నిరంతర వార్తా స్రవంతి

Monday, April 7, 2008

వర్ధిల్లుతున్న ఉర్దూ భాష!

ఉర్దూ (Urduఉచ్ఛారణ ) ఒక ఇండో-ఆర్యన్ భాష, భారత దేశం లో జన్మించిన భాష. ఈ భాష కు మాతృక లేదు. బహుభాషా సమ్మేళితం. ఖరీబోలి, లష్కరి, రీఖ్తి, హిందూస్తానీ దీనికి ఇతర నామాలు. అరబ్బీ (అరబిక్), బృజ్ భాష (హిందీ), పారశీకం (పర్షియన్), ఆంగ్లం మొదలగు భాషల సమ్మేళనం. ప్రపంచంలో దాదాపు 35 కోట్ల మంది మాట్లాడే భాష. భారతదేశపు 23 అధికారిక భాషల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్ లో 2వ అధికారిక భాష. ప్రపంచంలో మాండరిన్, ఇంగ్లీషుల తరువాత అత్యధికులు మాట్లాడేభాష ఉర్దూ.

చరిత్ర

13వ శతాబ్దం దక్షిణాసియా లోని ముస్లింల పరిపాలనా రాజుల సభలలో సభా భాష గా ఇండో-ఆర్యన్ (హిందూ-ఆర్యన్) ల మాండలికంగా ప్రారంభమయినది. ఢిల్లీ సుల్తానుల, మొఘల్ సామ్రాజ్యపు అధికార భాషగా విరాజిల్లినది. నాగరిక, సాహిత్య మరియు పద్యరూపాలకు పరిపూర్ణభాషగా పర్షియన్ ఉపయోగంలో వుండేది. మతపరమయిన మరియు ధార్మికపరమయిన భాషగా అరబ్బీ వుండేది. ఢిల్లీసుల్తానుల కాలంలో దాదాపు అందరు సుల్తానులు మరియు అత్యున్నత పదాధికారులందరూ మధ్యాసియా కు చెందిన పర్షియన్-తురుష్కులే. వీరి మాతృభాష చొఘ్తాయి లేదా టర్కిక్ భాష. మొఘలులుకూడా మధ్యాసియాకు చెందిన పర్షియన్ లే. వీరి ప్రథమభాష టర్కీ, తరువాత వీరు పర్షియన్ (పారసీ, ఫారసీ భాష) భాషను తమభాషగా ఉపయోగించసాగారు. మొఘలులకు పూర్వం, పర్షియన్ భాష అధికార భాషగాను సభ్యతా, సాహితీభాషగా పరిగణించబడినది. బాబరు మాతృభాష టర్కీ, టర్కీభాషలోనే బాబరు తన రచనలు చేశాడు. ఇతని కుమారుడు హుమాయూన్ కూడా టర్కీభాషనే అవలంబించాడు. మొఘల్ కాలపు హిందూ-పర్షియన్ చరిత్రకారుడు మొఘల్ పరిపాలనా, అక్బర్ పరిపాలనా కాలంలో పర్షియన్ భాష తన సభ్యతా విశాలధృక్పదాలు మరియు సరళతాకారణాలవల్ల ప్రధాన భాషగా ఆమోదం పొందిన భాష గా వర్ణిస్తాడు. టర్కీ, పర్షియన్, బ్రజ్ భాష, హిందవి, హర్యానవి, హిందీ భాషల సమ్మేళనభాషగా ఉర్దూ జన్మించింది. ఈ భాష దక్షిణాసియాలో ప్రధానంగాను, ప్రపంచమంతటా పాక్షికంగాను వాడుకలోయున్నది. ఢిల్లీ, హైదరాబాదు, కరాచి, లక్నో మరియు లాహోర్ లలో తనముద్రను ప్రగాఢంగా వేయగల్గింది.

ఉర్దూ అనే పేరు ఎలా వచ్చింది

The phrase జబాన్-ఎ-ఉర్దూ-ఎ-ముఅల్లా ("లష్కరీ భాష") నస్తలీఖ్ లిపిలో వ్రాయబడినది

The phrase జబాన్-ఎ-ఉర్దూ-ఎ-ముఅల్లా ("లష్కరీ భాష") నస్తలీఖ్ లిపిలో వ్రాయబడినది

రీఖ్తి, లష్కరి (సైనిక), భాషగా పేరు పడ్డ ఉర్దూ, షాజహాను కాలంలో ఉర్దూ అనేపేరును పొందింది. ఉర్దూ అనే పదానికి మూలం టర్కిష్ పదము ఉర్ద్ లేదా ఓర్ద్, అనగా సైన్యము, సైన్యపు డేరా, లేదా బజారు. దీనిని లష్కరీ జబాన్ లేదా 'సైనికులభాష' గా పేరొచ్చింది. ఎర్రకోట నిర్మాణసమయంలో దీనిపేరు ఉర్దూ గా స్థిరమయినది. సైనికులమధ్య వ్యావహారిక భాషగా మార్పుచెందుతూ, బజారులలో, వ్యాపారలావాదేవీల వ్యవహారాలలో, సభలలో తుదకు ఆస్థానాల ప్రధాన అధికారిక భాషగా స్థానం పొందింది. నవాబులు ఉర్దూను పోషించారు. రానురాను సాహితీభాషగా పద్యభాగానికి అనువైన భాషగా మార్పుచెందింది. ఉత్తరభారతదేశంలో ప్రధానభాషగా మారింది. రానురాను పర్షియన్ భాష స్థానాన్ని ఆక్రమించింది. పశ్చిమోత్తరభారతదేశంలో ప్రధానభాషగా వుండినది. 1947లో భారతదేశం విడగొట్టబడి పాకిస్తాన్ ఏర్పడినప్పుడు, పాకిస్తాన్ అధికారభాషగా ఆమోదింపబడింది. స్వతంత్రభారతదేశంలో అధికారభాష ప్రకటనా సమయంలో హిందీ భాషకు సమానంగా ఉర్దూకూ ఓట్లొచ్చాయి, పార్లమెంటులో హిందీ భాష ఆమోదం పొందింది. హిందీ-ఉర్దూ చెట్టాపట్టాలేసుకొని హిందవి లేదా హిందూస్తానీ భాషగానూ ప్రజామోదం పొందింది.

ఉర్దూ లిపి

ఉర్దూ లిపి నస్తలీఖ్, అరబ్బీ మరియు పర్షియన్ భాషల సాంప్రదాయం. కుడివైపు నుండి ఎడమవైపుకు వ్రాస్తారు. అరబ్బీ భాష లోని శబ్దాలను(అరబ్బీ భాషలో ప,ట,చ,డ మరియు గ శబ్దాలు లేవు) పర్షియన్ భాషనుండి ప,ట,చ,డ మరియు గ శబ్దాలను సంగ్రహించి ఉర్దూ భాషా శబ్దాలను ఏర్పరచారు.

మాండలికాలు

ఉర్దూ అక్షరమాల. (నస్తలీఖ్ అక్షరాలలో)

ఉర్దూ అక్షరమాల. (నస్తలీఖ్ అక్షరాలలో)

ఉర్దూ భాషకు నాలుగు మాండలికాలు గలవు. అవి

  • దక్కని దక్షిణభారతదేశంలోని మహారాష్ట్ర, హైదరాబాదు చుట్టుప్రక్కల ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలలోను, కర్నాటక, తమిళనాడు లోను,
  • పింజారి అనేక తెగలలోను,
  • రీఖ్తా ఉర్దూ పాత ఒరవడిగాను, మరియు
  • ఖరీబోలి ఢిల్లీ ప్రాంతం లోను మాట్లాడబడుచున్నవి.

దక్కని కు ఇతర పేర్లు దఖ్ఖని, దేశియా మరియు మిర్గాన్.

ఉర్దూ సాహిత్యం

ఉర్దూ మూడు శతాబ్దాలుగా సాహితీభాషగా విరాజిల్లుచున్నది. దీనికి మునుపు పర్షియన్ మరియు అరబ్బీ భాషాసాహిత్యాలు ప్రముఖంగా ఉపయోగపడేవి. ఉర్దూభాషా సాహిత్యం ప్రపంచ సాహిత్యంలో తనదంటూ ఒక స్థానం సంపాదించుకోగలిగినది.

గద్యం

ధార్మికసాహిత్యం

ఇస్లామీయ మరియు షరియా సాహిత్యంలో అరబ్బీ మరియు పర్షియన్ ల తరువాత ఉర్దూ ప్రముఖం. ఖురాన్ తర్జుమాలు, హదీసులు, ఫిఖహ్, ఇస్లామీయ చరిత్ర, మారిఫత్ (ఆధ్యాత్మికము), సూఫీ తత్వము, మరియు ధార్మికశాస్త్రాల సాహిత్యం చూడవచ్చు. ఖససుల్ అంబియా, తఫ్ హీముల్ ఖురాన్, తర్జుమానుల్ ఖురాన్, తఫ్సీరుల్ ఖురాన్, ఫజాయల్-ఎ-ఆమాల్, బెహిష్తీ జేవర్ మరియు బహారె షరీయత్ లు ప్రముఖం.

సాహితీ

గద్య సాహిత్యంలో ఇవి ముఖ్యం. దాస్తాన్, అఫ్సానా, నావల్ (నవల), సఫర్ నామా, మజ్ మూన్, సర్ గుజిష్త్, ఇన్ షాయియ, మురాసల, ఖుద్ నవిష్త్.

పద్యం

పద్యం లేదా కవితాసాహిత్యానికి చాలా అనువైనభాషగా ఉర్దూకు పేరుగలదు.

గజల్ ఉర్దూకవితా శిరస్సుపై వజ్రకిరీటం. ఉర్దూ ద్వారా గజల్ కు పేరురాలేదు గాని, గజల్ ద్వారా ఉర్దూకు ఖ్యాతి వచ్చింది అంటే అతిశయోక్తిగాదు.

పద్యసాహిత్యంలో కవితలకు ఈవిధంగా వర్గీకరించవచ్చు. నజమ్, గజల్, మస్ నవి, మర్సియా, దోహా, ఖసీదా, హమ్ద్, నాత్, ఖతా, రుబాయి, షెహ్ర్-ఎ-ఆషూబ్.

కవి తనకవితలలో తన కలంపేరు 'తఖల్లుస్' ఉపయోగిస్తాడు.

అరూజ్ లేదా ఛందస్సు

అరూజ్ అనగా కవితా రచనలో తీసుకోవలసిన సాంప్రదాయక విలువలు. కవితలు ఒక క్రమంగా తఖ్తీ ను గలిగి వుంటాయి. ఒక బహర్ (మీటర్) లో ఇమడబడి వుంటుంది. తఖ్తీ మూలాన్ని బహర్ అని, బహర్ లో వుండే శబ్దాలను అర్కాన్ లని అంటారు. అరూజ్ లో ముఖ్యమైన పదాలు అరూజ్, తఖ్తీ, బహర్, జమీన్, అర్కాన్.

షారిఖ్ జమాల్ నాగ్ పూరి అరూజ్ విద్వాంసుడు. ఇతని శిష్యగణం భారతదేశమంతటా, ముఖ్యంగా దక్షిణభారతదేశమంతటా గలరు.

వ్యావహారికము

ఉదాహరణలు

తెలుగు వాడుక ఉర్దూ లిపిలో తెలుగు లిప్యాంతరీకరణ యధానువాదం (గమనిక)
నమస్కారము السلام علیکم అస్సలామ్ ఒ అలైకుమ్ "మీకు శాంతి కలుగును గాక." ( అరబ్బీ నుండి.)
(ప్రతి) నమస్కారము و علیکم السلام వ అలైకుమ్ అస్సలామ్ "మీకునూ శాంతి కలుగును గాక." (అరబ్బీ నుండి)
నమస్తే (آداب (عرض ہے ఆదాబ్ (అర్జ్ హై) "గౌరవాన్ని ప్రకటించడం" (సెక్యులర్ విధానము)
మంచిది. వెళ్ళి రండి خدا حافظ ఖుదా హాఫిజ్ "అల్లాహ్ మిమ్మల్ని కాపాడు గాక"
అవును ہاں హాఁ అవును (సాధారణ వ్యవహారం)
అవును جی జీ అండీ(గౌరవ సూచకం)
అవునండీ جی ہاں జీ హాఁ అవునండీ(మర్యాదపూర్వంగా)
లేదు نا నా (సాధారణ వ్యవహారం)
లేదండి نہیں، جی نہیں నహీఁ, జీ నహీఁ లేదు (సాధారణ వ్యవహారం);లేదండీ (మర్యాదపూర్వంగా)
దయచేసి, దయవుంచి مہربانی మెహర్బానీ (కర్‌కె) దయ (ఉండి)
ధన్యవాదాలు شکریہ షుక్రియా ధన్యవాదాలు
దయచేయండి, స్వాగతం تشریف لائیے తష్రీఫ్ లాయియే "గౌరవంగా స్వాగతించడం"
దయచేసి కూర్చోండి تشریف رکھیئے తష్రీఫ్ రఖియే "గౌరవంగా కూర్చోబెట్టడం"
మీతోకలసి చాలా సంతోషించాను اپ سے مل کر خوشی ہوئی ఆప్ సే మిల్ కర్ ఖుషీ హుఈ "మీతోకలవడం ఆనందదాయకం"
మీరు ఇంగ్లీషు మాట్లాడగలరా? کیا اپ انگریزی بولتے ہیں؟ క్యా ఆప్ అంగ్రేజీ బోల్ తే హైఁ? "మీకు ఇంగ్లీషు వచ్చా?"
నేను ఉర్దూ మాట్లాడలేను. میں اردو نہیں بولتا/بولتی మైఁ ఉర్దూ నహీఁ బోల్ తా/బోల్ తీ బోల్ తా (పుంలింగము), బోల్ తీ (స్త్రీలింగము)
నా పేరు ... میرا نام ۔۔۔ ہے మేరా నామ్ .... హై
లక్నో ఎక్కడుంది? لکھنئو کہاں ہے؟ లక్నో కహాఁ హై
ఉర్దూ మంచి భాష. اردو اچھی زبان ہے ఉర్దూ అచ్ఛీ జబాన్ హై

ఇవి కూడా చూడండి

  1. ఉర్దూ సాహిత్యము
  2. ఉర్దూ ప్రముఖులు
  3. ఉర్దూ కవులు
  4. ముషాయిరా (కవిసమ్మేళనం)
  5. ఉర్దూ రచయితలు
  6. ఉర్దూ షాయిరి
  7. ఉర్దూ సామెతలు
  8. ప్రముఖ ఉర్దూ పుస్తకాలు
  9. ఉర్దూ-తెలుగు నిఘంటువు

ఉర్దూ భాష మాట్లాడే దేశాలు

  • భారత దేశం * పాకిస్తాన్ * బంగ్లాదేశ్ * యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ * యునైటెడ్ కింగ్డమ్ * సౌదీ అరేబియా * నేపాల్ * యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా * ఒమన్ * కెనడా * బహ్రయిన్ * మారిషెస్ * కతర్ * జర్మనీ * నార్వే * ఫ్రాన్స్ * స్పెయిన్ * స్వీడెన్ * ఆఫ్ఘనిస్తాన్ * ఇరాన్

ఉర్దూ అధికారిక భాష గల రాష్ట్రాలు

ప్రథమ అధికారిక భాష

  • జమ్మూ కాశ్మీరు

రెండవ అధికారిక భాష

  • ఉత్తరప్రదేశ్
  • బీహార్
  • ఆంధ్ర ప్రదేశ్
  • కర్నాటక
  • జార్ఖండ్
  • ఢిల్లీ
  • ఉత్తరాఖండ్

ఆంధ్రప్రదేశ్ లో రెండవ అధికారిక భాషగా గల జిల్లాలు

1. హైదరాబాద్. 2. నిజామాబాద్. 3. ఆదిలాబాద్. 4. వరంగల్. 5. మహబూబ్ నగర్. 6. కర్నూలు. 7. అనంతపురం. 8. చిత్తూరు. 9. కడప. 10. నల్గొండ. 11. కరీంనగర్ 12. మెదక్ 13. ఖమ్మం 14. రంగారెడ్డి

ఆంధ్రప్రదేశ్ నుండి ప్రచురితమయ్యే ఉర్దూ వార్తా పత్రికలు

దినపత్రికలు

సియాసత్, మున్సిఫ్ , రహ్ నుమా-యె-దక్కన్, ఏతెమాద్ , రాష్ట్రీయ సహారా మరియు మిలాప్

ఆంధ్రప్రదేశ్ లో ఉర్దూ విశ్వవిద్యాలయాల

  • మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటి, హైదరాబాద్.

ఆంధ్రప్రదేశ్ లో ఉర్దూ భాషా విభాగాలు గల విశ్వవిద్యాలయాలు

  • ఉస్మానియా విశ్వవిద్యాలయము హైదరాబాద్
  • హైదరాబాదు విశ్వవిద్యాలయము హైదరాబాద్
  • డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము హైదరాబాద్
  • కాకతీయ విశ్వవిద్యాలయము వరంగల్
  • శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము అనంతపురం
  • శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము తిరుపతి.

ఉర్దూ భాషాభివృధ్ధి కొరకు పాటుపడుతున్న సంస్థలు

  • సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్
  • నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్
  • అంజుమన్ తరఖ్ఖి ఉర్దూ
  • ఉర్దూ అకాడమీ

భారతదేశం లో ఉర్దూ టి.వి. ఛానళ్ళు

  • దూరదర్శన్ ఉర్దూ
  • ఈ.టి.వి. ఉర్దూ (ETV Urdu)

రేడియో స్టేషన్లు

  • ఆల్ ఇండియా రేడియో ఉర్దూ సర్వీస్.
  • వివిధ భారతి ఉర్దూ సర్వీస్.
  • ఆకాశవాణి ఉర్దూ సర్వీస్.

No comments: