నిరంతర వార్తా స్రవంతి

Wednesday, February 27, 2008

కాంగ్రెస్తో కేసీఆర్ తాడోపేడో!

రాజకీయ చతురతకు మారు పేరైన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు లోక్ సభలోనే మరో వ్యూహాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. పార్లమెంట్ లో ప్రధాని ప్రసంగం ముగిసిన వెంటనే నిరసన వ్యక్తం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.లోక సభలో ఓక చర్చలో పాల్గొనబోవడం ఇదే ప్రధమం. ఇదే చివరిది. ఎందుకంటే రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు ప్రధాని స్పందించిన వెంటనే కెసీఅర్ నాయకత్వంలోని తెలంగాణ ఎంపీలంతా నిరసన వ్యక్తం చేస్తూ సభలోనే స్పీకర్ సోమనాథ్ చటర్జీకి రాజీనామాలు సమర్పించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

అయ్యన్నపాత్రుడు వ్యవహారంపై అట్టుడికిన అసెంబ్లీ

తమ పార్టీ శాసనసభ్యుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు రాజీనామాపై తక్షణ చర్చకు బుధవారం శాసనసభలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. అయ్యన్నపాత్రుడిపై దాడి, ఆయన రాజీనామాపై చర్చించాలని తెలుగుదేశం సభ్యులు ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకుంటూ పట్టుబట్టారు. అయ్యన్నపాత్రుడి రాజీనామాను తాను ఆమోదించలేదని, అయ్యన్నపాత్రుడితో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటానని స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి చెప్పారు. అయినా తెలుగుదేశం సభ్యులు వినలేదు. దీంతో సభను స్పీకర్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా తెలుగుదేశం సభ్యులు తమ పట్టును వీడలేదు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా అందుకు అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పడంతో వారు తమ పట్టు వీడారు.తమ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావుపై శుక్రవారం వరకు విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని తెలుగుదేశం సభ్యులు కోరారు. తెలుగుదేశం పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే సస్పెన్షన్ ను ఎత్తివేయడానికి సిద్ధమేనని శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య చెప్పారు. పశ్చాత్తాపం వ్యక్తం చేసే ప్రసక్తే లేదని, నిరసన వ్యక్తం చేయడం తమ హక్కు అని తెలుగుదేశం శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. బిసి సంక్షేమంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలుగుదేశం సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రఘోత్తమరావు

ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి రఘోత్తమరావు నియమితులు కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన భూపరిపాలన శాఖ కమీషనర్ గా ఉన్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి హరినారాయణ ఈ నెల 29వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో రఘోత్తమరావు నియమితులు కానున్నారు. రఘోత్తమ రావు పదవీ కాలం రెండు నెలల కాలం మాత్రమే ఉంది. ఈ రెండు నెలల కాలం ఆయనను కొనసాగించి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమకు అనుకూలంగా ఉండే ఉన్నతాధికారిని ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇదే సమయంలో ఐఎఎస్ అధికారుల బదిలీకి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా 8 జిల్లాల కలెక్టర్లను మారుస్తున్నట్లు సమాచారం. ఇద్దరిని వేరే జిల్లాలకు బదిలీ చేస్తుండగా మరో ఆరు జిల్లాలకు కొత్తవారిని కలెక్టర్లుగా నియమించనున్నట్లు సమాచారం. శ్రీకాకుళం, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, మెదక్, వరంగల్, కరీంనగర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లను మార్చనున్నట్లు సమాచారం. దేవాదాయ, మున్సిపల్, సాధారణ పరిపాలనా శాఖల ఉన్నతాధికారులను బదిలీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి.

పట్టువీడని సీనియర్లు... సోనియాతోనే తేల్చుకుంటామని ప్రకటన!

తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో పని లేదని, తాము ఈ విషయాన్ని సోనియా గాంధీతోనే తేల్చుకుంటామని కాంగ్రెస్ తెలంగాణ సీనియర్లు అన్నారు. ఒంగోలులో కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణరావు మీడియా ప్రతినిధులతో అన్నారు. అయితే వీరప్ప మొయిలీ పిలిస్తే వెళ్తానని మరో సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. తెలంగాణపై చర్చించడానికి వీరప్ప మొయిలీ నుంచి తమకు ఎలాంటి పిలుపూ రాలేదని మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. తాము వీరప్పమొయిలీని కలిసే అవకాశం కూడా లేదని ఆయన చెప్పారు. సోనియాతోనే తేల్చుకుంటామని ఆయన చెప్పారు.ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ నాయకుడు ఎం. కోదండరెడ్డి అన్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రకటించిన చట్టబద్ద కమీషన్ ను తెలంగాణ నాయకులందరూ ఆహ్వానిస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని తిప్పికొట్టడానికి మార్చి 1వ తేదీ నుంచి సభలు పెడతామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. తన ఉనికిని కాపాడుకోవడానికే తెరాస రాజీనామాలు, సభలు వంటి కార్యక్రమాలు పెడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తెరాస ఆత్మస్థయిర్యాన్ని కోల్పోయిందని విమర్శించారు.

విజయశాంతిపై రోజా మండిపాటు!

హైదరాబాదులోని వికలాంగుల దీక్షా శిబిరంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై వాగ్యుద్ధానికి దిగిన తల్లి తెలంగాణ వ్యవస్థాపకురాలు, సినీ నటి విజయశాంతిపై తెలుగు మహిళ అధ్యక్షురాలు, సినీ నటి రోజా రుసరుసలాడారు. ప్రజల కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయని విజయశాంతి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ప్రజాసేవ చేసిన చంద్రబాబును విమర్శించడం ఏమిటని ఆమె బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబును విజయశాంతి విమర్శించడం హాస్యాస్పదమని ఆమె అన్నారు. విజయశాంతి వంటివారి గురించి మాట్లాడటం కూడా సమయం వృధా అని ఆమె వ్యాఖ్యానించారు.అయేషా హత్య కేసులో పోలీసు గురించి హోంమంత్రి కె. జానారెడ్డి చేసిన ప్రకటనను ఆమె తప్పు పట్టారు. జానారెడ్డి ప్రకటన పోలీసులను అవమానించేదిగా ఉందని ఆమె విమర్శించారు. అయేషా హత్య కేసులో మంత్రి కోనేరు రంగారావు బంధువుల పాత్ర ఉంది కాబట్టే కేసును తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె అన్నారు. పోలీసులకు స్వేచ్ఛ ఇస్తే అసలు నిందితులను పట్టుకుంటారని ఆమె అభిప్రాయపడ్డారు.

ఏ పరీక్షకైనా సిద్ధమే : మంత్రి కోనేరు

విజయవాడలో విద్యార్థిని అయేషా హత్య కేసులో తన మనవడి పాత్రపై ఏ పరీక్షకైనా తాము సిద్ధమేనని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కోనేరు రంగారావు చెప్పారు. ఇప్పటికే తన మనవడికి అన్ని పరీక్షలు నిర్వహించారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అయేషా హత్య కేసులో కోనేరు రంగారావు మనవడి పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.అయేషా హత్య కేసులో తన కుటుంబ సభ్యులు పోలీసులకు అన్ని విధాలా సహకరించారని, విచారణకు కూడా హాజరయ్యారని ఆయన చెప్పారు. అయేషా హత్య కేసులో నిజాన్ని నిగ్గు దేల్చాలని ఆయన పోలీసులకు సూచించారు. అయేషా హత్య కేసులో కోనేరు రంగారావు కూతురు, మనవడు జాతీయ మానవ హక్కుల కమీషన్ ముందు కూడా హాజరయ్యారు.

బెడిసికొట్టిన వైఎస్ వ్యూహం!

అంబేద్కర్ మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ద్వారా అపఖ్యాతి పాలైన కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను గుడ్డిగా వెనకేసుకు రావడం ద్వారా ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరో మారు అప్రదిష్ట పాలయ్యారు. గతంలో ఆయన తన వ్యక్తిగత సహాయకుడు సూరీడును గుడ్డిగా వెనకేసుకు వచ్చిన విషయం తెలిసిందే.రాజశేఖరరెడ్డి వ్యవహారశైలి మొదటి నుంచీ ఇదే విధంగా ఉంది. ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తన మంత్రులను, ఎమ్మెల్యేలను కూడా ఇదే విదంగా వెనకేసుకు వచ్చారు. తన మనుషుల మీద ఏ ఆరోపణలు వచ్చినా రెండు ప్రధాన దినపత్రికలను నిందించడం ఆయనకు అలవాటై పోయింది. 600 కోట్ల పెట్టుబడితో ఆయన వచ్చే నెలలో ప్రారంభించనున్న "సాక్షి" దినపత్రిక ద్వారా ఈ రెండు శత్రు సమాన దినపత్రికలను దుంప నాశనం చేయాలన్నది వైఎస్ ఆలోచనగా కన్పిస్తోంది.కార్పొరేట్ స్టైల్, అనుభవం ఉన్న సిబ్బంది "సాక్షి" ప్లస్ పాయింట్స్ కాగా, కాంగ్రెస్ దినపత్రిక కావడం మైనస్ పాయింట్. సమైక్యాంధ్ర పాలసీగా పెట్టుకున్న ఈ పత్రికకు తెలంగాణలో ఆదరణ సందేహాస్పదమే. చిరంజీవికి వ్యతిరేకంగా స్పెషల్ స్టోరీలను ప్లాన్ చేసుకుంటున్న ఈ పత్రికను లక్షలాది చిరంజీవి అభిమానులు ఆదరించే అవకాశాలు కన్పించడం లేదు.మరో వైపు ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త దినపత్రికలు "సాక్షి" నుంచి పోటీని తట్టుకోడానికి వివిధ రకాల వ్యాపార వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించాయి. "ఈనాడు" కంటే అధిక సర్క్యులేషన్ తో "సాక్షి" ని ప్రారంభించడానికి రంగం సిద్ధమైనా, కోట్లాది రూపాయల ఖర్చుతో చేస్తున్న యాడ్ క్యాంపెయిన్ పెద్ద ప్రభావం చూపడం లేదు.

"ఏ ఎండకాగొడుగు"

"ఏ ఎండకాగొడుగు" అంటే బి.వి.రామారావు పేరు ముందువరసలో ఉంటుంది. చిన్న పరిశ్రమల సమాఖ్య అధ్యక్షునిగా తోటి సభ్యులకు సాధించి పెట్టింది ఏమిటో తెలియదు కానీ ఈయన గారు మాత్రం "స్వర్ణాంధ్ర" పేరిట శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం పారిశ్రామికవాడ సమీపాన జ్యూట్ ఫ్యాక్టరీ పెట్టుకుని బాగుపడ్డాడు. నమ్ముకున్నవాళ్లను అమ్ముకున్నాడనో ఏమో కానీ భగవంతుడు రామారావుపై కన్నెర్రెజేశాడు. ప్రస్తుతం ఆ జ్యూట్ ఫ్యాక్టరీ పీకల్లోతు కష్టాలలో ఉన్నట్టు సమాచారం. చేసిన పాపం ఊరకే పోతుందా మరి! అదునుచూసి పార్టీలు మారడం రామారావుకి వెన్నతో పెట్టిన విద్యగా ఆయనగురించి తెలిసినవాళ్లు చెబుతుంటారు. మొదట్లో తెలుగుదేశాన్ని, తర్వాత కాంగ్రెస్నూ, మధ్యలో బి.జె.పి.నీ కూడా వదలకుండా ఈయనగారు రాజకీయం నడిపారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పుడు మళ్లీ ఫ్యాక్టరీలు, పారిశ్రామికవేత్తలూ గుర్తొచ్చాయి.

వీరోచిత పోరాటానికి నిలువెత్తు సాక్ష్యం ’ఉయ్యాలవాడ’

( డా. జోళె పాళం మంగమ్మ)

బ్రిటిష్, ఫ్రెంచ్ తూర్పిండియా వర్తక సంఘాలు అధికారం కోసం పోటీ పడితే వారిలో బ్రిటీష్ వారే నెగ్గారు. దత్త మండలంలో అప్పటికి స్వతంత్రులుగా ఉన్న పాలేగార్లు బ్రిటిష్ అధికారాంకి ఎదురు తిరిగారు. అప్పట్లో, అంటే 1802 నాటికి కడప కలెక్టరయిన థామస్ మన్రో పాలేగార్లతో అయిదేండ్లు పోరాడాడు. వారిలో 80 మందిని పట్టుకుని గుత్తికోటలో బంధించాడు. శిస్తు చెల్లిస్తున్న పాలేగార్లు తమ భూములను ప్రభుత్వపరం చేసినట్టు లెక్కగట్టి వారికి నామమాత్రంగా పింఛను నిర్ణయించాడు. పెద్ద పాలేగార్ల భూములు కొన్ని ఇతర గ్రామాల పరిధిలోనివని ప్రకటిస్తూ ప్రభుత్వం వాటిని వశపరచుకుంది. మేజర్ జనరల్ కంప్ బెల్ నాయకత్వంలొ ప్రతిఘటన లేకుండా బ్రిటిష్ సైనికులు ముఖ్యమయిన కోటలన్నీ ఆక్రమించారు. ముఖ్యంగా గండికోటలో రెండువేల మణువుల మదుగుండు సామగ్రి, 2000 గుండ్లు, పనిచేయని ఫిరంగి ఒకటి సైనికులకు దొరికాయి.
పాళేగారు మరణిస్తే కుటుంబానికి పించ్చను నిలిపివేస్తూ 1845లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారసులు లేరన్న మిషతో ఒక కోయిలకుంట్ల తాలూకాలోనే 60 పాళెములు ప్రభుత్వ పరమయ్యే పరిస్థితి ఏర్పడింది. దళౌసీ ఇదే రజ్య సంక్రమణ సిద్దంతంతో 1857లో సిపాయీల తిరుగుబాటుకు కారణమయ్యాడు.
కడప జిల్లాలో 13 సంవత్సరాల్లో 13 మంది కలెక్టర్లు బదిలీ కావడంతో స్థానిక సమస్యలు ప్రభుత్వానికి అంతు పట్టలేదు. 1845 జూన్ లో ప్రభుత్వం 23 మాన్యాలను వశపరచుకుంది. నిజంగా వారసులు లేనివి అందులో రెండు మాన్యాలు మాత్రమే. నొస్సం, గుండ్ల దుర్తి, కోయిలకుంట్ల ఆ చుట్టు పట్ల కట్టుబడిదార్లు, తిరుగుబాటుకు నాంది పలికారు. నరసిం హారెడ్డి గ్రామాల సంచారం ప్రారంభించాడు. కోయిలకుంట్ల తాలూకాలోని ఉయ్యాలవాడ, నొస్సంతో సహా 19 గ్రామాలు నరసిం హారెడ్డితో కలిశాయి. 1845 జులై 10వ తేదీ నరసిం హారెడ్డి కోయిలకుంట్ల తాలూకా కచేరికి రాగానే ప్రభుత్వ సిబ్బంది ఆయనతో కలిశారు.
ఉయ్యాలవాడ, నొస్సం పాలేగార్ల భూములు ప్రభుత్వ పరమయి, వారి కుటుంబాలకు కొద్దిపాటి పించ్చను లభించింది. ఉయ్యాలవాడ పాలేగారు ముగ్గురి కుమారుల్లో ఆఖరివాడు నరసిం హారెడ్డి. తల్లి వైపు నొస్సం పాలేగారు కుటుంబానికి 1821 వరకు పించ్చను లభించింది. నరసిం హారెడ్డికి ప్రభుత్వం నుండి వచ్చే పించ్చను చాలలేదు. కోయిలకుంట్ల తాలూకా ఆకుమళ్ళ గ్రామస్థుడు గోసాయి వెంకయ్య నరసిం హారెడ్డికి అతి సన్నిహితుడు. తన అసంతృప్తిని గోసాయికి వెళ్ళబోసుకున్నాడు రెడ్డి. తనకు, తన వారికీ అన్న్యాయం జరిగిందనీ, ముందు ముందు మంచి రోజులున్నాయనీ గోసాయి చెప్పడం రెడ్డిన్ మరింత బలపరచింది.
జయం తందేననే ధీమాతో ఉన్న నరసిం హారెడ్డిని తహసిల్దారు ట్రెజరీకి వచ్చి పించ్చను తీసుకోమని కబురంపటం తన హోదాకు భంగకరమనిపించింది రెడ్డికి. ప్రభుత్వ సేవకు హాజరయ్యేవారంతా, ఈటెగాళ్ళతో సహా నారాసిం హారెడ్డితో చేరారు. ఔకు జమీందార్లు, బనగానపల్లి నవాబు బంధువులు- ప్రభుత్వంతో అసంతృప్తి చెందినవారంతా నరసిం హారెడ్డిని బలపరిచారు. బ్రిటిష్ వారిని అధికారం నుంచి తొలగించాలనే భావం ప్రబలింది. బ్రిటిష వారితో పోరాడి విజయమో, వీర స్వర్గమో పొందాలని నరసిం హారెడ్డి నిర్ణయించాడు.
నరసిం హారెడ్డి వాదనతో ఏకీభవించిన వందలాదిమంది కట్టుబడిదార్లు అతనితో కలిశారు. పాలూరు, వనపర్తి, ఔక్, ఆనగొంది ఇంకా అనేక ఇతర పాలేగార్లు ఆయంతో చేతులు కలిపారు. గోల్కొండ నవాబు పనంపిన సనద్ మీద పారశీక భషలో రాజముద్ర ఉండేది. ఎల్లప్పుడూ దానిని వెంట ఉంచుకుని నైజాము రాజ్యంలోని కొందరు నవాబులతో కూడా నరసిం హారెడ్డి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు.
జులై 10వ తేదీన కోయిలకుంట్ల తాలూకా ఖజానాను రెడ్డి కొల్ల గొట్టాడు. ఖజానాను కాపాడేందుకు ప్రయత్నిస్తూ దఫేదారు, కొందరు ప్యూన్లు భవనం మీదనుంచి కాల్పులు జరిపారు. తమ మనుష్యులను కొందరిని పోగొట్టుకున్న నరసింహారెడ్డి ఒక గుండుతో డఫేదారుని కాల్చి చంపాడు. మరో అయిదుగురు పోలీసులు కూడా అక్కడికక్కడే మరణించారు. అక్కడి అమల్దారులు రెడ్డి ఎత్తుకుపోయాడు. ఇతర ప్రభుత్వ సేవకుల ఇండ్ల మీద నిఘా ఏర్పాటు చేశాడు. ఖజానాలో ఏమంత పెద్ద మొత్తం లేదు. శిస్తు వశుళ్ళన్నీ రూ. 650-14-2; ఇతర మార్గాల్లో ఆదాయం రూ. 136-9-4; ఖర్చు చూపినా చెల్లించని మొత్తం 18-2-10.
కడప జిల్లాలో 13 సంవత్సరాల్లో 13 మంది కలెక్టర్లు బదిలీ కావడంతో స్థానిక సమస్యలు ప్రభుత్వానికి అంతు పట్టలేదు. 1845 జూన్ లో ప్రభుత్వం 23 మాన్యాలను వశపరచుకుంది. నిజంగా వారసులు లేనివి అందులో రెండు మాన్యాలు మాత్రమే. నొస్సం, గుండ్ల దుర్తి, కోయిలకుంట్ల ఆ చుట్టు పట్ల కట్టుబడిదార్లు, తిరుగుబాటుకు నాంది పలికారు. నరసిం హారెడ్డి గ్రామాల సంచారం ప్రారంభించాడు. కోయిలకుంట్ల తాలూకాలోని ఉయ్యాలవాడ, నొస్సంతో సహా 19 గ్రామాలు నరసిం హారెడ్డితో కలిశాయి. 1845 జులై 10వ తేదీ నరసిం హారెడ్డి కోయిలకుంట్ల తాలూకా కచేరికి రాగానే ప్రభుత్వ సిబ్బంది ఆయనతో కలిశారు.
ఉయ్యాలవాడ, నొస్సం పాలేగార్ల భూములు ప్రభుత్వ పరమయి, వారి కుటుంబాలకు కొద్దిపాటి పించ్చను లభించింది. ఉయ్యాలవాడ పాలేగారు ముగ్గురి కుమారుల్లో ఆఖరివాడు నరసిం హారెడ్డి. తల్లి వైపు నొస్సం పాలేగారు కుటుంబానికి 1821 వరకు పించ్చను లభించింది. నరసిం హారెడ్డికి ప్రభుత్వం నుండి వచ్చే పించ్చను చాలలేదు. కోయిలకుంట్ల తాలూకా ఆకుమళ్ళ గ్రామస్థుడు గోసాయి వెంకయ్య నరసిం హారెడ్డికి అతి సన్నిహితుడు. తన అసంతృప్తిని గోసాయికి వెళ్ళబోసుకున్నాడు రెడ్డి. తనకు, తన వారికీ అన్న్యాయం జరిగిందనీ, ముందు ముందు మంచి రోజులున్నాయనీ గోసాయి చెప్పడం రెడ్డిన్ మరింత బలపరచింది.
జయం తందేననే ధీమాతో ఉన్న నరసిం హారెడ్డిని తహసిల్దారు ట్రెజరీకి వచ్చి పించ్చను తీసుకోమని కబురంపటం తన హోదాకు భంగకరమనిపించింది రెడ్డికి. ప్రభుత్వ సేవకు హాజరయ్యేవారంతా, ఈటెగాళ్ళతో సహా నారాసింహారెడ్డితో చేరారు. ఔకు జమీందార్లు, బనగానపల్లి నవాబు బంధువులు- ప్రభుత్వంతో అసంతృప్తి చెందినవారంతా నరసిం హారెడ్డిని బలపరిచారు. బ్రిటిష్ వారిని అధికారం నుంచి తొలగించాలనే భావం ప్రబలింది. బ్రిటిష వారితో పోరాడి విజయమో, వీర స్వర్గమో పొందాలని నరసిం హారెడ్డి నిర్ణయించాడు.
నరసిం హారెడ్డి వాదనతో ఏకీభవించిన వందలాదిమంది కట్టుబడిదార్లు అతనితో కలిశారు. పాలూరు, వనపర్తి, ఔక్, ఆనగొంది ఇంకా అనేక ఇతర పాలేగార్లు ఆయంతో చేతులు కలిపారు. గోల్కొండ నవాబు పనంపిన సనద్ మీద పారశీక భషలో రాజముద్ర ఉండేది. ఎల్లప్పుడూ దానిని వెంట ఉంచుకుని నైజాము రాజ్యంలోని కొందరు నవాబులతో కూడా నరసిం హారెడ్డి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు.
జులై 10వ తేదీన కోయిలకుంట్ల తాలూకా ఖజానాను రెడ్డి కొల్ల గొట్టాడు. ఖజానాను కాపాడేందుకు ప్రయత్నిస్తూ దఫేదారు, కొందరు ప్యూన్లు భవనం మీదనుంచి కాల్పులు జరిపారు. తమ మనుష్యులను కొందరిని పోగొట్టుకున్న నరసిం హారెడ్డి ఒక గుండుతో డఫేదారుని కాల్చి చంపాడు. మరో అయిదుగురు పోలీసులు కూడా అక్కడికక్కడే మరణించారు. అక్కడి అమల్దారులు రెడ్డి ఎత్తుకుపోయాడు. ఇతర ప్రభుత్వ సేవకుల ఇండ్ల మీద నిఘా ఏర్పాటు చేశాడు. ఖజానాలో ఏమంత పెద్ద మొత్తం లేదు. శిస్తు వశుళ్ళన్నీ రూ. 650-14-2; ఇతర మార్గాల్లో ఆదాయం రూ. 136-9-4; ఖర్చు చూపినా చెల్లించని మొత్తం 18-2-10.
నరసిం హారెడ్డి కార్యకలాపాలను అడ్డుకునేందుకు కడప, కర్నూలు, బళ్ళారి, సికిందరాబాదు నుండి సైనిక బృదాలు బయలు దేరాయి. కడప, కర్నూలు సరిహద్దు కొండల్లోని గుత్తి మీదుగా సప్లయిలు సమకూర్చుకుంటూ నరసిం హారెడ్డి గిద్దలూరుకు బయలుదేరాడు. అతని సైన్యంలో వడ్డరులు, యానాదులు అంతా మూడు వేలమంది ఉన్నారు. 19వ రెజిమెంట్లోని కెప్టెన్ స్కాట్ నాయకత్వంలో 250 మంది సైనికులు, 50 మంది సవారులు, కర్నూలు అసిస్టెంట్ కమిషనరు కెప్టెన్ రసల్తో బాటు నదికనుమ దాటారు. నరసిం హారెడ్డి ఈ కఒండలను నంది కనుమకు దక్షిణంగా అప్పటికే దాటాడు. కంభం నుండి వచ్చిన దళంతో బ్రిటీష్ దళం కలవవలసి ఉంది. సైనికులు గుత్తికనుమను కాపలా కాస్తున్నారు. దక్ష్నిణంగా మరో కనమకు కలెక్టరు కొక్రెయిన్, సైనికులు కాపలా కాస్తున్నారు. దాడి జరిపేందుకు నరసిం హారెడ్డి సన్నాహాలు చేస్తున్నాట్టు కర్నూలు అశ్వదళం సమాచారం అందించింది.
బ్రిటిష్ సైనయం సమీపిన్నట్టు తెలిసిన రెడ్డి బృనదం జమ్మలమడుగుకు ఇరవై మైళ్ళలో కర్ణులు సరిహద్దులోని రుద్రవం చేరుకున్నారు. సైన్యం సమీపించగానే కడపజిల్ల కంభం వైపు ఉన్న కొండల్లోకి వెళ్ళిపోయారు. ప్రభుత్వ దళంతో తలపడాలన్నదే రెడ్డి ఉద్దేశ్యం. కెప్టెన్ నాట్ తో వచ్చిన సైనయం కంభం నుండి వచ్చిన సైన్యంతో కలవాల్సి ఉన్నందున వారు నంది కనుమ దాటారు. తిరుగుబాటు దార్లను అడ్డుకొట్టి వారు తిరిగీ కనుమలు దాటకుండా చేయాలన్న ఉద్దేశ్యంతో కలెక్టర్ కొక్రెయిన్ నాయకత్వంతో అదే రెజిమెంట్లోని కెప్టెన్ కోత్స్ సైన్యంతో ఆయన వెంట ఉన్నాడు. దట్ట్మయిన అటవీ ప్రాంతమయినా నరసిం హారెడ్డిని చుట్టుముట్టి పట్టుకోవాలన్నదే ప్రభుత్వ వ్యూహం.
అప్పటికే నరసిం హారెడ్డి బలగం 5 వేలమంది ఉన్నారు. లెఫ్టినెంట్ వాట్సన్, తహసిల్దారుతో సహా వందమంది పూన్లతో గిద్దలూరు సమీపంలో ఉన్నాడు. నరసిం హారెడ్డి జులై 23 వ తేదీన వాట్సన్ మీద దాడి చేసాడు. వాట్సన్ కు ఎదురు చూస్తున్న సహాయం అందలేదు. నిస్సహాయుడుగా వాట్సన్ పాడుపడిన ఒక్ కోట చేరుకున్నాడు. ఆరుగంటల సేపు హోరాహోరీ పోరాటం జరిగింది. చీకటి పడగానే వాట్సqన్ రెడ్డి మీద మెరుపుదాడి చేశాడు. సాహసంగా ముందుకు దూకి, దాదాపు రెండువందల మందిని చంపి పాలేగారును వెనకకు తరిమాడు. నలుగురు సిపాయిలు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. అయిదు మైళ్ళలోని ముండ్లపాడుకు రెడ్డి ఉపసమ్హరించుకున్నాడు. వాట్సన్ కూడా ఆ చీకటిలోనే సమీపంలోని సెట్టి వీడుకు పారిపోయాడు. పోరాటంలో గిద్దలూరు తహసిల్దారే చనిపోయినందున పాడుపడిన కోటలోని తమ యుద్దసామగ్రిని కూడా వట్సన్ సేకరించుకోలేదు.
ఈ విషయం తెలిసిన కెప్టెన్ నాట్ గాజులపల్లిలో తన 19వ రెజిమెంట్తో రాత్రి గడిపి, కృష్ణం సెట్టి పల్లి మీదుగా గిద్దలూరుకు బయలుదేరాడు। లెఫ్టినెంట్ రసల్ నాయకత్వంలో కర్నూలు అశ్విక దళం కూడా కృష్ణం సెట్టి కోట చేరారు। గ్రామం నిర్మానుష్యంగా ఉంది। తిరుగుబాటు దారులు ఎవరయినా దాగి ఉన్నారేమోనని ఇళ్ళన్నీ గాలించారు। ప్రభుత్వ దళాలు నరసిం హారెడ్డిని చుట్టుముట్టినా రెడ్డి హైదరాబాదు ప్రాంతానికి తరలివెళ్ళి మరలా దళాన్ని సమకూర్చుకున్నాడు।కొండలు దిగి మైదానం మీద దాడి జరుపుతాడనే భీతితో సేనలను కొండల కిరువైపులా ప్రభుత్వం కాపలా పెట్టింది. రిజర్వు దళం కంభంవైపు గుత్తి కనుమ పాదంలో రెడ్డి ప్రధాన కార్యాలయమున్న కొత్తకోట చేరుకునే ప్రయత్నం చేసింది. నది పొంగటంతో ప్రవాహాన్ని దాటలేకపోయారు. నరసిం హారెడ్డి ఎర్రమలై కొండల్లోకి వెళ్ళిపోయాడు. ప్రభుత్వ సిబ్బందికి రెడ్డి సంచారం అంతు బట్ట్క, పట్టి ఇచ్చిన వారికి వెయ్యి రూపాయలు బహుమతి ప్రకటించారు. తన కట్టుబడి ప్యూన్లు వందమంది తిండికి రోజుకు ఎన్మిది రూపాయలు అలవెన్సు ఇచ్చినట్టయితే నరసిం హారెడ్డిని పట్టి ఇవ్వడానికి పాలేగారు ఎర్ర చెన్నమనాయుడు సిద్దంగా ఉన్నాడని బళ్ళారి మేజిస్ట్రేటు కడప మేజిస్ట్రేటుకు తెలియ చేశాడు. నరసిం హారెడ్డి భార్య , పిల్లలు కొత్తకోటలో ఉన్నారు. కొత్తకోట చేరిన నరసిం హారెడ్డిని ప్రభుత్వం కనిపెట్టలేక పోయింది.
కొత్తకోటలో నరసిం హారెడ్డి ప్రధాన కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ప్రభుత్వానికి కొన్ని ముఖ్యమయిన పత్రాలు దొరికాయి. హైదరాబాదు రజ్యంలో ప్రాతుకూరు జమీందారయిన లాల్ ఖానుకు పాలేగారు వ్రాసిన లేఖకు సమాధానంగా తాను సహాయం చేస్తానని జమీందారు మాట ఇచ్చాడు. ఈ లాల్ ఖానును బందించవలసిందిగా హైదరాబాదులోని బ్రిటిష్ రెసిడెంటుకు ప్రభుత్వం రాసింది. పాలేగారు తిరుగుబాటు జరిపినందుకు అభినందించే అనేక ఉత్తరాలున్నాయి. కోయిల కుంట్ల తాలూకావారు, గ్రామాల పెద్దలు కొందరు తాము బలగాన్ని పంపుతున్నట్టు వ్రాసిన అనేక ఉత్తరాలున్నాయి. రెడ్డి తన అనుచరులకు చెల్లించిన పైకము లెక్కలున్నాయి. అనుచర్ల పేర్లు కూడా ఆ జాబితాల్లో ఉనాయి. హైదరాబాదు రాజ్యం సరిహద్దుల్లో కృష్ణానది ఏ రేవులో దాటినా అటకాయించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.
లెఫ్టినెంట్ రసెల్ అశ్వదళంతో 36వ రెజిమెంట్తో సికిందరాబాదునుండి బయలుదేరాడు. దారిలో సప్లయిలు అందటం ఇబ్బందయింది. 5 వ రెజిమెంటు, 19వ రెజిమెంటు కోయిల కుంట్లలో ప్రధాన కార్యాలయం ఏర్పరచుకున్నారు.1846 అక్టోబరు 6వ తేదీకి నరసిం హారెడ్డి పేరుసోమల కొండ మీద ఉన్నట్టు ప్రభుత్వానికి తెలిసింది. నరసిం హారెడ్డి కొత్తకోట వదలి, ఎర్రమలై వదలి నల్లమలైకు బయలౌదేరాడు. ఆరుమైళ్ళు విస్తరించిన పేరుసోమల కొండమీద దేవాలయాన్ని స్థావరం చేసుకున్నాడు. పేరుసోమల గ్రామంలో కర్నూలు ఇర్ రెగ్యులర్ అశ్వదళం ఉంది. 19వ రెజిమెంట్ పేరుసోమల చేరింది. యాభైమంది సవారులు కొండ్ను చుట్టుముట్టారు. ఈ దాడిలో 40 మంది దాకా మరణించారు. 90 మంది పట్టుబడ్డారు. అనేకులు గాయపడ్డారు. కలిలో గుండు దూసుకుపోయిన నరసిం హారెడ్డి పట్టుబడ్డాడు. 16 సంవత్సరాల కుమారుడు మల్లారెడ్డి తండ్రి వెంట ఉన్నాడు. మల్లరెడ్డిని కలెక్టరు కొక్రెయినుకు అప్పగించాడు. రెడ్డి అనుయాయులంటూ గ్రామస్థులలో కొందరిని పట్టుకున్నారు.కొత్తకోటలో అభించిన కాయితాల్లో ఉన్న జబితాలోని వారందరికీ వారంట్లు జారీ అయ్యాయి. వారిలో ముఖ్యులు గోసాయి వెంకయ్య, కరణం అశ్వర్థం, దాసరి రోసిరెడ్డి, జంగం మల్లయ్య. పోరాటంలో 5 వందల మందిదాకా కట్టుబడులకు వంశపారంపర్యంగా వచ్చే ఆదాయం నిలుపు చేశారు. మొత్తం 901 మంది పట్టుబడితే 412 మందిని షరతులేవీ లేకుండా విడుదల చేశారు. 273 మందిని కొంత జామీను మీద వదిలారు. 232 మందిని విచారణకు హాజరు పరచారు. గోసాయి వెంకయ్యను కడప జిల్లా పోలీసుదళంలోని జాఫర్ మహమ్మద్ హైదరాబాదు రాజ్యంలోని ముక్త్యాల డివిజన్లో ఆత్కూర్ వద్ద పట్టుకున్నాడు.
నరసిం హారెడ్డి తిరుగుబాటు చేశాడనీ, హత్యలు చేశాడనీ, దోపిడీలు చేశాడనీ కడప స్పెషల్ కమిషనర్ 1834 రెగ్యులేషన్ 1 సెక్షన్ 2 క్రింద, 1802 రెగ్యులేషన్ 8 సెక్షన్ 10 క్రింద నేరం మోపారు. తీర్పుతోపాటు వారెంట్ పంపారు. జిల్లా అధికార్లు ఈ వారంటు అందిన తరువాత కోయిలకుంట్ల సమీపంలో ఎన్న్నిక చేసిన చోట వీలయినంత త్వరలో నరసిం హారెడ్డిని ఉరితీయాలని, పెద్ద మంచెకు శరీరాన్ని గొలుసులతో వేలాడతీయాలనీ ఆదేశించారు.
1847 ఫిబ్రవరి 22వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు నరసిం హరెడ్డిని ఉరితీస్తారని విస్తారంగా ప్రచారం చేశారు. భయంకరమయిన ఈ శిక్షను అంలు జరిపేటప్పుడు అక్కడ గుమికూదిన రెండువేలమంది ఎంతో నిశ్శబ్దంగా ఉన్నారు. నరసిం హారెడ్డి ధైర్యంగా, ప్రశాంతంగా ఉన్నాడు. కడపనుండి కోయిలకుంట్ల చేరేవరకూ కూడా నిగ్రహం చూపాడు. ఉరికంబం మీద ప్రశాంతంగా ఉన్నాడు. ఉరి తీసిన తర్వాత అదే వేదిక మీద శిరస్సు 1877 వరకు అంటే 30 సంవత్సరాలు వేలాడింది. వేదిక పడిపోతోందని, దాని మరమ్మతు చేపట్టాలా?వద్దా? అని అధికార్లు అడిగినప్పుడు, అలాగే సహజంగా వదలివేయండని ఆదేశాలు అందాయి. బ్రిటీష్ రాజ్యంలో 1947కు ముందు దేశ వ్యాప్తంగా ఇలాంటి ఎన్ని వేదికలు ఆ నూరేండ్ల కాలంలో నేలకూలాయో మనం చెప్పలేము.
1846 డిసెంబరు 8 వ తేదీ స్పెషల్ కమిషనర్ కోర్టులో కేసులను పరిశీలించాడు. ముండ్లపాడు వద్ద జులై 24వ తేదీ బాహాటంగా సాయుధ తిరుగుబాటు జరిపారని 35 మంది మీద నేరం మోపారు. తమను ఇండ్లనుండీ, పొలాలనుండి బలవంతాన లాక్కొచ్చారని చాలమంది చెప్పుకున్నారు. విచారణ మీద వారిలో 30 మందికి తిరుగుబాటుతో ఏమీ సంభందం లేదని తేలి, వింటనే విడుదల చేశారు. క్షమాభిక్ష పెట్టవచ్చని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లు అభిప్రాయపడ్డారు. శిక్షపడిన వారిలో 14 సంవత్సరాల శిక్షను 8 సంవత్సరాలకు, 8 సంవత్సరాలను 6కు, 7 సంవత్సరాలను 5 ఏండ్లకు, 5 సంవత్సరాలను 3 ఏండ్లకు తగ్గించారు. స్వాతంత్య సమరయోధుని భయంకరంగా ఉరితీసి, తాము ఎంతో కారుణ్యం గలవారమని ప్రజలకు చాటేందుకు ఈ విధంగా శిక్షలు తగ్గించారన్నది విదితమే. 1801లో దత్తమండలం బ్రిటిష్ వారి వశమయినప్పుడు ప్రారంభమయిన పాలేగార్ల పోరాటం మీద 1847లో నరసిం హారెడ్డిని ఉరితీయడంతో తెరపడింది. దక్షిణాది పాలేగార్ల తిరుగుబాటు ముగిసిన పదేండ్లకే 1857లో జయీయ స్వాతంత్య పోరాటానికి నాంది పలికింది.రాయలసీమ కొండ ప్రాంతాల్లో ఈ నాటికీ పాడుపడిన మట్టి కోటలు దర్శనమిస్తాయి. ఒకనాటి వీరుల గాథలను మనకు గుర్తుచేస్తాయి. వాటిని మరమ్మత్తు చేయరాదని కంపెనీ డైరెక్టర్లు ఉత్తర్వు జారీ చేశారు. పాలేగార్లది స్వాతంత్ర్య పోరాటమే కాదనీ, గ్రామాలు దోపిడీ చేసేవారనీ చరిత్రకారులు కొట్టి పారేశారు. ఇటీవల మాత్రమే చారిత్రక పరిశోధకులు ఈ అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. 1845లో వారసులు లేని భూములను ప్రభుత్వం వశపరచుకోవడమన్నదే మరో పదేండ్లకు రాజ్య సంక్రమణ సిద్దాంతం గా అమలులోకి వచ్చింది. ఝాన్సీ రాణీ,నానాఫడ్నవీస్, తాంతియాతోపే ఇంకా ఇతరులు 1857 తిరుగుబాటులో చేరడానికి ఇదే ప్రధాన కరణమని గుర్తించి ఈ అంశం మీద చరిత్రకారులు, పరిశోధకులు ఇంకా లోతుగా పరిశోదించాలి.
(ఆకాశవాణి కడప కేంద్రం వారి, సౌజన్యంతో, 1996)

Monday, February 25, 2008

అక్షరం అనంతశక్తికి ఆయుధం!

కొడవటిగంటి రోహిణీప్రసాద్
అక్షరం అంటే నశించనిది అని అర్థం. ఒకసారి ఏదైనా రాసి ఉంచితే అది శాశ్వతంగా నిలిచిపోతుందని ప్రాచీనులు భావించారు. రాతి మీద చెక్కినవైతే నిజంగా శిలాక్షరాలే. ఈ రోజుల్లో రాయడం, చదవడం అవసరమా, కాదా అనే ప్రశ్నే తలెత్తదు. ప్రస్తుతం మన జీవితాలు గడిచే పద్ధతిని బట్టి అక్షరాస్యత ఎంతో సహజమైనదిగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఒకప్పటి సమాజం ఇలా ఉండేది కాదు. తమ అవసరాలను బట్టి మనుషులు సృష్టించుకున్న “అసహజమైన” వ్యవస్థల్లో లిపికూడా ఒక అంశం. తొలినాటి లిపులు ప్రపంచంలో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఆవిర్భవించాయి.
రంగుదారాలూ, ముడుల భాష
ఆధునికయుగంలో నిరక్షరాస్యత వెనకబాటుతనానికి ముఖ్యలక్షణం. “చదువురాని మొద్దు” ఎందుకూ కొరగానట్టే. అయితే అక్షరాలూ, లిపులూ అన్నీ ఎప్పుడో ఒకప్పుడు ప్రాథమికస్థాయిలో మొదలైన కొత్త పద్ధతులే. వ్యవసాయం, తొలి గ్రామాల్లో స్థిర జీవితం వగైరాలన్నీ మొదలైన తరవాత జనాభా పెరగడంతో బాటుగా వారి అవసరాలు కూడా పెరగసాగాయి. పరస్పర సంభాషణకు పనికొచ్చిన భాషలు నోటిమాటలుగా మొదలై, చాలా శతాబ్దాల పాటు సామాన్య ప్రజలమధ్య మౌఖిక స్థాయిలోనే కొనసాగాయి. శబ్దాలనూ, అవి సూచిస్తున్న సమాచారాన్నీ ఏదో ఒక రూపంలో నమోదు చెయ్యవలసిన అవసరం కొంతకాలం తరవాతగాని తలెత్తలేదు. ఎందుకంటే మననం చేసుకున్న విషయాలను గుర్తుంచుకోవటానికి మంచి జ్ఞాపకశక్తి ఉండాలి. అది అందరికీ సాధ్యం కాదు. ఒకరు రాసిపెట్టిన సంగతులను ఇతరులు ఎంతకాలం తరవాతనైనా చదివి అర్థం చేసుకోవచ్చు. ఎన్నో తరాలుగా ఒకే చోట, ఒకే రకమైన జీవితాలు గడపసాగిన మానవజాతికి ఇలా లిఖితరూపంలో భద్రపరచిన సమాచారం విలువైనదిగా పరిణమించింది. ఈ సంగతులను సులభశైలిలో వివరిస్తూ సుమారు 50 ఎళ్ళ క్రితం తిరుమల రామచంద్రగారు “మన లిపి పుట్టుపూర్వోత్తరాలు” అనే అద్భుతమైన పుస్తకం రాశారు.
రంగు పూసల సందేశాలు
ఎటొచ్చీ సమాచారవ్యాప్తికి అక్షరాలే ఉపయోగించక్కర్లేదు. అక్షరాలనూ, లిపినీ ఉపయోగించకుండానే రంగుదారాలూ, పూసలూ, ఈకలూ మొదలైనవాటితో ఆదిమతెగలు దూరప్రాంతాలకు సందేశాలు పంపుకునేవారు. దూరానున్నవారికి వినిపించే విధంగా డప్పుల మోతలూ, కనిపించే విధంగా గాలిలోకి ఎత్తుగా లేచే పొగలూ మొదలైనవి కూడా ఉపయోగించేవారు. ఆ తరవాత రాళ్ళ మీదా, ఇతర వస్తువుల మీదా బొమ్మలు చెక్కడం మొదలయింది.
గుర్తుంచుకోవలసిన సమాచారాన్ని రాసిపెట్టుకోవలసిన అవసరం బహుశా వ్యవసాయం కారణంగానే తొలిసారిగా కలిగి ఉంటుంది. పంట వివరాలనో, నాట్లకూ, కోతలకూ తగిన సమయాలనో నమోదు చెయ్యడానికి ప్రాథమిక రూపంలో భవిష్యత్తులో పనికొచ్చే విధంగా సంకేతాలను ఏర్పాటు చేసుకుని ఉంటారు. ప్రపంచంలో అక్కడక్కడా రకరకాల లిపులు ఏర్పడ్డాయి. మెసపొటేమియా, ఈజిప్ట్‌, సింధునదీ ప్రాంతం, చైనా, మధ్య అమెరికా మొదలైన ప్రాంతాల్లో వేటికవిగా అక్షరసముదాయాలు పుట్టుకొచ్చాయి. అప్పట్లో రోజువారీ జీవితంలో కొంతమందికి అతి పరిమితంగానైనా రాయడం, చదవడం తప్పనిసరి అయి ఉండాలి.
మతసంబంధం కలిగిన తంతులకుకూడా లిపులు ఉపయోగపడి ఉంటాయి. సంఘంలో అతి కొద్దిమందికి మాత్రమే ఇటువంటివి రాయడం, చదవడం వచ్చిఉండేవి కనక చదువుకు ప్రతి సంస్కృతిలోనూ చాలా ప్రత్యేకత ఉండేది. అక్షరజ్ఞానానికి ప్రతీకలైన అధిష్ఠాన దేవతలుండేవారు. హిందువులకు సరస్వతీదేవిలాగానే ప్రాచీన మెసపొటేమియాలో మొదట ఎన్‌లిల్‌, తరవాత నబూ అనే దేవతలూ, ప్రాచీన ఈజిప్ట్‌లో ధ్వుతీ, అమెరికాలోని మాయా నాగరికతలో ఇట్జమ్నా మొదలైన దేవతలు ఆరాధించబడ్డారు. ప్రాచీన ఈజిప్ట్‌లో అక్షరాస్యత పూజారివర్గానికి పరిమితమై ఉండేది. భగవంతుడికీ, పాలకవర్గాలకూ సమీపంలో ఉండిన “వ్రాయసకాడు” సంఘంలో పరపతి కలిగి ఉండేవాడు. రాతపని చేసేవాడికి తక్కిన బరువు బాధ్యతలేవీ ఉండవనీ, అటువంటివారికి నిత్యమూ రాజుగారింటి భోజనం లభిస్తుందనీ, మంచి జీవితం, ఆరోగ్యం, సిరిసంపదలూ ఉంటాయనీ అభిప్రాయం ఉండేది. పూజలూ, తంతుల విశేషాలనూ, రాచవంశాల చరిత్రనేకాక కాలాన్ననుసరించి రుతువుల్లోనూ, వానలూ, వరదల్లోనూ కలిగే మార్పులనూ, వ్యవసాయానికి సంబంధించిన వివరాలనూ ఈ పూజారివర్గం నమోదుచేసి తమ “విద్యాధిత్యత”ను పామరుల ఎదుట చాటుకుంటూ ఉండేది. తక్కినవారెవరికీ సామాన్యంగా చదువుతో పనిపడేది కాదు. వారంతా ఈ పూజారులను అతీతశక్తులు కలవారని అనుకునేవారు.
రాత అనేది సామూహికవిజ్ఞానం। లిఖితరూపంలో పోగుచెయ్యడానికీ, గుర్తుంచుకోవలసిన విషయాలను ప్రజల్లో వ్యాప్తి చెయ్యడానికి పనికొచ్చిన సాధనం. ప్రపంచంలోని గొప్ప నాగరికతలెన్నో లిపులను జ్ఞాన వ్యాప్తికై సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగాయి. చరిత్ర వివరాలనూ, సామాజిక, చట్టసంబంధిత నిబంధనలనూ, వైజ్ఞానిక, సాంకేతిక విషయాలనూ, యుద్ధ తంత్రాలనూ, లిపిబద్ధం చేసి, తరవాతి తరాలకు అందించిన అక్షరాస్య సమాజాలు అంతులేని పురోగతిని సాధించాయి. దీనివల్ల లిపి ఆవిర్భావం అనేది నాగరికతకు ప్రతీకగా అనుకుంటాం కాని అది నిజం కాదు. దక్షిణ అమెరికాలోని ఆండీస్‌ పర్వత ప్రాంతాల్లో విలసిల్లిన గొప్ప నాగరికతల్లో అక్షరాస్యత మచ్చుకైనా ఉండేది కాదు. అలాగే ఎంతో ప్రగతినీ, ఔన్నత్యాన్నీ గతంతో పోలిస్తే ప్రపంచంలో వేలాదిగా ఉండిన మాండలిక భాషలన్నీ అతి త్వరగా అంతరించి పోతున్నాయని భాషావేత్తలు ఆవేదన చెందుతున్నారు. వీటితో బాటు అరుదైన సాంస్కృతిక సమాచారం కూడా మరుగునపడిపోతోంది.
సాధించిన రోమన్‌ సామ్రాజ్యం చివరకు హూణులవంటి బర్బరులవల్ల నాశనమైపోయింది. ఇలాంటివి కొన్ని తప్ప తక్కిన సందర్భాల్లో నాగరికులు అనాగరికుల్ని ఓడించి లొంగదీసుకోవటానికి తమ వద్దనున్న ఇతర సాధనాలతో బాటు విద్యాధిక్యతను కూడా ఉపయోగించుకున్నారు.రాసే ప్రక్రియ మొదలయాక శబ్దాలకూ, వాటిని సూచించే సంకేతాలకూ నిర్దిష్టమైన సంబంధం ఏర్పడటానికి రకరకాల పద్ధతులు ఉపయోగపడ్డాయి. అలాగే లేఖన సామగ్రి తయారుకావటానికి కొంత సాంకేతిక ప్రగతి అవసరమైంది. ఎన్నో శతాబ్దాలుగా నోటి మాటలకే పరిమితమై ఉండిన భాషలన్నిటికీ, లిపులూ, నిబంధనలూ, ఆ తరవాత వ్యాకరణనియమాలూ రూపొందాయి. ఒకరు రాసిపెట్టిన విషయాలను తక్కినవారు చదివి అర్థం చేసుకునేందుకు వీలుగా భాషలకు రూపురేఖలు ఏర్పడ్డాయి.
అంతమాత్రాన ప్రతి భాషకూ ఒక లిపి తయారయిందని కాదు. మన దేశంలో తుళు, కొంకణీ మొదలైన మాండలిక భాషల్లాగే ప్రపంచంలోని కొన్ని మాండలికాలకు లిపి ఉండదు. ఈ భాషలు ఒక్కొక్క ప్రాంతానికే పరిమితమైనప్పటికీ ఇవి మాట్లాడేవారి సంఖ్య అంత తక్కువేమీ కాదు. వాటిలో ఉత్తమ సాహిత్యంకూడా తయారవుతుంది కాని ఏవో చారిత్రక కారణాలవల్ల వాటికి లిపులు ఏర్పడలేదు. గతంతో పోలిస్తే ప్రపంచంలో వేలాదిగా ఉండిన మాండలిక భాషలన్నీ అతి త్వరగా అంతరించి పోతున్నాయని భాషావేత్తలు ఆవేదన చెందుతున్నారు. వీటితో బాటు అరుదైన సాంస్కృతిక సమాచారం కూడా మరుగునపడిపోతోంది.
ప్రాంతీయ భాషాభేదాలే కాక దేశభాషలుకూడా ప్రపంచీకరణ కారణంగా అంతరించిపోయే ప్రమాదం కనబడుతోంది. కంప్యూటర్ల వెల్లువలో ఎన్నో భాషలకు ప్రాచుర్యం తగ్గుతోంది. తెలుగువంటి భాషలను చదివేవారూ, రాసేవారూ క్రమంగా తగ్గిపోతున్నారు. ఎప్పటికప్పుడు సరఫరా అవుతున్న సమాచారాన్ని తమ మాతృభాషలో చదివి, నేర్చుకునే అవకాశాలు తగ్గుతున్నాయి. అందరికీ అర్థమయే సాంకేతిక పరిభాష తయారు కావటం లేదు. ఇవన్నీ భాషకూ, సంస్కృతికీ సంబంధించిన పరిమితులు.
అలాగే ఒక్కొక్క భాషలోని ఉచ్చారణ ననుసరించి అక్షరాలు రూపొందడం జరుగుతుంది. ఉదాహరణకు తమిళంలో క చ ట త పలు తప్ప భారతీయ భాషలన్నిటిలోనూ సామాన్యంగా ఉండే తక్కిన అక్షరాలు లేకపోవడంతో “కాంతి” అన్న పదానికీ, “గాంధి” అన్న పదానికీ రాతలో తేడా కనబడదు. అలాగే సంస్కృతం, హిందీ, మరాఠీ మొదలైన లిపుల్లో దక్షిణ భాషల్లో ఉన్నట్టుగా ఎ, ఒ అనే అక్షరాలూ, గుణింతాలూ ఉండవు. మరొకవంక కొన్ని ఇంగ్లీషు పదాలను తెలుగులో రాయాలంటే యాక్టర్‌, బ్యాంక్‌, థ్యాంక్స్‌ అని వికృతంగా రాయవలసివస్తుంది.
గతంతో పోలిస్తే నేటి సమాజం సమాచార సాధనాల మీదనే పూర్తిగా ఆధారపడుతోంది. నాగరికతలో భాగాలైన భాషలూ, లిపులూ అన్నీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకదానితో ఒకటి పోటీ పడే పరిస్థితి ఏర్పడుతోంది. తమ తమ భాషల, లిపి, సాహిత్యాల ఆవిర్భావాన్ని గుర్తించి, అర్థం చేసుకున్న జాతులు తమ గుర్తింపునూ, ఆత్మగౌరవాన్నీ మరింత బాగా కాపాడుకోగలవు.
ప్రాచీన సుమేరియన్ కీలలిపి
లిపిని సృష్టించడం సులువైన పని కాదు. నాగరికతలోని తక్కిన అంశాల్లాగే ఇది కూడా మెసపొటేమియాలో సుమేరియన్‌ నాగరికతలో మొదట తలెత్తినట్టుగా తెలియవస్తోంది. స్థిరజీవితం మొదలుపెట్టిన నాలుగైదు వేల ఏళ్ళ తరవాత మానవసమాజంలో క్రమంగా ఎన్నో మార్పులు కలిగాయి. మనోభావాలను ప్రకటించటానికీ, తంతులూ వగైరాలను నిర్వహించటానికీ బొమ్మలు గీయడం ఎప్పటినుంచో కొనసాగుతున్నప్పటికీ ఈనాడు మనం అభివర్ణించే సమాచారయుగం (ఇన్‌ఫర్మేషన్‌ ఏజ్‌) వంటిది మొదలవడానికి చాలాకాలం పట్టింది. మారుతున్న పరిస్థితుల్లో రాత అనేది తమకు పనికొస్తుందనీ, రాసే నిపుణులను పోషించే అవసరం ఉందనీ అప్పటివారికి అనిపించి ఉండాలి. ఇటువంటి పరిస్థితులు మన దేశంలోనూ, క్రీట్‌, ఇతియోపియా మొదలైన ప్రాంతాల్లోనూ కూడా ఏర్పడ్డాయి కాని లిపి అనేది ముందుగా సుమేరియన్‌ నాగరికతలోనూ, మెక్సికోలోనూ స్వతంత్ర రీతుల్లో తయారైందని పరిశోధకుల ఉద్దేశం.
నాగరికతలోని ఇతర విషయాలలాగే ఒకచోట తయారైన లిపి త్వరలోనే పొరుగు ప్రాంతాలకు వ్యాపించడంతో తక్కినవారికి ఎక్కడికక్కడ మళ్ళీ లిపులను సృష్టించుకోవలసిన అగత్యం లేకుండా పోయింది. వివిధ ప్రదేశాల్లో ఈ అనుకరణ మక్కీకి మక్కీ పద్ధతిలోనూ, ఇతరుల స్ఫూర్తితో తమకు అనువైన పద్ధతిలోనూ కూడా జరిగిన సందర్భాలున్నాయి. ఆధునిక యుగంలో టర్కీలోనూ, న్యూగినీ, అమెరికా వగైరాల ఆదిమ తెగల భాషలకు ఇంగ్లీష్‌ (రోమన్‌) లిపిని వాడడం జరిగింది. అలాగే రష్యాలోని కొన్ని తెగలు రష్యన్‌ (సిరిలిక్‌) లిపిని అనుసరించాయి. కొత్త లిపులని తయారుచేసుకోకుండా ప్రాచుర్యంలో ఉన్న అక్షరాలను వాడుకునే ఈ విధానం మక్కీకి మక్కీ పద్ధతి. ఇటువంటి అనుసరణలూ, అనుకరణలూ గతంలోనూ జరిగాయి. తొమ్మిదో శతాబ్దంలో గ్రీక్‌, హీబ్రూ లిపులను కొద్దిగా మార్చి రష్యన్‌ అక్షరాలను రూపొందించారు. అంతకు ముందు నాలుగో శతాబ్దంలో ఇంగ్లీష్‌తో సహా అనేక లిపులకు ఆధారమైన జర్మన్‌ అక్షరమాలను బిషప్‌ ఉల్ఫిలాస్‌ అనే వ్యక్తి ఎక్కువగా గ్రీక్‌ అక్షరాలనూ, కొన్ని రోమన్‌ అక్షరాలనూ కలిపి తయారు చేశాడు. క్రీ.పూ.1400 ప్రాంతాల క్రీట్‌లోని మినోవా నాగరికత తొలి గ్రీక్‌ అక్షరాలకు ఆధారం అయింది.
ప్రాచీన లిపులలో అప్పటివారు ఏం రాసేవారు? సుమేరియన్‌ వగైరా లిపుల్లో రాసినవన్నీ అసంపూర్తిగా, అస్తవ్యస్తంగా, చదవడానికి జటిలంగా ఉండేవి. మొదట్లో నమోదు చేసిన సమాచార మంతా టెలిగ్రాఫ్‌ భాషలాగా పేర్లకూ, అంకెలకూ, కొలతలకూ, లెక్కలకూ, కొన్ని విశేషణాలకూ మాత్రమే పరిమితమై ఉండేది. ఎంతో అవసరమనిపించిన విషయాలను మాత్రమే ఇలా కష్టపడి రాసేవారు. ఎందుకంటే నోటితో ఉచ్చరించే శబ్దాలన్నిటికీ ప్రతీకలైన అక్షరాలు తయారవడానికి ఎన్నో శతాబ్దాలు పట్టింది. ఒకవంక సమాజ జీవితంలో పరిణామాలు జరుగుతూ ఉంటే, మనుషుల మధ్య జరిగే వ్యవహారాలూ, వ్యాపారాలూ జటిలం అవుతూ వచ్చాయి. ఎందరో వ్యక్తులకు సంబంధించిన ఎన్నో విషయాలను లిఖితరూపంలో నమోదు చేస్తున్నప్పుడు అపోహలకూ, అపార్థాలకూ అవకాశాలు లేకుండా చూసుకోవలసివచ్చింది. ఈ రోజుల్లో అవసరాలనిబట్టి కొత్తరకాల కంప్యూటర్‌ భాషలు తయారవుతున్నట్టే ప్రాచీన యుగాల్లో నాగరికత పెరుగుతున్న కొద్దీ ఈ రకమైన ఒత్తిడివల్ల లిపులు మెరుగుపడక తప్పలేదు. మొదట్లో మత, న్యాయ, చట్టపరమైన వ్యవహారాలకు మాత్రమే పనికొచ్చిన అక్షరజ్ఞానమంతా దేవాలయాల్లోనూ, రాజప్రాసాదాల్లోనూ పనిచేసే చాలా కొద్దిమందికి మాత్రమే ఉండేది. క్రీ.పూ.3000 ప్రాంతంలో మొదలైన సుమేరియన్‌ లిపిని చదివితే అదంతా రాచ, దేవాలయ వ్యవస్థలకు సంబంధించిన అధికారుల రచనలుగా దర్శనమిస్తాయి. ప్రాచీన ఈజిప్ట్‌, క్రీట్‌, గ్రీస్‌, చైనా, ఉత్తర అమెరికా నాగరికతలన్నిటిలోనూ ఇదే కనిపిస్తుంది.
మధ్య అమెరికా ప్రాచీన లిపి
తొలి లిఖిత సాహిత్యానికి ప్రజాస్వామిక లక్షణాలేవీ ఉండేవి కావు. వృత్తిపరంగా రాయ, చదవ నేర్చినవారు ఒక్కొక్క చోటా 30, 40కి మించి ఉండేవారు కారు. సమాజంలో శ్రమవిభజన మొదలవడంతో అదనపు ఆహారోత్పత్తిని సాధించడం వీలైంది. కాయకష్టం చేసే వర్గం వేరవడంతో తిని, కూర్చోగలిగిన మరొక వర్గం ఏర్పడింది. ఇందులో కొందరు రకరకాల ప్రత్యేక వృత్తుల్లో నైపుణ్యం సంపాదించుకోగలిగారు. వాటిలో అక్షరాస్యత ఒకటి. వర్గాల మధ్య అంతరాలు ఏర్పడుతున్న కొద్దీ రాయడమనే నైపుణ్యానికి స్పష్టమైన వర్గ స్వభావం రూపొందసాగింది. ఏం రాయాలో, ఎందుకు రాయాలో తెలిశాక రాసే విధానం దానికి తగినట్టుగానే తయారైంది. రచనా పద్ధతి కూడా అందరికీ అర్థం కావలసిన అవసరం ఉండేది కాదు. అచ్చంగా పాలకవర్గాలకే పరిమితమైన ఆనాటి అక్షరజ్ఞానమంతా వారి వర్గప్రయోజనాలు కాపాడటానికీ, అలగాజనాన్ని పన్నులూ మొదలైనవాటితో అణిచిఉంచడానికీ ఉపయోగపడింది. పూజారులకూ, రాచవంశాలకూ ఎన్నో దైవిక శక్తులున్నట్టుగా ప్రజలను భ్రమ పెట్టటానికి పురాణాలు పనికొచ్చాయి. అక్షరాస్యత పెరిగిన వేల సంవత్సరాల తరవాత కూడా మత గ్రంథాల్లోనూ, పురాణాల్లో ఏముందో చదివి తెలుసుకోలేని పామరులకు విస్సన్న చెప్పిందే వేదమనేది మనకు తెలిసినదే. అందుచేత తొలి యుగాల్లో లిఖిత సమాచారాన్ని స్వప్రయోజనాలకు ఎలా వినియోగించుకునేవారో మనం సులువుగా ఊహించుకోవచ్చు.
అక్షరాస్యత కొద్దిమందికే పరిమితం కావడంతో ఏదైనా నాగరికత అంతరించినప్పుడల్లా విలువైన అక్షరజ్ఞానం మరుగున పడిపోతూ ఉండేది. సింధునది లోయలో అద్భుతమైన నగర నిర్మాణవ్యవస్థతో వర్ధిల్లిన నాగరికత ఆర్యభాషీయుల సంపర్కంతో క్రమేపీ నశించినట్టుగా పరిశోధకులు చెపుతారు. అక్కడి అవశేషాల్లో ముద్రికలమీద కనిపిస్తున్న లిపికీ, ఆ తరవాతి వేదకాలపు భాషకూ ఎటువంటి సంబంధమూ కనబడదు. క్రీ.పూ.1200 ప్రాంతంలో అతి ప్రాచీన గ్రీక్‌ నాగరికత కుప్పకూలిన తరవాత వారి లిపి కూడా అంతరించిపోయింది. మళ్ళీ నిరక్షరాస్యతే మిగిలింది. ఆ తరవాత మరొక 400 ఏళ్ళకు అదే ప్రాంతంలో మరొక గ్రీక్‌ నాగరికత తలెత్తడం, తమకు అనువైన పద్ధతిలో వారు మెరుగైన అక్షరమాలను రూపొందించుకోవడం జరిగాయి. గతంతో పోలిస్తే వారి జీవనశైలిలోనూ, జీవితావసరాల్లోనూ కలిగిన మార్పుల దృష్య్టా కొత్తపద్ధతిలో రాసే విధానం మరింత నిర్దుష్టంగా తయారైంది. అంతేకాదు; మారుతున్న ప్రజల జీవితావసరాలకు అనుగుణంగా రాసే విషయాల్లోకూడా మార్పు కలిగింది. నిజమైన సాహిత్యానికి నాంది ఇదే.

అచ్చతెలుగు పండగ ఉగాది

అసలుసిసలు తెలుగు పండుగ, ఆంధ్రులను ప్రకృతితో మమేకం చేసే పర్వదినం ఉగాది. వేపపువ్వుకు కూడా ఒక ప్రయోజనాన్ని కల్పించిన, ఆ వగరు రుచిని నాలుకలమీదకు చేర్చే పండుగ బహుశా ప్రపంచంలోనే ఉగాది ఒక్కటి. కొత్తబట్టలు, నగలు కంటె రానున్న పన్నెండు నెలలూ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునేందుకు అనుచానంగా పంచాంగశ్రవణం మీద ఉత్సుకత చూపే “తెలుగులు” అంతకంటే ఉత్సాహంగా కవిసమ్మేళనాలూ జరుపుకుంటారు. కవిపుంగవులూ భావిని అంతా సస్యశ్యామలమూ, సతతహరితమే అని అనునయ గీతాలు పాడుతారు ఈ దినాన. ఏనాట కలిసిందో గాని సాహితీవేత్తలకూ, ఉగాదికి సావాసం, ఆంధ్రులు అంతర్జాతీయపౌరులయినా ఆ సత్సాంగత్యం నిత్యనూతనంగా సాగుతూనే ఉంది.
ఉగాది వస్తుంది అనగానే సాహితీకృషీవలురు పలువురు ముద్రణారంగాన్ని ముఖ్యంగా పత్రికాప్రపంచాన్ని సుసంపన్నం చేస్తారు. కధలు, కవితలు, వ్యాసాలు, నవలలు, అనువాదాలు, విమర్శలు, పద్యాల తోరణాలతో పండగరోజు తెలుగుభాషామతల్లిని శోభాయమానంగా అలంకరిస్తారు. పత్రికారంగం కూడా అన్నిసాహితీప్రక్రియల్లో పోటీలు నిర్వహించి, కొన్ని వందలరూపాయల నుంచి, అక్షరాలా లక్షరూపాయలవరకూ నగదు పురస్కారాలను విజేతలకు అందజేస్తుంది. అచ్చుపత్రికలు, పోర్టల్సు, వెబ్ పత్రికలు రానున్న ఉగాదికి అన్ని సాహితీవిభాగాల్లోనూ పోటీలు ఇప్పటికే ప్రకటించాయి. గోరంత విత్తు కొండంత చెట్టయినట్లు సరదాగా మొదలయిన తెలుగు బ్లాగులు క్రమంగా సమాంతర సమాచార, సాహితీవేదికలుగా రూపాంతరం చెందిన విషయం సభ్యసమాజం సగౌరవంగా గుర్తించి, బ్లాగరుల వైపు ఆసక్తిగా, ఆశగా చూస్తుంది.. ఈ ఉగాది రచనల పోటీల్లో విజేతలుగా నిలిచే అర్హత మన బ్లాగర్లలో చాలా మందికి ఉంది. ఆలస్యం అమృతం విషం అన్నట్లు మన వారు కలాలు తీసుకుని కార్యరంగంలోకి దుమకటమే ఆలస్యం.

చిరంజీవి పార్టీకి విజయశాంతి మద్దతు?

చిరంజీవి సరసన హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించిన విజయశాంతి ఇప్పుడు చిరంజీవి పెట్టబోయే పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. "ప్రత్యేక తెలంగాణ, ఆంధ్ర అభివృద్ధి, అవినీతి నిర్మూలన" ఎజెండాగా ముందుకు రానున్న చిరంజీవి పార్టీలో చేరి తెలంగాణలో ప్రచారం చేసి ఒక ముఖ్య నాయకురాలిగా ఎదగాలన్న ఆలోచన విజయ శాంతికి ఉన్నట్టు ఆమె సహచరులు చెబుతున్నారు.టీఅర్ ఎస్ తో చిరంజీవి పొత్తు పెట్టుకుంటారన్న ఫీలర్స్ రావడంతో అలర్ట్ అయిన విజయశాంతి చిరంజీవిని వ్యక్తిగతంగా కలుసుకుని ఆయన పెట్టబోయే పార్టీకి తన మద్దతు ప్రకటించినట్టు తెలుస్తోంది.

జూ. ఎన్.టి.ఆర్. కొత్త చిత్రం

వి వి వినాయక్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. ఇది అందరూ అనుకుంటున్నట్లుగా యుగంధర్ రీమేక్ కాదట. వినాయక్ దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ సినిమా "ఆది" బాక్సాఫీసు వద్ద పెద్దగా హిట్టయిన విషయం తెలిసిందే. మళ్లీ వీరిద్దరూ కలిసి పని చేస్తున్నారు. ఎన్టీఆర్ తో "సాంబ" సినిమాను నిర్మించిన కొడాలి నానీ ఈ సినిమా నిర్మాత. ఈ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 28వ తేదీన ప్రారంభమవుతుందని తెలిసింది. వినాయక్ ఎన్టీఆర్ ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టు రాస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది చివరలో విడుదల చేయాలని కొడాలి నాని భావిస్తున్నారు.

నాగార్జున కొత్త కోరిక!

సినిమాల ఎంపికలో తనదైన బాణీని పలికించే నటుడు అక్కినేని నాగార్జున తెలుగు సినీ ఆణి ముత్యం "పాతాళ భైరవి" లాంటి చిత్రంలో నటించాలని ఉందని తెలిపారు. వీలైతే ఎవరైనా ఈ "పాతాళ భైరవి" చిత్రాన్ని రీమేక్ చేస్తే ఎలాంటి సంకోచం లేకుండా తాను అందులో నటించడానికి ఆసక్తి చూపుతానని ఆయన తెలిపారు. ఇప్పటిదాకా పలు సాంఘిక, పోరాణిక చిత్రాలలో నటించిన తనకు ఫాంటసీ చిత్రాలలో నటించాలని చాలా కుతూహలంగా ఉన్నట్లు తెలిపారు. ఎప్పటికైనా తన కలను నిజం చేసుకుంటానని, వీలైతే "పాతాళ భైరవి" చిత్రాన్ని తానే రీమేక్ చేసినా ఆశ్చర్యపోనక్కరలేదని ఆయన పాత్రికేయులతో తన అభిప్రాయం వ్యక్తం చేయడం ఇక్కడ గమనార్హం.ఎనీహౌ...బెస్ట్ ఆఫ్ లక్ నాగార్జున.

వెంకీ ద్విపాత్రాభినయం

"సూర్యవంశం","సుభాష్ చంద్ర బోస్","జయం మనదేరా" లాంటి పలు చిత్రాలలో ద్విపాత్రాభినయం చేసిన విక్టరీ వెంకటేష్‌ తదుపరి చిత్రంలో కూడా డబుల్ రోల్స్‌ను పోషించనున్నట్లు చలన చిత్ర వర్గాల సమాచారం. అయితే ఈ విషయమై వెంకటేష్ గానీ, ఇతర సంబందీకులుగానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. "లక్ష్మీ", "ఆడవారి మాటలకు అర్థాలే" వేరులే వంటి సెంటిమెంట్ చిత్రాల్లో నటించిన మాస్, యాక్షన్ కలగలిసిన "తులసి"లో ఇటీవల నటించాడు.అయితే ప్రస్తుతం వెంకటేశ్ డబుల్ రోల్ చిత్ర కథకు ఓకే చెప్పినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.ఈ చిత్రానికి సంబధించిన కథ, కథనాలు ఇప్పటికే పూర్తయ్యాయని,త్వరలోనే రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలు ద్విపాత్రాభినయంతో వచ్చే సినిమాలు చాలా తక్కువైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో వెంకటేశ్ నటించనున్న ద్విపాత్రాభినయ చిత్రానికి సహజంగానే క్రేజ్ ఏర్పడటం సహజం. దానికి తోడు గతంలో వెంకటేశ్ నటించిన ద్విపాత్రాభినయ చిత్రాలలో ఎక్కువశాతం మంచి విజయాన్ని సాధించాయి కూడా. సో విక్టరీ అభిమానులు తమ హీరోను త్వరలోనే ద్విపాత్రాభినయంలో చూసుకుంటారన్న మాట.

దిష్టితీయించుకున్న చిరంజీవి!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ప్రస్తుతం శాంతి పూజల్లో నిమగ్నమైనట్టు సమాచారం. తన కుటుంబ జ్యోతిష్య పండితుల సూచన మేరకు ఈ పూజలు నిర్వహిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల భొగొట్టా. తెలుగు చిత్ర పరిశ్రమలో నానాటికీ పెరుగుతున్న తన ఇమేజ్‌పై "దిష్టి" తగిలిందని బలంగా నమ్ముతున్న చిరు కుటుంబ స్బ్యులు, మరియు జ్యోతిష్యుని సలహా మేరకు వాటి నుంచి త్వరగా విముక్తుడయ్యేందుకు వీలుగా నవగ్రహ గ్రహ శాంతి పూజలు, నర్పదోష, ఇతర రకాల పూజలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. దీనికి తోడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తాను తదుపరి నిర్మించనున్న 149 చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

Saturday, February 23, 2008

శ్రీకాకుళం జిల్లాకు అధికార భాష అవార్డు

శ్రీకాకుళం జిల్లాకు అధికార భాష అవార్డు లభించింది. జిల్లా కలెక్టర్ విఎన్ విష్ణు చేతులమీదుగా అదుకుంటున్న అధికారులు.

పద్మశ్రీ యార్లగడ్డ సిక్కోలు పర్యటన

రాష్ట్ర హిందీ అకాడమీ అధ్యక్షుడు పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావుతో కలిసి తిలకిస్తున్న దృశ్యం.

ఘనంగా ఎర్రన్నాయుడి జన్మదినోత్సవం

తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టి.డి.పి.పి.) నేత కింజరాపు ఎర్రన్నాయుడు 51వ జన్మదినోత్సవ వేడుకలు శ్రీకాకుళం జిల్లాలో శనివారం ఘనంగా జరిగాయి, పార్టీ నాయకులు, అభిమానులు ఈ సందర్భంగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు, కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విఎన్ విష్ణు, జడ్పీ మాజీ చైర్మన్ వైవి సూర్యనారాయణ, ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఇప్పిలి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

Thursday, February 21, 2008

సమాచార శాఖా...? చేతకాని ...??

విశాఖపట్నంలోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ పనితీరు నానాటికీ మీడియాకు తలనొప్పిగా మారుతోంది. జిల్లాలో పాత్రికేయుల బాగోగులు చూడాల్సిన ఆ శాఖ అధికారులు తద్భిన్నంగా వ్యవహరిస్తూ ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు. పట్టించుకునే నాధుడు లేడనో ఏమో కానీ చివరికి జర్నలిస్టులకి ద్రోహంచేసేవాళ్లకి పూర్తిస్థాయిలో సహకరిస్తూ వృత్తిధర్మానికి తిలోదకాలిస్తున్నారు. కేవలం డి.పి.ఆర్.ఒ.కార్యాలయంలోని కొంతమంది సహకారంతో వీరాభిమన్యుడులాంటి వెదవలు సైతం విర్రవీగిపోతున్నారు. సమాచార హక్కు చట్టాన్ని అడ్డంపెట్టుకుని వీరాభిమన్యుడు తోటి జర్నలిస్టులను అనేక ఇబ్బందులు పెట్టడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాచార శాఖ అందిస్తున్న సహకారాం గురించి అందరికీ తెలిసిందే. అక్రిటిడేషన్ జీవోలోని లొసుగుల్ని అడ్డంపెట్టుకుని అభిమన్యుడు చిన్న పత్రికల విలేఖరులను పెడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు.

విప్లవ సింహం "ఉయ్యాలవాడ"

1800-1900 ప్రాంతాల్లో రేనాటి సీమను ఇద్దరు మహనీయులు పునీతం చేశారు। ఇద్దరు కర్నూలు జిల్లా నొస్సం మండలం ఉయ్యాలవాడ వాస్తవ్యులే కావడం కూడ విశేషమే.
ఒకరు కంపెనీ పాలన మీద కత్తి దూసి స్వేచ్చకోసం పోరాడి ఉరికొయ్యకు బలీయిపోయి తరువాతి స్వాత్రంత్ర ఉద్యమానికి ప్రేరణ ఇచ్చిన వాడు। చైతన్యం నింపినవాడు. స్వాతంత్ర కాంక్షను రగిలించి మండే సూర్యుడయ్యాడు. అందుకే రేనాటి సూర్యుడు- విప్లవసింహం ఉయ్యాలవాడ నారసింహరెడ్డి. మరొకరు కరవు బారిన పడిన పేదలకు తన ఆపన్న హస్తం చాచి కడుపు నిండా అన్నం పెట్టి కలియుగ దానకర్ణుడని పేరుపొందిన బుడ్డా వెంగళరెడ్డి. తనకు ఉన్నాదంతా దానం చేసిన ఈ మహానుభావుని దాతృత్వానికి పరాయి పాలకులకు సైతం ఆశ్చర్యం వేసింది. అందుకే విక్టోరియా మహారాణి బంగారు పతకాన్ని బహుమానంగా ఇచ్చింది. ఇతని చల్లని నీడలో నిర్భాగ్యులు ఎందరో సేదదీరారు. అందువల్లనే రేనాటికి చల్లని వెన్నెల పంచిన చంద్రుడు -- బుడ్డా వెంగళరెడ్డి.
1857 కంటే ముందు 1846-47 ప్రాంతాల్లో 9000 మంది సైన్యంతో సాయుధపోరాటం నడిపిన ఉయ్యాలవాడ నారసింహారెడ్డి విప్లవానికి భారతీయ స్వాతంత్ర చరిత్రలో సముచిత స్థానాన్నిచారా అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకం। మన చరిత్రను మనము రాసుకోకపోవడమే ఇందుకు కారణం. ఇట్లాంటి వీరులు ఇంకా ఎంతమంది చరిత్రలో మరుగున పడిపోయాయో? ఇప్పటికైనా ఉయ్యాలవాడ నారసింహారెడ్డి విప్లవానికి భారతీయ స్వాతంత్ర్య చరిత్రలో సముచిత స్థానం కల్పించాలని ఆశిద్దాం.

ఎ.పి.యు.డబ్ల్యు.జె. మీడియా డైరీ ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఎ।పి।యు।డబ్ల్యు।జె।) మీడియా డైరీ ఆవిష్కరణ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్వర్యంలో ప్రచురించిన 2008 మీడియా డైరీని జిల్లా కలెక్టర్ వి.ఎన్।విష్ణు ఆవిష్కరించారు। కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి రమేష్, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నల్లి ధర్మారావు, జిల్లా యూనిట్ నాయకులు ఎస్।నర్శింహులు, ఎన్।ఈశ్వరరావు, శృంగారం ప్రసాద్, జి।నాగభూషణ రావు తదితరులు పాల్గొన్నారు.

చినుకు కోసం ఎదురుచూపు!

డా। జోగధేను స్వరూప్ కృష్ణ
ఒక్క చుక్క నీళ్ళు లేకపాయె
కన్నీటి చుక్కకానకట్ట లేకపాయె
యేడ్చి యేడ్చి గొంతుకెండి పాయె
దప్పిక్కి యెండిపోయిన నాలిక లెక్కన
సీలికలైన భూమి
బక్క సిక్కి పోయిన భూమి
యాడికి పోయి సెప్పాలీ గోడు
యెవరికి సెప్పాలీ గోడు

రేతిరి మబ్బు పట్టిందిలే
ఇంక ఆకాశం చిల్లుల్లోంచి
నీటి సుక్కలు కార్తాయి లెమ్మని
ఆశతో కన్నుమూస్తే
తెల్లారి లేస్తే
ఏముంది ఒక్క తడి బొట్టు లేదు
ఊరికే ఉరవడం తప్ప….
అరచడమే తప్ప ఆదుకోవడం తెలీని వాళ్ళే సుట్టు పక్కల
సినుకు ఊసే లేదనే నిజం కల అయితే ఎంత బాగుండేది

కలలు కనడానికే ఉన్న కళ్ళు
నీళ్ళతో తడిసిపోయిన కళ్ళు
ఆశ నిరాశల మధ్య టపటపమని కొట్టుకునే కళ్ళు
వానకోసం చూసిచూసి విసిగి వేసారిన కళ్ళు

చల్లగాలి వత్తే చాలు మట్టి వాసన
మట్టి వాసనొస్తే చాలు పడింది సినుకని ఓ సంబడం
ఎంతో సేపు లేదు సంతోషం
సినుకు కెంత కోపమని…
పడదు… పడదు…
ఏంపాపం చేసినామని, ఏం నేరం చేసినామని
మబ్బులన్నీ యాడ దాక్కున్నాయో
కప్పలమ్మ నీకెమైనా తెలుసా

నాసిన్నపుడు
కుండపొతగా వర్షంకురిస్తే
మా ఊరి అయ్యోరు కట్టిచ్చిన కాగితప్పడవలు
ఈదిగుండ పారే నీళ్ళలో ఇడిసి ఆడుకునే రోజులు
నా పిల్లలకు సెప్తే….
నాయన అబాద్దాలడతాండాడని నగుకున్నపుడు
మా ఆడదాని కండ్లలో జాలి సూపులు
ఆ చణాన నేను సచ్చినా బాగుండేది.
కలం కాగితప్పడవల్లో ఒడ్డు దాటడానికి
ఆశ తెడ్డు ఆధారం..
నిరాశ తుఫానులో చిక్కుకున్న పడవ గట్టెక్కేదానికి
ఆకాశం తప్ప దిక్కెవరు..
ఇట్లా ఎందుకు జరుగుతాండాదో నీకేమైనా తెలుసా కప్పలమ్మ…

అప్పట్లో కుండపోతలుగా వాన పడేది
వద్దంటే వాన
కళకళలాడే చెరువులు
ఎగసిపడే కాలువలు
ఆకాశానికి భూమికి తాకుతూ ఏసిన పందిరిలా వాన
ఆకాశాన్ని లాగేసి తనతో కలుపుకునేకి
భూమి పేనిన నీటి చుక్కల తాడులా వాన
బయటకు రానిచ్చేది కాదు
మట్టి మిద్దెలు గదా కొంపంతా నీళ్ళే
బొటుకు బొటుకు పడతాంటే సత్తు గిన్నెలు ఇంటినిండా పరిచి
బొటుకు బొటుకు పడతాంటే గిన్నెల్లో సంగీతం టప్ టప్ అని….
ఆడదానికి ఒకటే పని
అంత వాన
మట్టి నీళ్ళ చారికలు చారికలు
ఇళ్ళంతా తడిసిపోయి ఇంట్లో ఆడది విసుక్కునేంత వాన
భూమికి బొక్కలు పెట్టేకి ఆకాశం ఏసిన బాణాల్లెక్కన
వాన…..అంత వాన…
తూముల్లోంచి జోరున వాన నీళ్ళు
చించెరువు కట్టకాడ బాయికి పోయి
నీళ్ళు ఏంతెత్తావ్ లెమ్మని
ఇంటి తూము నీళ్ళు కడవలకెత్తుకుపోయే రోజులు
గోనె సంచి నెత్తినేసుకుని చేని కాడికి పోయి చూత్తే..

వానకు నాని అప్పుడే తానమాడిన పడుచుపిల్ల మాదిరిగా ఉండేది భూమి
పచ్చగా సెట్లన్ని చిన్న గాలికి ఊగుతాంటే తడిసిపోయి
జోలెలో పడుకొని నవ్వుకునే సంటోడి లెక్కన ఉండేది భూమి
వద్దంటే వాన
వాన వెలిసినంక నీటి సుక్కల్తో నిండిన అద్దం మాదిరిగ ఆకాశం
పసుపు పూసి నీళ్ళు పోసుకున్నట్లు పచ్చగా భూమి
యావైపు చూసిన పచ్చ పచ్చనే
పండు ముత్తైదువు అప్పుడు భూమి
ఎంతమందికి అన్నం పెట్టేది
ఎంతమందిని అక్కున చేర్చుకునేది
ఎంతమందిని ఓదార్చేది
అన్నపూర్ణమ్మ తల్లి అప్పుడు భూమి
పచ్చని చీర కట్టుకుని గాలికి రెపరెపలాడే పైట చెరగు
మాదిరిగా పైర్లు ఊగుతాంటే
చేనిగట్టు మీద కూకుని చూడబుద్దయ్యేది ఎంత సేపైన
ఇసుమంతైన ఇసుగేసేది కాదు
కంటికింపుగా ఉండేది

ఊరికే కూకోక పోతే
వచ్చి పని చేయరాదు అంటూ
చేతులూపి పిలిచినట్లు ఊగే పైర్లు
గుంపులు కట్టి ఆడుకునే పిళ్ళోల్ల మాదిరి ఊగే పైర్లు
పిచ్చికలు, పక్షులు
తనని పట్టుకునేకి వస్తాంటే
తప్పిచ్చుకునే మాదిరి అటు ఇటు ఊగే పైర్లు
దోబూచులాడే పైర్లు
దాగుడుమూతలాడే పైర్లు
సేని గట్టున కూకుని చూత్తాంటే
ఎంతసెపైనా చూడబుద్దయ్యేది
ఇసుమంతైన ఇసుగేసేది కాదు
కంటికింపుగా ఉండేది…

అప్పట్లో ఎంత పని!
చేతి నిండా పని
నాట్లు వేసేది మొదలుకుని కలుపు తీసే దాకా
కోతలు మొదలు కొని ఊర్పుల దంకా
తూర్పార పట్టే దాకా
పని.. పని.. పని…
కట్టం తెలీకుండా పనిలో పాటలు
పాటలే పాటలు.. ఎన్ని పాటలు
నవ్వుతూ పనిలో మునిగి కట్టం తెలీకుండా
పని.. పని.. పని..

పురిటి నొప్పుల్తో విలవిలలాడే భూమి
పండిన పంట ఇంటి నిండా
గాదెలనిండా
పొంగుతున్న పాలగిన్నెల్లా నిండుగా
ఇంటినిండా బస్తాలు
నిడుగా ముస్తాబయ్యి ఉండే ఇండ్లు
ఏం బెంగలేకుండా
ఇంటి కాడ కట్ట మీద కూకుని
యేదాంతం మాట్లాడుకునేంత సుకం
కడుపునిండా ఇంత తిని, కంటినిండా ఇంత నిదర ….

ఇదంతా కల అయిపాయే
బతుకు కలవరం అయి పాయే
సెబితే నమ్మవుగాని
-ఆ కలకలం లేదు
-ఆ నిండుదనం లేదు
-ఆ ఆనందం లేదు
యాడ సూసినా దరిద్రమే
నవ్వంటే యెట్లా ఉంటుందో మరిచిపోయి చాన్నాళ్ళయింది
ఇట్లా ఎందుకైందో నీ కేమైన తెలుసా కప్పలమ్మా !
నీకు పెళ్ళి సేత్తే వాన కురుత్తదని సెప్తే..
బిడ్డ పెండ్లి ఎట్లా చెయ్యలేనని
గుండెల కుంపటి ఆర్పలేనని
కట్టం కాడ గబుక్కున రాలిపోతానని
తెలుసుకొని
నీకు పెండ్లి సేత్తే వానా కురుత్తే
ఇంత ఎనకేసుకుని ఇంటికి మామిడాకులు కడదామనుకుని
ఆశతో నీకు పెండ్లి సేత్తే
ఆశ అంతకంతకూ పెరిగిపాయే
గాలి ఊదిన బుడగమాదిరి
ఆశ అంతకంతకూ పెరిగిపాయే
ఎంత సేపు బుడగ నిలుత్తాది
వాన సినుకు లేకపాయే
బిడ్డ పెండ్లి ఎట్లా సెయ్యలేను
నీ పెండ్లైనా చేసిన తృప్తి మిగిలింది..
నమ్మకాలే జీవితాన్ని వమ్ము సేత్తండాయి
నమ్మకం సాలెగూడు మాదిరి
దూరానికి అందంగా కనిపించి చిక్కించుకుంటుంది
వమ్మయిందో.. చిక్కి శల్యం సేస్తుంది

అయ్యోరు బారతంలో విరాట పర్వం చదివితే
వానొత్తదంటే ఊరంతా కలిసి చందాలేసుకుని
బాపనయ్యతో మాట్లాడి
బారతం చదివిత్తే
వాన సినుకేమో గాని
బాపనయ్య సంబరాలకు అప్పులో అప్పు పెరిగిపాయే
పూజలో కర్పూరంలా కాలం కరిగిపాయే గాని
వాన మాత్రం రాక పాయే
బారత బాగోతాలకు కాలం సెల్లిపోయే రోజులు
ఇలువల్లేని రోజులు,
దరమం కుంటుతాంటే వానలొత్తాయా
అంతా బ్రమ
మంత్రాలకు సింతకాయలు రాల్తాయేమో గాని
మబ్బు రాతిగుండె మాత్రం కన్నీళ్ళు కార్చదు…

గంగమ్మ కనికరిత్తది జాతర సేస్తే అని
అయిన కాడికి
బందువులందరిని పిలిచి ఇంటినిండుగా సంబరం….
ఊరుఊరంతా సంబరం..
అమ్మతల్లికి కోటి దండాలు
తప్పెట్లు తాళాలు
తందనాలు, ఊరేగింపులు
నూటొక్క బిందెల నీళ్ళు గుమ్మరించి
గంగమ్మకు తానం పోత్తె….
దున్నలు, జీవాలు, కోళ్ళు
బలిచ్చి రగత దాహం తీర్చినా
మాదాహం తీరక పాయే
బాయి ఎండిపాయే
వాన సినుకు లేకపాయే
శివుని కొప్పులో గంగమ్మ కులుకుతానే ఉండాది..
రకతంతో భూమి యెర్ర బారింది కాదాని
ఇన్ని నీళ్ళు కొట్టి భూమిని కడుగుదామని
ఆకాశానికి ఆలోచన రాదు.
భూమి వాడిపోయి పగుల్లు పోతానే ఉంది..
మా గొంతులు ఎండుతానే ఉండాయి
దప్పిక నోళ్ళు తెరిచినట్టు పగుల్లు పోయిన భూమి
నాలుక యెండి పోతాంటే బయటికి సాపి..
-నీళ్ళ కోసం తపించే భూమి
-తడి కోసం తపించే భూమి
-ఒక్క సుక్క నీటి బొట్టుకు ముకం వాచి పోయిన భూమి
-గొంతెండిపోతాంటే
గుక్కెడు నీళ్ళు పొయ్యలేని
నీ బతుకు ఓ బతుకేనా
అని నిలదీసి అడిగే భూమి!
-గట్టు మీద కూకొనేకి మనసొప్పక
దూరంగా నిలబడి సూత్తాంటే
ముండమోపి లాగా ఎండిపోయిన భూమి!
-సూడ బుద్ది కాక తలపక్కకు తిప్పుకుంటే
యేరు దాటింతరువాత తెప్ప తగలేసే రకమని
అనుకుంటాదేమోనని బెంగ
యెండిపోయి కండలేక జీవం పోయి
గుండెనిండుగా బాదతో
బరువుగా తలవంచుకున్నట్టున్న భూమి!
సూడబుద్దేయ్యక తలపక్కకు తిప్పుదామంటే
మనసొప్పదు గదా!

వానల్లేకపోతే పాయే
భూమిలో నీళ్ళు యెలికి తీత్తామని
నీటికోసం జూదం..
అయ్యోరు వాస్తు చూసి ఈడ తవ్వుకోమంటే
నూరడుగులు అమ్మ గుండెలో లోతుగా గునపాలు
బోరు బాయికి…
అడుగు అడుక్కి తవ్వుతాంటే
తల్లి రొమ్ము గుద్దుతాండావని
భూమి బాద పడతాదేమోనని బెంగ
తల తాకట్టు పెట్టి తెచ్చిన సొమ్ముతో
నూరు అడుగులు తవ్వినా..
ఇన్నూరు అడుగులు తవ్వినా…
అడుగు అడుక్కి ఉన్న ఆశ పోయింది
నీళ్ళు ముకానికి చిమ్ముతాయనుకుంటే
సెమట తుడిచి ఇంత సల్లదనం కురిపిత్తాయనుకుంటే
సివరికి ఇంత పెద్ద బండ
గుండె గుబేలు మనేలా
నెత్తిన ఇంత పెద్ద బండ
చెంప చెళ్ళుమనిపించింది
వాస్తూ లేదు అయ్యోరు లేడు…
ఇదేందయ్యో అని అడిగితే
నీ పేరు మీద బలం లేదని మళ్ళ బుకాయింపు
యాడికని నమ్మేది..
మడుసుల్ని నమ్మేకంటే మాను న్నమ్మేది మేలని
ఊరికే అన్నారా ..!
నమ్మ బలికినోడు నట్టేట ముంచేత్తాంటే
బతుకునిచ్చే తల్లి రొమ్ము ఎండిపోతాంటే
ఎవర్నేమని లాబం
భూమినండా బోరు బాయిలే, నీళ్ళు లేని బోరు బాయిలే!
ఈడ పడతాది తవ్వు
అదిగో ఆడపడతాది తవ్వు
ఇంకొంచెం ముందు పడతాది తవ్వు
ఆశ…ఆశ… మినుకుమినుకుమనే ఆశ…
జూదం…ఆశ..
ఆశ..జూదం…

మళ్ళీ మట్టి వాసన
గమనించావా కప్పలమ్మా
ఆశ.. పైనుండి ఓ చినుకు
మళ్ళీ ఓ చినుకు
తేనే తుట్టెలోంచి తేనె బొట్టులా
ఒక్కో చినుకు
వరుసగ చినుకులు, చినుకులు, చినుకులు
వాన…వానా… ఆశ…

అరువుకు తెచ్చిన విత్తనాలు
భూమి తల్లికి గోరు ముద్దల్లా అందించి
పంట కోసం యెదురు చూస్తూ
ఆశగా.. ఆశగా…
ఆకాశం కనికరించినా
అవకాశం కలిసిరావద్దు…
కల్తీ విత్తనాలు, కల్తీ యెరువులు…
ఒక్కసారిగా మనసు కుదేలుమంది
గుండె గుబేలుమంది…
భూమికి పచ్చ చీర కప్పుదామనుకున్న ఆశ….
నిరాశ అయితే ఒక్కసారిగా జీవితం కూలిపోతుంది..
మనిషి కల్తీ, మనసు కల్తీ, బతుకు కల్తీ…
మనిషే ప్రకృతిని పొట్టన పెట్టుకుని
భస్మాసుర హస్తం ….
తన నెత్తి మీద తానే నిప్పు పెట్టుకుంటూ…
యెదుటి వాడి గుండెల్లో గునపాలు కుచ్చుతూ
బతుకంతా ఇంతే…
కొన ఊపిరి ఆగిపోతూ
ఇప్పటికి చాలు…
గాలిలో కలిసిపోయి,
ఇప్పటికి చాలు…
మళ్ళి పుడతాను,
సినుకై మళ్ళి పుట్టి భూమికి పచ్చచీర కప్పుతాను...

Sunday, February 17, 2008

ప్రజాస్వామ్య పునాది సింగపూర్

సింగపూర్ (మలయ్: Singapura; చైనీస్: 新加坡, Xīnjiāpō; తమిళం: சிங்கப்பூர்), అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ఒక చిన్న ద్వీపం, దేశం, నగరం కూడాను. మలేషియాకు దక్షిణాన కలదు. 704 చదరపు కిలోమీటర్ల తో (272 చదరపు మైళ్ళు) దక్షిణ ఆసియాలోని అతి చిన్న దేశం.
బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ 1819వ సంవత్సరములో అడుగుపెట్టినప్పుడు ఇది మలయ్, ఒరాంగ్ లౌట్ జాలర్లు నివసించు గ్రామం. బ్రిటిషు వారు రవాణాల నిమిత్తం వాడుకున్నారు. రెండవ ప్రపంచయుద్ధం సమయంలో జపాను ఆక్రమించింది, 1945 సంవత్సరములో తిరిగి బ్రిటిష్ వారి పరమయ్యింది. 1963 సంవత్సరములో మలేషియా ఏర్పడినప్పుడు దానిలో భాగంగా ఉండి, రెండు సంవత్సరముల తరువాత సైద్ధాంతిక భేదాలతో విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడినది.
స్వతంత్ర దేశంగా అవతరించిన తరువాత, సగటు సింగపూర్ నివాసి జీవనశైలి గణనీయంగా పెరిగింది. విదేశీ పెట్టుబడులు ప్రభుత్వ యంత్రీకరణము వలన ఎలక్ట్రానిక్సు మరియు కర్మాగారం ఆధారంగా ఒక ఆధునిక ఆర్ధికరంగం ఉద్భవించింది. స్థూల జాతీయ ఉత్పత్తి ఆధారంగా ప్రపంచంలో 18వ ధనవంతమైన దేశము. భూభాగము ప్రకారము ఎంతో చిన్నదయినా, సి.$212 బిలియన్ల మారకద్రవ్య (అ.$139 బిలియన్లు) నిలవలు కలది. ధనవంతమైన జీవన శైలి ప్రకారము, ది ఎకనామిస్టు (2005) సింగపూరును ఆసియాలో అతి ఉత్తమమైనదిగా ప్రపంచములో 11వ స్థానముగా నిర్ధారించినది. ఇంత చక్కటి విలువలు కలిగి ఉన్నా, సగటున లక్ష జనాభాకు 13.57 మరణశిక్షలు నమోదు అవుతున్నాయి, సౌదీ అరేబియా 4.65 మరియు చైనా 2.01 శాతం గమనించాల్సిన విషయం.

ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్!

నాకు నాలుగేళ్ళు వచ్చేసరికే, మా అమ్మని, రెండు గాడిదలని వదిలి మా నాన్న చనిపోయాడు. అమ్మదింకా అప్పటికి చిన్న వయసే కాబట్టి మరో పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది. వెడుతూ వెడుతూ, కట్నంగా ఒక గాడిదని తనతో తీసుకుపోయింది. నాన్నకి సొంత భూమంటూ ఏదీ లేదు. నాన్న చావు, అమ్మ రెండో పెళ్ళి తర్వాత, మా మురికి వాడ యజమాని నన్ను అక్కడి నుంచి తరిమేసాడు. నా మేన మామ, అతడి భార్య నన్ను చేరదీసారు. మిగిలిన ఆ ఒక్క గాడిదను వాళ్ళు ఉంచేసుకున్నారు. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం నేను ఇక్కడికి వస్తాను. ఇక్కడ ‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ వారి అద్దాల బోర్డు ఉంది. ఓ బట్టల సబ్బు కంపెనీ వ్యాపార ప్రకటనల కోసం ఈ పుస్తకాన్ని ప్రచురిస్తోంది. ఈ పుస్తకంలో నా పేరు కూడా ఉంది. ఆ బోర్డు పైన నా నీడ పొడుగ్గా పడుతోంది. ఓ బండి నన్ను దాటుకుంటూ వెళ్ళింది. నా నీడ ఇంకా పొడుగయ్యింది. అదృశ్యమయ్యేముందు నీడలు మరీ పొడుగవుతాయి. ఈ ఏడాది నా పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కబోతోంది. ఆ మేరకు ఉత్తరం కూడ వచ్చింది. ఏం లాభం? నేను ఏ భాషలోను చదవలేను. నా మిత్రులు నాకు చదివి వినిపించారు. ఇదే నా స్థలం! రాధు కిళ్ళీకొట్టు పక్కన. నేనిక్కడ అందరినీ నవ్విస్తాను. ఉత్సాహపరుస్తాను. నిజానికి నేను నోరు తెరవక్కరలేదు. పెదాలు కదిలిస్తే చాలు, జనాలు విరగబడి నవ్వుతారు. కాని ఈ పిల్లలు జాలి లేని వాళ్ళు. వీళ్ళు రాక్షసులే! నేను ఒంటరిగా ఉన్నప్పుడు పిడిగుద్దులు గుద్దుతారు. జుట్టు పట్టి లాగుతారు. నేను ఎదురుతిరిగితే, దూరం నుంచి రాళ్ళు విసురుతారు. వీళ్ళ కారణంగా నేను స్వేచ్ఛగా తిరగలేను. మా మావయ్య నన్ను చక్కగా చూసుకుంటాడు. ఇక అత్త అయితే అమ్మే! వీళ్ళే లేకపోతే నేనీపాటికి ఏ సర్కస్ కంపెనీలోనో ఉండేవాడిని. ఓ సారి ఓ కంపెనీ వాళ్ళు నాకు లక్షరూపాయలు ఇస్తామని మా అత్తకి, మామకి ఆశ చూపారు. ఎన్ని జన్నలెత్తినా, అంత పెద్ద మొత్తాన్ని కళ్ళజూడరేమో. కాని మా అత్త ఒప్పుకోలేదు. “వరుసగా పదడుగులు సరిగా వేయలేడు, సర్కస్ లో తాడు మీద ఎలా నడుస్తాడు? ఓ పెద్ద జోకర్ కాళ్ళమధ్యనుంచి కిందకి పడిపోతే? పులి నోట్లోకి వెళ్ళి తిరిగిరాగలడా? మేజీషియన్ పెట్టెలోంచి బయటకు రాగలడా?” అంటూ మా అత్త ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంది. హిందీ సినిమాలలో ప్రయత్నిద్దామని ఓ సారి బొంబాయి కూడ వెళ్ళాను. కాని ఫలితం లేకపోయింది. ఊరంతా తిరిగి, వట్టిచేతులతో ఇల్లు చేరాను. క్రిందటి ఏడాది ఓ టి.వి. బృందంలో హాస్యగాడిగా చేరి కొంచెం డబ్బు సంపాదించాను. మా అత్తని, మావయ్యని ఇంకా ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. ఇప్పుడు నా వయసు 23 ఏళ్ళు. వీళ్ళ మీద ఆధారపడి ఎంత కాలం బతకడం? ఓ సారి తినుబండారాల కొట్టు పెట్టాను. అత్త పదార్థాలు చేసిస్తే, నేను వాటిని అమ్మేవాడిని. చుట్టుపక్కల పిల్లలంతా తిని పోయేవారు. డబ్బులిచ్చేవారు కాదు. పిల్లలు ప్రతీసారి తినేసి పరిగెత్తేవారు. నన్నేదో మోసగించాలని వారి ఉద్దేశ్యం కాదు. నేను వాళ్ళని వెంటబడి తరిమితే చూడాలని వారి కోరిక. ఈ వ్యాపారంలో నేను నష్టపోయాను. ఓ సారి మా నగర మేయర్ నన్ను చూసారు. అప్పటికే నా పేరు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. నాకు మేయర్ సన్మానం చేసారు. కాని నాకది అవమానంగా తోచింది. “ఈ అబ్బాయి రికార్డు పుస్తకాలలోకి ఎక్కగానే సరికాదు, గౌరవప్రదమైన జీవితం గడపడానికి మనమందరం తోడ్పడాలి” అంటూ మేయర్ గంభీరంగా ప్రకటించారు. ఆ మాటలకి నేను పొంగిపోయాను. ఏదైనా మంచి అవకాశం వస్తుందేమోనని చాలా కాలం వేచిచూసాను. కాని అటువంటిదేదీ జరగలేదు. మేయర్ మాటలు నీటిమీద రాతలే అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగాను. నేను ఒంటరిగా వెళ్ళలేను. నాతో పాటు ఎవరో ఒకరు తోడు రావల్సిందే. పైగా బస్సులలో అసలు వెళ్ళలేను. ఆటోలో వెళ్ళాల్సిందే. మరి డబ్బులో? అంత మొత్తం నేనెలా భరించగలను? విసిగి వేసారిపోయాను.
నాకు సినిమాలంటే ఇష్టం. అమితాబ్ బచ్చన్ నా అభిమాన హీరో. ఎంత పొడుగ్గా ఉంటాడో కదా! హీరోయిన్లలో నాకెవ్వరూ నచ్చరు. నాకు నటీమణులు నచ్చరు. నాకున్న స్నేహితులంతా మగవాళ్ళే. మా అత్తని మినహాయించాలి. ఆమె నా పాలిట దేవత! కిళ్ళీ కొట్టు యజమాని రాధు నా ప్రాణ స్నేహితుడు. మేమిద్దరం చాలా సమయం కలసి గడుపుతాం. అలాగే లతీఫ్ కూడ. లతీఫ్ దర్జీ. నా బట్టలు ఉచితంగా కుట్టిపెడతాడు. గుడ్డముక్కలు అత్త కొంటుంది. అయినా నా శరీరానికి ఏ మాత్రం గుడ్డముక్క కావాలేంటి?నాకు ఇంకో మిత్రుడున్నాడు. వాడి అసలు పేరు చెప్పను. ‘రాహు’ అనుకుందాం. వాడో వెధవ. దొంగతనాలు చేసి డబ్బు సంపాదిస్తుంటాడు. వాడెంత సమర్ధుడంటే, రెండు సన్నని చేపలని పిడికిళ్ళలో పెట్టుకుని, బూజు పట్టిన గొట్టాలని అవలీలగా ఎక్కిదిగగలడు. కాలక్షేపం కోసం నేను టి.వి. చూస్తాను. పేపరు చదవలేను, కాని మావయ్య వార్తలను పైకి చదువుతుంటే వింటాను. ఓ రోజు మా పేటలో ఏవో సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి. నన్ను కొన్ని చేష్టలు చేయమన్నారు. చేసాను. ప్రతిఫలంగా కొంత డబ్బిచ్చారు. ఓ సారి మా టి.వి. బృందానికో పెద్ద అవకాశం వచ్చింది. ప్రదర్శన కొనసాగుతోంది. మా బృందంలో ఓ గాయని కూడ ఉంది. ఆమె పేరు మీరా. ఆమె పాటలు పాడుతుంటే, మధ్యలో నేను కుప్పిగెంతులు వేసి ప్రేక్షకులని నవ్విస్తున్నాను. స్టేజికి వెనుకగా కట్టిన తెరమీద నా నీడ పడి, పెరుగుతూ తరుగుతూ ప్రేక్షకులకి వినోదం పంచుతోంది. అందరూ చప్పట్లు కొట్టారు. మీరా కూడా. విరామ సమయంలో పాట ఆగింది, కాని వాయిద్యాలు ఆగలేదు. అందరూ చూస్తుండగా మీరా తెర వెనక్కి నన్ను లాక్కెళ్ళింది. ఏదో విశేషమైన అంకం కాబోలని ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ, తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఒకరో ఇద్దరో ఈలలు కూడ వేసారు. “నిన్నొక మాట అడగనా?” అంది మీరా జీర గొంతుతో. మళ్ళీ తనే మాట్లాడుతూ,“ఎప్పటినుంచో అడగాలను కుంటున్నాను. కాని ధైర్యం చాలలేదు. నీ సమాధానం ‘సరే’ అయితే ఇప్పుడే చెప్పేయ్. ‘కాదు’ అయితే మాత్రం ఇప్పుడే చెప్పకు. నేను తట్టుకోలేను. నా హృదయం బద్దలవుతుంది” అని అంది. మా నీడలు తెరమీద పడి, మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటున్న సంగతి ఎదురుగా కూర్చున్న అందరికీ తెలుస్తోంది.నేను ఆసక్తిగా ఆమెకేసి చూసాను.“నా హృదయం నీకర్పించాను. నన్ను పెళ్ళి చేసుకుంటావా?” అని అడిగింది మీరా. ఇంత అప్యాయంగా నాతో మాట్లాడినవారెవ్వరూ లేరు. నేను కరిగిపోయాను. నేను పిల్లి మొగ్గ వేసాను. డ్రమ్స్ వాయించే కుర్రాడి భుజంపైకెక్కి, డ్రమ్‌ని రెండు సార్లు మ్రోగించాను. తర్వాత మీరా దగ్గరికి పరిగెత్తాను. ఆమె గౌను అంచుని ముద్దాడాను. ఆమె వాయిద్యకారులున్న వైపు నడిచింది. వాళ్ళలో ఒకడు మైక్ పట్టుకుని, “ఏమన్నాడు?” అని అడిగాడు.ప్రేక్షకులు కూడా ” ఏమన్నాడు?” అంటూ కోరస్ గా అరిచారు. ఆ వంచకి, మైక్ అందుకుని, “నేను అతడిని నన్ను పెళ్ళిచేసుకుంటావా అని అడిగాను” అంటూ వీక్షకులకి చెప్పింది. నా వీపు ప్రేక్షకులకి కనపడేలా నిలుచున్నాను. “జవాబు ఏం చెప్పాడు?” అంటూ ప్రేక్షకులు గోల గోలగా అడిగారు. నాకు సిగ్గేసింది. నా ముఖం మాడిపోయింది. నా శరీరం ఎదగలేదు నిజమే, కాని బుద్ధి ఎదిగింది. ఆమె నన్ను గేలి చేసిందని గ్రహించడానికి ఎంతో సేపు పట్టలేదు. ఇక్కడి జనాలను నవ్విస్తూ, నేను చనిపోయుంటే, నేను నా చివరి క్షణాలలో ఎవరిని తలుచుకునుండే వాడినో తెలుసా? అమ్మ కన్నా ఎక్కువైన అత్తని కాదు, దేవుడి లాంటి మావయ్యని కాదు, ఆఖరికి నా మిత్రబృందాన్ని కూడా కాదు. మీరాని ! అటువంటిది - ఎంతటి విద్రోహం? మీరా హుషారుగా చెబుతోంది - ” అతడు సరేనన్నాడు. మనం ఎప్పుడు పెళ్ళి చేసుకుందాం అని అడిగాడు” అంతే అక్కడ ఒక్కసారిగా, నవ్వులవాన కురిసింది. జనాలందరూ హేళనగా పగలబడినవ్వారు. వాళ్ళల్లో మా అత్త, మావయ్య కూడ ఉన్నారు.మోసగాళ్ళు. అందరూ మోసగాళ్ళే! మీరా, అత్త, మావయ్య, రాధు, లతీఫ్… అందరూ! గడ్డిలో దాక్కున్న పాములు! వాయిద్యకారులు గట్టిగా మ్రోగించి ప్రేక్షకులని మరింత రెచ్చగొట్టారు. నేనింకా అలాగే నిలబడి ఉన్నాను. మీరా నన్ను వెర్రి వెధవని చేసింది. నేను మరుగుజ్జునే కావచ్చు. కాని నా గుండె చిన్నది కాదే? మాములు మనుషులకి ఉండే పరిమాణంలోనే నా గుండె కూడ ఉంది. వర్షాకాలంలో కురిసిన వానంతా కలసి నా కళ్ళలో సముద్రమైంది. నా కళ్ళ లోంచి జారుతున్న నీటి బొట్లని చూడండి. వాటి పరిమాణాన్ని గమనించండి. ప్రపంచంలోని ఏ మనిషి కళ్ళనుంచైనా కారే నీటి బిందువుల పరిమాణమే కదా అవి? లేదంటే అవింకా చిన్నవని మీరు భావిస్తున్నారా?
* * *
ఒరియా మూలం: హృశికేశ్ పండాఆంగ్లం: లిపి పుష్పనాయక్తెలుగు: కొల్లూరి సోమ శంకర్. కథారచయిత మరియు అనువాదకుడైన ఈయన గతంలో కొన్ని దిన పత్రికలలో శీర్షికలు కూడా నిర్వహించారు. వ్యాసాలు రాసారు. ఈయన సొంత కథలు, అనువాదాలు వివిధ తెలుగు పత్రికలలో ప్రచురితమయ్యాయి. మంచి కథలు ఎక్కద చదివినా, వాటిని తెలుగు లో కి అనువదించడానికి ప్రయత్నిస్తుంటారు.
- కొల్లూరి సోమ శంకర్.

Saturday, February 16, 2008

’చిరంజీవి’వా ’ఠాగూర్’రా?

సొంతంగా రాజకీయపార్టీ పెట్టాలనుకుని చిరంజీవి నిర్ణయించుకోవడం దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. నిర్ణయం తీసుకోవడంలో ఆయన తటపటాయిస్తున్నారన్న అపవాదు ఉన్నప్పటికీ ఆయన మంచి సమయం కోసమే ఎదురు చూస్తున్నట్టు సినీవర్గాలు చెబుతున్నాయి.రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఏడెనిమిది నెలల ముందు పార్టీని ప్రకటించాలని ఆయన యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పదిహేను నెలల ముందే పార్టీని ప్రకటిస్తే ఆ టెంపోను మెయింటైన్ చేయడం కష్టమని, ఖర్చులను తట్టుకోవడం కూడా అనవసరమని చిరంజీవి క్యాంప్ లోని ముఖ్యులు చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ దిశగా ఇప్పటికే చిరంజీవి అడుగులు ముందుకు వేయడమే కాకుండా, తన తమ్ముడు నాగబాబు ద్వారా లోయర్ కేడర్ను బలోపేతం చేసే పనులలో నింగ్నమైనట్లు సమాచారం. అయితే ఈ పార్టీకి "చిరంజీవి" పార్టీ అని పెడదామని కొందరు భావిస్తుండగా, చిరంజీవి సన్నిహితులు మాత్రం "ఠాగూర్" పార్టీ అని నామకరణం చేస్తే బావుంటుందని భావిస్తున్నట్లు తెలిసింది.

నాగార్జున తనయునితో అనుష్క ’డేటింగ్’?

హీరో అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్యతో హీరోయిన్ అనుష్క డేటింగ్ చేస్తోంద? నిజం ఆ దేవునికే తెలియాలి, కానీ గత కొన్ని రోజులుగా టాలీవుడ్ మొత్తం ఇదే వార్తతో మారుమ్రోగిపోతోంది. నిజానికి నాగ చైతన్య వయసులో అనుష్క కన్నా చిన్నవాడు. అయినా ఇలాంటి రూమర్ ఎందుకు వస్తుందో తెలియడం లేదు. ప్రస్థుతం నాగార్జునతో అనుష్క "డాన్" చిత్రంలో నటిస్తోంది. సహజంగా అనుష్క కలుపుగోలుగా ఉండటం, నాగార్జున కూడా కలుపుగోలుగా ఉండే స్వభావం ఉండటం వల్ల వారు స్నేహంగా ఉండటం జరుగుతుంది. ఆ స్నేహం వారు కుటుంబ స్నేహితులయ్యేలా చేసిందని, తదనంతరం అనుష్క, నాగ చైతన్యల మధ్యన స్నేహం పెరిగి ఇప్పుడది "ప్రేమ" గా మారి, "డేటింగ్"కు దారి తీసిందని టాలీవుడ్ లో వినిపిస్తోంది. అయితే ఇదే విషయమై కొందరు సన్నిహితులు అనుష్కతో సంప్రదించగా "అలాంటిదేమీ లేదు, తనంటే కిట్టని వారు చేస్తున్న ప్రచారంగా" ఆమె దీనిని కొట్టిపడేస్తున్నారు. ప్రస్తుతం తొమ్మిది తెలుగు చిత్రాలలో నటిస్తున్న అనుష్క, ఈ మధ్యన తమిళ సినిమాలలో నటించమని వస్తున్న పలు అవకాశాలను తిరస్కరిస్తోంది. నాగ చైతన్యతో కొనసాగుతున్న "ప్రేమ" వల్లే ఇకపై చిత్రాలను ఆమె ఒప్పుకోవడం లేదని, లేదంటే ఆమె కొత్త చిత్రాల అవకాశాలను ఎందుకు తిరస్కరిస్తోందనే తర్కం టాలీవుడ్ లో కొనసాగుతోంది. సరే, కొత్తగా వచ్చిన ఈ వార్త ముందుముందు ఎక్కడికి దారితీస్తుందో చూద్దాం.
(పి.ఎస్.టి.ఎల్. సౌజన్యంతో)

’పశ్చిమ’లో రాజుకున్న రాజకీయం

కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై విజిలెన్స్ నిఘా!

పాడేరు ఫారెస్టులో నక్సల్స్ భేటీ?

ఉత్తరాంధ్రలో ’ఆపరేషన్ గజ’

అమ్మతోడు అడ్డంగా నరికేస్తాడు!

రాజమండ్రిలో మరో సెక్స్ రాకెట్!

తెలంగాణ ఊబిలో వైఎస్!

శ్రీకాకుళంలో ఎఫ్.ఎం. రేడియో కేంద్రం

శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలో ఎఫ్.ఎం. రేడియో స్టేషన్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ కార్పొరేట్ సంస్థ దీన్ని ఏర్పాటుచేసేందుకు ముందుకువచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఎఫ్.ఎం. స్టేషన్లను ఏర్పాటుచేసిన ఈ సంస్థ ఇప్పుడు తన కార్యకలాపాలను శ్రీకాకుళంలాంటి పట్టణాలకు విస్తరించాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇక్కడ రేడియో కేంద్రం ఏర్పాటవుతోంది.

పాత్రికేయుల ప్రాంతీయ పోరు!

(విశాఖపట్నం నుంచి ఎస్పీ)

ప్రత్యేక తెలంగాణ వాదన ఊపందుకున్న తర్వాత రాష్ట్రంలోని పాత్రికేయుల మధ్య వచ్చిన వేర్పాటువాదం ఇప్పుడు ఉత్తరాంధ్రకూ పాకింది. హైదరాబాదులాగే ఇక్కడి పాత్రికేయుల మధ్యా ప్రాంతీయ పోరు మొదలైంది. వివిధ పక్షాల మధ్య రాజుకుంటున్న ప్రాంతీయ పోరుకు మీడియా కూడా అతీతం కాదని నిరూపిస్తూ విశాఖ నగరానికి చెందిన కొంతమంది విలేఖరులు "ఉత్తరాంధ్ర అభివృద్ధి" పేరిట శనివారం సమావేశమై ప్రాంతీయ పోరుపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ పో(ఆ)రాటం వెనుకున్న ఆంతర్యం ఏమిటోగానీ ఇప్పుడు అందరిలోనూ ఒకటే చర్చకు దారితీసింది.

Monday, February 11, 2008

అవినీతిలో ఆంధ్రప్రదేశ్!

(హైదరాబాద్ నుంచి ప్రసాద్)

అవినీతిలో ఆంధ్రప్రదేశ్ పాత్రగురించి ఇటీవల పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. యువత మొదలు ముదుసలి వరకూ అందరూ అవినీతి గురించే మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ పాలనలో రాష్ట్రం అవినీతిమయమైందన్న ప్రతిపక్షాల విమర్శలకు ఊతమిచ్చేలా మంత్రుల అవినీతి పెరిగిపోయినట్లు ఇటీవల నిర్వహించిన ఒక సర్వే స్పష్టంచేస్తోంది. ఆర్ధిక మంత్రి రోశయ్య శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లా అవినీతి కూడా అంచనాలు దాటిపోయింది. పాలనా వ్యవస్థలో గత ప్రభుత్వ హయాంలో 23 నుంచి 28 శాతం మధ్య ఉన్న అవినీతి తాజాగా 40 నుంచి 45 శాతానికి పెరగడాన్ని బట్టే అవినీతి తీవ్రతను అంచనా వేయవచ్చు.