అధికార పార్టీలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా చిరంజీవి రాజకీయ ప్రవేశాన్ని ఎవరూ ఆపలేరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చిరంజీవి ఉగాది నాడు రాజకీయ రంగ ప్రవేశం గురించి స్వయంగా ప్రకటిస్తారని మీడీయాలో వార్తలు వస్తున్నప్పటికీ, ఏప్రిల్ 14 న ఆయన బహిరంగ సభలో ఈ విషయం ప్రకటిస్తారని రూఢీగా తెలియవచ్చింది.
ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, శ్రీరామ నవమి, అయ్యప్ప జయంతి రావడంతో తన రాజకీయ రంగప్రవేశానికి అదే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని చిరంజీవి మార్గదర్శకులు అంటున్నారు.చిరంజీవి రాజకీయాలోకి రావాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు, పూజలు, యాగాలు జరుగుతున్నాయి.
నిరంతర వార్తా స్రవంతి
Friday, March 21, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment