత్వంలోను అన్నీ తానే అయి నడిపించాడు. ప్రజల్లో నిరసన భావం కలగడానికి ఇది ప్రధాన కారణమైంది. 1989లో ఎన్నికలకు కొద్ది నెలల ముందు మొత్తం మంత్రివర్గాన్ని ఏకపక్షంగా రద్దుపరచి కొత్త మంత్రుల్ని తీసుకున్నాడు. ఈ కాలంలో జరిగిన కొన్ని కులఘర్షణలు కూడా ప్రభుత్వ ప్రతిష్టపై దెబ్బతీసాయి. 1989 ఎన్నికలలో ఇది తీవ్ర ప్రభావం చూపింది. కాంగ్రెసు తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించి తిరిగి అధికారానికి వచ్చింది. ఎన్నికలలో ఓడిపోయినా భారత దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ, కమ్యూనిస్టులతో కలిపి కాంగ్రేసుకు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేయటంలో ఎన్టీఆర్ విజయం సాధించాడు. 1991 లో నంద్యాల లోక్‌సభ ఉప ఎన్నికలలో కాంగ్రెసు తరపున అభ్యర్థిగా అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు నిలబడగా, ప్రధానమంత్రి అయిన ఒక తెలుగువాడికి గౌరవ సూచకంగా ఎన్టీఆర్ ఎవరినీ పోటీగా నిలబెట్టలేదు.


1989-94 మధ్యకాలం ఎన్టీఆర్ రాజకీయ చరిత్రలో అత్యంత నిమ్నదశగా చెప్పవచ్చు. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అధికార కాంగ్రెసు పార్టీ చేతిలో అవమానాలు పొందాడు. శాసనసభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ ఏస్థాయిలో ఉండేదంటే - ఈ కాలంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులను 9 సార్లు సభనుండి బహిష్కరించారు. ఈ కాలంలో నాలుగు సినిమాలలో నటించాడు కూడా. తన జీవితకథ రాస్తున్న లక్ష్మీపార్వతిని 1993 సెప్టెంబర్‌లో పెళ్ళి చేసుకున్నాడు. రామారావు వ్యక్తిగత జీవితంలో ఇదో కీలకమైన మలుపు. ఆయన వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యులతో ఆయన సంబంధాలపై ఈ పెళ్ళి కారణంగా నీడలు కమ్ముకున్నట్లు కనిపించాయి.


1994లో కిలో బియ్యం రెండు రూపాయలు, సంపూర్ణ మద్య నిషేధం, వంటి హామీలతో, మునుపెన్నడూ ఏపార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారంపడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచాడు. అయితే ఆయన రెండవ భార్య లక్ష్మీపార్వతి పార్టీ, ప్రభుత్వ విషయాలలో విపరీతంగా కలుగజేసుకోవటం వలన ఆయన చాలా సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చింది. పార్టీలో ప్రముఖులు అభద్రతా భావాన్ని ఎదుర్కొన్నారు. పార్టీలో ముదిరిన సంక్షోభానికి పరాకాష్టగా ఆయన అల్లుడు, ఆనాటి మంత్రీ అయిన నారా చంద్రబాబునాయుడు తిరుగుబాటు చేసాడు. అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది. అనతికాలంలోనే, 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించాడు.


ముప్పైమూడేళ్ళ తెర జీవితంలోను, పదమూడేళ్ళ రాజకీయ జీవితంలోను నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడు. ఆయన మరణించినపుడు ఈనాడు పత్రికలో శ్రీధర్ వేసిన ఈ కార్టూను ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ పట్ల ఉన్న అభిమానానికి అద్దం పడుతుంది.

ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రముఖులకు జీవిత కాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1996 లో నెలకొల్పింది. 2002 వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం తరువాత నిలిపివేసింది. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా 2006 జనవరి 18 న ఈ పురస్కారాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఎన్టీఆర్ విశిష్టత

  • సిసలైన ప్రజానాయకుడు ఎన్టీఆర్‌. ఆంధ్ర ప్రదేశ్ లో, ఆయన సమకాలికుల్లో ఆయనంతటి ప్రజానాయకుడు మరొకరు లేరు.
  • వటవృక్షంలాంటి కాంగ్రెసు పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లో దీటైన ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టిన గొప్పదనం పూర్తిగా ఎన్టీఆర్‌దే.
  • పట్టుదలకూ, క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి ఆయన. ఈ కారణాలవల్లనే కాంగ్రెసు పార్టీని ఎదుర్కొని స్థిరమైన ప్రభుత్వాన్నీ, ప్రభావవంతమైన ప్రతిపక్షాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వగలిగాడు.
  • తెలుగుజాతికీ, తెలుగుభాషకూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్.
  • స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత రామారావుదే.
  • బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్ళు కట్టించిన గొప్పతనం ఆయనకు దక్కింది.
  • రెండు రూపాయలకే కిలో బియ్యం వాగ్దానం చేసి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు ఓర్చి, తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.
  • తెలుగుగంగ ప్రాజెక్టులో పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత కూడా ఎన్టీఆర్‌దే.
  • దేశంలో ప్రధాన ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చిన నేత ఆయన.
  • ఎందరో కొత్తవారిని, బాగా చదువుకున్నవారిని రాజకీయాలకు పరిచయం చేసి, ఒంటిచేత్తో వారిని గెలిపించిన ప్రజానాయకుడు ఆయన. దేవేందర్ గౌడ్, కె.చంద్రశేఖరరావు మొదలైన నేతలు ఆయన పరిచయం చేసినవారే.

ఎన్టీఆర్ పై విమర్శ

  • ఏకస్వామ్య పరిపాలన
  • వ్యక్తుల గురించి, రాజకీయ పార్టీల గురించి ఆయన వాడిన భాష రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఇతర పార్టీలు దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడంతో రాజకీయనేతలు వాడే భాషా స్థాయి మరింత పడిపోయింది.
  • ఏ ఇతర నేతకూ లభించని ప్రజాదరణ పొందినా కేవలం స్వీయ తప్పిదాల కారణంగా దాన్ని నిలుపుకోలేకపోయాడు.
  • ఆయన పాలనా కాలంలో కులపరమైన ఘర్షణలు జరిగాయి. ఆయనకు ప్రత్యక్ష సంబంధం లేకున్నా, అప్పటి ముఖ్యమంత్రిగా బాధ్యత వహించక తప్పలేదు.

సినిమాలు

నటుడిగా

యన్టీ రామారావు నటించిన సినిమాల జాబితా

40వ దశకం

  1. మన దేశం(1949)

50వ దశకం

  1. షావుకారు(1950)
  2. పల్లెటూరిపిల్ల(1950)
  3. మాయరంభ(1950)
  4. సంసారం(1950)
  5. మాయరంభ(1950) (తమిళము)
  6. పాతాళభైరవి(1951)
  7. పాతాళభైరవి(1951) (తమిళము)
  8. పాతాళభైరవి(1951) (హిందీ)
  9. మల్లీశ్వరి(1951)
  10. పెళ్ళిచేసిచూడు(1952)
  11. దాసి(1952)
  12. పల్లెటూరు(1952)
  13. కళ్యాణంపన్నిప్పర్(1952) (తమిళము)
  14. వెలైకరిమగల్(1952) (తమిళము)
  15. అమ్మలక్కలు(1953)
  16. మరుముగల్(1953) (తమిళము)
  17. పిచ్చి పుల్లయ్య(1953)
  18. చండీరాణి(1953)
  19. చండీరాణీ(1953) (తమిళము)
  20. చండీరాణీ(1953) (హిందీ)
  21. చంద్రహారం(1954)
  22. చంద్రహారం(1954) (తమిళము)
  23. వద్దంటే డబ్బు(1954)
  24. తోడుదొంగలు(1954)
  25. రేచుక్క(1954)
  26. రాజు పేద(1954)
  27. సంఘం(1954)
  28. సంఘం(1954) (తమిళము)
  29. అగ్గిరాముడు(1954)
  30. పరివర్తన(1954)
  31. ఇద్దరుపెళ్ళాలు(1954)
  32. మిస్సమ్మ(1955)
  33. విజయగౌరి(1955)
  34. చెరపకురా చెడేవు(1955)
  35. జయసింహ(1955)
  36. కన్యాశుల్కం(1955)
  37. సంతోషం(1955)
  38. నయాఆద్మి(1956) (హిందీ)
  39. తెనాలి రామకృష్ణ(1956)
  40. తెనాలి రామకృష్ణన్(1956) (తమిళము)
  41. చింతామణి(1956)
  42. జయంమనదే(1956)
  43. సొంతవూరు(1956)
  44. ఉమాసుందరి(1956)
  45. చిరంజీవులు(1956)
  46. శ్రీగౌరి మహాత్మ్యం(1956)
  47. పెంకి పెళ్ళాం(1956)
  48. మర్మవీరన్(1956) (తమిళము)
  49. చరణదాసి(1956)
  50. భాగ్యరేఖ(1957)
  51. మాయాబజార్(1957)
  52. మయాబజార్(1957) (తమిళము)
  53. వీరకంకణం(1957)
  54. సంకల్పం(1957)
  55. వినాయకచవితి(1957)
  56. భలే అమ్మాయిలు(1957)
  57. సతి అనసూయ(1957)
  58. సారంగధర(1957)
  59. కుటుంబగౌరవం(1957)
  60. పాండురంగ మహత్యం(1957)
  61. అన్నాతమ్ముడు(1958)
  62. భూకైలాస్(1958)
  63. శోభ(1958)
  64. రాజనందిని(1958)
  65. మంచిమనసుకుమంచిరోజు(1958)
  66. కార్తవరాయని కథ(1958)
  67. ఇంటిగుట్టు(1958)
  68. సంపూర్ణరామాయణం(1958) (తమిళము)
  69. అప్పుచేసి పప్పుకూడు(1959)
  70. రాజసేవై(1959) (తమిళము)
  71. రేచుక్క-పగటిచుక్క(1959)
  72. శభాష్ రాముడు(1959)
  73. దైవబలం(1959)
  74. బాలనాగమ్మ(1959)
  75. వచ్చిన కోడలు నచ్చింది(1959)
  76. బండరాముడు(1959)

60వ దశకం

  1. శ్రీవెంకటేశ్వరమహత్యం(1960)
  2. రాజమకుటం(1960)
  3. రాజమకుటం(1960) (తమిళము)
  4. రాణి రత్నప్రభ(1960)
  5. దేవాంతకుడు(1960)
  6. విమల(1960)
  7. దీపావళి(1960)
  8. భట్టివిక్రమార్క(1960)
  9. కాడెద్దులు ఎకరంనేల(1960)
  10. భక్తరఘునాథ్(1960) (గుజరాతి)
  11. సీతారామకళ్యాణం(1961)
  12. ఇంటికిదీపంఇల్లాలే(1961)
  13. సతీసులోచన(1961)
  14. పెండ్లిపిలుపు(1961)
  15. శాంత(1961)
  16. జగదేకవీరునికథ(1961)
  17. కలిసిఉంటేకలదుసుఖం(1961)
  18. టాక్సీరాముడు(1961)
  19. గులేబకావలికధ(1962)
  20. గాలిమేడలు(1962)
  21. టైగర్ రాముడు(1962)
  22. భీష్మ(1962)
  23. దక్షయజ్ఞం(1962)
  24. గుండమ్మకథ(1962)
  25. మహామంత్రి తిమ్మరుసు(1962)
  26. స్వర్ణమంజరి(1962)
  27. రక్తసంబంధం(1962)
  28. ఆత్మబందువు(1962)
  29. శ్రీకృష్ణార్జునయుద్దం(1963)
  30. ఇరుగుపొరుగు(1963)
  31. పెంపుడుకూతురు(1963)
  32. వాల్మీకి(1963)
  33. సవతికొడుకు(1963)
  34. లవకుశ(1963)
  35. లవకుశ(1963) (తమిళము)
  36. లవకుశ(1963) (హిందీ)
  37. పరువూప్రతిష్ట(1963)
  38. ఆప్తమిత్రులు(1963)
  39. బందిపోటు(1963)
  40. లక్షాధికారి(1963)
  41. తిరుపతమ్మకథ(1963)
  42. నర్తనశాల(1963)
  43. మంచిచెడు(1963)
  44. కర్ణ(1964)
  45. కర్ణన్(1964) (తమిళము)
  46. కర్ణ(1964) (హిందీ)
  47. గుడిగంటలు(1964)
  48. మర్మయోగి(1964)
  49. కలవారికోడలు(1964)
  50. దేశద్రోహులు(1964)
  51. రాముడు భీముడు(1964)
  52. సత్యనారాయణమహత్యం(1964)
  53. అగ్గిపిడుగు(1964)
  54. దాగుడుమూతలు(1964)
  55. శభాష్ సూరి(1964)
  56. బభ్రువాహన(1964)
  57. వివాహబంధం(1964)
  58. మంచిమనిషి(1964)
  59. వారసత్వం(1964)
  60. బొబ్బిలియుద్దం(1964)
  61. భక్తరామదాసు(1964) (తమిళము)
  62. భక్తరామదాస్(1964) (గుజరాతి)
  63. నాదీఆడజన్మే(1965)
  64. పాండవవనవాసం(1965)
  65. దొరికితేదొంగలు(1965)
  66. మంగమ్మశపధం(1965)
  67. సత్యహరిశ్చంద్ర(1965)
  68. తోడూనీడ(1965)
  69. ప్రమీలార్జునీయం(1965)
  70. దేవత(1965)
  71. వీరాభిమన్యు(1965)
  72. విశాలహృదయాలు(1965)
  73. సిఐడి(1965)
  74. ఆడబ్రతుకు(1965)
  75. శ్రీకృష్ణపాండవీయం(1966)
  76. పల్నాటియుద్దం(1966)
  77. శకుంతల(1966)
  78. పరమానందయ్యశిష్యులకధ(1966)
  79. మంగళసూత్రం(1966)
  80. అగ్గిబరాట(1966)
  81. సంగీతలక్ష్మి(1966)
  82. శ్రీకృష్ణతులాభారం(1966)
  83. పిడుగురాముడు(1966)
  84. అడుగుజాడలు(1966)
  85. డాక్టర్ ఆనంద్(1966)
  86. గోపాలుడు భూపాలుడు(1967)
  87. నిర్దోషి(1967)
  88. కంచుకోట(1967)
  89. భువనసుందరికథ(1967)
  90. ఉమ్మడికుటుంబం(1967)
  91. భామావిజయం(1967)
  92. నిండుమనసులు(1967)
  93. స్త్రీజన్మ(1967)
  94. శ్రీకృష్ణావతారం(1967)
  95. పుణ్యవతి(1967)
  96. ఆడపడుచు(1967)
  97. చిక్కడు-దొరకడు(1967)
  98. ఉమచండీగౌరీశంకరులకథ(1968)
  99. నిలువుదోపిడీ(1968)
  100. తల్లిప్రేమ(1968)
  101. తిక్కశంకరయ్య(1968)
  102. రాము(1968)
  103. కలిసొచ్చిన అదృష్టం(1968)
  104. నిన్నే పెళ్ళాడుతా(1968)
  105. భాగ్యచక్రం(1968)
  106. నేనేమొనగాన్ని(1968)
  107. బాగ్దాద్ గజదొంగ(1968)
  108. నిండుసంసారం(1968)
  109. వరకట్నం(1969)
  110. కథానాయకుడు(1969)
  111. భలేమాస్టారు(1969)
  112. గండికోటరహస్యం(1969)
  113. విచిత్రకుటుంబం(1969)
  114. కదలడు వదలడు(1969)
  115. నిండుహృదయాలు(1969)
  116. భలే తమ్ముడు(1969)
  117. అగ్గివీరుడు(1969)
  118. మాతృదేవత(1969)
  119. ఏకవీర(1969)

70వ దశకం

  1. తల్లాపెళ్ళామా(1970)
  2. లక్ష్మీకటాక్షం(1970)
  3. ఆలీబాబా 40 దొంగలు(1970)
  4. పెత్తందారులు(1970)
  5. విజయంమనదే(1970)
  6. చిట్టిచెల్లెలు(1970)
  7. మాయనిమాట(1970)
  8. మారినమనిషి(1970)
  9. కోడలుదిద్దినకాపురం(1970)
  10. ఒకేకుటుంబం(1970)
  11. తిరుదత్తతిరుడన్(1970) (తమిళము)
  12. కన్నన్ వరువన్(1970) (తమిళము)
  13. శ్రీకృష్ణవిజయం(1971)
  14. నిండుదంపతులు(1971)
  15. రాజకోటరహస్యం(1971)
  16. జీవితచక్రం(1971)
  17. రైతుబిడ్డ(1971)
  18. అదృస్టజాతకుడు(1971)
  19. చిన్ననాటిస్నేహితుడు(1971)
  20. పవిత్రహృదయాలు(1971)
  21. శ్రీకృష్ణసత్య(1971)
  22. శ్రీకృష్ణార్జునయుద్ధం(1972)
  23. కులగౌరవం(1972)
  24. బడిపంతులు(1972)
  25. ఎర్రకోటవీరుడు(1973)
  26. డబ్బుకు లోకం దాసోహం(1973)
  27. దేశోద్దారకుడు(1973)
  28. ధనమా దైవమా(1973)
  29. దేవుడుచేసినమనుషులు(1973)
  30. వాడేవీడు(1973)
  31. పల్లెటూరిచిన్నోడు(1974)
  32. అమ్మాయిపెళ్ళి(1974)
  33. మనుషుల్లోదేవుడు(1974)
  34. తాతమ్మకల(1974)
  35. నిప్పులాంటిమనిషి(1974)
  36. దీక్ష(1974)
  37. శ్రీరామాంజనేయయుద్దం(1975)
  38. కథానాయకునికథ(1975)
  39. సంసారం(1975)
  40. రామునిమించినరాముడు(1975)
  41. అన్నదమ్ముల అనుబంధం(1975)
  42. మాయామశ్చీంద్ర(1975)
  43. తీర్పు(1975)
  44. ఎదురులేనిమనిషి(1975)
  45. వేములవాడ భీమ కవి(1976)
  46. ఆరాధన(1976)
  47. మనుషులంతాఒక్కటే(1976)
  48. మగాడు(1976)
  49. నేరంనాదికాదు ఆకలిది(1976)
  50. బంగారుమనిషి(1976)
  51. మాదైవం(1976)
  52. మంచికిమారోపేరు(1976)
  53. దానవీరశూరకర్ణ(1977)
  54. అడవిరాముడు(1977)
  55. ఎదురీత(1977)
  56. చాణక్య చంద్రగుప్త(1977)
  57. మాఇద్దరికథ(1977)
  58. యమగోల(1977)
  59. సతీసావిత్రి(1978)
  60. మేలుకొలుపు(1978)
  61. అక్బర్ సలీమ్ అనార్కలి(1978)
  62. రామకృష్ణులు(1978)
  63. యుగపురుషుడు(1978)
  64. రాజపుత్రరహస్యం(1978)
  65. సింహబలుడు(1978)
  66. శ్రీరామపట్టాభిషేకం(1978)
  67. సాహసవంతుడు(1978)
  68. లాయర్ విశ్వనాథ్(1978)
  69. కెడినంబర్ 1 (K.D.No.1)(1978)
  70. డ్రైవర్ రాముడు(1979)
  71. మావారి మంచితనం(1979)
  72. శ్రీమద్విరాటపర్వం(1979)
  73. వేటగాడు(1979)
  74. టైగర్(1979)
  75. శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం(1979)
  76. శృంగారరాముడు(1979)
  77. యుగంధర్(1979)

80వ దశకం

  1. చాలెంజ్ రాముడు(1980)
  2. సర్కస్ రాముడు(1980)
  3. ఆటగాడు(1980)
  4. సూపర్ మాన్(1980)
  5. రౌడీ రాముడు కొంటె కృష్ణుడు(1980)
  6. సర్దార్ పాపారాయుడు(1980)
  7. సరదారాముడు(1980)
  8. ప్రేమసింహాసనం(1981)
  9. గజదొంగ(1981)
  10. ఎవరుదేవుడు(1981)
  11. తిరుగులేనిమనిషి(1981)
  12. సత్యంశివం(1981)
  13. విశ్వరూపం(1981)
  14. అగిరవ్వ(1981)
  15. కొండవీటిసింహం(1982)
  16. మహాపురుషుడు(1981)
  17. అనురాగదేవత(1982)
  18. కలియుగరాముడు(1982)
  19. జస్టిస్ చౌదరి(1982)
  20. బొబ్బిలిపులి(1982)
  21. వయ్యారిభామలు వగలమారిభర్తలు(1982)
  22. నాదేశం(1982)
  23. సింహం నవ్వింది(1983)
  24. చండశాసనుడు(1983)
  25. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర(1984)

90వ దశకం

  1. బ్రహ్మర్షి విశ్వామిత్ర(1991)
  2. సామ్రాట్ అశోక(1992)
  3. మేజర్ చంద్రకాంత్(1993)
  4. శ్రీనాథకవిసార్వభౌమ(1993)

దర్శకునిగా

  1. శ్రీసీతారామకళ్యాణం(1962)
  2. గులేబకావళికథ(1962)
  3. శ్రీకృష్ణపాండవీయం(1966)
  4. వరకట్నం(1969)
  5. తల్లాపెళ్ళామా(1970)
  6. తాతమ్మకల(1974)
  7. దానవీరశూరకర్ణ(1977)
  8. చాణక్యచంద్రగుప్త(1977)
  9. అక్బర్ సలీమ్ అనార్కలి(1978)
  10. శ్రీరామపట్టాభిషేకం(1978)
  11. శ్రీమద్విరాటపర్వం(1979)
  12. శ్రీతిరుపతివెంకటేశ్వరకల్యాణం(1979)
  13. చండశాసనుడు(1983)
  14. శ్రీమద్విరాటపోతులూరివీరబ్రహ్మేంద్రస్వామిచరిత్ర(1984)
  15. బ్రహ్మర్షివిశ్వామిత్ర(1991)
  16. సామ్రాట్ అశోక(1992)

నిర్మాతగా

  1. సామ్రాట్ అశోక (1992)
  2. శ్రీనాథకవిసార్వభౌమ (1993)
  3. దానవీరశూరకర్ణ

రచయితగా

  1. బిదాయి(1974) (హిందీ)

తరగని అందం సోగ్గాడి సొంతం!

శోభన్ బాబు

జన్మ నామం ఉప్పు శోభానా చలపతి రావు
జననం జనవరి 14, 1937
చిన నందిగామ (కృష్ణ జిల్లా ,మైలవరం సమీపంలో ఉంది),ఆంధ్రప్రదేశ్
మరణం మార్చి 20, 2008
చెన్నై
గుండెపోటు
నివాసం చెన్నై
ఇతర పేర్లు నటభూషణ,సోగ్గాడు
వృత్తి నటన
భార్య/భర్త శాంత కుమారి
సంతానం కరుణా శేషు,(కుమారుడు),మృదుల నివేదిత,ప్రశాంతి(కుమార్తెలు)
తండ్రి ఉప్పు సూర్య నారాయణ రావు

బాల్యం

శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. ఆయన జనవరి 14, 1937న కృష్ణా జిల్లా తెలివిదేవరపాడులో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణ రావు. మైలవరం హైస్కూల్లో చదివేరోజుల్లో శోభన్ బాబు నాటకాల పైన ఆసక్తి పెంచుకొని అనతికాలంలో మంచి నటుడిగా పేరు పొందాడు. హైస్కూలు చదువు పూర్తి అయిన తర్వాత విజయవాడలో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చదువు పూర్తి చేసాడు.

సినీరంగ ప్రవేశం

మద్రాసులో లా కోర్సులో చేరినప్పటికీ నటన పైన ఆసక్తితో మధ్యలో ఆపివేసి సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అప్పుడే తన పేరును శోభన్ బాబుగా మార్చుకున్నాడు. 1960లో భక్త శబరి చిత్రంలో రామునిగా నటించి తెరంగ్రేటం చేసాడు. ఆయన నటనకు మంచి పేరు వచ్చినా, చిత్రం విజయం సాధించకపోవడంతో అవకాశాలు రాలేదు. అప్పటికే పెళ్ళయి భార్య పిల్లలతో ఉన్న శోభన్ బాబు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న పాత్రలను కూడా పోషించసాగాడు. అందులో శోభన్ బాబుకు మంచి పేరు తెచ్చిన పాత్రలు: అభిమన్యుడిగా నర్తనశాలలో, అర్జునుడుగా భీష్మలో, లక్ష్మణుడుగా సీతారామకల్యాణంలో.

విజయపరంపర

శోభన్ బాబు వీరాభిమన్యు చిత్రంలో హీరోగా అభిమన్యుడి పాత్రలో తన నటనా చాతుర్యాన్ని చాటిచెప్పాడు.వెంటనే లోగుట్టు పెరుమాళ్ళకెరుక సినిమాలో సోలో హీరోగా నటించాడు. అది విజయం సాధించడంతో మరిన్ని అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. ఆ తర్వాత మనుషులు మారాలి, చెల్లెలి కాపురం, దేవాలయం, కళ్యాణ మంటపం, మల్లెపువ్వు మొదలయిన చిత్రాల ఘన విజయాలతో అగ్ర నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకొన్నాడు.

వైవిధ్యం

అనతి కాలంలో దేవత, పండంటి కాపురం, కార్తీక దీపం వంటి కుటుంబ కథా చిత్రాలలో నటించి మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయకుడయ్యాడు. దాదాపు అన్ని కుటుంబ చిత్రాలలో బాధ్యత గల కుటుంబ పెద్దగా, భార్యను ప్రేమించి గౌరవించే వ్యక్తిగా గౌరవప్రదమయిన పాత్రలు పోషించాడు. అప్పట్లో అమ్మాయిలు తమకు కాబోయే భర్త శోభన్ బాబులా అందగాడు మాత్రమే కాకుండా ఆయన పోషించే పాత్రల వ్యక్తిత్వం కలిగి ఉండాలని కోరుకొనేవారు!

రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు మొదలయిన పౌరాణికి పాత్రలే కాకుండా కొన్ని జానపద చిత్రాల్లో కూడా నటించాడు. అప్పటికే అగ్ర హీరోగా ఉన్నా, కాంబినేషన్ చిత్రాలలో ఎటువంటి భేషజాలు లేకుండా సాటి హీరోలతో నటించేవాడు. కొన్ని కాంబినేషన్ చిత్రాలు: ఎన్‌టీ్ఆర్ తో: ఆడపడుచు, విచిత్ర కుటుంబం. అక్కినేని నాగేశ్వరరావుతో: పూలరంగడు, బుద్ధిమంతుడు. కృష్ణతో: మంచి మిత్రులు, ఇద్దరు దొంగలు

ఆయనకున్న బిరుదులు: నటభూషణ, సోగ్గాడు, ఆంధ్రా అందగాడు.

ఆణిముత్యాలు

శోభన్ బాబు నటజీవితంలో ఎన్నో చిత్రాలు ఘనవిజయం సాధించి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కొన్ని తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి.

  • మనుషులు మారాలి: యావత్ తెలుగు సినీ అభిమానులను ఉలిక్కిపడేలా చేసిన ఈ సినిమాలో కార్మిక నాయకుడిగా శోభన్ బాబు నటన అద్వితీయం. ఈ సినిమా అప్పట్లో 25 వారాలు ఆడింది.
  • చెల్లెలి కాపురం: అప్పటికే అందాల నటుడిగా ఆంద్రలోకమంతా అభిమానులను సంపాదించుకున్న శోభన్ బాబు నట జీవితంలో ఈ చిరం కలికితురాయి. అంద వికారుడయిన రచయితగా చెల్లెలి కోసం తాపత్రయ పడే అన్నగా ఆయన నటన చిరస్మరణీయం.
  • ధర్మపీఠం దద్దరిల్లింది: తన కన్న కొడుకులు ముగ్గురూ అవినీతికి పాల్పడుతుంటే చూసి సహించలేక ముగ్గురినీ అంతంచేసే తండ్రిగా శోభన్ బాబు ప్రదర్శించిన నటన అసామాన్యం.

అవార్డులు-రివార్డులు

  • ఫిల్మ్ ఫేర్ అవార్డు: 1971, 1974, 1976, 1979
  • ఉత్తమ నటుడిగా నంది అవార్డు: 1969, 1971, 1972, 1973, 1976
  • సినీగోయెర్స్ అవార్డు: 1970,1971,1972,1973,1974,1975,1985,1989
  • వంశీ బర్కిలీ అవార్డు: 1978, 1984, 1985
  • కేంద్ర ప్రభుతం చేత ఉత్తమ నటుడు అవార్డు: బంగారు పంజరం సినిమాకు 1970లో

వ్యక్తిగత జీవితం

శోభన్ బాబుకు మే 15, 1958న కాంత కుమారితో వివాహమయినది. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. వారి పేర్లు: కరుణ శేషు, మృదుల, ప్రశాంతి, నివేదిత. సినీరంగంలో ఉన్నా, ఆయన ఎన్నడూ ఎటువంటి వ్యసనాలకు లోను కాలేదు. ప్రతిరోజు సాయంత్రం షూటింగ్ అయిన వెంటనే ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులతో సమయం గడిపేవాడు. వృత్తికంటే కుటుంబంతో గడపడానికే ప్రాధాన్యతనిస్తూ అదే విషయాన్ని తోటినటులకు చెప్పేవాడు. ఆయన తన సంతానాన్ని ఎన్నడూ సినీరంగంలోకి తీసుకొని రాలేదు. వయసు పైబడుతున్నపుడు కూడా హీరోగా నటించాడే తప్ప చిన్న పాత్రలు పోషించలేదు. వ్యక్తిగా శోభన్ బాబు చాలా నిరాడంబరుడు. ఎంతో డబ్బు సంపాదించినా ఎన్నడూ ఆడంబర జీవితం గడపలేదు. డబ్బును పొదుపు చేయడంలో మరియు మదుపు చేయడంలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ఎందరికో సహాయాలు, దానాలు చేసినా, ఎందరికో ఇళ్ళు కట్టించినా ప్రచారం చేయించుకోలేదు.

చివరి దశ

ఎన్నటికీ ప్రేక్షలు మనసులో అందాల హీరోగా ఉండిపోవాలని భావించిన శోభన్ బాబు 220 పైగా చిత్రాలలో నటించి 1996లో విడులయిన హలో..గురూ చిత్రంతో తన 30 ఏళ్ళ నటజీవితానికి స్వస్థి చెప్పి చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడిపేవాడు. శోభన్ బాబు 2008, మార్చి 20 ఉదయం గం.10:50ని.లకు చెన్నై లో దివంగతులయ్యారు.

100రోజులు పైన ఆడిన చిత్రాలు (సెంటరులు)

  • వీరాభిమన్యు (11)
  • పొట్టిప్లీడరు (2)
  • మనుషులు మారాలి (7)
  • తాసిల్దారుగారి అమ్మాయి (6)
  • సంపూర్ణ రామాయణం (8)
  • జీవన తరంగాలు (2)
  • పుట్టినిల్లు మెట్టినిల్లు (2)
  • అందరూ దొంగలే (3)
  • మంచిమనుషులు (10)
  • జేబుదొంగ (9)
  • సోగ్గాడు (19)
  • మల్లెపూవు (1)
  • కార్తీకదీపం (10)
  • జూదగాడు (5)
  • గోరింటాకు (9)
  • కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త (2)
  • పండంటి జీవితం (4)
  • ఇల్లాలు (8)
  • మహారాజు (1)
  • ఖైదీ బాబాయ్ (2)
  • ఇల్లాలు ప్రియురాలు (8)
  • ప్రేమ మూర్తులు (2)
  • దేవత (17)
  • ముందడుగు (17)
  • సర్పయాగం (1)
  • ఏవండీ ఆవిడ వచ్చింది (2)

నటించిన సినిమాలు

క్ర. సం. సంవత్సరం చ్రిత్రం పేరు కథానాయిక దర్శకుడు
1 1959 దైవబలం వసంతకుమార్ రెడ్డి
2 1960 భక్త శభరి చైత్రపు నారాయణ రావు
3 1961 సీతారామ కళ్యాణం యన్.టి. రామారావు / యన్.ఎ.టి. యూనిట్
4 1962 భీష్మ బి.ఎ. సుబ్బారావు
5 1962 మహామంత్రి తిమ్మరుసు కమలాకర కామేశ్వరరావు
6 1963 ఇరుగు-పొరుగు టి.యన్. మూర్తి
7 1963 సోమవార వ్రత మహత్యం ఆదోని లక్ష్మి ఆర్.యమ్.కృష్ణస్వామి
8 1963 పరువు ప్రతిష్ట మనపురమ్
9 1963 లవకుశ సి.పుల్లయ్య / సి.యస్.రావు
10 1963 చదువుకున్న అమ్మాయిలు సావిత్రి ఆదుర్తి సుబ్బారావు
11 1963 నర్తనశాల యల్. విజయలక్ష్మి కమలాకర కామేశ్వరరావు
12 1964 నవగ్రహ పూజామహిమ బి. విఠలాచార్య
13 1964 కర్ణ (తమిళం) బి.ఆర్. పంతులు
14 1964 దేశద్రోహులు బొల్లా సుబ్బారావు
15 1964 మైరావణ బి.ఎ. సుబ్బారావు
16 1965 సుమంగళి జయంతి ఆదుర్తి సుబ్బారావు
17 1965 ప్రమీలార్జున యుద్దమ్ వాణిశ్రీ యం. మల్లికార్జున రావు
18 1971 ప్రతిజ్ఞాపాలన సి.యస్. రావు
19 1965 వీరాభిమన్యు కాంచన వి. మధుసూధన రావు
20 1966 శ్రీకృష్ణ పాండవీయం యన్.టి. రామారావు
21 1966 లోగుట్టు పెరుమాళ్ళకెరుక రాజశ్రీ కె.యస్.ఆర్. దాస్
22 1966 పరమానందయ్య శిశ్యుల కధ అత్తిలి లక్ష్మి సి. పుల్లయ్య
23 1966 పొట్టి ప్లీడర్ గీతాంజలి కె.హేమాంభరధర రావు
24 1966 భక్త పోతన కె.ఆర్.విజయ జి. రామినీడు
25 1966 గూడఛారి 116 మల్లికార్జున రావు
26 1967 పిన్ని విజయ నిర్మల బి.ఎ. సుబ్బారావు
27 1967 శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న రాజశ్రీ కె. హేమాంభరధర రావు
28 1967 సత్యమే జయమ్ రాజశ్రీ పి.వి. రామారావు
29 1967 ప్రైవేట్ మాష్టర్ కె. విశ్వనాధ్
30 1967 శ్రీకృష్ణావతారం కమలాకర కామేశ్వరరావు
31 1967 పుణ్యవతి దాదా మిశ్రి
32 1967 ఆడపడుచులు వాణిశ్రీ కె. హేమాంభరధర రావు
33 1967 రక్త సింధూరం పండరీభాయి సీ. సీతారామ్
34 1967 కాంభోజరాజు కధ రాజశ్రీ కమలాకర కామేశ్వరరావు
35 1967 పూలరంగడు విజయ నిర్మల ఆదుర్తి సుబ్బారావు
36 1968 బార్య వాణిశ్రీ కే. యస్. ప్రకాశ రావు
37 1968 చుట్టరికాలు లక్ష్మి పేకేటి శివరామ్
38 1968 మన సంసారం భారతి సి.యస్. రావు
39 1968 లక్ష్మి నివాసం భారతి వి. మధుసూధన రావు
40 1968 పంతాలు-పట్టింపులు వాణిశ్రీ కె.బి. తిలక్
41 1968 జీవిత బంధం యమ్.యస్. గోపీనాథ్
42 1968 వీరాంజనేయ కమలాకర కామేశ్వరరావు
43 1968 కలసిన మనసులు భారతి కమలాకర కామేశ్వరరావు
44 1968 కుంకుమ భరిణె వేదాంతం రాఘవయ్య
45 1969 మంచి మిత్రులు టి. రామారావు
46 1969 బంగారు పంజరం వాణిశ్రీ బి.యన్. రెడ్డి
47 1969 విచిత్ర కుటుంబం షీలా కే. యస్. ప్రకాశ రావు
48 1969 సత్తెకాలపు సత్తెయ్య రాజశ్రీ కే. యస్. ప్రకాశ రావు
49 1969 బుద్దిమంతుడు విజయ నిర్మల బాపు
50 1969 నిండు హృదయాలు గీతాంజలి కె. విశ్వనాథ్
51 1969 మనుష్యులు మారాలి శారద వి. మధుసూధన రావు
52 1969 మాతృదేవత చంద్రకళ సావిత్రి
53 1969 కన్నుల పండగ కె.ఆర్. విజయ అనిశెట్టి
54 1969 తారాశశాంకం దేవిక మనపురం
55 1969 ప్రతీకారం సంద్యారాణి యమ్. నాగేశ్వర రావు
56 1970 భలే గూడచారి సునంద హోమి వదయ
57 1970 పెత్తందార్లు సి.యస్. రావు
58 1970 ఇద్దరు అమ్మాయిలు వాణిశ్రీ పుతన్న
59 1970 మా మంచి అక్కయ్య కె.ఆర్. విజయ వి. రామచంద్ర రావు
60 1970 పసిడి మనుష్యులు శారద సుబ్రమణ్యమ్
61 1970 జగజ్జెట్టీలు వాణిశ్రీ కె.వి. నందన రావు
62 1970 తల్లిదండ్రులు వై.విజయ కె.బాబూరావు
63 1970 మాయని మమత లక్ష్మి కమలాకర కామేశ్వరరావు
64 1970 ఇంటి గౌరవం ఆరతి బాపు
65 1970 దేశమంటే మనుషులోయ్ చంద్రకళ సి.ఎస్.రావు
66 1970 మూగ ప్రేమ విజయ లలిత జి.రామినీడు
67 1970 కథానాయకురాలు వాణిశ్రీ గిడుతూరి సూర్యం
68 1970 విచిత్ర దాంపత్యం విజయ నిర్మల పి.చంద్ర శేఖర రెడ్డి
69 1970 దెబ్బకు ఠా దొంగల ముఠా వాణిశ్రీ సుబ్రహ్మణ్యం
70 1971 సతీ అనసూయ జమున బి.ఎ.సుబ్బారావు
71 1971 సిసింద్రీ చిట్టిబాబు శారద ఎ.సంజీవి
72 1971 కళ్యాణ మండపం కాంచన వి.మధుసూదన రావు
73 1971 తాసిల్దారు గారి అమ్మాయి జమున కే. యస్. ప్రకాశ రావు
74 1971 బంగారు తల్లి వెన్నిరాడై నిర్మల తాపీ చాణక్య
75 1971 నా తమ్ముడు భారతి కే. యస్. ప్రకాశ రావు
76 1971 చిన్ననాటి స్నేహితులు వాణిశ్రీ కె.విశ్వనాధ్
77 1971 రామాలయం విజయ నిర్మల కె.బాబూరావు
78 1971 కూతురు కోడలు విజయలలిత పి. లక్ష్మిదీపక్
79 1971 తల్లీ కూతుళ్ళు కాంచన జి.రామినీడు
80 1971 జగజ్జెంత్రీలు వాణిశ్రీ పి.లక్ష్మిదీపక్
81 1972 వంశోద్ధారకుడు కాంచన పి.సాంబశివరావు
82 1972 కిలాడి బుల్లోడు చంద్రకళ నందమూరి రమేష్
83 1972 శాంతి నిలయం చంద్రకళ వైకుంఠ శర్మ
84 1972 కన్నతల్లి చంద్రకళ టి.మాధవరావు
85 1972 అమ్మ మాట వాణిశ్రీ కమలాకర కామేశ్వరరావు
86 1972 సంపూర్ణ రామాయణం చంద్రకళ బాపు
87 1972 మానవుడు-దానవుడు శారద / రీనా పి.చంద్రశేఖర రెడ్డి
88 1972 కాలం మారింది శారద కె.విశ్వనాధ్
89 1973 పెద్దకొడుకు కాంచన కె.ఎస్.ప్రకాశ రావు
90 1973 పుట్టినిల్లు-మెట్టినిల్లు చంద్రకళ పట్టు
91 1973 మైనర్ బాబు వాణిశ్రీ టి.ప్రకాశరావు
2 1973 జీవన తరంగాలు వాణిశ్రీ టి.రామారావు
93 1973 శారద శారద, జయంతి కె.విశ్వనాధ్
94 1973 జీవితం జయంతి కే. యస్. ప్రకాశ రావు
95 1973 డాక్టర్ బాభు జయలలిత టి.లెనిన్ బాబు
96 1973 ఇదా లోకం శారద కె.ఎస్.ప్రకాశ రావు
97 1974 కోడె నాగు చంద్రకళ, లక్ష్మి కే. యస్. ప్రకాశ రావు
98 1974 కన్నవారి కలలు వాణిశ్రీ, లత ఎస్.ఎస్.బాలన్
99 1974 ఖైదీ బాబాయ్ వాణిశ్రీ టి.కృష్ణ
100 1974 గంగ-మంగ వాణిశ్రీ తాపీ చాణక్య / వి.రామచంద్రరావు
101 1974 అందరూ దొంగలే లక్ష్మి వి.బి.రాజేంద్ర ప్రసాద్
102 1974 చక్రవాకం వాణిశ్రీ కే. యస్. ప్రకాశ రావు
103 1974 మంచి మనుషులు మంజుల వి.బి.రాజేంద్ర ప్రసాద్
104 1975 అందరూ మంచివారే మంజుల యస్.యస్. బాలన్
105 1975 దేవుడు చేసిన పెళ్ళి శారద ఎమ్.ఎస్.రెడ్డి
106 1975 బాబు వాణిశ్రీ కే. రాఘవేంద్ర రావు
107 1975 జీవన జ్యోతి వాణిశ్రీ కె.విశ్వనాధ్
108 1975 బలిపీఠం శారద దాసరి నారాయణరావు
109 1975 జేబు దొంగ జయసుధ వి.మధుసూదనరావు
110 1975 గుణవంతుడు మంజుల ఆదుర్తి సుబ్బారావు
111 1975 సోగ్గాడు జయచిత్ర, జయసుధ కె.బాపయ్య
112 1976 పిచ్చిమారాజు మంజుల వి.బి.రాజేంద్ర ప్రసాద్
113 1976 ఇద్దరూ ఇద్దరే మంజుల వి.మధుసూదనరావు
114 1976 రాజా కే. రాఘవేంద్ర రావు
115 1976 ప్రేమబంధం వాణిశ్రీ కె.విశ్వనాధ్
116 1976 పొగరుబోతు వాణిశ్రీ టి.ప్రకాశరావు
117 1976 మొనగాడు జయసుధ, మంజుల టి.కృష్ణ
118 1976 రాజు వెడలె జయసుధ టి. రామారావు
119 1977 కురుక్షేత్రం లత కమలాకర కామేశ్వరరావు
120 1977 జీవితనౌక జయసుధ, జయప్రద కె.విశ్వనాధ్
121 1977 ఈతరం మనిషి జయప్రద వి.మధుసూదనరావు
122 1977 ఖైదీ కాళిదాస్ దీప సి. సుబ్రమణ్యం
123 1977 గడుసు పిల్లోడు జయసుధ కె.బాపయ్య
124 1978 నాయుడు బావ జయసుధ, జయప్రద పి.చంద్రశేఖర రెడ్డి
125 1978 నిండు మనిషి జయచిత్ర యస్.డి. లాల్
126 1978 మంచి బాబాయి జయచిత్ర టి.కృష్ణ
127 1978 కాలాంతకులు జయసుధ కె.ఎస్.ఆర్.దాస్ / కె.విశ్వనాధ్
128 1978 మల్లెపూవు జయసుధ, లక్ష్మి వి.మధుసూదనరావు
129 1978 రాధాకృష్ణ జయప్రద వి.మధుసూదనరావు
130 1978 ఎంకి-నాయుడు బావ వాణిశ్రీ బోయిన సుబ్బారావు
131 1979 కార్తీక దీపం శారద, శ్రీదేవి, గీత పి.లక్ష్మిదీపక్
132 1979 జూదగాడు జయసుధ వి.మధుసూదనరావు
133 1979 మండే గుండెలు జయసుధ కె.బాపయ్య
134 1979 గోరింటాకు సుజాత, వక్కలంక పద్మ దాసరి నారాయణరావు
135 1979 బంగారు చెల్లెలు జయసుధ వి.మధుసూదనరావు
136 1979 రామబాణం జయసుధ జి.రామమోహనరావు
137 1980 కక్ష శ్రీదేవి వి.సి. గుహనాథన్
138 1980 కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త శారద, గీత కట్టా సుబ్బారావు
139 1980 మహాలక్ష్మి వాణిశ్రీ / సుభాషిణి రాజచంద్ర
140 1980 చండీప్రియ జయప్రద వి.మధుసూదనరావు
141 1980 చేసిన బాసలు జయప్రద కె.ఎస్.ఆర్.దాస్
142 1980 మోసగాడు శ్రీదేవి కే. రాఘవేంద్ర రావు
143 1980 సన్నాయి అప్పన్న జయప్రద పి.లక్ష్మిదీపక్
144 1980 ధర్మచక్రం జయప్రద పి.లక్ష్మిదీపక్
145 1980 రాముడు పరశురాముడు లత ఎమ్.ఎస్.గోపీనాధ్
146 1980 మానవుడే మహనీయుడు సుజాత పి.చంద్రశేఖర రెడ్డి
147 1981 పండంటి జీవితం సుజాత టి.రామారావు
148 1981 ఇల్లాలు శ్రీదేవి, జయసుధ టి.రామారావు
149 1981 దీపారాధన జయప్రద దాసరి నారాయణరావు
150 1981 జీవిత రథం రతి వి.మధుసూదనరావు
151 1981 జగమొండి రతి వి.మధుసూదనరావు
152 1981 దేవుడు మామయ్య వాణిశ్రీ రాజచంద్ర
153 1981 సంసారం-సంతానం జయసుధ వి.మధుసూదనరావు
154 1981 ఘరానా గంగులు శ్రీదేవి కట్టా సుబ్బారావు
155 1981 గిరిజా కళ్యాణం జయప్రద కె.ఎస్.ఆర్.దాస్
156 1981 అల్లుడుగారు, జిందాబాద్! గీత కట్టా సుబ్బారావు
157 1982 వంశగౌరవం సుజాత రవీందర్ రెడ్డి
158 1982 కృష్ణార్జునులు జయప్రద దాసరి నారాయణరావు
159 1982 ప్రేమమూర్తులు రాధ, లక్ష్మి ఎ.కోదండరామిరెడ్డి
160 1982 ప్రతీకారం సుజాత జి. రామినీడు
161 1982 స్వయంవరం జయప్రద దాసరి నారాయణరావు
162 1982 దేవత శ్రీదేవి, జయప్రద కే. రాఘవేంద్ర రావు
163 1982 ఇల్లాలి కోరికలు జయసుధ జి.రామమోహనరావు
164 1982 బందాలు-అనుబంధాలు లక్ష్మి భార్గవ్
165 1982 కోరుకున్న మొగుడు జయసుధ కట్టా సుబ్బారావు
166 1982 ఇద్దరు కొడుకులు రాధ ఎ.కోదండరామిరెడ్డి
167 1983 ముందడుగు జయప్రద కె.బాపయ్య
168 1983 ముగ్గురు మొనగాళ్ళు రాధిక టి. రామారావు
169 1983 బలిదానం మాధవి ఎస్.ఎ.చంద్రశేఖర
170 1983 రఘురాముడు శారద కొమ్మినేని
171 1983 తోడు-నీడ సరిత, రాధిక వి. జనార్థన్
172 1983 రాజకుమార్ జయసుధ / అంబిక జి. రామినీడు
173 1984 ఇద్దరు దొంగలు రాధ కే. రాఘవేంద్ర రావు
174 1984 ఇల్లాలు-ప్రియురాలు సుహాసిని, ప్రీతి కోదండరామిరెడ్డి
175 1984 అభిమన్యుడు విజయశాంతి దాసరి నారాయణరావు
176 1984 బావామరదళ్ళు సుహాసిని, రాధిక ఎ.కోదండరామిరెడ్డి
177 1984 పుణ్యం కొద్ది పురుషుడు జయసుధ కట్టా సుబ్బారావు
178 1984 జగన్ జయసుధ దాసరి నారాయణరావు
179 1984 కోడెత్రాచు శ్రీదేవి ఎ.కోదండరామిరెడ్డి
180 1984 దండయాత్ర జయసుధ కె.బాపయ్య
181 1984 మిస్టర్ విజయ్ రాధ కోదండరామి రెడ్డి
182 1984 బార్యామణి జయసుధ విజయబాపినీడు
183 1984 దానవుడు జయసుధ కె.బాపయ్య
184 1984 సంపూర్ణ ప్రేమాయణం జయప్రద యన్.బి. ఛక్రవర్తి
185 1985 దేవాలయం విజయశాంతి టి.కృష్ణ
186 1985 మహారాజు సుహాసిని విజయ బాపినీడు
187 1985 ముగ్గురు మిత్రులు సుహాసిని రాజచంద్ర
188 1985 శ్రీవారు విజయశాంతి బీ. భాస్కర రావు
189 1985 మహాసంగ్రామం జయసుధ ఎ.కోదండరామిరెడ్డి
190 1985 కొంగుముడి జయసుధ విజయ బాపినీడు
191 1985 మాంగళ్యబలం జయసుధ, రాధిక బోయిన సుబ్బారావు
192 1985 జాకి సుహాసిని బాపు
193 1985 ఊరికి సోగ్గాడు విజయశాంతి బి.వి.ప్రసాద్
194 1986 శ్రావణ సంద్య విజయశాంతి/సుహాసిని ఎ.కోదండరామిరెడ్డి
195 1986 బంధం రాధిక రాజచంద్ర
196 1986 డ్రైవర్ బాబు రాధ బోయిన సుబ్బారావు
197 1986 మిస్టర్ భరత్ సుహాసిని రాజచంద్ర
198 1986 జీవన పోరాటం విజయశాంతి రాజచంద్ర
199 1986 జీవన రాగం జయసుధ బి.వి.ప్రసాద్
200 1986 ధర్మపీఠం దద్దరిల్లింది జయసుధ దాసరి నారాయణరావు
201 1986 విజృంభణ శోభన రాజచంద్ర
202 1986 అడవి రాజ రాధ కె.మురళి మోహనరావు
203 1986 చక్కనోడు విజయశాంతి బి. భాస్కరరావు
204 1986 జైలుపక్షి రాధిక కోడి రామకృష్ణ
205 1987 పున్నమి చంద్రుడు సుహాసిని విజయ బాపినీడు
206 1987 ఉమ్మడి మొగుడు కీర్తీ సింగ్ బీ. భాస్కర రావు
207 1987 కళ్యాణ తాంబూలం విజయశాంతి బాపు
208 1987 కార్తీక పౌర్ణమి భానుప్రియ ఎ.కోదండరామిరెడ్డి
209 1987 పుణ్యదంపతులు సుహాసిని జీ. అనిల్ కుమార్
210 1988 సంసారం జయప్రద రేలంగి నరసింహారావు
211 1988 దొంగ పెళ్ళి విజయశాంతి రవిరాజా పినిశెట్టి
212 1988 దొరగారింట్లొ దొంగోడు రాధ కోడి రామకృష్ణ
213 1988 చట్టంతో చదరంగం శారద కే. మురళీమోహన రావు
214 1988 బార్యాభర్తలు రాధ కే. మురళీమోహన రావు
215 1988 అన్నా చెల్లెలు రాధిక రవిరాజా పినిశెట్టి
216 1989 దొరికితే దొంగలు విజయశాంతి కే. మురళీమోహన రావు
217 1989 సోగ్గాడి కాపురం రాధ కోడి రామకృష్ణ
218 1990 దోషి-నిర్దోషి సుమిత్ర వై. నాగేశ్వర రావు
219 1991 సర్పయాగం రేఖ పరుచూరి బ్రదర్స్
220 1991 అగ్ని నక్షత్రం శరత్
221 1992 బలరామకృష్ణులు శ్రీవిద్య రవిరాజా పినిశెట్టి
222 1992 అశ్వమేధం గీత కే. రాఘవేంద్ర రావు
223 1993 ఏమండీ!... ఆవిడ వచ్చింది శారద, వాణిశ్రీ ఈ.వీ.వీ. సత్యనారాయణ
224 1994 జీవితఖైది జయసుధ, జయప్రద కే. అజయ్ కుమార్
225 1995 ఆస్తి మూరెడు-ఆశ బారెడు జయసుధ కోడి రామకృష్ణ
226 1995 దొరబాబు ప్రియారామన్ బోయిన సుబ్బారావు
227 1995 అడవి దొర రాధ, సురభి కే. అజయ్ కుమార్
228 1996 హలో... గురూ! ఆమని, సుహాసిని వెంకట్రావు

ముమైత్ కు హీరోలు కావలెను!

Mumaith Khan

ముమైత్ ఖాన్ ఐటం గాళ్ గా వచ్చి హీరోయిన్ గా సెటిలైపోయంది. అంతే కాదు ఆమె సినిమాల్లో ఆమే హీరో. హీరోయిన్ ప్రధానంగా నడిచే సినిమాల ఆఫర్లే వస్తున్నాయి. ఒకప్పుడు ఇటువంటి ఆఫర్లు విజయశాంతికి మాత్రమే వచ్చేవి. సినిమాల్లో ఆమే డామినేట్ చేసే కాలంలో ఆమె సరసన నటించడానికి హీరోలు జంకేవారు.

ఇప్పుడు ముమైత్ పరిస్ధితి అలాగే ఉంది. ఆమె ప్రధాన పాత్రలో నటించే సినిమాల్లో హీరోలుగా నటించడానికి ఓ ,ఓస్తరు నటులు కూడా ముందుకు రావడం లేదట. అల్లరి నరేశ్, శివాజీ, శర్వానంద్ వంటి వారు కూడా అమె సినిమాలో నటించమంటే వద్దు బాబోయ్ అంటూ దణ్ణం పెట్టేస్తున్నారట.

"మంచు"కొండ!

మంచు మోహబాబు

మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) - (జ. మార్చి 19, 1952), తెలుగు సినిమా నటుడు మరియు నిర్మాత.

చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మోదుగులపాళెం లో పుట్టిన మంచు భక్తవత్సలం నాయుడు సినీరంగ ప్రవేశంతో మోహన్ బాబుగా మార్చుకున్నాడు. దర్శక రత్న డాక్టర్‌ దాసరి నారాయణ రావు శిష్యుడిగా గుర్తింపు పొందారు. దాసరి దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం సినిమాలో మోహన్‌ బాబుకు ప్రధాన పాత్రలో నటించే అవకాశం లభించింది. ఆ తర్వాత ఆయన అనేక హిట్‌ చిత్రాల్లో నటించి సినిమా నిర్మాతగా కూడా మారారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పని చేశారు. విలన్‌గా, క్యారెక్టర్‌ నటుడిగా, హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కళాప్రతిభకు పద్మ శ్రీ పురస్కారం లభించింది. రంగంపేట లో శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థలు స్థాపించారు. తెలుగు సినిమా రంగంలో ఇప్పటికీ క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. రాజకీయాల్లో ప్రవేశించి రాజ్యసభ సభ్యుడిగా ఒక పర్యాయం పదవిని అలంకరించారు.