నిరంతర వార్తా స్రవంతి
Friday, March 14, 2008
ఇంత కర్కశత్వమా?
ఆ ప్రాంతాల్లో గర్భిణి స్త్రీ ఎవరైనా మరణిస్తే సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చెయ్యరట. గర్భిణి స్త్రీగా మరణించడాన్ని పాపంగా భావించి ఆ మృత దేహాన్ని అనాథ శవంలా ఎక్కడో పడేసి గాలికొదిలేస్తారట. అనంతపురం జిల్లా పుట్లూరు మండల వాసి అయిన 26 ఏళ్ల రమాదేవి అనే మహిళ పచ్చ కామెర్లతో మరణించగా, ఆమెకు పట్టిన ఈ గతి ప్రసారమాధ్యమాల దృష్టికి రావడంతో ఈ దురాచారం వెలుగులోకి వచ్చింది. మొత్తం మీద ఈ వ్యవహారం పోలీసులకు తెలిసి వారు అక్కడి ప్రజలను కలుసుకొని ఈ అనాగరిక చర్యను ప్రశ్నించడంతో ఆ శవాన్ని ఖననం చేసారు. కడప జిల్లాలోని ఆరెస్ కొండాపురం మండలంలోనూ ఇలాంటి దురాచారం కొనసాగుతోందట. ఆధునిక సమాజంలో నూతన విజ్ఞాన విను వీధిలో విహరిస్తున్నామని చెప్పుకునే మన సంఘం ఇలాంటి పరిణామాలకు వేదిక కావడం దురదృష్టకరం. ప్రజలను ఇలాంటి పరిస్థితుల నుంచి మేలుకొలిపే దిశగా మేథావులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలూ పూనుకోవాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment