నిరంతర వార్తా స్రవంతి

Friday, March 14, 2008

ఉర్దూ రాష్ట్రమా? ఇంకెన్ని ముక్కలు చేస్తారు?

భాషా ప్రయుక్త రాష్ట్రాలున్న మన దేశంలో ఉర్దూ మాట్లాడే వారికి ఒక రాష్ట్రం ఏర్పడాలని మజ్లిస్ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ పాపం ఆవేదన చెందుతున్నారు. స్వతంత్రోద్యమ సమయంలో భారతదేశంలోని ముస్లింలకు అన్యాయం జరిగిపోతోందన్న జిన్నాగారి డిమాండ్ ఫలితంగానే కదా ఉర్దూ జాతీయ భాషగా కలిగిన పాకిస్తాన్ ఆవిర్భవించింది ? మళ్లీ భారతదేశంలో ఇంకో ఉర్దూ రాష్ట్రం అనడంలో అసదుద్దీన్ ఓవైసీ ఉద్దేశం ఏమిటో అర్ధం కావడంలేదు. కావాలనుకుంటే వారి కోసమే ఏర్పాటైన పాకిస్తాన్ వెళ్లిపోవచ్చు కదా. అసలు చెప్పాలంటే మన దేశంలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ ఉన్న పాతికకు పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న కోట్లాది ముస్లింలు అందరూ ఆయా ప్రాంతీయ భాషలతో పాటు ఉర్దూ మాట్లాడతారు. ఈ కోటాను కోట్లమంది ముస్లింలందరూ ఆయా రాష్ట్రాలను విడిచి పెట్టి అసదుద్దీన్ గారి కోరిక ప్రకారం హైదరాబాద్, సైబరాబాద్‌లతో ఏర్పడాలంటున్న ఉర్దూ రాష్ట్రానికి వచ్చేయాలా ? మన దేశంలో ఇప్పటికే కాశ్మీరు రాష్ట్రం దాదాపు పూర్తిగా ముస్లిం జనాభా ప్రాబల్యంతో, ఉర్దూ భాష ప్రధానంగా ఉన్నందున అసదుద్దీన్ గారు, ఆయన అనుచరగణం అక్కడికి వెళ్లవచ్చు. ఓ పక్క తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ నిరశన జ్వాలలు రగులుతుండగా, మరో పక్క ఆంధ్ర, రాయలసీమలనూ ప్రత్యేక రాష్ట్రాలుగా చెయ్యాలంటూ రంకెలేస్తున్న నేతల గళాలు విభజన గరళాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రాష్ట్రాన్ని ఇంకెన్ని ముక్కలు చేస్తారు ? ఈ నేతలకు పరమత సహనం లేదా ? కుల మత భాషా భేదాలను విడిచిపెట్టరా ? ఐక్యతకు అర్థం తెలీదా ?

No comments: