నిరంతర వార్తా స్రవంతి
Thursday, February 21, 2008
సమాచార శాఖా...? చేతకాని ...??
విశాఖపట్నంలోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ పనితీరు నానాటికీ మీడియాకు తలనొప్పిగా మారుతోంది. జిల్లాలో పాత్రికేయుల బాగోగులు చూడాల్సిన ఆ శాఖ అధికారులు తద్భిన్నంగా వ్యవహరిస్తూ ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు. పట్టించుకునే నాధుడు లేడనో ఏమో కానీ చివరికి జర్నలిస్టులకి ద్రోహంచేసేవాళ్లకి పూర్తిస్థాయిలో సహకరిస్తూ వృత్తిధర్మానికి తిలోదకాలిస్తున్నారు. కేవలం డి.పి.ఆర్.ఒ.కార్యాలయంలోని కొంతమంది సహకారంతో వీరాభిమన్యుడులాంటి వెదవలు సైతం విర్రవీగిపోతున్నారు. సమాచార హక్కు చట్టాన్ని అడ్డంపెట్టుకుని వీరాభిమన్యుడు తోటి జర్నలిస్టులను అనేక ఇబ్బందులు పెట్టడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాచార శాఖ అందిస్తున్న సహకారాం గురించి అందరికీ తెలిసిందే. అక్రిటిడేషన్ జీవోలోని లొసుగుల్ని అడ్డంపెట్టుకుని అభిమన్యుడు చిన్న పత్రికల విలేఖరులను పెడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
వీడి గురించి మీదగ్గర ఉన్నది చాలా తక్కువలా ఉంది. బ్లాగ్ లో పెట్టగల ధైర్యం ఉంటే చెప్పండి శ్రీనివాస్ గాడి అక్రమాల చిట్టా మీకు పంపిస్తాను. దయచేసి మీ అంగీకారం తెలియజేయగలరు.
ఇట్లు,
శ్రీనివాస్ బాధితుడు,
విజయనగరం
Post a Comment