శోభన్ బాబు | |
జన్మ నామం | ఉప్పు శోభానా చలపతి రావు |
---|---|
జననం | జనవరి 14, 1937 చిన నందిగామ (కృష్ణ జిల్లా ,మైలవరం సమీపంలో ఉంది),ఆంధ్రప్రదేశ్ |
మరణం | మార్చి 20, 2008 చెన్నై గుండెపోటు |
నివాసం | చెన్నై |
ఇతర పేర్లు | నటభూషణ,సోగ్గాడు |
వృత్తి | నటన |
భార్య/భర్త | శాంత కుమారి |
సంతానం | కరుణా శేషు,(కుమారుడు),మృదుల నివేదిత,ప్రశాంతి(కుమార్తెలు) |
తండ్రి | ఉప్పు సూర్య నారాయణ రావు |
బాల్యం
శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. ఆయన జనవరి 14, 1937న కృష్ణా జిల్లా తెలివిదేవరపాడులో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణ రావు. మైలవరం హైస్కూల్లో చదివేరోజుల్లో శోభన్ బాబు నాటకాల పైన ఆసక్తి పెంచుకొని అనతికాలంలో మంచి నటుడిగా పేరు పొందాడు. హైస్కూలు చదువు పూర్తి అయిన తర్వాత విజయవాడలో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చదువు పూర్తి చేసాడు.
సినీరంగ ప్రవేశం
మద్రాసులో లా కోర్సులో చేరినప్పటికీ నటన పైన ఆసక్తితో మధ్యలో ఆపివేసి సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అప్పుడే తన పేరును శోభన్ బాబుగా మార్చుకున్నాడు. 1960లో భక్త శబరి చిత్రంలో రామునిగా నటించి తెరంగ్రేటం చేసాడు. ఆయన నటనకు మంచి పేరు వచ్చినా, చిత్రం విజయం సాధించకపోవడంతో అవకాశాలు రాలేదు. అప్పటికే పెళ్ళయి భార్య పిల్లలతో ఉన్న శోభన్ బాబు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న పాత్రలను కూడా పోషించసాగాడు. అందులో శోభన్ బాబుకు మంచి పేరు తెచ్చిన పాత్రలు: అభిమన్యుడిగా నర్తనశాలలో, అర్జునుడుగా భీష్మలో, లక్ష్మణుడుగా సీతారామకల్యాణంలో.
విజయపరంపర
శోభన్ బాబు వీరాభిమన్యు చిత్రంలో హీరోగా అభిమన్యుడి పాత్రలో తన నటనా చాతుర్యాన్ని చాటిచెప్పాడు.వెంటనే లోగుట్టు పెరుమాళ్ళకెరుక సినిమాలో సోలో హీరోగా నటించాడు. అది విజయం సాధించడంతో మరిన్ని అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. ఆ తర్వాత మనుషులు మారాలి, చెల్లెలి కాపురం, దేవాలయం, కళ్యాణ మంటపం, మల్లెపువ్వు మొదలయిన చిత్రాల ఘన విజయాలతో అగ్ర నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకొన్నాడు.
వైవిధ్యం
అనతి కాలంలో దేవత, పండంటి కాపురం, కార్తీక దీపం వంటి కుటుంబ కథా చిత్రాలలో నటించి మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయకుడయ్యాడు. దాదాపు అన్ని కుటుంబ చిత్రాలలో బాధ్యత గల కుటుంబ పెద్దగా, భార్యను ప్రేమించి గౌరవించే వ్యక్తిగా గౌరవప్రదమయిన పాత్రలు పోషించాడు. అప్పట్లో అమ్మాయిలు తమకు కాబోయే భర్త శోభన్ బాబులా అందగాడు మాత్రమే కాకుండా ఆయన పోషించే పాత్రల వ్యక్తిత్వం కలిగి ఉండాలని కోరుకొనేవారు!
రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు మొదలయిన పౌరాణికి పాత్రలే కాకుండా కొన్ని జానపద చిత్రాల్లో కూడా నటించాడు. అప్పటికే అగ్ర హీరోగా ఉన్నా, కాంబినేషన్ చిత్రాలలో ఎటువంటి భేషజాలు లేకుండా సాటి హీరోలతో నటించేవాడు. కొన్ని కాంబినేషన్ చిత్రాలు: ఎన్‌టీ్ఆర్ తో: ఆడపడుచు, విచిత్ర కుటుంబం. అక్కినేని నాగేశ్వరరావుతో: పూలరంగడు, బుద్ధిమంతుడు. కృష్ణతో: మంచి మిత్రులు, ఇద్దరు దొంగలు
ఆయనకున్న బిరుదులు: నటభూషణ, సోగ్గాడు, ఆంధ్రా అందగాడు.
ఆణిముత్యాలు
శోభన్ బాబు నటజీవితంలో ఎన్నో చిత్రాలు ఘనవిజయం సాధించి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కొన్ని తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి.
- మనుషులు మారాలి: యావత్ తెలుగు సినీ అభిమానులను ఉలిక్కిపడేలా చేసిన ఈ సినిమాలో కార్మిక నాయకుడిగా శోభన్ బాబు నటన అద్వితీయం. ఈ సినిమా అప్పట్లో 25 వారాలు ఆడింది.
- చెల్లెలి కాపురం: అప్పటికే అందాల నటుడిగా ఆంద్రలోకమంతా అభిమానులను సంపాదించుకున్న శోభన్ బాబు నట జీవితంలో ఈ చిరం కలికితురాయి. అంద వికారుడయిన రచయితగా చెల్లెలి కోసం తాపత్రయ పడే అన్నగా ఆయన నటన చిరస్మరణీయం.
- ధర్మపీఠం దద్దరిల్లింది: తన కన్న కొడుకులు ముగ్గురూ అవినీతికి పాల్పడుతుంటే చూసి సహించలేక ముగ్గురినీ అంతంచేసే తండ్రిగా శోభన్ బాబు ప్రదర్శించిన నటన అసామాన్యం.
అవార్డులు-రివార్డులు
- ఫిల్మ్ ఫేర్ అవార్డు: 1971, 1974, 1976, 1979
- ఉత్తమ నటుడిగా నంది అవార్డు: 1969, 1971, 1972, 1973, 1976
- సినీగోయెర్స్ అవార్డు: 1970,1971,1972,1973,1974,1975,1985,1989
- వంశీ బర్కిలీ అవార్డు: 1978, 1984, 1985
- కేంద్ర ప్రభుతం చేత ఉత్తమ నటుడు అవార్డు: బంగారు పంజరం సినిమాకు 1970లో
వ్యక్తిగత జీవితం
శోభన్ బాబుకు మే 15, 1958న కాంత కుమారితో వివాహమయినది. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. వారి పేర్లు: కరుణ శేషు, మృదుల, ప్రశాంతి, నివేదిత. సినీరంగంలో ఉన్నా, ఆయన ఎన్నడూ ఎటువంటి వ్యసనాలకు లోను కాలేదు. ప్రతిరోజు సాయంత్రం షూటింగ్ అయిన వెంటనే ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులతో సమయం గడిపేవాడు. వృత్తికంటే కుటుంబంతో గడపడానికే ప్రాధాన్యతనిస్తూ అదే విషయాన్ని తోటినటులకు చెప్పేవాడు. ఆయన తన సంతానాన్ని ఎన్నడూ సినీరంగంలోకి తీసుకొని రాలేదు. వయసు పైబడుతున్నపుడు కూడా హీరోగా నటించాడే తప్ప చిన్న పాత్రలు పోషించలేదు. వ్యక్తిగా శోభన్ బాబు చాలా నిరాడంబరుడు. ఎంతో డబ్బు సంపాదించినా ఎన్నడూ ఆడంబర జీవితం గడపలేదు. డబ్బును పొదుపు చేయడంలో మరియు మదుపు చేయడంలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ఎందరికో సహాయాలు, దానాలు చేసినా, ఎందరికో ఇళ్ళు కట్టించినా ప్రచారం చేయించుకోలేదు.
చివరి దశ
ఎన్నటికీ ప్రేక్షలు మనసులో అందాల హీరోగా ఉండిపోవాలని భావించిన శోభన్ బాబు 220 పైగా చిత్రాలలో నటించి 1996లో విడులయిన హలో..గురూ చిత్రంతో తన 30 ఏళ్ళ నటజీవితానికి స్వస్థి చెప్పి చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడిపేవాడు. శోభన్ బాబు 2008, మార్చి 20 ఉదయం గం.10:50ని.లకు చెన్నై లో దివంగతులయ్యారు.
100రోజులు పైన ఆడిన చిత్రాలు (సెంటరులు)
- వీరాభిమన్యు (11)
- పొట్టిప్లీడరు (2)
- మనుషులు మారాలి (7)
- తాసిల్దారుగారి అమ్మాయి (6)
- సంపూర్ణ రామాయణం (8)
- జీవన తరంగాలు (2)
- పుట్టినిల్లు మెట్టినిల్లు (2)
- అందరూ దొంగలే (3)
- మంచిమనుషులు (10)
- జేబుదొంగ (9)
- సోగ్గాడు (19)
- మల్లెపూవు (1)
- కార్తీకదీపం (10)
- జూదగాడు (5)
- గోరింటాకు (9)
- కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త (2)
- పండంటి జీవితం (4)
- ఇల్లాలు (8)
- మహారాజు (1)
- ఖైదీ బాబాయ్ (2)
- ఇల్లాలు ప్రియురాలు (8)
- ప్రేమ మూర్తులు (2)
- దేవత (17)
- ముందడుగు (17)
- సర్పయాగం (1)
- ఏవండీ ఆవిడ వచ్చింది (2)
నటించిన సినిమాలు
క్ర. సం. | సంవత్సరం | చ్రిత్రం పేరు | కథానాయిక | దర్శకుడు |
1 | 1959 | దైవబలం | వసంతకుమార్ రెడ్డి | |
2 | 1960 | భక్త శభరి | చైత్రపు నారాయణ రావు | |
3 | 1961 | సీతారామ కళ్యాణం | యన్.టి. రామారావు / యన్.ఎ.టి. యూనిట్ | |
4 | 1962 | భీష్మ | బి.ఎ. సుబ్బారావు | |
5 | 1962 | మహామంత్రి తిమ్మరుసు | కమలాకర కామేశ్వరరావు | |
6 | 1963 | ఇరుగు-పొరుగు | టి.యన్. మూర్తి | |
7 | 1963 | సోమవార వ్రత మహత్యం | ఆదోని లక్ష్మి | ఆర్.యమ్.కృష్ణస్వామి |
8 | 1963 | పరువు ప్రతిష్ట | మనపురమ్ | |
9 | 1963 | లవకుశ | సి.పుల్లయ్య / సి.యస్.రావు | |
10 | 1963 | చదువుకున్న అమ్మాయిలు | సావిత్రి | ఆదుర్తి సుబ్బారావు |
11 | 1963 | నర్తనశాల | యల్. విజయలక్ష్మి | కమలాకర కామేశ్వరరావు |
12 | 1964 | నవగ్రహ పూజామహిమ | బి. విఠలాచార్య | |
13 | 1964 | కర్ణ (తమిళం) | బి.ఆర్. పంతులు | |
14 | 1964 | దేశద్రోహులు | బొల్లా సుబ్బారావు | |
15 | 1964 | మైరావణ | బి.ఎ. సుబ్బారావు | |
16 | 1965 | సుమంగళి | జయంతి | ఆదుర్తి సుబ్బారావు |
17 | 1965 | ప్రమీలార్జున యుద్దమ్ | వాణిశ్రీ | యం. మల్లికార్జున రావు |
18 | 1971 | ప్రతిజ్ఞాపాలన | సి.యస్. రావు | |
19 | 1965 | వీరాభిమన్యు | కాంచన | వి. మధుసూధన రావు |
20 | 1966 | శ్రీకృష్ణ పాండవీయం | యన్.టి. రామారావు | |
21 | 1966 | లోగుట్టు పెరుమాళ్ళకెరుక | రాజశ్రీ | కె.యస్.ఆర్. దాస్ |
22 | 1966 | పరమానందయ్య శిశ్యుల కధ | అత్తిలి లక్ష్మి | సి. పుల్లయ్య |
23 | 1966 | పొట్టి ప్లీడర్ | గీతాంజలి | కె.హేమాంభరధర రావు |
24 | 1966 | భక్త పోతన | కె.ఆర్.విజయ | జి. రామినీడు |
25 | 1966 | గూడఛారి 116 | మల్లికార్జున రావు | |
26 | 1967 | పిన్ని | విజయ నిర్మల | బి.ఎ. సుబ్బారావు |
27 | 1967 | శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న | రాజశ్రీ | కె. హేమాంభరధర రావు |
28 | 1967 | సత్యమే జయమ్ | రాజశ్రీ | పి.వి. రామారావు |
29 | 1967 | ప్రైవేట్ మాష్టర్ | కె. విశ్వనాధ్ | |
30 | 1967 | శ్రీకృష్ణావతారం | కమలాకర కామేశ్వరరావు | |
31 | 1967 | పుణ్యవతి | దాదా మిశ్రి | |
32 | 1967 | ఆడపడుచులు | వాణిశ్రీ | కె. హేమాంభరధర రావు |
33 | 1967 | రక్త సింధూరం | పండరీభాయి | సీ. సీతారామ్ |
34 | 1967 | కాంభోజరాజు కధ | రాజశ్రీ | కమలాకర కామేశ్వరరావు |
35 | 1967 | పూలరంగడు | విజయ నిర్మల | ఆదుర్తి సుబ్బారావు |
36 | 1968 | బార్య | వాణిశ్రీ | కే. యస్. ప్రకాశ రావు |
37 | 1968 | చుట్టరికాలు | లక్ష్మి | పేకేటి శివరామ్ |
38 | 1968 | మన సంసారం | భారతి | సి.యస్. రావు |
39 | 1968 | లక్ష్మి నివాసం | భారతి | వి. మధుసూధన రావు |
40 | 1968 | పంతాలు-పట్టింపులు | వాణిశ్రీ | కె.బి. తిలక్ |
41 | 1968 | జీవిత బంధం | యమ్.యస్. గోపీనాథ్ | |
42 | 1968 | వీరాంజనేయ | కమలాకర కామేశ్వరరావు | |
43 | 1968 | కలసిన మనసులు | భారతి | కమలాకర కామేశ్వరరావు |
44 | 1968 | కుంకుమ భరిణె | వేదాంతం రాఘవయ్య | |
45 | 1969 | మంచి మిత్రులు | టి. రామారావు | |
46 | 1969 | బంగారు పంజరం | వాణిశ్రీ | బి.యన్. రెడ్డి |
47 | 1969 | విచిత్ర కుటుంబం | షీలా | కే. యస్. ప్రకాశ రావు |
48 | 1969 | సత్తెకాలపు సత్తెయ్య | రాజశ్రీ | కే. యస్. ప్రకాశ రావు |
49 | 1969 | బుద్దిమంతుడు | విజయ నిర్మల | బాపు |
50 | 1969 | నిండు హృదయాలు | గీతాంజలి | కె. విశ్వనాథ్ |
51 | 1969 | మనుష్యులు మారాలి | శారద | వి. మధుసూధన రావు |
52 | 1969 | మాతృదేవత | చంద్రకళ | సావిత్రి |
53 | 1969 | కన్నుల పండగ | కె.ఆర్. విజయ | అనిశెట్టి |
54 | 1969 | తారాశశాంకం | దేవిక | మనపురం |
55 | 1969 | ప్రతీకారం | సంద్యారాణి | యమ్. నాగేశ్వర రావు |
56 | 1970 | భలే గూడచారి | సునంద | హోమి వదయ |
57 | 1970 | పెత్తందార్లు | సి.యస్. రావు | |
58 | 1970 | ఇద్దరు అమ్మాయిలు | వాణిశ్రీ | పుతన్న |
59 | 1970 | మా మంచి అక్కయ్య | కె.ఆర్. విజయ | వి. రామచంద్ర రావు |
60 | 1970 | పసిడి మనుష్యులు | శారద | సుబ్రమణ్యమ్ |
61 | 1970 | జగజ్జెట్టీలు | వాణిశ్రీ | కె.వి. నందన రావు |
62 | 1970 | తల్లిదండ్రులు | వై.విజయ | కె.బాబూరావు |
63 | 1970 | మాయని మమత | లక్ష్మి | కమలాకర కామేశ్వరరావు |
64 | 1970 | ఇంటి గౌరవం | ఆరతి | బాపు |
65 | 1970 | దేశమంటే మనుషులోయ్ | చంద్రకళ | సి.ఎస్.రావు |
66 | 1970 | మూగ ప్రేమ | విజయ లలిత | జి.రామినీడు |
67 | 1970 | కథానాయకురాలు | వాణిశ్రీ | గిడుతూరి సూర్యం |
68 | 1970 | విచిత్ర దాంపత్యం | విజయ నిర్మల | పి.చంద్ర శేఖర రెడ్డి |
69 | 1970 | దెబ్బకు ఠా దొంగల ముఠా | వాణిశ్రీ | సుబ్రహ్మణ్యం |
70 | 1971 | సతీ అనసూయ | జమున | బి.ఎ.సుబ్బారావు |
71 | 1971 | సిసింద్రీ చిట్టిబాబు | శారద | ఎ.సంజీవి |
72 | 1971 | కళ్యాణ మండపం | కాంచన | వి.మధుసూదన రావు |
73 | 1971 | తాసిల్దారు గారి అమ్మాయి | జమున | కే. యస్. ప్రకాశ రావు |
74 | 1971 | బంగారు తల్లి | వెన్నిరాడై నిర్మల | తాపీ చాణక్య |
75 | 1971 | నా తమ్ముడు | భారతి | కే. యస్. ప్రకాశ రావు |
76 | 1971 | చిన్ననాటి స్నేహితులు | వాణిశ్రీ | కె.విశ్వనాధ్ |
77 | 1971 | రామాలయం | విజయ నిర్మల | కె.బాబూరావు |
78 | 1971 | కూతురు కోడలు | విజయలలిత | పి. లక్ష్మిదీపక్ |
79 | 1971 | తల్లీ కూతుళ్ళు | కాంచన | జి.రామినీడు |
80 | 1971 | జగజ్జెంత్రీలు | వాణిశ్రీ | పి.లక్ష్మిదీపక్ |
81 | 1972 | వంశోద్ధారకుడు | కాంచన | పి.సాంబశివరావు |
82 | 1972 | కిలాడి బుల్లోడు | చంద్రకళ | నందమూరి రమేష్ |
83 | 1972 | శాంతి నిలయం | చంద్రకళ | వైకుంఠ శర్మ |
84 | 1972 | కన్నతల్లి | చంద్రకళ | టి.మాధవరావు |
85 | 1972 | అమ్మ మాట | వాణిశ్రీ | కమలాకర కామేశ్వరరావు |
86 | 1972 | సంపూర్ణ రామాయణం | చంద్రకళ | బాపు |
87 | 1972 | మానవుడు-దానవుడు | శారద / రీనా | పి.చంద్రశేఖర రెడ్డి |
88 | 1972 | కాలం మారింది | శారద | కె.విశ్వనాధ్ |
89 | 1973 | పెద్దకొడుకు | కాంచన | కె.ఎస్.ప్రకాశ రావు |
90 | 1973 | పుట్టినిల్లు-మెట్టినిల్లు | చంద్రకళ | పట్టు |
91 | 1973 | మైనర్ బాబు | వాణిశ్రీ | టి.ప్రకాశరావు |
2 | 1973 | జీవన తరంగాలు | వాణిశ్రీ | టి.రామారావు |
93 | 1973 | శారద | శారద, జయంతి | కె.విశ్వనాధ్ |
94 | 1973 | జీవితం | జయంతి | కే. యస్. ప్రకాశ రావు |
95 | 1973 | డాక్టర్ బాభు | జయలలిత | టి.లెనిన్ బాబు |
96 | 1973 | ఇదా లోకం | శారద | కె.ఎస్.ప్రకాశ రావు |
97 | 1974 | కోడె నాగు | చంద్రకళ, లక్ష్మి | కే. యస్. ప్రకాశ రావు |
98 | 1974 | కన్నవారి కలలు | వాణిశ్రీ, లత | ఎస్.ఎస్.బాలన్ |
99 | 1974 | ఖైదీ బాబాయ్ | వాణిశ్రీ | టి.కృష్ణ |
100 | 1974 | గంగ-మంగ | వాణిశ్రీ | తాపీ చాణక్య / వి.రామచంద్రరావు |
101 | 1974 | అందరూ దొంగలే | లక్ష్మి | వి.బి.రాజేంద్ర ప్రసాద్ |
102 | 1974 | చక్రవాకం | వాణిశ్రీ | కే. యస్. ప్రకాశ రావు |
103 | 1974 | మంచి మనుషులు | మంజుల | వి.బి.రాజేంద్ర ప్రసాద్ |
104 | 1975 | అందరూ మంచివారే | మంజుల | యస్.యస్. బాలన్ |
105 | 1975 | దేవుడు చేసిన పెళ్ళి | శారద | ఎమ్.ఎస్.రెడ్డి |
106 | 1975 | బాబు | వాణిశ్రీ | కే. రాఘవేంద్ర రావు |
107 | 1975 | జీవన జ్యోతి | వాణిశ్రీ | కె.విశ్వనాధ్ |
108 | 1975 | బలిపీఠం | శారద | దాసరి నారాయణరావు |
109 | 1975 | జేబు దొంగ | జయసుధ | వి.మధుసూదనరావు |
110 | 1975 | గుణవంతుడు | మంజుల | ఆదుర్తి సుబ్బారావు |
111 | 1975 | సోగ్గాడు | జయచిత్ర, జయసుధ | కె.బాపయ్య |
112 | 1976 | పిచ్చిమారాజు | మంజుల | వి.బి.రాజేంద్ర ప్రసాద్ |
113 | 1976 | ఇద్దరూ ఇద్దరే | మంజుల | వి.మధుసూదనరావు |
114 | 1976 | రాజా | కే. రాఘవేంద్ర రావు | |
115 | 1976 | ప్రేమబంధం | వాణిశ్రీ | కె.విశ్వనాధ్ |
116 | 1976 | పొగరుబోతు | వాణిశ్రీ | టి.ప్రకాశరావు |
117 | 1976 | మొనగాడు | జయసుధ, మంజుల | టి.కృష్ణ |
118 | 1976 | రాజు వెడలె | జయసుధ | టి. రామారావు |
119 | 1977 | కురుక్షేత్రం | లత | కమలాకర కామేశ్వరరావు |
120 | 1977 | జీవితనౌక | జయసుధ, జయప్రద | కె.విశ్వనాధ్ |
121 | 1977 | ఈతరం మనిషి | జయప్రద | వి.మధుసూదనరావు |
122 | 1977 | ఖైదీ కాళిదాస్ | దీప | సి. సుబ్రమణ్యం |
123 | 1977 | గడుసు పిల్లోడు | జయసుధ | కె.బాపయ్య |
124 | 1978 | నాయుడు బావ | జయసుధ, జయప్రద | పి.చంద్రశేఖర రెడ్డి |
125 | 1978 | నిండు మనిషి | జయచిత్ర | యస్.డి. లాల్ |
126 | 1978 | మంచి బాబాయి | జయచిత్ర | టి.కృష్ణ |
127 | 1978 | కాలాంతకులు | జయసుధ | కె.ఎస్.ఆర్.దాస్ / కె.విశ్వనాధ్ |
128 | 1978 | మల్లెపూవు | జయసుధ, లక్ష్మి | వి.మధుసూదనరావు |
129 | 1978 | రాధాకృష్ణ | జయప్రద | వి.మధుసూదనరావు |
130 | 1978 | ఎంకి-నాయుడు బావ | వాణిశ్రీ | బోయిన సుబ్బారావు |
131 | 1979 | కార్తీక దీపం | శారద, శ్రీదేవి, గీత | పి.లక్ష్మిదీపక్ |
132 | 1979 | జూదగాడు | జయసుధ | వి.మధుసూదనరావు |
133 | 1979 | మండే గుండెలు | జయసుధ | కె.బాపయ్య |
134 | 1979 | గోరింటాకు | సుజాత, వక్కలంక పద్మ | దాసరి నారాయణరావు |
135 | 1979 | బంగారు చెల్లెలు | జయసుధ | వి.మధుసూదనరావు |
136 | 1979 | రామబాణం | జయసుధ | జి.రామమోహనరావు |
137 | 1980 | కక్ష | శ్రీదేవి | వి.సి. గుహనాథన్ |
138 | 1980 | కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త | శారద, గీత | కట్టా సుబ్బారావు |
139 | 1980 | మహాలక్ష్మి | వాణిశ్రీ / సుభాషిణి | రాజచంద్ర |
140 | 1980 | చండీప్రియ | జయప్రద | వి.మధుసూదనరావు |
141 | 1980 | చేసిన బాసలు | జయప్రద | కె.ఎస్.ఆర్.దాస్ |
142 | 1980 | మోసగాడు | శ్రీదేవి | కే. రాఘవేంద్ర రావు |
143 | 1980 | సన్నాయి అప్పన్న | జయప్రద | పి.లక్ష్మిదీపక్ |
144 | 1980 | ధర్మచక్రం | జయప్రద | పి.లక్ష్మిదీపక్ |
145 | 1980 | రాముడు పరశురాముడు | లత | ఎమ్.ఎస్.గోపీనాధ్ |
146 | 1980 | మానవుడే మహనీయుడు | సుజాత | పి.చంద్రశేఖర రెడ్డి |
147 | 1981 | పండంటి జీవితం | సుజాత | టి.రామారావు |
148 | 1981 | ఇల్లాలు | శ్రీదేవి, జయసుధ | టి.రామారావు |
149 | 1981 | దీపారాధన | జయప్రద | దాసరి నారాయణరావు |
150 | 1981 | జీవిత రథం | రతి | వి.మధుసూదనరావు |
151 | 1981 | జగమొండి | రతి | వి.మధుసూదనరావు |
152 | 1981 | దేవుడు మామయ్య | వాణిశ్రీ | రాజచంద్ర |
153 | 1981 | సంసారం-సంతానం | జయసుధ | వి.మధుసూదనరావు |
154 | 1981 | ఘరానా గంగులు | శ్రీదేవి | కట్టా సుబ్బారావు |
155 | 1981 | గిరిజా కళ్యాణం | జయప్రద | కె.ఎస్.ఆర్.దాస్ |
156 | 1981 | అల్లుడుగారు, జిందాబాద్! | గీత | కట్టా సుబ్బారావు |
157 | 1982 | వంశగౌరవం | సుజాత | రవీందర్ రెడ్డి |
158 | 1982 | కృష్ణార్జునులు | జయప్రద | దాసరి నారాయణరావు |
159 | 1982 | ప్రేమమూర్తులు | రాధ, లక్ష్మి | ఎ.కోదండరామిరెడ్డి |
160 | 1982 | ప్రతీకారం | సుజాత | జి. రామినీడు |
161 | 1982 | స్వయంవరం | జయప్రద | దాసరి నారాయణరావు |
162 | 1982 | దేవత | శ్రీదేవి, జయప్రద | కే. రాఘవేంద్ర రావు |
163 | 1982 | ఇల్లాలి కోరికలు | జయసుధ | జి.రామమోహనరావు |
164 | 1982 | బందాలు-అనుబంధాలు | లక్ష్మి | భార్గవ్ |
165 | 1982 | కోరుకున్న మొగుడు | జయసుధ | కట్టా సుబ్బారావు |
166 | 1982 | ఇద్దరు కొడుకులు | రాధ | ఎ.కోదండరామిరెడ్డి |
167 | 1983 | ముందడుగు | జయప్రద | కె.బాపయ్య |
168 | 1983 | ముగ్గురు మొనగాళ్ళు | రాధిక | టి. రామారావు |
169 | 1983 | బలిదానం | మాధవి | ఎస్.ఎ.చంద్రశేఖర |
170 | 1983 | రఘురాముడు | శారద | కొమ్మినేని |
171 | 1983 | తోడు-నీడ | సరిత, రాధిక | వి. జనార్థన్ |
172 | 1983 | రాజకుమార్ | జయసుధ / అంబిక | జి. రామినీడు |
173 | 1984 | ఇద్దరు దొంగలు | రాధ | కే. రాఘవేంద్ర రావు |
174 | 1984 | ఇల్లాలు-ప్రియురాలు | సుహాసిని, ప్రీతి | కోదండరామిరెడ్డి |
175 | 1984 | అభిమన్యుడు | విజయశాంతి | దాసరి నారాయణరావు |
176 | 1984 | బావామరదళ్ళు | సుహాసిని, రాధిక | ఎ.కోదండరామిరెడ్డి |
177 | 1984 | పుణ్యం కొద్ది పురుషుడు | జయసుధ | కట్టా సుబ్బారావు |
178 | 1984 | జగన్ | జయసుధ | దాసరి నారాయణరావు |
179 | 1984 | కోడెత్రాచు | శ్రీదేవి | ఎ.కోదండరామిరెడ్డి |
180 | 1984 | దండయాత్ర | జయసుధ | కె.బాపయ్య |
181 | 1984 | మిస్టర్ విజయ్ | రాధ | కోదండరామి రెడ్డి |
182 | 1984 | బార్యామణి | జయసుధ | విజయబాపినీడు |
183 | 1984 | దానవుడు | జయసుధ | కె.బాపయ్య |
184 | 1984 | సంపూర్ణ ప్రేమాయణం | జయప్రద | యన్.బి. ఛక్రవర్తి |
185 | 1985 | దేవాలయం | విజయశాంతి | టి.కృష్ణ |
186 | 1985 | మహారాజు | సుహాసిని | విజయ బాపినీడు |
187 | 1985 | ముగ్గురు మిత్రులు | సుహాసిని | రాజచంద్ర |
188 | 1985 | శ్రీవారు | విజయశాంతి | బీ. భాస్కర రావు |
189 | 1985 | మహాసంగ్రామం | జయసుధ | ఎ.కోదండరామిరెడ్డి |
190 | 1985 | కొంగుముడి | జయసుధ | విజయ బాపినీడు |
191 | 1985 | మాంగళ్యబలం | జయసుధ, రాధిక | బోయిన సుబ్బారావు |
192 | 1985 | జాకి | సుహాసిని | బాపు |
193 | 1985 | ఊరికి సోగ్గాడు | విజయశాంతి | బి.వి.ప్రసాద్ |
194 | 1986 | శ్రావణ సంద్య | విజయశాంతి/సుహాసిని | ఎ.కోదండరామిరెడ్డి |
195 | 1986 | బంధం | రాధిక | రాజచంద్ర |
196 | 1986 | డ్రైవర్ బాబు | రాధ | బోయిన సుబ్బారావు |
197 | 1986 | మిస్టర్ భరత్ | సుహాసిని | రాజచంద్ర |
198 | 1986 | జీవన పోరాటం | విజయశాంతి | రాజచంద్ర |
199 | 1986 | జీవన రాగం | జయసుధ | బి.వి.ప్రసాద్ |
200 | 1986 | ధర్మపీఠం దద్దరిల్లింది | జయసుధ | దాసరి నారాయణరావు |
201 | 1986 | విజృంభణ | శోభన | రాజచంద్ర |
202 | 1986 | అడవి రాజ | రాధ | కె.మురళి మోహనరావు |
203 | 1986 | చక్కనోడు | విజయశాంతి | బి. భాస్కరరావు |
204 | 1986 | జైలుపక్షి | రాధిక | కోడి రామకృష్ణ |
205 | 1987 | పున్నమి చంద్రుడు | సుహాసిని | విజయ బాపినీడు |
206 | 1987 | ఉమ్మడి మొగుడు | కీర్తీ సింగ్ | బీ. భాస్కర రావు |
207 | 1987 | కళ్యాణ తాంబూలం | విజయశాంతి | బాపు |
208 | 1987 | కార్తీక పౌర్ణమి | భానుప్రియ | ఎ.కోదండరామిరెడ్డి |
209 | 1987 | పుణ్యదంపతులు | సుహాసిని | జీ. అనిల్ కుమార్ |
210 | 1988 | సంసారం | జయప్రద | రేలంగి నరసింహారావు |
211 | 1988 | దొంగ పెళ్ళి | విజయశాంతి | రవిరాజా పినిశెట్టి |
212 | 1988 | దొరగారింట్లొ దొంగోడు | రాధ | కోడి రామకృష్ణ |
213 | 1988 | చట్టంతో చదరంగం | శారద | కే. మురళీమోహన రావు |
214 | 1988 | బార్యాభర్తలు | రాధ | కే. మురళీమోహన రావు |
215 | 1988 | అన్నా చెల్లెలు | రాధిక | రవిరాజా పినిశెట్టి |
216 | 1989 | దొరికితే దొంగలు | విజయశాంతి | కే. మురళీమోహన రావు |
217 | 1989 | సోగ్గాడి కాపురం | రాధ | కోడి రామకృష్ణ |
218 | 1990 | దోషి-నిర్దోషి | సుమిత్ర | వై. నాగేశ్వర రావు |
219 | 1991 | సర్పయాగం | రేఖ | పరుచూరి బ్రదర్స్ |
220 | 1991 | అగ్ని నక్షత్రం | శరత్ | |
221 | 1992 | బలరామకృష్ణులు | శ్రీవిద్య | రవిరాజా పినిశెట్టి |
222 | 1992 | అశ్వమేధం | గీత | కే. రాఘవేంద్ర రావు |
223 | 1993 | ఏమండీ!... ఆవిడ వచ్చింది | శారద, వాణిశ్రీ | ఈ.వీ.వీ. సత్యనారాయణ |
224 | 1994 | జీవితఖైది | జయసుధ, జయప్రద | కే. అజయ్ కుమార్ |
225 | 1995 | ఆస్తి మూరెడు-ఆశ బారెడు | జయసుధ | కోడి రామకృష్ణ |
226 | 1995 | దొరబాబు | ప్రియారామన్ | బోయిన సుబ్బారావు |
227 | 1995 | అడవి దొర | రాధ, సురభి | కే. అజయ్ కుమార్ |
228 | 1996 | హలో... గురూ! | ఆమని, సుహాసిని | వెంకట్రావు |
No comments:
Post a Comment