నిరంతర వార్తా స్రవంతి

Wednesday, February 27, 2008

బెడిసికొట్టిన వైఎస్ వ్యూహం!

అంబేద్కర్ మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ద్వారా అపఖ్యాతి పాలైన కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను గుడ్డిగా వెనకేసుకు రావడం ద్వారా ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరో మారు అప్రదిష్ట పాలయ్యారు. గతంలో ఆయన తన వ్యక్తిగత సహాయకుడు సూరీడును గుడ్డిగా వెనకేసుకు వచ్చిన విషయం తెలిసిందే.రాజశేఖరరెడ్డి వ్యవహారశైలి మొదటి నుంచీ ఇదే విధంగా ఉంది. ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తన మంత్రులను, ఎమ్మెల్యేలను కూడా ఇదే విదంగా వెనకేసుకు వచ్చారు. తన మనుషుల మీద ఏ ఆరోపణలు వచ్చినా రెండు ప్రధాన దినపత్రికలను నిందించడం ఆయనకు అలవాటై పోయింది. 600 కోట్ల పెట్టుబడితో ఆయన వచ్చే నెలలో ప్రారంభించనున్న "సాక్షి" దినపత్రిక ద్వారా ఈ రెండు శత్రు సమాన దినపత్రికలను దుంప నాశనం చేయాలన్నది వైఎస్ ఆలోచనగా కన్పిస్తోంది.కార్పొరేట్ స్టైల్, అనుభవం ఉన్న సిబ్బంది "సాక్షి" ప్లస్ పాయింట్స్ కాగా, కాంగ్రెస్ దినపత్రిక కావడం మైనస్ పాయింట్. సమైక్యాంధ్ర పాలసీగా పెట్టుకున్న ఈ పత్రికకు తెలంగాణలో ఆదరణ సందేహాస్పదమే. చిరంజీవికి వ్యతిరేకంగా స్పెషల్ స్టోరీలను ప్లాన్ చేసుకుంటున్న ఈ పత్రికను లక్షలాది చిరంజీవి అభిమానులు ఆదరించే అవకాశాలు కన్పించడం లేదు.మరో వైపు ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త దినపత్రికలు "సాక్షి" నుంచి పోటీని తట్టుకోడానికి వివిధ రకాల వ్యాపార వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించాయి. "ఈనాడు" కంటే అధిక సర్క్యులేషన్ తో "సాక్షి" ని ప్రారంభించడానికి రంగం సిద్ధమైనా, కోట్లాది రూపాయల ఖర్చుతో చేస్తున్న యాడ్ క్యాంపెయిన్ పెద్ద ప్రభావం చూపడం లేదు.

No comments: