నిరంతర వార్తా స్రవంతి

Wednesday, March 19, 2008

మూడవ విలియం హెన్రీ గేట్స్ బిల్ గేట్స్!


బిల్ గేట్స్
జననం అక్టోబర్ 28 1955 (1955-10-28) (వయసు 52)
సియెటల్, వాషింగ్టన్, అమెరికా
వృత్తి చైర్మెన్, మైక్రోసాఫ్ట్
కో-చైర్మెన్, బిల్ మరియు మెలిండా గేట్స్ ఫౌండేషన్
ఉన్న డబ్బు US$58 బిలియన్లు (2008)[1]
భార్య మెలిండా గేట్స్ (1994 నుండి ప్రస్తుతం)
సంతానం ముగ్గురు
వెబ్‌సైటు మైక్రోసాఫ్ట్‌లో బిల్ గేట్స్ పేజి
బిల్ మరియు మెలిండా గేట్స్ ఫౌండేషన్

బిల్ గేట్స్‌గా అందరికీ తెలిసిన మూడవ విలియం హెన్రీ గేట్స్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత మరియు గొప్ప దాత. వ్యక్తిగత ఉపయోగాలకోసం వినియోగించే కంప్యూటర్లను సామాన్యులకు అందుబాటులో తెచ్చిన వ్యక్తిగా బిల్ గేట్స్ ఎంతో పేరు పొందాడు. ప్రస్తుతం బిల్ గేట్స్ ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతుడు.[2] ప్రపంచవ్యాప్తంగా ఎన్నొ దానాలు, సహాయాలు చేసాడు. చేస్తున్నాడు.

బాల్యం

బిల్ గేట్స్ అక్టోబర్ 28 1955 న వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్‌లో ఒక ధనవంతులు కుటుంబంలో జన్మించాడు. ఎలెమెంటరీ స్కూల్లో ఉన్నపుడు గణితం మరియు సైన్స్‌లలో చాలా ప్రతిభ చూపించేవాడు. తన మిత్రుడు పాల్ అల్లెన్‌తో కలసి కంప్యూటర్ లాంగ్యేజి అయిన BASIC నేర్చుకొని అందులో ప్రోగ్రాములు రాయడం మొదలు పెట్టాడు. 14 ఏళ్ళ వయసులో పాల్ అల్లెన్‌తో కలసి ట్రాఫిక్ లెక్కించే ప్రాసెసర్‌కు సంభందించిన ప్రోగ్రాములు రాసి అమ్మడం మొదలు పెట్టాడు. మొదటి ఏడాది 20,000 డాలర్లు సంపాదించినా, బిల్ గేట్స్ వయసు 14 అన్న విషయం తెలిసి వ్యాపారం తగ్గుముఖం పట్టింది.

మైక్రోసాఫ్ట్

1975లో MITS అనే మైక్రోకంప్యూటర్ కంపెనీకి అవసరమయిన సాఫ్ట్‌వేర్ తాము అందించగలమని బిల్ గేట్స్ తెలిపి, తర్వాత ఆ కంపెనీ ఆఫీసులో తమకు తెలిసినవి చూపించడంతో ఇద్దరితో ఆ కంపెనీ కాంట్రాక్టు ఏర్పాటు చేసుకుంది . మొదట మైక్రో-సాఫ్ట్ అని పేరు పెట్టినా, ఏడాది తర్వాత మైక్రోసాఫ్ట్ అన్న పేరు రిజిస్టర్ చేయించారు.

MITS కంపెనీవారు బిల్ గేట్స్ అందిస్తున్న BASIC కోడ్‌ను ఉపయోగించడం మాత్రమే కాకుండా ఆ కోడ్‌ను కాపీ కొట్టి వాడుతుండడం తెలిసిన బిల్ గేట్స్ ఆ కంపెనీతో భాగస్వామ్యం రద్దు చేసుకొని స్వతంత్రుడయ్యాడు. బిల్ గేట్స్ 1980 వరకు కంపెనీ వ్యాపార వ్యవహారలన్నీ చూసుకోంటూనే ప్రోగ్రాములు రాసేవాడు. ఐదేళ్ళపాటు కంపెనీలో ప్రతివ్యక్తి రాసిన ప్రతి లైను పరిశీలించి అవసరమయినచోట మార్పులు చేసేవాడు.

1980లో IBM కంపెనీవారు తాము తయారు చేయబోయే పర్సనల్ కంప్యూటర్‌లకు అవసరమయిన BASIC interpreter కోసం బిల్ గేట్స్‌తో చర్చిస్తూ, ఒక మంచి ఆపరేటింగ్ సిస్టం కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.అపుడు బిల్ గేట్స్ తనకు తెలిన SCP అనే కంపెనీ తయారు చేసే 86-DOS ఆపరేటింగ్ సిస్టం లైసెన్సు తీసుకొని IBM కు అమ్మడం మొదలు పెట్టాడు. కొన్నాళ్ళకు SCPని కొని MS-DOS ఆపరేటింగ్ సిస్టంగా IBM కు అందించేలా ఒప్పందం చేసుకున్నాడు. అప్పటినుండి మైక్రోసాఫ్ట్ వెనుతిరిగి చూడలేదు. అనతి కాలంలో బిల్ గేట్స్ మిలియనీర్ అయ్యాడు.

వ్యక్తిగతం

బిల్ గేట్స్ భార్య పేరు మెలిండా. వారికి ముగ్గురు పిల్లలు. వాషింగ్టన్ లో 5.15 ఎకరాల విశాలమయిన ఎస్టేట్‌లో దాదాపు 50,000 చదరపు అడుగులు విస్తీర్ణంగల ఇల్లు వీరి నివాస స్థలము. 2005 లెక్కల ప్రకారం ఈ ఇంటి విలువ $135 మిలియన్ డాలర్లు. ఈ ఇంటి నిర్మాణానికి దాదాపు ఏడేళ్ళు పట్టింది.

1999లో బిల్ గేట్స్ ఆస్థి విలువ 101 బిలియన్లు చేరుకొన్నపుడు అందరూ బిల్ గేట్స్‌ను మొట్ట మొదటి 'సెంటి బిలియనీరు ' అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏర్పడిన ఆర్థిక మాంద్యం వల్ల ఆ విలువ తగ్గుతూ వచ్చినప్పటికీ 1995 నుండి 2006 వరకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాడు. 2007 లెక్కల ప్రకారం బిల్ గేట్స్ ఆస్థి విలువ 58 బిలియన్ డాలర్లు.

దాన ధర్మాలు

2000 సంవత్సరంలో బిల్ గేట్స్ తన భార్యతో కలసి బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎయిడ్స్ నిర్మూలన, మూడవ ప్రపంచ దేశాలల్లో అంటువ్యాధుల నిర్మూలన, పేదవారికి విద్య మొదలయిన సేవలకు ధన సహాయం చేస్తున్నాడు. బిల్ గేట్స్ ఇచ్చిన కొన్ని విరాళాలు: ($1 మిలియన్ = $1,000,000)

ప్రపంచ ఆరోగ్య సంస్థకు - $800 మిలియన్లు (ప్రతి ఏడాది)
పసిపిల్లల వ్యాక్సిన్లకు - $750 మిలియన్లు
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్కాలర్‌షిప్ - $210 మిలియన్లు
వాషింగ్టన్ డీసీలో పేదవిద్యార్థులకు - $122 మిలియన్లు

2004 ఫోర్బ్స్ లెక్కల ప్రకారం బిల్ గేట్స్ దాదాపు $29 బిలియన్లు విరాళాలు ఇచ్చాడు.

విమర్శలు

వీలయినంత తొందరగా తమ ప్రత్యర్థులను పోటీనుండి తప్పించి వ్యాపారంలో గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తుందని మొదటినుండి బిల్ గేట్స్ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ విమర్శలను ఎదుర్కొంటున్నది.

No comments: