
కాంగ్రెస్ సానుభూతిపరులైన హీరో కృష్ణ కుటుంబసభ్యుల మీద ఐటీ దాడులు జరిగినప్పుడే ఏదో జరగబోతోందని పరిశీలకులు ఊహించారు. చిరంజీవి టార్గెట్ గానే ఈ దాడులు జరుగుతున్నాయని భావిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పడానికే దాసరి సంస్ధ మీద ఐటీ దాడులు జరిపించినట్టు తెలుస్తోంది.
అయితే చిరంజీవి ఇళ్ళ మీద దాడులు చేసే సాహసం చేస్తారని అనుకోలేం. చిరంజీవిని రాజకీయాల్లోకి రాకుండా భయపెట్టడానికే ఈ కుట్ర జరుగుతోందని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుందని పాలకులకు, వారి సలహాదారులకు బాగా తెలుసు.
No comments:
Post a Comment