కానీ నీ దీక్ష అమోఘం ...
అందరూ రాత్రుల్ని కలల్తో పక్షుల్లా
పొడుస్తూ వుంటే నువ్వొక్కదానివి నీ
దీక్షతో వెలిగిస్తూ వుండిపోయేదానివి.
అందరూ మెత్తని వెన్నెలని కప్పుకుంటే
నువ్వు మాత్రం నా జ్ఙాపకాన్ని
వెచ్చగా కౌగిలించుకున్నావు .
నీకూ కలలకూ ఎడతెగని యుద్దం...
కాంక్షాభరిత భవిష్యత్ దృక్కోణాల్ని
నేను ఆవిష్కరించినపుడు నీలో ఎంత ఆరాటం.
ఆ అలసటలోనే మన ప్రపంచాల కోసం యెంత తపించావో కదా !
అనారోగ్యం నిన్ను తినేస్తున్నా
అలిసిపోయిన నీ చిర్నవ్వుల్లో నా కోసం యెంత హామీ !
నాకు తెలుసు...
యీ యుద్దం అసామాన్యమైందినూ, అనివార్యమైందీనూ .
యిది గెలవటం తప్పనిసరి కూడా!
అభినందనకి సిద్దంగా వుండమని చెప్పి నువ్వు యుద్దానికి వెళ్లావు.
గెలుపు నక్షత్రాలను నువ్వు చల్లుకుంటో దరహాసంతో తిరిగొచ్చేవేళ
వెలుగు రవ్వల హారాల్తో నిన్ను అభినందించడానికి నేను ఎదుర్చూస్తూ వుంటాను.
నిరంతర వార్తా స్రవంతి
Friday, March 21, 2008
అభినందన పత్రం!
యీ రాత్రికి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment