
చిరంజీవి పార్టీ వామపక్షాలతో జోడీ కట్టే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మరోవైపు తెలుగుదేశం, టీఅర్ ఎస్ ల మధ్య స్నేహం చిగురిస్తోంది. వైఎస్ వ్యతిరేకులందరినీ ఒక తాటి మీదికి తెచ్చేందుకు రామోజీరావు చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలున్నాయి.
చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఎదుగూ బొదుగూ లేకుండా ఉండడంతో "ప్యాడింగ్" వర్క్ రామోజీరావు నాయకత్వంలో అతి రహస్యంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డీతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న రామోజీరావు వైఎస్ కు ఏకు మేకు వంటి డిఎస్ ను పిసిసి అధ్యక్షుడిగా చేయగలిగారు, జైపాల్ సహకారంతో.
రానున్న రోజుల్లో వైఎస్ , రామోజీ మధ్య పోరాటం తీవ్రతరం కానుంది. రామోజీరావు మీద రాజశేఖరరెడ్డి కక్ష గట్టడం కాంగ్రెస్ నాయకుల్లోనే చాలామందికి నచ్చడం లేదు. ఆ విషయాన్ని గ్రహించిన అధిష్టానవర్గం రామోజీపై మరీ అంత క్రూరంగా వ్యవహరించవద్దని సూచించినట్టు తెలుస్తోంది.
No comments:
Post a Comment