నిరంతర వార్తా స్రవంతి

Friday, March 14, 2008

రక్షించిన ద్వారము పై రక్తము..!

భయంకర యుద్ద సమయంలో ఓ క్రూర కమాండర్ ఓ గ్రామము లోని ప్రతి ఇంటిలో నివసించే అందరిని చంపాలని నిర్ణయించాడు. తన నిర్ణయాన్ని అమలు పరచాలని తన సైనికులకు అదేశించాడు.ఆ సైనికులు ఇంటిలోని అందరిని చంపినతరవాత ఆ యింటిలో అందరు చంపబడినారు అని గుర్తుగా ఆ యింటి ద్వారము పై రక్తమును చల్లేవారు. దానితొ ఆ యింటిలో అందరు చంపబడినారు అని గుర్తుగా భావించారు. ఈ విషయన్ని గమనించిన ఓ యువకుడు, తాను, తన స్నేహితులు దాగుకొనియున్న ఇంటిలోకి వెళ్ళి, ఇంటిలోనున్న 'మేకాను చంపి దాని రక్తమును ఇంటి ద్వారముపై పూసెను. ఇంతలో అటువచ్చిన సైనికులు ఆ రక్తమును చూచి ఆ ఇంటిలో అందరు చంపబడ్డరన్న తలంపుతో ఆ ఇంటిలోనికి వెల్లకుండా వేరె ఇంటివైపు సాగిపోయారు. అయితే, 'మెకా రక్తముతో పూయబడిన తలుపు గల ఇంటిలోని యువకులు అతని స్నేహితులు మాత్రము మరణము నుండి రక్షింపబడినారు./ తప్పించుకోగలిగారు. నిర్ణయించుకోండి! మీరే గనక అటువంటి యుద్ధ పరిస్తితుల్లో ఉండినట్లైన, 'మెకా తక్తముతో పూయబడిన ఇంటిలో దాగుగొనుటకు ఆలస్యము చేయకుందువు కదా! "మరణము, తీర్పు" అనేవి ప్రతి ఒక్కరికి సంభవించును. అయెతే, తీర్పులోనికి రాకుండా "యేసు" తక్తము ద్వార తప్పింపబడుటకు చాలమంది నిరాకరిస్తున్నారు. బైబిలు చెబుతుంది "పాపము వలన వచ్చు జీతము మరణము" (రోమా 6:23) మరియు "మరణమైన తర్వాత తేర్పు జరుగును." (హెబ్రీ 9:27) మీయోక్క పాపములకు తగిన శిక్ష ఒక క్రూరమైన యుద్ధ కమాండర్ ద్వార కాదు గాని ఒక నీతిమంతుడైన దేవుడు, పాపమును ద్వేషించే దేవుని నుండి. అయెతే ఆయనే నీవు నీ శిక్షనుండి తప్పింపబడుతకు ఒక చక్కని మార్గమును చూపిస్తున్నాడు. యుద్ధసమయములో తప్పింపబడిన యువకులవలే నీవు కూడ యేసు రక్తము ద్వారా నీవు తప్పింపబడుదువు. ఆయన సమస్త జనముల పాపముల ప్రాయశ్చిత్తమై మరణించెను. నిర్గమకాండము 12వ అధ్యాయములో "నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయెదను." అటువంటి రక్షణార్ధమైన రక్తమును నీవు ఆశ్రయించాలనుకోవడంలేదూ..? "యేసు రక్తము ప్రతిపాపమునుంది మనలను కడిగి పవిత్రపరచును.

No comments: