నిరంతర వార్తా స్రవంతి

Friday, March 21, 2008

మనసులోనే మాజీ ప్రియునికి నివాళి!

శోభన్ బాబుకు, తమిళనాడు మాజీముఖ్యమంత్రి జయలలితకు మధ్య ఒకప్పుడు ఉన్న సాన్నిహిత్యం ఆ తరం వారందరికీ తెలుసు. వీరిద్దరూ అనేక సినిమాల్లో కలిసి నటించారు. చెన్నైలోనే ఉంటున్న శోభన్ బాబు మరణించినప్పుడు ఆమె ఇప్పటివరకు అంతిమ దర్శనం చేసుకోలేదు సరి కదా, సంతాప ప్రకటన కూడా విడుదల చేయలేదు.

ఒక దశలో శోభన్ బాబు ను జయలలిత పెళ్ళి చేసుకోవాలనుకున్నారని, అప్పటికే పెళ్ళయిన శోభన్ తటపటాయించి చివరికి నో చెప్పారని సినీ పరిశ్రమ వృద్ధులు ఇప్పటికీ చెబుతుంటారు. ఎమ్జీఆర్ జయలలితను చేరదీశే వరకు జయ, శోభన్ ల మధ్య సంబంధాలు కొనసాగాయి. ఎమ్జీఆర్ ఆమెను రాజకీయంగా పైకి తెచ్చారు. శోభన్ బాబుతో వ్యవహారం కొనసాగిస్తే తమిళ ప్రజలు తనను రాజకీయ నాయకురాలిగా ఆదరించరని గ్రహించిన ఆమె తన జీవితాన్ని ఎమ్జీఆర్ సేవకు అంకితం చేశారు. శోభన్ బాబు మృత దేహం వైపు ఆమె తొంగిచూడకపోవడానికి కారణాలు ఇవే అంశాలని తెలుస్తోంది.

No comments: