నిరంతర వార్తా స్రవంతి

Friday, March 21, 2008

పడిలేచే క్రీడా కెరటం... సచిన్ టెండుల్కర్!



India
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి కుడిచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి రైట్-ఆర్మ్ లెగ్‌బ్రేక్/ఆఫ్‌బ్రేక్/మీడియం
కెరీర్ గణాంకాలు

Tests ODIs
మ్యాచ్‌లు 146 417
పరుగులు 11782 16361
బ్యాటింగ్ సగటు 55.57 44.33
100లు/50లు 39/49 42/89
అత్యుత్తమ స్కోరు 248* 186*

Overs 623 1315
Wickets 42 154
Bowling average 51.02 44.12
5 wickets in innings 0 2
10 wickets in match 0 n/a
Best bowling 3/10 5/32
Catches/stumpings 93/- 122/-

As of ఫిబ్రవరి 4, 2008

భారత క్రికెట్ క్రీడా చరిత్రలోనే ప్రఖ్యాతి గాంచిన ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్ (Sachin Ramesh Tendulkar) (Hindi: सचिन रमेश तेंदुलकर). క్రికెట్ క్రీడకు భారతదేశం లో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్ ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు. ఈనాడు భారత్ లో ఈ క్రీడకు ఇంత జనాదరణ ఉందంటే అదంతా సచిన్, అతని ఆట తీరే కారణం. 1990 దశకంలో భారత క్రికెట్ లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్. భారత జట్టుకు ఆపద్భాందవుడిగా ఎన్నో విజయాలు అందజేసిన ఈ ముంబాయి కి చెందిన బ్యాట్స్‌మెన్ ను పొగడని వారు లేరనే చెప్పవచ్చు. 34 ఏళ్ళ వయసులో కూడా ఇప్పటికీ జట్టు విజయాలకై శాయశక్తుల ప్రయత్నిస్తున్నాడు. 2002 లో విజ్డెన్ పత్రిక టెస్ట్ క్రికెట్ లో ఆస్ట్రేలియా కు చెందిన బ్రాడ్‌మెన్ మరియు వన్డే క్రికెట్ లో వెస్ట్‌ఇండీస్ న కు చెందిన వివియన్ రిచర్డ్స్ ల తర్వాత క్రికెట్ క్రీడా ప్రపంచంలోనే సచిన్ ను రెండో అత్యున్నత బ్యాట్స్‌మెన్ గా ప్రకటించింది. 2003 లో మళ్ళి తిరగరాసి వన్డే క్రికెట్ లో వివియన్ రిచర్డ్స్ కు రెండో స్థానంలోకి నెట్టి సచిన్ ను అగ్రస్థానంలో నిలబెట్టారు. అతని యొక్క ఆటతీరు, ఆట లోని నైపుణ్యం ఎంత చూసిననూ తనవి తీరనిది. అతను అవుటైన వెంటనే టి.వి.లను కట్టేసిన సందర్భాలు, స్టేడియం నుంచి ప్రేక్షకులు వెళ్ళిన సందర్భాలు కోకొల్లలు. టెస్ట్ రికార్డులు చూసిననూ, వన్డే రికార్డులు చూసిననూ అడుగడుగునా అతని పేరే కన్పిస్తుంది. లెక్కకు మించిన రికార్డులు అతని సొంతం.టెస్ట్ క్రికెట్ లోనూ అత్యధిక పరుగులలో నవంబర్ 25, 2007ఆస్ట్రేలియా కు చెందిన అలాన్ బోర్డర్ ను అధికమించి ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగుల రికార్డు అతనిదే. ఇక సెంచరీల విషయంలో అతనికి దరిదాపుల్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. లిటిల్ మాస్టర్ లేదా మాస్టర్ బ్లాస్టర్ అని పిల్వబడే సచిన్ 1989 లో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. 1997-1998లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొంది ఈ అవార్డు స్వీకరించిన ఏకైక క్రికెట్ క్రీడాకారుడిగా నిల్చినాడు. ఇప్పటి వరకు క్రికెట్ క్రీడా జగత్తులోని అత్యంత ప్రముఖమైన క్రీడాకారులలో ఒకరు సచిన్ టెండుల్కర్..

బాల్యం, కుటుంబ జీవితం

సచిన్ టెండుల్కర్ ముంబాయి (పూర్వపు బొంబాయి) లోని సరస్వతి బ్రాహ్మణ కుటుంబంలో ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు. తండ్రి రమేష్ మరాఠీ నవలా రచయిత. 1995 లో గుజరాత్ పారిశ్రామికవేత్త ఆనంద్ మెహతా కూతురు అంజలి ని వివాహం చేసుకునాడు. వారికి ఇద్దరు సంతానం. సారా (జననం అక్టోబర్ 12, 1997) మరుయు అర్జున్ (జననం సెప్టెంబర్ 23, 1999.

క్రీడా జీవితం

ప్రారంభ రోజులు

తన గురువు రమాకాంత్ అచ్రేకర్ సలహాపై సచిన్ శారదాశ్రమ్ విద్యామందిర్ హైస్కూల్ హాజరైనాడు.పాఠశాల విద్యార్థిగా ప్రారంభ దినాలలో పేస్ బౌలింగ్ లో శిక్షణ కోసం MRF పేస్ అకాడమీకి హాజరైననూ ఇంటికి పంపివేయబడ్డాడు. సచిన్ ను పంపిన మహానుభావుడు పాతతరపు ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ బ్యాటింగ్ పై దృష్టి సారించు అని ముక్తంగా చెప్పడం, అతని సలహాను సచిన్ పాటించడంతో నేటి ప్రపంచంలో మనం ఒక ప్రముఖ బ్యాట్స్‌మెన్ చూస్తున్నాం. సచిన్ యువకుడిగా ఉన్నప్పుడు కోచ్ వెంబడి గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయుటలో బోర్ అనిపించేది. అందుకు కోచ్ స్టంప్స్ పైన ఒక రూపాయి నాణేన్ని ఉంచి సచిన్ ను ఔట్ చేసిన బౌలర్ కు ఇచ్చేవాడు. సెషన్ మొత్తం సచిన్ ఔట్ కానిచో ఆ నాణెం సచిన్ కే దక్కేది. అలాంటి 13 నాణేలు ఇప్పటికీ సచిన్ వద్ద ఉన్నాయి.

పాఠశాలలో ఉన్నప్పుడు హరీష్ షీల్డ్ పోటీలో వినోద్ కాంబ్లీ తో కల్సి 1988 లో 644* పరుగుల పాట్నర్‌షిప్ రికార్డు సృష్టించాడు. ఆ ఇన్నింగ్సులో సచిన్ బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరద సాదించి 320 కి పైనా పరుగులు చేశాడు. ఆ టోర్నమెంట్ లో సచిన్ వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. హైదరాబాదు లో 2006 లో జర్గిన అండర్-13 మ్యాచ్ లో ఇద్దరు కుర్రాళ్ళు ఈ రికార్డును ఛేధించే వరకు 18 సం.ల పాటు సచిన్-కాంబ్లీ లదే రికార్డుగా కొనసాగింది.

దేశవాళీ క్రికెట్

1988/1989 లో అతని మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ముంబాయి తరఫున ఆడుతూ గుజరాత్ పై 100* పరుగులు సాధించాడు. 15 సం.ల 232 రూజుల వయస్సులోనే ఫస్ట్ క్లాస్ సెంచరీ సాధించి ఆ ఘనతన సాధించిన యువ బ్యాట్స్‌మెన్ గా అవతరించాడు. అంతేకాకుండా రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ లలో కూడా తను ఆడిన తొలి మ్యాచ్ లలోనే సెంచరీలు సాధించి ఆ ఘనతను పొందిన ఏకైక క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.

అంతర్జాతీయ క్రికెట్

టెండుల్కర్ వ్రాయడంలో ఎడమచేతి వాటం ఉపయోగించిననూ, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో మాత్రం కుడిచేయే ఉపయోగిస్తాడు. టెండుల్కర్ తన తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ 1989 లో పాకిస్తాన్ పై ఆడి కేవలం 15 పరుగులకే వకార్ యూనిస్ బౌలింగ్ లో అవుటయ్యాడు. వకార్ కు కూడా ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. ఆ తర్వాత ఫైసలాబాద్ లో తన తొలి అర్థశతకం పూర్తిచేశాడు. డిసెంబర్ 18 న ఆడిన తన తొలి వన్డే మ్యాచ్ లో కూడా వకార్ యూనిస్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. పాకిస్తాన్ సీరీస్ తర్వాత న్యూజీలాండ్ టూర్ లో రెండో టెస్ట్ లో 88 పరుగులు సాధించాడు. 1990 ఆగస్ట్ లో ఇంగాడు లోని ఓల్డ్ ట్రఫర్డ్ లో జర్గిన మ్యాచ్ లో తన తొలి శతకం సాధించాడు. 1991-1992 లో ఆస్ట్రేలియా టూర్ లో ప్రపంచ శ్రేణి బ్యాట్స్‌మెన్ గా అవతరించాడు. షేన్‌వార్న్ టెస్ట్ మ్యాచ్ లో రంగప్రవేశం చేసిన సిడ్నీ మ్యాచ్ లో 148 పరుగులు చేశాడు. ఆ తర్వాత పెర్త్ మ్యాచ్ లో మరో సెంచరీ సాధించాడు. టెండుల్కర్ ప్రతిభ 1994-1999 సం.లలో శిఖరాలకు చేరింది.1994 లో ఆక్లాండ్ తెస్ట్ లో టెండుల్కర్ ను ఓపెనర్ గా పంపించారు. ఆ టెస్టులో 49 బంతుల్లోనే 82 పరుగులను సాధించాడు. అతని తొలి వన్డే సెంచరీ సెప్టెంబర్ 27 , 1994 లో ఆస్ట్రేలియాపై సాధించాడు. తొలి వన్డే శతకానికి 79 మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది.

1996 ప్రపంచ కప్ : తన ప్రతిభను అలాగే కొనసాగిస్తూ 1996 ప్రపంచ కప్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ గా నిల్చినాడు. ఆ ప్రపంచ కప్ లో 2 శతకాలు సాధించాడు.1998 ప్రారంభంలో భారత్ విచ్చేసిన ఆస్ట్రేలియా క్రికెట్ టీం పై వరుసగా 3 సెంచరీలు సాధించి బ్యాటింగ్ లో తన ప్రతిభను మరింతగా మెరుగుపర్చుకున్నాడు. అందులోనే షేర్‌వార్న్, రోబర్ట్‌సన్ ల లక్ష్యంగా ముందస్తు ప్రణాళిక వేసుకున్నట్లు వారి బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. అతని ఫలితంగా భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ సీరీస్ తర్వాత సచిన్ తన బౌలింగ్ ను ఉతికి ఆరేసినట్లు రాత్రి కలలో వచ్చినట్లు వార్న్ పేర్కొనడం విశేషం.

1999 ప్రపంచ కప్ : 1999 ప్రపంచ కప్ పోటీలో ఉండగా అతని తండ్రి రమేష్ తెండుల్కర్ మృతిచెందారు. తండ్రి అంతిమక్రియల కొరకు భారత్ రావడంతో జింబాబ్వే తో ఆడే మ్యాచ్ కోల్పోయాడు. వెంటనే మళ్ళీ ప్రపంచ కప్ పోటీలకు హాజరై కెన్యా పై బ్రిస్టన్ లో జర్గిన మ్యాచ్ లో 101 బంతుల్లోనే 140 పరుగులు చేసినాడు. ఈ శతకం తన తండ్రికి అంకితం ఇచ్చాడు.

షేర్‌వార్న్ కు సింహస్వప్నం : 1998 ఆస్ట్రేలియా పర్యటనలో సచిన్ మంచి ఊపుపై ఉండి 3 సెంచరీలను సాధించాడు. ప్రముఖ స్పిన్నర్ షేన్‌వార్న్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే నిర్ణయించిన విధంగా ఎదుర్కొని బంతిని బౌండరీలు దాటిస్తుంటే వార్న్ నిశ్చేతుడిగా చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. రాత్రివేళల్లో సచిన్ స్వప్నంలోకి వచ్చాడని కూడా వార్న్ పేర్కొనడం గమనార్హం.

నాయకత్వం : ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అజహరుద్దీన్ నుంచి సచిన్ తెండుల్కర్ కు నాయకత్వ పగ్గాలు అప్పగించారు. కాని ఈ సీరీస్ కొత్త ప్రపంచ చాంపియన్ చేతిలో 3-0 తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత 2-0 తేడాతో దక్షిణాఫ్రికాపై కూడా ఓడిపోవడంతో సచిన్ నాయకత్వ బాద్యతల నుంచి తప్పుకున్నాడు.అతని తర్వాత 200 లో సౌరవ్ గంగూలీ కి కెప్తెన్సీ ఇవ్వబడింది. resigned, and Sourav Ganguly.

20003 ప్రపంచ కప్ : 2003 ప్రపంచ కప్ లో సచిన్ 11 మ్యాచ్ లలో 673 పరుగులు సాధించి భారత్ ను ఫైనల్స్ కి చేర్చినాడు. కాని ఈ సారి కూడా ఆస్త్రేలియాకే విజయం వరించింది. అయిననూ మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డ్ మాత్రం ఉత్తమ ఆటతీరును ప్రదర్శించిన సచిన్ కే వరిందింది. 2003-04 లో భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ లో జర్గిన చివరి టెస్ట్ మ్యాచ్ లో సచిన్ డబుల్ సెంచరీ సాధించాడు.

అత్యధిక టెస్ట్ సెంచరీల రికార్డు : డెసెంబర్ 10, 2005 న ఢిల్లీ లోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో శ్రీలంక పై ఆడితూ 35 వ తెస్ట్ సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచంలోనే అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ గా అవతరించాడు. దీంతో ఇది వరకు సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న 34 టెస్ట్ సెంచరీల రికార్డును విచ్ఛిన్నమైంది.

పేవల ప్రదర్శన : మార్చి 19, 2006 న సొంత మైదానమైన వాంఖేడే స్టేడియంలో ఇంగ్లాండు తో జర్గిన మ్యాచ్ లో 21 బంతుల్లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసేసరికి ప్రేక్షక మూక మైదానంలోకి చొచ్చుకొనివచ్చింది. క్రీడా జీవితంలో అది తనకు తొలి అనుభవం. అదే టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో సచిన్ దే అత్యధిక స్కోరు. అయిననూ ఆ 3 టెస్టుల సీరీస్ లో అతనిది కనీసం ఒక్క అర్థ శతకం కూడా లేదు.

పాకిస్తాన్ XI తో జర్గిన అనధికార ట్వంటీ-20 మ్యాచ్ లో సచిన్ 21 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్ గా నిల్చి ఇంటర్నేషనల్ XI గెలుపుకు కారణమయ్యాడు.

జనవరి 2007 లో వెస్ట్‌ఇండీస్ తో జర్గిన వన్డే మ్యాచ్ లో 76 బంతుల్లో సెంచరీ సాధించి తన 41 శతకాన్ని పూర్తిచేసి రెండో స్థానంలో ఉన్న సనత్ జయసూర్య కంటే 17 శతకాలు ఆధిక్యంలో ఉండి తిరుగులేదనిపించుకున్నాడు.

2007 ప్రపంచ కప్ : వెస్ట్‌ఇండీస్ లో జర్గిన 2007 ప్రపంచ కప్ లో రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో కలోయర్ ఆర్డర్ బ్యాంటింగ్ చేసి పేవలమైన్ స్కోరు సాధించాడు. బంగ్లాదేశ్ పై 7 పరుగులు, బెర్మూడా పై 57* పరుగులు, శ్రీలంక పై సున్నా పరుగులు చేసినాడు. దాంతో భారత జట్టు కోచ్ గ్రెగ్ చాపెన్ సోదరుడైన్ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ సచిన్ క్రికెట్ నుంచి రిటైరవ్వాలని ముంబాయి కి చెందిన మధ్యాహ్న పత్రికలో కాలమ్ రాసి సంచలనం సృష్టించాడు.

ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనలో సచిన్ మ్యాన్ ఆఫ్ ది సీరీస్ పొంది విమశకులకు నోళ్ళు మూయించాడు. దక్షిణాఫ్రికా తో సీరీస్ లో కూడా రెండు సార్లు 90 కి పైగా పరుగులు చేసినాడు. ఇమ్దులోనే అత్యధిక పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది సీరీస్ చేజిక్కించుకున్నాడు. ఫ్యూచర్ కప్ లో కూడా 66 పరుగుల సరాసరితో టాప్ స్కోరర్ గా నిల్చినాడు.

11000 పరుగులు పూర్తి : జూలై 28, 2007 నాటింఘమ్ టెస్టు రెండో రోజున సచిన్ టెస్ట్ క్రికెట్ లో 11000 పరుగులు పూర్తిచేసి ఈ ఘనతను సాధించిన మూడవ బ్యాట్స్‌మెన్ గా అవతరించాడు. కాగా భారతీయులలో ఈ ఘనత పొందిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ గా రికార్డు సృష్టించాడు.

2007 అక్టోబర్ లో ఆస్ట్రేలియా తో జర్గిన వన్డే సీరీస్ లో 278 పరుగులతో భారత్ తరఫున టాప్ స్కోరర్ గా నిల్చినాడు.

1997 లో విజ్డెన్ పత్రిక సచిన్ ను క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. ఆ క్యాలెండర్ సం.లో సచిన్ తొలిసారిగా 1000 పరుగులు పూర్తిచేసినాడు. ఆ తర్వాత 1999, 2001, మరియు 2002 లలో కూడా సచిన్ ఈ ఘనతను సాధించాడు.

ఇక వన్డే లో ఒకే క్యాలెండర్ సం.లో 1000 పరుగులు సాధించడాన్ని సచిన్ 7 సార్లు చేశాడు.1994, 1996, 1997, 1998, 2000 ,2003 మరియు 2007 లలో ఈ ఘనత సాధించాడు. 1998 లో ఇతను వన్డేలలో 1,894 పరుగులు సాధించాడు. ఇది ఒకే క్యాలెండర్ సం.లో ఒక బ్యాట్స్‌మెన్ సాధించిన అత్యధిక పరుగుల రికార్డు.

టెస్ట్ కెప్టెన్సీకి విముఖత : నవంబర్ 6 , 2007 న తెండుల్కర్ వ్యక్తిగత కారణాల వల్ల టెస్టు నాయకత్వం వహించడానికి విముఖత ప్రదర్శించాడు. దీంతో నాయకత్వ వేట మొదలై చివరికి అనిల్ కుంబ్లే కు ఈ కిరీటం లభించింది.

సచిన్ టెండుల్కర్ ఎన్నో సెంచరీలు సాధించిననూ సెంచరీలకు చేరువలో అవుటైన సందర్బాలు కూడా చాలా ఉన్నాయి. మొత్తం 23 పర్యాయాలు అతడు 90 -100 మద్య స్కోరులో ఔటైనాడు. ఇటీవలే సెప్టెంబర్ 8, [2007]] న పాకిస్తాన్ పై మొహలీ వన్డేలో 99 పరుగుల వద్ద ఔటైనాడు. అదే పాకిస్తాన్ పై సెప్టెంబర్ 15 , 2007 న గ్వాలియర్ వన్డేలో 97 పరుగులకు ఔటైనాడు. ఎన్నో సెంచరీలు చేసిన సచిన్ ప్రస్తుతం సెంచరీకి చేరువలో ఔటవడం ఆశ్చర్యం. ఒక్క 2007 సం.లోనే 7 సార్లు ఈ విధంగా సెంచరీలను చేజార్చుకున్నాడు. లేనిచో మరిన్ని సెంచరీలు అతని ఖాతాలో జమాయ్యేవి. సెంచరీలు చేజార్చుకున్నా అర్థ సెంచరీలలో ప్రపంచ రికార్డు సృష్టించడం విశేషం.

బౌలింగ్

విమర్శలు

సచిన్ సాధించిన రికార్డులు

వన్డే రికార్డులు

  • వన్డే క్రికెట్ లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (42 సెంచరీలు)
  • వన్డే క్రికెట్ లో అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (89 అర్థ సెంచరీలు)
  • వన్డే క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించిన భారతీయ బ్యాట్స్ మెన్. (186* పరుగులు)
  • అత్యధిక వన్డే పోటీలకు ఆడిన క్రికెటర్. (417 వన్డేలు)
  • వన్డే క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు పొందిన క్రికెటర్. (57 సార్లు)
  • వన్డే క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆప్ ది సీరీస్ అవార్డు పొందిన క్రికెటర్. (14 సార్లు)
  • అతిపిన్న వయస్సులో వన్డే క్రికెట్ ఆడిన భారతీయుడు.
  • అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్. (16000+ పరుగులు)
  • 10000, 11000, 12000, 13000, 14000, 15000, 16000 పరుగులు పూర్తిచేసిన తొలి భారతీయుడు.
  • వన్డేలలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారతీయుడు. (186 పరుగులు)
  • ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 1000 పరుగులు చొప్పున 7 సార్లు సాధించాడు.
  • ఆస్త్రేలియా, దక్షిణాప్రికా, న్యూజీలాండ్, శ్రీలంక, జింబాబ్వేలపై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్.
  • ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు. (1894 పరుగులు)
  • ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సెంచరీలు. (9 సెంచరీలు)
  • రాహుల్ ద్రవిడ్ తో కలిసి అత్యధిక పరుగుల పాట్నర్‌షిప్ రికార్డు. (331 పరుగులు )
  • సౌరవ్ గంగూలీతో కలిసి అత్యధిక ఓపెనింగ్ పాట్నర్‌షిప్ రికార్డు. (6271)
  • అత్యధిక సార్లు 200 మించి పాట్నర్‌షిప్ పరుగులు. (6 సార్లు)

టెస్ట్ రికార్డులు

  • పిన్న వయస్సులో టెస్ట్ క్రికెట్ ఆడిన భారతీయుడు
  • టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (39 సెంచరీలు)
  • 20 సంవత్సరాల వయస్సులోనే 5 టెస్ట్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్.
  • కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన భారతీయుడు. (217 పరుగులు)
  • అన్ని టెస్టు ఆడే దేశాలపై సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు.
  • టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్ మెన్
  • అత్యధిక టెస్టులు ఆడిన భారతీయ క్రికెటర్. (146 టెస్టులు)
  • టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్‌మెన్. (11782)
  • 10వేల పైబడి పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో అత్యధిక సగటు కల్గిన క్రికెటర్. (55.57)
  • 11000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్.
  • అతివేగంగా 10 వేల పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాట్స్‌మెన్. (195 ఇన్నింగ్సులలో)
  • విదేశాలలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్.
  • ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 1000 పరుగులు చొప్పున 4 సార్లు సాధించిన ఇద్దరు భారతీయ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. (మరో వ్యక్తి సునీల్ గవాస్కర్}

ప్రపంచ కప్ రికార్డులు

  • ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్. (1796 పరుగులు)
  • 2003 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్. (673 పరుగులు)
  • 1996 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్. (523 పరుగులు)

అవార్డులు

మీడియా గుర్తింపులు

  • 2003 ఆగస్ట్ లో జీన్యూస్ ద్వారా దేశంలో గొప్ప క్రీడావ్యక్తిగా ఎన్నికైనాడు.
  • 2006 నవంబర్ లో టైంమేగజైన్‌చే ఏషియన్ హీరోలలో ఒకడిగా గుర్తింపు పొందినాడు.
  • 2006 డిసెంబర్ లో స్పోర్ట్స్ పర్సన్ ఆప్ ది ఇయర్‌గా పేరుసంపాదించినాడు.

టెస్ట్ మ్యాచ్ అవార్డులు

మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డులు

# సీరీస్ సీజన్ సీరీస్ లో చూపిన ప్రతిభ
1 బోర్డర్ గవాస్కర్ ట్రోఫి టెస్ట్ సీరీస్(ఆస్ట్రేలియా తో) 1997/98 446 (3 మ్యాచ్ లు, 5 ఇనింగ్సులు, 2x100, 1x50); 13.2-1-48-1; 2 Catches
2 బోర్డర్ గవాస్కర్ ట్రోఫి టెస్ట్ సీరీస్ (ఆస్ట్రేలియా తో) 1999/00 278 పరుగులు (6 ఇన్నింగ్సులు, 1x100, 2x50); 9-0-46-1
3 ఇంగ్లాండు తో టెస్ట్ సీరీస్ 2001/02 307 పరుగులు (4 ఇన్నింగ్సులు, 1x100, 2x50); 17-3-50-1; 4 క్యాచ్ లు
4 బంగ్లాదేశ్ తో టెస్ట్ సీరీస్ 2007 254 పరుగులు (3 ఇన్నింగ్సులు, 2x100, 0x50); 6.3-1-35-2; 2 క్యాచ్ లు

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు

క్ర.సం. ప్రత్యర్థి వేదిక సీజన్ మ్యాచ్ లో చూపిన ప్రతిభ
1 ఇంగ్లాండు ఓల్డ్ ట్రఫర్డ్, మాంచెస్టర్ 1990 మొదటి ఇన్నింగ్స్: 68 (8x4); 2 మ్యాచ్ లు

రెండో ఇన్నింగ్స్: 119 (17x4)

2 ఇంగ్లాండు ఎం.ఏ.చిదంబరం స్టేడియం, చేపాక్, చెన్నై 1992/93 మొదటి ఇన్నింగ్స్: 165 (24x4, 1x6); 2-1-5-0

రెండో ఇన్నింగ్స్: 2 క్యాచ్ లు; 2-1-4-0

3 న్యూజీలాండ్ ఎం.ఏ.చిదంబరం స్టేడియం, చేపాక్, చెన్నై 1995/96 మొదటి ఇన్నింగ్స్: 52 (5x4)
4 ఆస్త్రేలియా ఎం.ఏ.చిదంబరం స్టేడియం, చేపాక్, చెన్నై 1997/98 మొదటి ఇన్నింగ్స్: 4 (1x4); 1 Catch

రెండో ఇన్నింగ్స్: 155 (14x4, 4x6)

5 పాకిస్తాన్ ఎం.ఏ.చిదంబరం స్టేడియం, చేపాక్, చెన్నై 1998/99 మొదటి ఇన్నింగ్స్: 0; 3-0-10-1

రెండో ఇన్నింగ్స్: 136 (18x4); 7-1-35-2

6 న్యూజీలాండ్ Motera, Ahmedabad 1999/00 మొదటి ఇన్నింగ్స్: 217 (29x4)

రెండో ఇన్నింగ్స్: 15 (3x4); 5-2-19-0

7 ఆస్త్రేలియా మెల్బోర్న్ 1999/00 మొదటి ఇన్నింగ్స్: 116 (9x4, 1x6)

రెండో ఇన్నింగ్స్: 52 (4x4)

8 దక్షిణాఫ్రికా వాంఖేడే స్టేడియం, ముంబాయి 1999/00 మొదటి ఇన్నింగ్స్: 97 (12x4, 2x6); 5-1-10-3

రెండో ఇన్నంగ్స్: 8 (2x4); 1-0-4-0

9 వెస్ట్‌ఇండీస్ ఈడెన్ గార్డెన్ కోల్కత 2002/03 మొదటి ఇన్నింగ్స్: 36 (7x4); 7-0-33-0

రెండో ఇన్నింగ్స్: 176 (26x4)

10 ఆస్ట్రేలియా సిడ్నీ 2003/04 మొదటి ఇనింగ్స్: 241 (33x4)

2nd Innings: 60 (5x4); 6-0-36-0; 1 Catch

వన్డే అవార్డులు

టెండుల్కర్ వన్డే క్రికెట్ లో 14 సార్లు మ్యాన్ ఆఫ్ ది సీరీస్ (MoS) మరియు 56 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ (MoM) అవార్డులు పొందినాడు. టెస్ట్ మ్యాచ్ లు ఆడే అన్ని దేశాలపై ఆడి మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొందినాడు. UAE (2 మ్యాచ్ లు), నెదర్లాండ్ (1 మ్యాచ్ ) మరియు బెర్మూడా (1 మ్యాచ్ ) లపై మాత్రమే అతడు వన్డే క్రికెట్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందలేడు.

మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డులు :

# సీరీస్ (ప్రత్యర్థులు) సీజన్ సీరీస్ గణాంకాలు
1 సింగర్ సీరీస్ (ఆస్ట్రేలియా, శ్రీలంక) 1994 136 (4 మ్యాచ్‌లు & 3 ఇన్నింగ్సులు, 1x100)
2 విల్స్ వరల్డ్ కప్ (వెస్ట్‌ఇండీస్, దక్షిణాఫ్రికా) 1994/95 285 పరుగులు (5 ఇన్నింగ్సులు, 1x100, 2x50); 39-4-155-8; 1 క్యాచ్
3 వెస్ట్‌ఇండీస్ పర్యటన 1994/95 246 Runs (5 ఇన్నింగ్సులు, 1x100, 2x50); 16-0-93-1; 1 క్యాచ్
4 సిల్వర్ జూబ్లీ ఇండెపెండెన్స్ కప్ (బంగ్లాదేశ్, పాకిస్తాన్) 1997/98 258 పరుగులు (5 ఇన్నింగ్సులు, 3x50); 23.3-0-148-5; 6 క్యాచ్‌లు
5 కోకాకోలా కప్ (ఆస్ట్రేలియా, న్యూజీలాండ్) 1997/98 435 పరుగులు (5 ఇన్నింగ్సులు, 2x100, 1x50); 19-0-101-2
6 జింబాబ్వే పర్యటన 1998/99 158 పరుగులు (3 ఇన్నింగ్సులు, 1x100); 6-0-41-0; 1 క్యాచ్
7 కోకాకోలా చాంపియన్‌షిప్ (జింబాబ్వే, శ్రీలంక) 1998/99 274 పరుగులు (5 ఇన్నింగ్సులు, 2x100); 14-0-51-2; 1 క్యాచ్
8 దక్షిణాఫ్రికా పర్యటన 1999/00 274 పరుగులు (5 ఇన్నింగ్సులు, 1x100, 1x50); 49-1-219-6; 1 క్యాచ్
9 కోకా కోలా కప్ (వెస్ట్‌ఇండీస్, జింబాబ్వే) 2001 282 పరుగులు (5 ఇన్నింగ్సులు, 1x100, 2x50); 4-0-25-0
10 ఇంగ్లాండు పర్యటన 2001/02 266 పరుగులు (6 ఇన్నింగ్సులు, 2x50); 30.5-158-2; 3 క్యాచ్‌లు
11 2003 ప్రపంచ కప్ క్రికెట్ 2002/03 673 పరుగులు (11 ఇన్నింగ్సులు, 1x100, 6x50); 18-0-77-2; 4 క్యాచ్‌లు
12 TVS కప్ (ఆస్ట్రేలియా, న్యూజీలాండ్) 2003/04 466 పరుగులు (7 ఇన్నింగ్సులు, 2x100, 2x50); 21-0-125-1
13 వెస్ట్‌ఇండీస్ పర్యటన 2006/07 191 పరుగులు (4 ఇన్నింగ్సులు, 1x100, 1x50); 23-0-112-4
14 ఫ్యూచర్ కప్ (దక్షిణాఫ్రికాతో) 2007 200 పరుగులు (3 మ్యాచులు, 3 ఇన్నింగ్సులు, 2x50)

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు:

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు — సచిన్ టెండుల్కర్
# ప్రత్యర్థి మొత్తం స్వదేశంలో విదేశాల్లో తటస్థ వేదికలపై
1 ఆస్ట్రేలియా (47 మ్యాచ్ లు) 10 5 0 5
2 బంగ్లాదేశ్ (10 మ్యాచ్ లు) 1 0 0 1
3 ఇంగ్లాండు (27 మ్యాచ్ లు) 2 0 1 1
4 న్యూజీలాండ్ (38 మ్యాచ్ లు) 5 4 1 0
5 పాకిస్తాన్ (61 మ్యాచ్ లు) 7 1 1 5
6 దక్షిణాఫ్రికా (50 మ్యాచ్ లు) 4 3 1 0
7 శ్రీలంక (65 మ్యాచ్ లు) 5 1 1 3
8 వెస్ట్‌ఇండీస్ (38 మ్యాచ్ లు) 9 3 1 5
9 జింబాబ్వే (34 మ్యాచ్ లు) 8 0 4 4
10 కెన్యా (10 మ్యాచ్ లు) 4 2 0 2
11 నమీబియా (1 మ్యాచ్ ) 1 0 0 1

మొత్తం (381 మ్యాచ్ లు) 56 19 10 27

వ్యాపార ఆసక్తి

పుస్తకాలు

కాంట్రాక్టులు

వ్యాపారం

ఉత్పత్తి బ్రాండ్ ఎండార్స్‌మెంట

No comments: