నిరంతర వార్తా స్రవంతి
Saturday, March 1, 2008
ఇంటిలోనే ప్రాథమిక చికిత్స కోసం
ఎవరికి ఎపుడు ఏ తరహా ప్రమాదం జరుగుతుందో తెలియదు. పెద్ద ప్రమాదాలయితే వైద్యుల వద్దకు వెళతాం కానీ ఇంటిలో కత్తి లేక బ్లేడుతో అకస్మాత్తుగా కోసుకోవడం, నిప్పు చేతిపై పడి కాలిపోవడం వంటివి జరిగితే పెద్దగా పట్టించుకోం. అదే కొద్ది రోజులకు పెద్దవై మనల్ని పలు రకాలుగా బాధిస్తుంది.ఇలా జరిగే సమయంలో కాస్త పౌడర్ చల్లుకోవడం, పసుపు రాసుకోవడమో, తడి వస్త్రాన్ని చేతికి చుట్టుకోవడమో చేస్తాం కానీ ఇంటిలోనే ప్రాథమిక చికిత్స చేసుకునేలా ఓ ఫస్ట్ ఎయిడ్‌కిట్ ఉంటే ఎంతమంచిదో ఆలోచించండి.జాయింట్లు, పాదాలు, చేతులకు చుట్టుకునే క్రేప్‌బ్యాండేజీలు, కాటన్‌బ్యాండేజీలు (వివిధ సైజులు), కాటన్‌రోల్ (గాయాలను శుభ్రం చేసేందుకు), ప్లాస్టర్ రోల్ (చిన్న చిన్న దెబ్బలకోసం చుట్టేవి), రెండు కత్తెర్లు, హ్యాండ్‌వాష్ సొల్యూషన్, యాంటీ సెప్టిక్‌లోషన్ వంటివి తప్పనిసరిగా ఉండాలి.అలాగే కొన్ని మంచి పెయిన్‌కిల్లర్స్, ఓ చిన్నగ్లూకోజు ప్యాకెట్, అయోడెక్స్ వంటి బెణుకులకు తక్షణ ఉపశమనం ఇచ్చే బామ్, ఓ చిన్న స్పూన్, .థర్మామీటర్ మీ మెడికల్‌కిట్‌లో ఉంటే మీరు దేనికీ కంగారుపడాల్సిన అవసరంఉండదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment