నిరంతర వార్తా స్రవంతి
Saturday, March 1, 2008
మోహన్‌బాబుతో బెల్లంకొండ సురేష్ చిత్రం
కలెక్షన్ కింగ్, డాక్టర్ ఎం మోహన్‌బాబు కథానాయకుడుగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇందులో ప్రముఖ హీరోయిన్ సిమ్రన్ నాయికగా నటించే అవకాశమున్నట్టు విశ్వసనీయ సమాచారం.ఫ్యామిలీ చిత్రాలను అందరూ నచ్చేలా మెచ్చేలా తీయడంలో దిట్టయైన సీనియర్ దర్శకులు ముత్యాల సుబ్బయ్య ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశమున్నట్టు ఫిలింనగర్‌లో బలంగా వినిపిస్తోంది. యమదొంగ చిత్రం తర్వాత మోహన్‌బాబు తన సొంత బ్యానర్‌లో కాకుండా బయట బ్యానర్‌లలో హీరోగా నటిస్తున్న చిత్రమిదే. త్వరలో మోహన్ బాబు కాంగ్రెస్లో చేరనున్నారన్న ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో బెల్లంకొండ ఏ తరహా కథతో ఆయన్ని తెరపై చూపనున్నారో అన్న ఆసక్తి ఇటు ప్రేక్షకుల్లోను, అటు రాజకీయ వర్గాల్లోనూ నెలకొంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment