నిరంతర వార్తా స్రవంతి

Wednesday, February 27, 2008

పట్టువీడని సీనియర్లు... సోనియాతోనే తేల్చుకుంటామని ప్రకటన!

తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో పని లేదని, తాము ఈ విషయాన్ని సోనియా గాంధీతోనే తేల్చుకుంటామని కాంగ్రెస్ తెలంగాణ సీనియర్లు అన్నారు. ఒంగోలులో కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణరావు మీడియా ప్రతినిధులతో అన్నారు. అయితే వీరప్ప మొయిలీ పిలిస్తే వెళ్తానని మరో సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. తెలంగాణపై చర్చించడానికి వీరప్ప మొయిలీ నుంచి తమకు ఎలాంటి పిలుపూ రాలేదని మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. తాము వీరప్పమొయిలీని కలిసే అవకాశం కూడా లేదని ఆయన చెప్పారు. సోనియాతోనే తేల్చుకుంటామని ఆయన చెప్పారు.ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ నాయకుడు ఎం. కోదండరెడ్డి అన్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రకటించిన చట్టబద్ద కమీషన్ ను తెలంగాణ నాయకులందరూ ఆహ్వానిస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని తిప్పికొట్టడానికి మార్చి 1వ తేదీ నుంచి సభలు పెడతామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. తన ఉనికిని కాపాడుకోవడానికే తెరాస రాజీనామాలు, సభలు వంటి కార్యక్రమాలు పెడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తెరాస ఆత్మస్థయిర్యాన్ని కోల్పోయిందని విమర్శించారు.

No comments: