నిరంతర వార్తా స్రవంతి
Saturday, March 1, 2008
పాక్‌తో పోల్చితే భారత్‌కే ప్రాధాన్యం: అమెరికా
పాకిస్థాన్‌తో పోల్చితే భారత్‌తో సంబంధాలకే తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని అమెరికా పేర్కొంది. భారత్ ప్రపంచ స్థాయి పలుకుబడితో మంచి శక్తివంతమైన దేశంగా అవతరిస్తున్న నేపధ్యంలో ఆ దేశంతో విస్తృత సంబంధాలు ఎంతో ముఖ్యమని భావిస్తున్నామని తెలిపింది.అమెరికా రక్షణ శాఖ ఉప సహాయ మంత్రి (దక్షిణ, ఆగ్నేయాసియా వ్యవహారాలు) జేమ్స్ క్లాడ్ వాషింగ్టన్ నుంచి టెలీ కాన్ఫరెన్స్‌లో విలేకరులతో మాట్లాడుతూ భారత్, అమెరికాలు వ్యూహాత్మక సామర్థ్యం దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఎంతో ముఖ్యం కాగలవన్నారు.ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్‌కై గాలిస్తున్న పాక్ తీవ్రవాదంపై అంతర్జాతీయ పోరులో సాయం అందిస్తున్నప్పటికీ భారత్‌తో తాము దీర్ఘకాలిక సంబంధాలే ప్రయోజనకరంగా ఉండగలవని భావిస్తున్నామని ఆయన చెప్పారని అమెరికన్ ఫోర్సస్ ప్రెస్ సర్వీసెస్ తెలిపింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment