నిరంతర వార్తా స్రవంతి
Friday, March 14, 2008
ఆమెకు నిప్పంటించాడు... అతనూ బలయ్యాడు
అనంతపురం జిల్లా యాడికి గ్రామంలో జరిగిందిది. ఇక్కడి నారాయణ స్వామి కాలనీలో కాపురముంటున్న భాస్కర్ (40), చంద్రకళ (35) దంపతులకు ఇద్దరమ్మాయిలు, ఒకబ్బాయి. వ్యాపారంలో నష్టాలు రావడంతో మద్యానికి బానిసైన భాస్కర్ భార్యతో గురువారం గొడవపడ్డాడు. పిల్లలు పాఠశాలకు వెళిపోగా వీళ్ల గొడవ ఎవరికీ వినబడకుండా టీవీ శబ్దం పెంచి అరుచుకున్నారు. ఒక దశలో చంపుతానని భాస్కర్ తన భార్య చంద్రకళను బెదిరించగా... చంపు చూద్దామని భార్య కూడా అనడంతో రెచ్చిపోయిన భాస్కర్ ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటలు ఎగసిపడగా కాలిపోతున్న చంద్రకళ తనపై కిరోసిన పోసిన భర్త భాస్కర్‌ను గట్టిగా కౌగలించుకుంది. ఫలితంగా రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి. పిల్లలు నడిరోడ్డున పడ్డారు. సంయమనం లేని కారణంగా ఓ నిండు కుటుంబం అంతమైపోయింది. అందుకే.... కోపావేశాలను పెకలించి, నిగ్రహానికి చోటివ్వండి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment