నిరంతర వార్తా స్రవంతి
Friday, March 14, 2008
హోమ్ నర్సింగ్!
దీర్ఘకాలిక రోగాలు, ప్రమాదాలు లేదా వృద్ధాప్యం కారణంగా రోజు ఆసుపత్రుల చుట్టూ తిరగలేని వారికి వైద్య సేవలందించేందుకు ఇటీవల కాలంలో హోమ్ హెల్త్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. వైద్య రంగంలో నిపుణులైన వైద్యులు, నర్సులు ఒక బృందంగా ఏర్పడి అన్ని వయసుల వారికీ 24 గంటలూ ఇళ్లలోనే వైద్య సేవలందించేలా సంస్థలను నడుపుతున్నారు. ఇప్పటికే మన దేశంలోని పలు నగరాల్లో ప్రారంభమైన ఈ సంస్థల సేవలు మధ్య తరగతి వారికీ అందుబాటులో ఉంటున్నాయట. తగినన్ని మందులు, సామగ్రితో ఎప్పుడూ సిద్ధంగా ఉండి రోగులకు వైద్యపరంగా ఏ సమయంలో ఏ అవసరం వచ్చినా చేయూతనిచ్చేందుకు ఈ సంస్థల సిబ్బంది ఎల్లప్పూడూ సన్నద్ధంగా ఉంటార్ట. మొత్తం మీద వైద్య రంగంలోని నిరుద్యోగులకు ఇదో ఉద్యోగావకాశం, రోగులు సావకాశంగా మేలైన సేవలు పొందే సదవకాశం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment