నిరంతర వార్తా స్రవంతి

Friday, March 14, 2008

ఏంటో ఈ రాజకీయాలు?

ఒకాయనకు ఒక వ్యక్తి చేసే పనులు నచ్చక ఆయన్ని శత్రువుగా భావిస్తున్నాడు. అయితే ఆ వ్యక్తే తనకు మిత్రుడని ఇంకోచోట జతకట్టాడు. ఇలా ఉంది నేటి రాజకీయ పార్టీల ధోరణి. మిత్రపక్షాలుగా ఉన్న రెండు పార్టీలు స్థానిక ఎన్నికలు జరిగే రెండు జిల్లాల్లో మాత్రం మనిద్దరం శత్రుపక్షాలమని, మిగిలిన చోట్ల మిత్రులమేనని పేర్కొంటూ అభిప్రాయబేధాలకు ఆజ్యం పోశాయి. సాధారణంగా ఏ ఇద్దరైనా, ఎక్కడైనా అయితే శత్రువులుగా లేదా మిత్రులుగా లేదా మామూలుగా వ్యవహరించడం జరుగుతుంది. ఒక చోట నువ్వే నా మిత్రుడివని, మరో చోట నువ్వే నా శత్రువ్వని చెప్పుకోవడం ఏది మంచి ఏది చెడు అనేది తేల్చుకోని వారి అపరిపక్వ స్థితిని తెలియజేస్తోంది. ఇలాంటి నేతలు ప్రజలకు ఏం సేవలు చేస్తారో ఏమిటో...

No comments: