నిరంతర వార్తా స్రవంతి
Saturday, March 1, 2008
రాష్ట్రంలో మరో ఏడేళ్లలో లక్షలాదిగా ఉద్యోగాలు
ఐటి,ఐటిఇఎస్,టెక్స్‌టైల్స్,ఇంజనీరింగ్,కన్‌స్ట్రక్షన్,ఫార్మా,బయోటెక్ టూరిజం,హెల్త్ కేర్,ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లలో కొత్తగా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నట్టుగా భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడయింది.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో 2015 నాటికి కొత్తగా 80 లక్షల ఉద్యోగాలు ఏర్పడే అవకాశముంది.'మ్యాపింగ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ స్కిల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్' అనే అంశంపై ఈ అధ్యయనం నిర్వహించినట్టు సీఐఐ తెలిపింది. సాధారణ నైపుణ్యం,అత్యధిక నైపుణ్యం ఉన్న ఉద్యోగాలు కనీసం 45 లక్షలు, నైపుణ్యం పెద్దగా అవసరం లేని మామూలు ఉద్యోగాలు సుమారు 35 లక్షల మేర ఉంటాయని భావిస్తున్నట్టుగా ఈ అధ్యయనం వెల్లడించింది.అయితే అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే విద్యకు సంబంధించిన మౌలిక సదుపాయాలను పెంచడంతో పాటు శిక్షణ సౌకర్యాలను, వృత్తివిద్యా కోర్సులను పెద్ద ఎత్తున ప్రారంభించాల్సి ఉంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment