నిరంతర వార్తా స్రవంతి

Friday, March 14, 2008

బధిర యజమానిని రక్షించుకున్న చిలుక!

కృతజ్ఞత కుక్కలకే కాదు, చిలకలకూ ఉంటుందని రుజువైన ఘటన బ్రిటన్‌లో జరిగింది. ఇక్కడి య్కార్‌షైర్‌ కౌంటీ మిర్‌ఫీల్డ్‌ ప్రాంతానికి చెందిన బధిరుడు పీటర్‌ టేలర్‌, ఆఫ్రికా జాతికి చెందిన చిలుకను పెంచుకుంట్నునాడు. ఆ మధ్య ఈయన చెవులకు పెట్టుకొనే మిషన్‌ తీసివేసి నిద్రపోతున్నప్పుడు ఇంటికి నిప్పంటుకుందిట. పరిస్థితిని గమనించిన ఆ చిలుక ఫైరింజన్‌ తరహాలో శబ్దం చేస్తూ యజమాని కాళ్ల మీద పైకి, కిందకు పాకుతూ లేపి ఆయన్ను రక్షించుకుంది. పరిణామ క్రమంలో చిలుకలు కూడా కుక్కల తరహాలో విశ్వాసానికి మారుపేరుగా నిలవడం ఆశ్చర్యకరమైన, ఆనందదాయకమైన పరిణామం కదూ. ఓ పత్రికలో వచ్చిన ఈ సంఘటన గురించి మీ అందరితో పంచుకోవాలనిపించింది.

No comments: