
విజయవాడలో విద్యార్థిని అయేషా హత్య కేసులో తన మనవడి పాత్రపై ఏ పరీక్షకైనా తాము సిద్ధమేనని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కోనేరు రంగారావు చెప్పారు. ఇప్పటికే తన మనవడికి అన్ని పరీక్షలు నిర్వహించారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అయేషా హత్య కేసులో కోనేరు రంగారావు మనవడి పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.అయేషా హత్య కేసులో తన కుటుంబ సభ్యులు పోలీసులకు అన్ని విధాలా సహకరించారని, విచారణకు కూడా హాజరయ్యారని ఆయన చెప్పారు. అయేషా హత్య కేసులో నిజాన్ని నిగ్గు దేల్చాలని ఆయన పోలీసులకు సూచించారు. అయేషా హత్య కేసులో కోనేరు రంగారావు కూతురు, మనవడు జాతీయ మానవ హక్కుల కమీషన్ ముందు కూడా హాజరయ్యారు.
No comments:
Post a Comment