1800-1900 ప్రాంతాల్లో రేనాటి సీమను ఇద్దరు మహనీయులు పునీతం చేశారు। ఇద్దరు కర్నూలు జిల్లా నొస్సం మండలం ఉయ్యాలవాడ వాస్తవ్యులే కావడం కూడ విశేషమే.
ఒకరు కంపెనీ పాలన మీద కత్తి దూసి స్వేచ్చకోసం పోరాడి ఉరికొయ్యకు బలీయిపోయి తరువాతి స్వాత్రంత్ర ఉద్యమానికి ప్రేరణ ఇచ్చిన వాడు। చైతన్యం నింపినవాడు. స్వాతంత్ర కాంక్షను రగిలించి మండే సూర్యుడయ్యాడు. అందుకే రేనాటి సూర్యుడు- విప్లవసింహం ఉయ్యాలవాడ నారసింహరెడ్డి. మరొకరు కరవు బారిన పడిన పేదలకు తన ఆపన్న హస్తం చాచి కడుపు నిండా అన్నం పెట్టి కలియుగ దానకర్ణుడని పేరుపొందిన బుడ్డా వెంగళరెడ్డి. తనకు ఉన్నాదంతా దానం చేసిన ఈ మహానుభావుని దాతృత్వానికి పరాయి పాలకులకు సైతం ఆశ్చర్యం వేసింది. అందుకే విక్టోరియా మహారాణి బంగారు పతకాన్ని బహుమానంగా ఇచ్చింది. ఇతని చల్లని నీడలో నిర్భాగ్యులు ఎందరో సేదదీరారు. అందువల్లనే రేనాటికి చల్లని వెన్నెల పంచిన చంద్రుడు -- బుడ్డా వెంగళరెడ్డి.
1857 కంటే ముందు 1846-47 ప్రాంతాల్లో 9000 మంది సైన్యంతో సాయుధపోరాటం నడిపిన ఉయ్యాలవాడ నారసింహారెడ్డి విప్లవానికి భారతీయ స్వాతంత్ర చరిత్రలో సముచిత స్థానాన్నిచారా అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకం। మన చరిత్రను మనము రాసుకోకపోవడమే ఇందుకు కారణం. ఇట్లాంటి వీరులు ఇంకా ఎంతమంది చరిత్రలో మరుగున పడిపోయాయో? ఇప్పటికైనా ఉయ్యాలవాడ నారసింహారెడ్డి విప్లవానికి భారతీయ స్వాతంత్ర్య చరిత్రలో సముచిత స్థానం కల్పించాలని ఆశిద్దాం.
నిరంతర వార్తా స్రవంతి
Thursday, February 21, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment