నిరంతర వార్తా స్రవంతి
Saturday, March 1, 2008
పవన్ సిఎంపిఎఫ్‌కు అభిమానుల అంబులెన్స్
అన్నయ్య (చిరంజీవి) కుమార్తె శ్రీజ ప్రేమ వివాహం నేపథ్యంలో నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సిఎంపిఎఫ్)కు ఆయన అభిమానులు ఓ అంబులెన్స్‌ను విరాళంగా అందించి తమ ప్రియతమ అభిమాన నటుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.అదే విధంగా పవన్ స్థాపించిన సిఎంపిఎఫ్‌కు సైతం ఆది నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. నగదు రూపంలో విరాళాలిచ్చేందుకు దాతలు సైతం ముందుకొస్తున్నారు. ఇక అభిమానులైతే చెప్పనక్కరలేదు. తమ యధాశక్తి సగటు వ్యక్తి సంక్షేమానికి చేయాల్సిన మంచి పనులు చేస్తున్నారు.కర్నూలు జిల్లాలోని నంద్యాలకి చెందిన ముగ్గురు వ్యక్తులు తమ పరిసర గ్రామాల్లోని ప్రజల కోసం సిఎంపిఎఫ్‌కు అంబులెన్స్‌ను విరాళంగా అందించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment