నిరంతర వార్తా స్రవంతి

Tuesday, April 8, 2008

తెదేపా తెలంగాణ కమిటీ భేటీ!

తెలంగాణపై ఏర్పడిన అధ్యయన కమిటీ మంగళవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో సమావేశమైంది. కమిటీ సభ్యుల్లో ఒకరైన యనమల రామకృష్ణుడు నెల్లూరు పర్యటనలో ఉండడంతో సమావేశానికి హాజరు కాలేదు. కమిటీ విధివిధానాలను ఖరారు చేయడానికి ఈ సమావేశం జరిగింది. కమిటీ నివేదిక సమర్పించడానికి గడువేదీ విధించలేదు. కమిటీ తెలంగాణలోని పార్టీ నాయకులను, కార్యకర్తలను సంప్రదించడమే కాకుండా తెలంగాణ పత్రికల్లో వస్తున్న విశ్లేషణలను కూడా అధ్యయనం చేస్తుంది.

తెలంగాణపై సాధ్యమైనంత తొందరగా కమిటీ అధ్యయనం చేసి ఉప ఎన్నికలు జరిగే లోగానే నివేదిక సమర్పిస్తుందని భావిస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగా పార్టీ వైఖరిని ఖరారు చేయాలని సమావేశంలో అనుకున్నారు. పార్టీ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. చిరంజీవి పార్టీ ప్రభావంపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఈ కమిటీలో టి. దేవేందర్ గౌడ్, నాగం జనార్దన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు, కె. ఎర్రంనాయుడు, కె.ఇ. కృష్ణమూర్తి ఉన్నారు.

No comments: