నిరంతర వార్తా స్రవంతి

Friday, March 14, 2008

పోలవరం ఆగిపోతే బాగుండు!

నేను: మామయ్యా పోలవరం ఏదో రకంగా ఆగిపోతే బాగుండు కదా
మామయ్య: ఎందుకు?
నేను: సగం ఖమ్మం జిల్లా మునిగిపోతుంది కదా
మామయ్య: అలా అనుకుంటే ఎలా! నాగార్జున సాగర్ కట్టినప్పుడు కూడా నలబై యాబై గ్రామాలు మునిగిపొయినాయి కానీ రాష్ట్రం ఎంత బాగుపడినదో నువ్వే చెప్పు
నేను: (అవును కదా) - (ఇంకేమీ మాట్లాడలేదు)


ఓ నెల క్రితం ఇంటికి వెళ్ళినప్పటి సంభాషణ
- పోలవరం కట్టాలి, కానీ త్యాగమూర్తులకు (బలవంతపు ) ...చాలా మంచి పరిహారం ఇవ్వాలి!- ప్రస్తుతము అయితే పరిహారపు నియమాలు చాలా దారుణముగా ఉన్నాయి అని విన్నాను, ఐదు ఆరు లక్షల ఇల్లు కేవలము యాబై వేలు మాత్రమే ఇచ్చి ఖాలీ చెయ్యమనడము దారుణ నియమాలలో ఒకటి :(

- పోలవరము కేవలము కాకినాడ ఇండస్ట్రియలు కారిడారునకు , వైజాకు ఇండస్ట్రియలు కారిడారునకు నీరు త్వరిత గతిన ఇవ్వడానికి మాత్రమే ఇంత వేగంగా కడుతున్నారు, దీనివల్ల తెలంగాణాకు ఒరిగేదేమీ లేదు ఖమ్మం జిల్లాలోని రెండు మూడు మండలాలకు తప్ప (మునిగిపోయే మండలాలను, మండల కేంద్రాలను బేరీజు వేస్తే ఆ లాభం కూడా చాలా తక్కువే!)॥ అందువల్ల ముందు దుమ్ముగూడెం మరియు ఇతర తెలంగాణా ప్రాజెక్టులను కట్టిన తరువాత మాత్రమే పోలవరం నిర్మించాలి, లేదా రెండింటిని నిస్పక్షపాతంతా సమాంతరంగా అయినా నిర్మించాలి! అనే కమ్యునిస్టుల వాదనతో నేను ఏకీభవిస్తున్నాను!

No comments: