"సూర్యవంశం","సుభాష్ చంద్ర బోస్","జయం మనదేరా" లాంటి పలు చిత్రాలలో ద్విపాత్రాభినయం చేసిన విక్టరీ వెంకటేష్ తదుపరి చిత్రంలో కూడా డబుల్ రోల్స్‌ను పోషించనున్నట్లు చలన చిత్ర వర్గాల సమాచారం. అయితే ఈ విషయమై వెంకటేష్ గానీ, ఇతర సంబందీకులుగానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. "లక్ష్మీ", "ఆడవారి మాటలకు అర్థాలే" వేరులే వంటి సెంటిమెంట్ చిత్రాల్లో నటించిన మాస్, యాక్షన్ కలగలిసిన "తులసి"లో ఇటీవల నటించాడు.అయితే ప్రస్తుతం వెంకటేశ్ డబుల్ రోల్ చిత్ర కథకు ఓకే చెప్పినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.ఈ చిత్రానికి సంబధించిన కథ, కథనాలు ఇప్పటికే పూర్తయ్యాయని,త్వరలోనే రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలు ద్విపాత్రాభినయంతో వచ్చే సినిమాలు చాలా తక్కువైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో వెంకటేశ్ నటించనున్న ద్విపాత్రాభినయ చిత్రానికి సహజంగానే క్రేజ్ ఏర్పడటం సహజం. దానికి తోడు గతంలో వెంకటేశ్ నటించిన ద్విపాత్రాభినయ చిత్రాలలో ఎక్కువశాతం మంచి విజయాన్ని సాధించాయి కూడా. సో విక్టరీ అభిమానులు తమ హీరోను త్వరలోనే ద్విపాత్రాభినయంలో చూసుకుంటారన్న మాట.
నిరంతర వార్తా స్రవంతి
Monday, February 25, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment