నిరంతర వార్తా స్రవంతి
Friday, March 14, 2008
అక్రమ వ్యభిచారమట!
గ్రహచారం కాకపోతే... ఈ అక్రమ వ్యభిచారం ఏంటో ఆ వార్త చదవకముందు నా చిట్టి మట్టి బుర్రకు అంత త్వరగా అర్థం కాలేదు. సెక్స్ వర్కర్లకు లైసెన్సులు ఇచ్చి, వ్యభిచారాన్ని చట్టబద్ధం (సక్రమ వ్యభిచారం) చేసి, ఈ వర్గాన్ని కార్మికులుగా గుర్తించకపోతే బెంగాల్ శాసనసభ ఎన్నికలను బహిష్కరిస్తామంటూ కోల్‌కతలోని (అదే కలకత్తా) సెక్స్ వర్కర్లు కొన్నాళ్ల కిందట ఆందోళన చేపట్టారు(ఈ కోరిక నెరవేరిందో లేదో ఇంకా తెలీదు). ఓ పక్క ఎయిడ్స్ భూతాన్ని పెంచిపోషిస్తున్న వ్యభిచారమనేది ఘోరమైన సాంఘిక దురాచారం రా బాబూ అని గగ్గోలు పెడుతోంటే దీన్ని చట్టబద్ధం చేయాలని కోరడమేంటో, దానికొక లైసెన్స్ ఏమిటో, మనం ఎటుపోతున్నామో, ఓరి దేముడో నాకర్థంగావడంలేదు. ఈ సెక్స్ వర్కర్లు వ్యభిచార వృత్తిని వదలిపెట్టి సామాజికంగా గౌరవప్రదమైన మరో వృత్తిని చేపట్టి ముందంజ వేసేలా సహకరించేందుకు అందరూ ముందుకు రావాలనేది నా అభిలాష, ఆకాంక్ష.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment